
నిందితుడిని పట్టుకున్న పోలీసులు
సాక్షి, అమరావతి బ్యూరో/భవానీపురం(విజయవాడ పశ్చిమ) : బెజవాడలో ఆదివారం అదృశ్యమైన బాలిక పక్కింట్లోనే శవమై కనిపించింది. విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడి పరిధిలోని నల్లగుంటలో ఈ దారుణం జరిగింది. ఏసుపాదం, రమణ దంపతుల కుమార్తె మొవ్వ ద్వారక(8) ఆదివారం అదృశ్యమైంది. బాలిక తల్లిదండ్రులు అదే రోజు రాత్రి భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఇంటి పక్కనే ఉండే మర్లపూడి ప్రకాష్ భార్య సోమవారం ఊరి నుంచి వచ్చి ఇంటి తలుపులు తెరచి చూడగా ఒక మూటలో బాలిక శవం కనిపించింది.
ఈ విషయాన్ని ఆమె చుట్టుపక్కల వారికి, పోలీసులకు తెలిపింది. ఆగ్రహంతో స్థానికులు ప్రకాష్‌ను చితకబాది పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. బాలిక తండ్రి ఓ లిక్కర్ షాపులో పనిచేస్తుండగా, తల్లి రమణ ఓ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తుంది. పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడబోగా కేకలు వేయడంతో గొంతు నులిమి చంపేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
నిందితులను వదిలేది లేదు : వాసిరెడ్డి పద్మ
బాలికలపై దారుణాలకు పాల్పడుతున్న నిందితులను వదిలే ప్రసక్తే లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. బాలిక ద్వారక కుటుంబీకులను ఆమె సోమవారం పరామర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment