తెలంగాణ బిల్లుపై లోక్సభలో చర్చ ప్రారంభం
న్యూఢిల్లీ : సీమాంధ్ర సభ్యుల తీవ్ర నిరసనల మధ్యే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లును పరిశీలించి ఆమోదించాలని హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే మంగళశారం లోక్‌సభను కోరారు. వాయిదా అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన లోక్‌సభలో 41వ అంశంగా తెలంగాణ బిల్లు వ్యవహారం వచ్చింది.
సీమాంధ్ర సభ్యుల తీవ్ర నినాదాలు, గందరగోళం మధ్య ఇప్పటికే ప్రవేశపెట్టిన విభజన బిల్లును పరిశీలించి ఆమోదం తెలపాలని షిండే సభకు విజ్ఞప్తి చేశారు. కీలకమైన బిల్లు పరిశీలనకు వచ్చిందని... ఈ సమయంలో సభలో శాంతియుత వాతావరణం ఉండాలని స్పీకర్ మీరా కుమార్ పదే పదే విజ్ఞప్తి చేసినా సభ్యులెవరూ వెనక్కి తగ్గకపోవడంతో... ఆమె సభను మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు వాయిదా వేశారు.