call money scam
-
కొనసాగుతున్న‘కాల్‌మనీ’ కార్యకలాపాలు
శ్రీనగర్ కాలనీకి చెందిన తిరుపతిరావు కొబ్బరి బొండాలు వ్యాపారం చేసుకుంటుంటారు. బావాజీ పేటకు చెందిన పిల్లా సింహాచలం, బి.నారాయణ, వాసు, చంద్రశేఖర్ అనే నలుగురు వ్యక్తులు రూ. 35 లక్షలు తిరుపతిరావుకు అప్పు ఇచ్చి రోజువారీ వడ్డీ వ్యాపారం చేయమన్నారు. ఆ అప్పును ఆయన తిరిగి చెల్లించినా ఇంకా రూ. 3 లక్షలు బకాయి పడ్డావని వేధిస్తున్నారు. ఈ మేరకు తిరుపతిరావు నగర సీపీకి ఫిర్యాదు చేశారు. ఆంధ్రా బ్యాంక్‌కు చెందిన 18 చెక్కులను, 13 ప్రామిసరీ నోట్ల తన నుంచి తీసుకున్నారని, ఇటీవల డబ్బు కోసం కొట్టారని, తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఇలాంటి అనేక ఘటనలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. నగర వ్యాప్తంగా కమిషనరేట్‌తోపాటు వివిధ పోలీసుస్టేషన్లలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో కాల్‌మనీ వ్యాపారుల అరాచకాలపై పోలీసు అధికారులకు పదుల సంఖ్యలో బాధితులు ఏకరువు పెడుతున్నారు. సాక్షి, అమరావతి/ కృష్ణా: విజయవాడ కాల్‌మనీ వడ్డీ వ్యాపారుల నేరాలు, ఘోరాలపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. రాజకీయ నాయకులు, సంపన్నులు నిర్లజ్జగా ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు. తరచూ వేదికల మీద నీతులు చెప్పే కొందరు బడా నేతలు కాల్‌మనీ ముఠాకు నేతృత్వం వహిస్తుండటం గమనార్హం. ఇటీవల వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్పందన’ కార్యక్రమంలో కాల్‌మనీ కోరల్లో చిక్కుకున్న బాధితులు తమను రక్షించాలంటూ విజయవాడ నగర కమిషనర్‌ను వేడుకుంటున్నారు. తీసుకున్న వడ్డీ డబ్బులు చెల్లించినా చెక్కులు, ప్రామిసరీ నోట్లు తిరిగి ఇవ్వకుండా మరింత బాకీ ఉన్నావు.. అది తీర్చాకే ఇస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని.. మరికొందరు కాల్‌మనీ వ్యాపారులు చిత్రహింసలకు సైతం గురిచేస్తున్నారని ఫిర్యాదులు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ప్రతి ఫిర్యాదును కాల్‌మనీ కేసుగా పరిగణించలేమని నగర కమిషనర్ స్వయంగా చెబుతున్నా.. మరోవైపు బాధితులు మాత్రం ప్రతి సోమవారం స్పందన కార్యక్రమంలో అర్జీలు దాఖలు చేస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. చర్యలకు వెనుకడుగు.. 2015 డిసెంబరులో వెలుగులోకి వచ్చిన కాల్‌మనీ సెక్స్‌రాకెట్ కేసుతో రాష్ట్రం అట్టుడుకింది. దాదాపు 1,952 ఫిర్యాదులు అందగా 105 కేసులు నమోదు చేశారు. ఇందులో 406 కేసులు కోర్టు పరిధిలో ఉన్నాయి. మరో 993 కేసుల్లో ఇరువర్గాలు రాజీపడ్డారు. 