
ఆ డబ్బును పార్టీకి ఖర్చు పెట్టండి: వీహెచ్
హైదరాబాద్: ప్రజల్లోకి వెళ్లకుండా ప్రెస్ మీట్ లకే పరిమితమవుతున్నారంటూ సొంతపార్టీ నేతలపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మండిపడ్డారు. నరేంద్ర మోదీ సర్కారు తెచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్ ను వ్యతిరేకించడంలో పార్టీ సీనియర్లు విలేకరుల సమావేశాలకే పరిమితమవ్వడం సరికాదన్నారు.
ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలు తెలుసుకోవాలని, పాదయాత్రలు చేయాలని సూచించారు. అధికారంలో ఉన్నప్పుడు సంపాదించిన డబ్బును ఇప్పుడు పార్టీకి ఖర్చుపెట్టాలని వీహెచ్ అన్నారు.