
'సెలవుపై వెళ్లడం అనుమానాలు రేకిత్తిస్తోంది'
న్యూఢిల్లీ: విజయవాడ 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ సెలవుపై వెళ్లడం అనుమానాలకు తావిస్తోందన్నారు. టీడీపీ నాయకుల ఒత్తిడి వల్లే ఆయన సెలవు వెళ్లారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు.
కాల్ మనీ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ హెచ్ ఆర్సీని కోరారు.