హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల సమయమిది. కాంగ్రెస్ పార్టీ ఉనికి చాటుకోవడానికి ఇదే మంచి తరుణం. ఈ నేపథ్యంలోనే పార్టీ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలో నగరంలోని చింతల్ బస్తీ లో సమావేశం. ఓ వైపు ఆయన నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఆ మాటలు జోల పాటలా అనిపించాయో..ఇంతకంటే మంచి సమయం దొరకదనుకున్నారో వేదికపైనున్న కీలక నేతలు వి.హనుమంతరావు, జానారెడ్డి, కుంతియాలు మెల్లగా ఓ కునుకు తీశారు. ఇలా కునికి పాట్లు పడితే ..ఎన్నికలయ్యాక కలత తప్పదంటూ ఓ కార్యకర్త వ్యాఖ్యానించడం కొసమెరుపు.
కునుకు పడితే.. మనసు కాస్త కుదుట పడతది!
Published Wed, Jan 13 2016 10:04 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Advertisement
Advertisement