97 తప్పుడు కేసులుగా గుర్తించారు. అవిపోగా ఇతరత్రా, పోలీసుస్టేషన్లలో ఉన్నవి 342. అయితే పోలీసు చర్యలకు భయపడి కొంత కాలం అజ్ఞాతంలో ఉన్న కాల్‌మనీ వ్యాపారులు.. మళ్లీ ఇప్పుడు చెలరేగిపోతున్నారు. చాలా మంది బాధితులను తమ కార్యాలయాలకు పిలిపించి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. వడ్డీ, అసలు కట్టాలని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ‘స్పందన’ కార్యక్రమంలో తమ బాధలను చెప్పుకుంటే వెంటనే పరిష్కారం లభిస్తుందన్న ధీమా రావడంతో ఇప్పుడిప్పుడే కాల్‌మనీ బాధితులు ఫిర్యాదులు ఇవ్వడానికి ముందుకొస్తున్నారు. అయితే పోలీసు అధికారులు కొన్నింటిపై శ్రద్ధ చూపుతున్నా.. మరికొన్నింటి ఫిర్యాదులను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
కాల్‌మనీ వ్యాపారులపై ఉక్కుపాదం
ఏలూరు: జిల్లాలో రూ.5, రూ.10 వడ్డీలతో ప్రజలను దోపిడీ చేసే కాల్‌మనీ వ్యాపారులను అరెస్ట్ చేసి బాధితులకు ఉపశమనం కల్పించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మీ కోసం సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ఉంగుటూరు మండలం చేబ్రోలుకు చెందిన కొక్కిరపాటి ఎస్తేరమ్మ వినతిపత్రం సమర్పిస్తూ గ్రామంలోని మంతెన కనకరత్నం దగ్గర నూటికి ఐదు శాతం చొప్పున తాను తీసుకున్న రూ.40 వేలను 35 సంవత్సరాలుగా దఫాదఫాలుగా పూర్తిగా చెల్లించినప్పటికీ ఇంకా బాకీ చెల్లించాల్సి ఉందని చెబుతూ తమకు ఇవ్వాల్సిన ప్రాంశరీ నోట్లను ఇవ్వడం లేదని, అడిగితే తిట్టడమే కాకుండా దౌర్జన్యం చేస్తున్నారని తెలిపారు. అదే గ్రామానికి చెందిన సిరిమామిళ్ల తాయారమ్మ, గుంటాన గంగమ్మలు కూడా 30 సంవత్సరాలుగా తాము చెల్లించాల్సిన సొమ్ములు దఫదఫాలుగా చెల్లించినప్పటికీ మంతెన వెంకటరత్నం ప్రాంసరీ నోట్లు ఇవ్వకుండా అప్పు ఇంకా తీరలేదంటూ దౌర్జన్యంపై చేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందిస్తూ కాల్‌మనీ వడ్డీ వ్యాపారుల ఆగడాల వల్ల ఎంతోమంది పేదల జీవితాలు చిన్నాభిన్నం అయిపోయాయని, ఎక్కువ శాతం వడ్డీలతో పేద ప్రజలను పీడిస్తూ కొంతమంది మరణాలకు కూడా కారణమవుతున్నారని, అటువంటి వడ్డీ వ్యాపారుల ఆగడాలపై ఉక్కుపాదం మోపి కఠినంగా అణచివేయాలని పోలీస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. వివిధ సమస్యలపై పలువురు కలెక్టర్‌కు వినతిపత్రాలు అందించగా వాటిని పరిశీలించిన ఆయన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ పి.కోటేశ్వరరావు పాల్గొన్నారు. -
కాల్‌మనీ నిందితుడు పెండ్యాల శ్రీకాంత్ అరెస్ట్
-
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది
-
'కాల్ మనీపై 600కు పైగా ఫిర్యాదులు '
-
సెక్స్ రాకెట్ నిందితుడి ఫామ్‌హౌస్ పై దాడి
-
అప్పుడలా... ఇప్పుడిలా...!
-
అసెంబ్లీలో రెచ్చిపోయిన గోరంట్ల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి రెచ్చిపోయారు. 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ సభ్యులను నోటికి వచ్చినట్టు తిడుతూ ఊగిపోయారు. సభను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తాము కూడా సభను అడ్డుకోగలమని అన్నారు. విపక్ష సభ్యులను ఎలా దారికి తేవాలో తమకు తెలుసునన్నారు. ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసైనా సభ జరిగేలా చేయాలని డిమాండ్ చేశారు. 'సభను అడ్డుకోవడం మాకు చేతనవును. మాకూ అధికారం ఉంది. మేము ఏమైనా చేయగలం. మిమ్మల్ని ఏం చేయాలో మాకు తెలుసు. ఇక ముందు సభకు అడ్డుపడకుండా విపక్ష సభ్యులపై స్పీకర్ చర్యలు తీసుకోవాలి. వారిని సస్పెండ్ చేసైనా సభను నడపండి' అని గోరంట్ల అన్నారు. -
అప్పుడలా... ఇప్పుడిలా...!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దేన్నయితే వ్యతిరేకించిందో... ఈనాడు అధికారంలో అదే చేసింది. కాల్‌మనీ సెక్స్ రాకెట్ వ్యవహారంపై శుక్రవారం అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యురాలు ఆర్ కె రోజాను ఏకంగా ఏడాది పాటు సభ నుంచి సస్పెండు చేశారు. అసెంబ్లీలో కాల్ మనీపై చర్చకు అంగీకరించకపోవడంతో నిరసనగా పోడియం వద్ద నిరసన తెలియజేస్తున్న సందర్భంగా రోజా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న నెపంతో అధికార పార్టీ ఆమెను ఏడాది పాటు సభ నుంచి సస్పెండు చేయాలని తీర్మానం పెట్టడం, అది కూడా ప్రవేశపెట్టిన మరుక్షణమే ఎలాంటి చర్చకు తావివ్వకుండానే వెనువెంటనే సస్పెండు చేశారు. ఆరు నెలల పాటు కరణం సస్పెన్షన్ శాసనసభ చరిత్రలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరిగిన సందర్భం లేదు. 2008లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి శాసనసభ స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డిని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారన్న అంశంపై టీడీపీ సభ్యుడు కరణం బలరామకృష్ణమూర్తిని ఆరు నెలల పాటు సభ నుంచి సస్పెండు చేశారు. అయితే అప్పట్లో దీనికి ఒక పద్ధతిని పాటించారు. కరణం బలరాం చేసిన వ్యాఖ్యలపై అధికార పార్టీ సభ్యులు స్పీకర్ ముందు ఫిర్యాదు చేయగా, స్పీకర్ దాన్ని సభా హక్కుల కమిటీకి నివేదించారు. సీనియర్ సభ్యుడు గాదె వెంకట్‌రెడ్డి నేతృత్వంలో సభా హక్కుల కమిటీకి సిఫారసు చేయగా, ఆ కమిటీ పూర్వాపరాలు తెలుసుకుని అవసరమైన సాక్ష్యాధారాలను పరిశీలించింది. స్వయంగా కరణం బలరాం వాదనలను కూడా విన్నది. ఆ తర్వాత కరణం బలరాంను ఆరు నెలల పాటు సస్పెండు చేయాలని సిఫారసు చేసింది. విచిత్రమేమంటే... దానిపై శాసనసభలో కరణం బలరాంకు వివరణ ఇచ్చుకునే అవకాశం కూడా లభించింది. నాడు చంద్రబాబు ఏమన్నారంటే... ఇంత జరిగిన తర్వాతే కరణం బలరాంను ఆరు నెలల పాటు సస్పెండు చేయగా, ఆరోజు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ఇదొక దుర్దినం అనీ, కక్ష సాధింపు చర్య అంటూ దుయ్యబట్టారు. సభలో మిగిలిన ప్రతిపక్ష పార్టీలను కూడగట్టి అసెంబ్లీ ఆవరణలోకి గాంధీ విగ్రహం వద్ద నిరసన ధర్నా చేశారు. కరణం బలరాంపై కక్ష సాధింపు చర్యకు దిగారంటూ ఆరోజు ఏకంగా స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారు. పార్లమెంటరీ చరిత్రలోనే... ఒక పార్టీ నుంచి ఎంపికైనా సభ్యుడు మరో పార్టీలోకి ఫిరాయించినట్టు బహిరంగంగా స్పష్టమైన సందర్భాల్లోనూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో అనేక పద్ధతులు, సంప్రదాయాలను పాటిస్తున్నారు. గతంలో ఎమ్మెల్యే, ఎంపీలపై ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా వారి వాదనలు వినిపించడానికి అవకాశం కల్పించారు. సభ్యుల భావోద్వేగాలను పరిగణలోకి తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి. రోజా విషయంలో... కాల్ మనీ - సెక్స్ రాకెట్ వ్యవహారంలో సూత్రధారులను అధికార పార్టీ నేతలు కాపాడుతున్నారని ఆరోపిస్తూ రెండు రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ అసెంబ్లీలో డిమాండ్ చేస్తోంది. దానిపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇవ్వడం, అది తిరస్కరించడంతో ముందు దానిపైనే చర్చ జరగాలని పట్టుబట్టింది. శుక్రవారం కూడా ఇదే అంశంపై పోడియం చుట్టుముట్టి నిరసనగా నినాదాలు చేశారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అలా నినాదాలు చేయడంపై ఆ తర్వాత ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, పలువురు అధికార పార్టీ సభ్యులు తీవ్రస్థాయిలో దుయ్యబట్టిన తర్వాత ఉన్నట్టుండి రోజాను ఏడాది పాటు సస్పెండు చేయాలని టీడీపీ సభ్యుడు దూళిపాళ్ల నరేంద్ర కోరడం, వెనువెంటనే శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రతిపాదించడం... క్షణాల్లో రోజాను ఏడాది పాటు శాసనసభ నుంచి సస్పెండు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏం తప్పు చేశారని... రోజా ఏం తప్పుచేశారని సస్పెండు చేశారని ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి లేచి ప్రశ్నించినప్పటికీ మాట్లాడటానికి సభలో అవకాశం ఇవ్వలేదు. ఆ సమయంలో సభలోనే ఉన్న రోజాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. పైగా సస్పెండైన రోజా సభ నుంచి నిష్ర్కమిస్తే తప్ప మాట్లాడటానికి ప్రతిపక్షానికి అవకాశమివ్వబోమని స్పీకర్ తేల్చిచెప్పారు. -
అసెంబ్లీలో రెచ్చిపోయిన గోరంట్ల
-
'మేము తలుచుకుంటే 2 నిమిషాలు పట్టదు'
-
'మేము తలుచుకుంటే 2 నిమిషాలు పట్టదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఒంటికాలిపై లేచారు. 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేస్తుండగా వైఎస్సార్ సీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో కలజేసుకున్న విష్ణుకుమార్ రాజు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలపై మండిపడ్డారు. సభలో ఆందోళన చేయడం సరికాదన్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పట్టువీడకపోవడంతో తాము తల్చుకుంటే రెండు నిమిషాలు పట్టదంటూ హెచ్చరిక ధోరణిలో మాట్లాడారు. ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం తగదంటూ చంద్రబాబును వెనకేసుకొచ్చారు. సభకు దారికి తీసుకొచ్చేందుకు ఓపిగ్గా ప్రయత్నిస్తున్న స్పీకర్ కు జోహార్లు అర్పించారు. స్పీకర్ తో వాదించడం సమంజసం కాదని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలకు సూచించారు. కాగా, వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే రోజాను సభ నుంచి సంవత్సరం పాటు సస్పెండ్ చేయాలని పాయకరావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నాయకుడిపై కూడా చర్య తీసుకోవాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. -
ఎవరినీ వదలం: చంద్రబాబు
-
ఎవరినీ వదలం: చంద్రబాబు
హైదరాబాద్: 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారంపై అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వడ్డీ వ్యాపారులపై 227 ఫిర్యాదులు వచ్చాయని, ఇప్పటివరకు 188 మందిని అరెస్ట్ చేశారని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ప్రకటించారు. పలువురు నిందితుల పేర్లను చదివి వినిపించారు. ఎవరినీ ఉపేక్షించబోమని, టీడీపీ పార్టీ నేతలు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రుణగ్రస్తుల ప్రయోజనాలు కాపాడానికి, నిందితులను కఠినంగా శిక్షించేవిధంగా చట్టాన్ని కఠినతరం చేస్తామన్నారు. 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారంపై విచారణకు విజయవాడలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తామని హామీయిచ్చారు. బాధితులకు న్యాయం చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తామన్నారు. -
అసెంబ్లీలో ఎదుర్కోవడమెలా...?
-
మహిళలను రాబందుల్లా పీక్కుతింటున్నారు
-
అసెంబ్లీలో ఎదుర్కోవడమెలా...?
అసెంబ్లీని కుదిపేయనున్న కాల్ మనీ సెక్స్ రాకెట్ ఎప్పటిలాగే ఎదురుదాడి వ్యూహంతో సర్కారు హైదరాబాద్: గురువారం నుంచి ప్రారంభమవుతున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగనున్నాయి. ఇటీవలే వెలుగులోకి వచ్చిన కాల్ మనీ రాకెట్ దుమారంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమైంది. తెలుగుదేశం నేతల ప్రమేయంతో ఈ రాకెట్ సాగుతోందని పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో దీనిపై ఇప్పటికే ప్రతిపక్షం గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం, ఈ వ్యవహారంపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్ హెచ్ఆర్సీ) తీవ్రంగా స్పందించడంతో చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఏపీలో తీవ్ర సంచలనం రేపిన కాల్ మనీ రాకెట్ రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న విజయవాడ కమిషనర్‌పై తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో ఆయన సెలవు కోరడం, దానిపైనా విమర్శలు వెళ్లువెత్తడంతో ఆయన సెలవు రద్దు చేయడం వంటి పరిణామాలు ప్రభుత్వాన్ని మరింత ఇరకాటంలోకి నెట్టింది. దీనిపై కూపీ లాగుతున్న కొద్దీ ఈ మొత్తం వ్యవహారం వెనుక అధికార పార్టీ నేతల పాత్ర స్పష్టం కావడంతో దీనిపై అసెంబ్లీలో ఎలా సమాధానం చెప్పాలన్న అంశంపై మంత్రులతో చంద్రబాబు తర్జనభర్జన పడ్డారు. అసెంబ్లీలో ప్రతిపక్షం నిలదీసే అవకాశాలుండటంతో చివరి నిమిషంలో విజయవాడ కమిషనర్ గౌతం సవాంగ్ సెలవులను రద్దు చేసి దిద్దుబాట చర్యలకు ఉపక్రమించింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో సూత్రధారులపై చర్యలు లేవన్న విషయంపై ప్రతిపక్షం లేవనెత్తితే ఎప్పటిలాగే ఎదురుదాడి చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఈ అంశంపై చర్చించింది. మంత్రులకు పలు సూచనలు చేశారు. ప్రతిపక్షం ఈ అంశం లేవనెత్తగానే ఎదురుదాడికి దిగాలని ముఖ్యమంత్రి చెప్పినట్టు సమాచారం. అందుకు పార్టీకి చెందిన కొంత మంది నేతలను ఎంపిక చేశారు. కాల్ మనీ వ్యవహారంపై జ్యుడీషియల్ విచారణ చేయాలని కేబినేట్ లో నిర్ణయించిన ప్రభుత్వం ఇదే అంశంపై సభలో ఒక ప్రకటన చేయడం ద్వారా విపక్షం దాడిని కట్టడి చేయాలని భావించారు. బీఏసీలో నిర్ణయం అసెంబ్లీ సమావేశాల్లో చేపట్టాల్సిన ఎజెండా నిర్ణయించడానికి స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన గురువారం సభా వ్యవహారాల మండలి (బీఏసీ) సమావేశం ఏర్పాటు చేశారు. శీతాకాల సమావేశాలు అయిదు రోజుల పాటే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుండగా, ప్రజా సమస్యలు అనేకం చర్చించాల్సి ఉన్నందున సమావేశాలను పొడిగించాలని ప్రతిపక్షం కోరుతోంది. -
పోలీసుల అదుపులో కాల్ నాగులు
-
కాల్‌మనీ వ్యవహారంలో పోలీసుల ఓవరాక్షన్
-
ఫైనాన్స్ వ్యవస్ధ పై నిఘా వుండాలి
-
ఒక్కొక్కరిది ఒక్కో దయనీయ గాధ
-
బాబు గారి భక్తులు కాల్ యముళ్లు
-
'సెలవుపై వెళ్లడం అనుమానాలు రేకిత్తిస్తోంది'
న్యూఢిల్లీ: విజయవాడ 'కాల్ మనీ' సెక్స్ రాకెట్ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో లేవనెత్తుతామని చెప్పారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ సెలవుపై వెళ్లడం అనుమానాలకు తావిస్తోందన్నారు. టీడీపీ నాయకుల ఒత్తిడి వల్లే ఆయన సెలవు వెళ్లారన్న అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాల్ మనీ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నాయకులు జాతీయ మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్ హెచ్ ఆర్సీని కోరారు. -
'సీరియస్ గా తీసుకుంటాం, ఎవరినీ వదలం'
-
'సీరియస్ గా తీసుకుంటాం, ఎవరినీ వదలం'
విజయవాడ: 'కాల్ మనీ' సెక్సె రాకెట్ వ్యవహారంలో ఎవరినీ వదిలి పెట్టబోమని ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు అన్నారు. బెదిరింపులకు పాల్పడితే పీడీ యాక్టు కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రుణాలు చెల్లించకపోతే మహిళలను చెరబట్టడం దారుణమన్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. 'కాల్ మనీ'పై వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలిస్తామని, సీరియస్ గా తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల తనిఖీలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ వ్యవహారంలో బుద్ద నాగేశ్వరరావు, సముద్రాల నాగేశ్వరరావు, లంకలపల్లి సతీష్ లను అరెస్ట్ చేసి రూ. 7 లక్షల నగదు, ప్రామిసరీ నోట్లు, బైకులు స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ తెలిపారు. 'కాల్ మనీ' వ్యవహారం నేపథ్యంలోనే విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్ సెలవుపై వెళ్లారని వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. ఆయన నెలరోజుల క్రితమే సెలవుకు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. -
కాల్ మనీ పాపం చాంద్రబాబుదే
-
అప్పుడు ఓటుకు నోట్లు..! ఇప్పుడు కాల్ మనీ...!!
* చంద్రబాబును కలిసి అయుత చండీయాగానికి ఆహ్వానించిన కేసీఆర్ * కేసీఆర్ కలిసిన ప్రతిసారీ ఇబ్బందికర పరిస్థితుల్లో చంద్రబాబు హైదరాబాద్: రెండు నెలల కిందట చంద్రబాబు తెలంగాణ సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లినప్పుడు... ఈరోజు కేసీఆర్ స్వయంగా చంద్రబాబు వద్దకు వెళ్లినప్పుడు... రెండు సందర్భాల్లోనూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడారు. నోట్ల వ్యవహారాల్లో తీవ్ర విమర్శల సుడిగుండంలో చిక్కుకున్న సందర్భంలోనే చంద్రబాబు, కేసీఆర్‌ల భేటీలు జరగడం విశేషం. ఈ నెల 23 నుంచి 27 వరకు మెదక్ జిల్లా ఎర్రవల్లి గ్రామంలో తలపెట్టిన అయుత చండీ మహా యాగంలో పాల్గొనాలని కోరుతూ కేసీఆర్ సోమవారం చంద్రబాబును కలుసుకున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరిన కేసీఆర్ విజయవాడలో ఉన్న చంద్రబాబు నివాసానికి వెళ్లి స్వహస్తాలతో ఆహ్వానపత్రికను అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్వయంగా కేసీఆర్‌కు అతిథి మర్యాదలు చేశారు. మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ బాల్క సుమన్‌లతో కలిసి వెళ్లినప్పటికీ కేసీఆర్‌తో చంద్రబాబు విడిగా దాదాపు 20 నిమిషాలపాటు ఏకాంతంగా చర్చించుకున్నారు. అనంతరం ఆంధ్రా వంటకాలతో కేసీఆర్‌కు చంద్రబాబు ప్రత్యేక విందునిచ్చారు. వెనక్కి తిరిగిచూస్తే... ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి చంద్రబాబు స్వయంగా హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి ఆహ్వానం అందజేశారు. అక్టోబర్ 18న చంద్రబాబు తెలంగాణ సీఎం అధికారిక నివాసానికి వెళ్లి అమరావతి శంకుస్థాపనకు రావాలని కోరాగా, కేసీఆర్ అందుకు సమ్మతించి హాజరయ్యారు కూడా. రెండు సందర్భాల్లోనూ... అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి కేసీఆర్‌ను ఆహ్వానించాలనుకున్నప్పుడు చంద్రబాబు తీవ్ర తర్జనభర్జన పడాల్సి వచ్చింది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి నోట్ల కట్టలను ఎరగా చూపిన విషయం తెలిసిందే. రేవంత్‌రెడ్డి జూన్ 1న స్టీఫెన్సన్ను కలిసి డబ్బు మూటను ఇస్తున్న వీడియో రికార్డులు బయటకు రావడం, ఆ తర్వాత స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్లో మాట్లాడినట్టు ఆడియో టేపులు బయకుపొక్కడం వంటి ఘటనలు తీవ్ర సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంలో చంద్రబాబు గొంతువరకు కూరుకుపోయారని కేసీఆర్ చెప్పగా, మా ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ చంద్రబాబు నేరుగా కేంద్రం ముందు శరణుజొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన తర్వాత నాలుగు నెలల వరకు చంద్రబాబు, కేసీఆర్ పరస్పరం కలుసుకున్న సందర్భం రాలేదు. అమరావతి శంకుస్థాపనకు రావాలని కోరే విషయంలో అక్టోబర్ 18న చంద్రబాబు వెళ్లి కేసీఆర్‌ను ఆహ్వానించారు. ఆ తర్వాత అక్టోబర్ 22న దసరా పండుగ రోజు అమరావతి శంకుస్థాపన వేదికపైన కలుసుకున్నారు. రెండు రోజుల క్రితం కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ కుమార్తె వివాహ కార్యక్రమంలో వారిద్దరు పరస్పరం ఎదురుపడినప్పుడు నమస్కారాలతో సరిపెట్టారే తప్ప పెద్దగా మాట్లాడుకోలేదు. మళ్లీ ఇప్పుడు... ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం కలిగిస్తున్న కాల్‌మనీ వ్యవహారంలోనూ అధికార పార్టీ నేతల అండదండలు ఉన్నాయని, అందులో టీడీపీకి చెందిన ఒక ఎమ్మెల్యే పాత్ర ఉందని బలంగా వినిపిస్తోంది. గత రెండు రోజులుగా ఈ వ్యవహారంపై అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజల నుంచి చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కేసీఆర్ రావడం యాధృచ్చికమైనప్పటికీ చంద్రబాబును ఇబ్బంది పెట్టిందని ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. -
సీబీఐ విచారణ జరిపించాలి
-
'ఆయనొచ్చాక విజయవాడలో పెరిగిన క్రైమ్ రేటు'
హైదరాబాద్: తెలుగు తమ్ముళ్ల కాల్ మనీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ లో ఉన్నవారిని తప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన కాపాడతారనే నమ్మకంతోనే తెలుగు తమ్ముళ్లు పేట్రేగి పోతున్నారని ధ్వజమెత్తారు. విజయవాడకు చంద్రబాబు మకాం మార్చిన తర్వాత నేరాలు పెరిగాయని తెలిపారు. విజయవాడను నేర రాజధానిగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు. -
'ఆయనొచ్చాక పెరిగిన క్రైమ్ రేటు'