షిండేకు రక్షణగా నిలబడ్డ హనుమంతన్న | V. Hanumantha Rao secure Sushil Kumar Shinde in Rajya Sabha | Sakshi

షిండేకు రక్షణగా నిలబడ్డ హనుమంతన్న

Published Thu, Feb 20 2014 4:09 PM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

షిండేకు రక్షణగా నిలబడ్డ హనుమంతన్న - Sakshi

షిండేకు రక్షణగా నిలబడ్డ హనుమంతన్న

తెలంగాణ బిల్లును అనూహ్యంగా లోక్సభలో ప్రవేశపెట్టిన యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలోనూ అదే వ్యూహాన్ని అమలు చేసింది.

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును అనూహ్యంగా లోక్సభలో ప్రవేశపెట్టిన యూపీఏ ప్రభుత్వం రాజ్యసభలోనూ అదే వ్యూహాన్ని అమలు చేసింది. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే నేడు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాజ్యసభ ప్రత్యక్ష ప్రసారాలను కొద్దిసేపు నిలిపివేశారు. అంతేకాకుండా తెలంగాణ బిల్లును వ్యతిరేకించిన వారిని నియంత్రించేందుకు మార్షల్స్న ప్రయోగించింది. షిండేకు రక్షణగా నిలబడిన మార్షల్స్ ఆందోళనలు చేస్తున్న సభ్యులను అడ్డుకున్నారు.

సీమాంధ్ర సభ్యులతో పాటు సీపీఎం, సమాజ్వాది పార్టీ తదితర పార్టీలకు చెందిన ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ షిండేను చుట్టుముట్టారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వి. హనుమంతరావు.. షిండేకు రక్షణగా నిలబడ్డారు. సీమాంధ్ర, తెలంగాణ సభ్యుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement