'ఆయనొచ్చాక విజయవాడలో పెరిగిన క్రైమ్ రేటు' | crime rate increse in vijayawada: vasireddy padma | Sakshi
Sakshi News home page

'ఆయనొచ్చాక విజయవాడలో పెరిగిన క్రైమ్ రేటు'

Published Sat, Dec 12 2015 2:20 PM | Last Updated on Mon, Jul 23 2018 8:49 PM

'ఆయనొచ్చాక విజయవాడలో పెరిగిన క్రైమ్ రేటు' - Sakshi

'ఆయనొచ్చాక విజయవాడలో పెరిగిన క్రైమ్ రేటు'

హైదరాబాద్: తెలుగు తమ్ముళ్ల కాల్ మనీ వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. కాల్ మనీ, సెక్స్ రాకెట్ లో ఉన్నవారిని తప్పించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన కాపాడతారనే నమ్మకంతోనే తెలుగు తమ్ముళ్లు పేట్రేగి పోతున్నారని ధ్వజమెత్తారు.

విజయవాడకు చంద్రబాబు మకాం మార్చిన తర్వాత నేరాలు పెరిగాయని తెలిపారు. విజయవాడను నేర రాజధానిగా మార్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని వాసిరెడ్డి పద్మ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement