girl murder
-
ఆస్తి కోసమే బాలిక హత్య
కంభం: ఆస్తి కోసం తొమ్మిదేళ్లు పెంచుకున్న బాలికను పెంపుడు తల్లి అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేసింది. ఈ నెల 6న ప్రకాశం జిల్లా అర్థవీడులో చోటుచేసుకున్న ఈ ఘటనపై నమోదైన కేసును పోలీసులు ఛేదించారు. శనివారం మార్కాపురం డీఎస్పీ బాలసుందరరావు మీడియాకు కేసు వివరాలను వెల్లడించారు. రాచర్ల మండలం అనుమలవీడుకు చెందిన పుచ్చకాయల వెంకట రమణ, పుచ్చకాయల లక్ష్మీపద్మావతికి పిల్లలు లేకపోవడంతో అతని సోదరుడు వెంకట రంగారెడ్డి కుమార్తె పుచ్చకాయల శాన్విరెడ్డిని ఆరునెలల వయసు ఉన్నప్పుడే.. అనగా 9 ఏళ్ల నాడు దత్తత తీసుకున్నారు.ప్రస్తుతం ఆ బాలిక 3వ తరగతి చదువుతోంది. ఇటీవల శాన్విరెడ్డి కన్నతల్లిదండ్రులకు, పెంచిన తల్లిదండ్రులకు ఆస్తుల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. కన్నతల్లిదండ్రులు శాన్విరెడ్డిపై ఎక్కువ ప్రేమ చూపిస్తుండటాన్ని గమనించిన పెంపుడు తల్లి..ఎంతబాగా పెంచినా కన్నతల్లిదండ్రులం కాలేమని భావించింది. బాలికను చంపేస్తే తమ ఆస్తి ఎవరికీ ఇవ్వాల్సిన అవసరం ఉండదని, తామే అనుభవించుకోవచ్చని ఆలోచించింది. ఈ నెల 6న శాన్విరెడ్డి ఒంటరిగా బెడ్రూంలో ఫోన్ చూసుకుంటున్న సమయంలో పెంపుడు తల్లి అయిన లక్ష్మీపద్మావతి బాలిక వద్దకు వెళ్లి మొహంపై దిండు వేసి గట్టిగా నొక్కిపట్టి గొంతుకోసి హత్య చేసింది. ఆ సమయంలో ఆమె భర్త గేటు వద్ద నిలబడి ఎవరూ రాకుండా చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఆ తర్వాత ఓ పథకం ప్రకారం వారిద్దరూ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు శాన్విరెడ్డిని హత్య చేశారని చుట్టుపక్కల వారిని, బంధువులను నమ్మించారు. బాలికను అర్థవీడులోని ఓ ఆర్ఎంపీ వద్దకు తీసుకెళ్లగా, అప్పటికే మరణించినట్లు చెప్పడంతో తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పాప సొంత తల్లిదండ్రులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కన్న తండ్రి ఫిర్యాదు మేరకు అర్థవీడు ఎస్ఐ అనిత కేసు నమోదు చేశారు. మార్కాపురం డీఎస్పీ బాలసుందర్రావు ఆదేశాల మేరకు సీఐ జె.రామకోటయ్య ఆధ్వర్యంలో కంభం, బేస్తవారిపేట, అర్థవీడు ఎస్ఐలు 3 బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. అనుమానాస్పదంగా ఉన్న పెంపుడు తల్లిదండ్రులను పోలీసులు తమదైన శైలిలో విచారించగా, తామే నేరం చేసినట్లు వారు అంగీకరించారు. -
మిస్టరీగా 11 ఏళ్ల చిన్నారి హత్య..చిక్కుముడి విప్పిన మిస్డ్ కాల్
కిడ్నాప్‌కి గురైన 11 ఏళ్ల చిన్నారి హత్య తీవ్ర కలకలం రేపింది. అదికూడా ఒక పట్టాన అంతు చిక్కని ఈకేసు చిక్కుముడిని ఒక మిస్డ్‌కాల్ చేధించింది. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో 11 ఏళ్ల చిన్నారి ఫిబ్రవరి 9న పాఠశాలకు వెళ్లి కనిపించకుండాపోయింది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తుండగా..చిన్నారి తల్లికి కూతురు కిడ్నాప్ అయ్యిన రోజే ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి మిస్డ్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు మొబైల్‌నెంబర్‌ను ట్రాక్ చేసి పంజాబ్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఆ క్రమంలోనే ఫిబ్రవరి 21న నిందితుడు రోహిత్ అలియాస్ వినోద్ అనే వ్యక్తిని అందుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడమే గాక బాలికను హత్య చేసి శవాన్ని ఘెవ్రా మోర్ సమీపంలో పడేసినట్లు వెల్లడించాడు. ఈ మేరకు పోలీసులు ముండ్కా గ్రామంలో కుళ్లిపోయిన బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఐతే ఆ చిన్నారి నలుగురు అన్నదమ్ములకు ఒక్కతే చెల్లి అని తాము ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్నట్లు బాధితురాలి తల్లి ఆవేదనగా చెబుతోంది. కాగా, ఈ హత్యకు దారితీసిన కారణాలు గురించి ఇంకా తెలియాల్సి ఉంది. (చదవండి: 70 కి.మీ దూరం వెళ్లి 512 కిలోల ఉల్లి అమ్మితే మిగిలింది రూ.2.. ఓ రైతు దీనగాథ!) -
వన్ సైడ్ లవ్: ప్రేమించిన యువతిని హత్య
తిరువొత్తియూర్: ప్రేమించిన యువతిని తనకిచ్చి వివాహం చేయడానికి ఆమె తల్లిదండ్రులు తిరస్కరించడంతో నిద్రపోతున్న యువతిపై బండరాయి వేసి ఓ యువకుడు హత్య చేశాడు. ఈ ఘటన తంజై జిల్లాలో చోటుచేసుకుంది. తంజై జిల్లా పట్టుకోట్టైకి చెందిన పాండ్యన్ కుమార్తె మౌనిక (18). తిరువారూర్ జిల్లా ముత్తుపేట పట్టణ పంచాయతీకి చెందిన ప్రాంతంలో ఉన్న అవ్వ రాజకుమారి ఇంటిలో ఉంటూ తిరుచ్చిలో పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతోంది. ఈ క్రమంలో మౌనిక బంధువు అయిన ముత్తుపేట తిరుకలూర్ గ్రామానికి చెందిన శివ శంకర్ (28). ఇతను మౌనికను వన్ సైడ్ లవ్ చేసినట్లు తెలిసింది. మౌనికను తనకిచ్చి పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులను కోరాడు. అందుకు వారు తిరస్కరించారు. దీంతో ఆగ్రహం చెందిన శివశంకర్ శనివారం రాత్రి రాజకుమారి ఇంట్లోకి చొరబడి నిద్రిస్తున్న మౌనికపై బండరాయి వేశాడు. మౌనిక అక్కడికక్కడే మృతిచెందింది. పోలీసులు శివశంకర్‌ను అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మైనర్ బాలిక దారుణహత్య; రోజు మొత్తం బ్రిడ్జి కింద వేలాడుతూ
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల మైనర్ బాలిక మృతదేహం ఒకరోజు మొత్తం రైల్వే వంతెన కింద వేలాడడం సంచలనం సృష్టించింది. బాలిక జీవనశైలి నచ్చకనే ఆమె తాత, మామలు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. విషయంలోకి వెళితే.. 17 ఏళ్ల మైనర్ బాలిక తన తల్లితో కలిసి ఇటీవలే డియోరియా జిల్లాలోని తన తాత ఇంటికి వచ్చింది. బాలిక తండ్రి పంజాబ్‌లో వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటికి వచ్చిన మైనర్ బాలిక జీవనశైలి, ఆమె కుటుంబ నేపథ్యం తాతకు, మామలకు నచ్చలేదు. దీంతో బాలికపై కోపం పెంచుకున్న ఆమె తాత రెండు రోజలు క్రితం ఇంట్లోనే రాడ్‌తో తీవ్రంగా కొట్టాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో భయపడిన వాళ్లు.. తల్లికి ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పారు. మార్గ మధ్యలోనే బాలిక ప్రాణాలు కోల్పోవడంతో డియోరియాలోని రైల్వే బ్రిడ్జి మీదకు తీసుకువచ్చారు. బ్రిడ్జి మీద నుంచి బాలికను కిందకు తోసేయగా.. ఆమె కాళ్లు బ్రిడ్జి కింద బాగానికి చిక్కుకొని తలకిందులుగా వేలాడింది. ఇది గమనించని ఆమె కుటుంబసభ్యులు అక్కడినుంచి వెళ్లిపోయారు. సోమవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజామువరకు ఆమె మృతదేహం అక్కడే వేలాడింది. అటు పక్కగా వెళ్తున్న కొందరు స్థానికులు బాలిక మృతదేహం వేలాడుతుండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసుకున్నారు. -
బాలిక హత్య కేసులో..నిందితుల అరెస్ట్
ఒడిశా, జయపురం: నవరంగపూర్ జిల్లాలోని కొశాగుమడలోని గుముండల గ్రామ బాలిక హత్య సంఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. తొలుత బాలికను ఎవరో గుర్తు తెలియని దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడి, అనంతరం హత్య చేశారన్న ఆరోపణలు బాగా వినిపించాయి. ఇదే విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, బాలికపై ఎవరూ లైంగి కదాడి చేయలేదని, కేవలం హత్య మాత్రమే చేశారన్న విషయం బయటపడింది. ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు ఇదే కేసుకు సంబంధించి శుక్రవారం ఇద్దరు నింది తులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో కొరాపుట్ జిల్లాలోని కొట్‌పాడ్ సమితిలో ఉన్న పొనకగుడ గ్రామవాసి ఖాడి భొత్ర(18), గుముండల గ్రామానికి చెందిన బొలి మఝి(20) ఉన్నారు. ప్రస్తుతం నిందితులను కోర్టుకు తరలించినట్లు నవరంగపూర్ ఎస్పీ నితిన్‌కుశలాకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో సంఘటన జరిగిన 20రోజులైనా నిందితులను పట్టుకోవడంలో విఫలమైన పోలీ సుల తీరుకు నిరసనగా కొ«శాగుమడ క్రిస్టియన్ సమాజ్ శనివారం చేపట్టాలనుకున్న బంద్ విరమించుకున్నట్లు తెలిసింది. -
పక్కింటోడే చిన్నారి ప్రాణాలు తీశాడు
సాక్షి, అమరావతి బ్యూరో/భవానీపురం(విజయవాడ పశ్చిమ) : బెజవాడలో ఆదివారం అదృశ్యమైన బాలిక పక్కింట్లోనే శవమై కనిపించింది. విజయవాడ గ్రామీణ మండలం గొల్లపూడి పరిధిలోని నల్లగుంటలో ఈ దారుణం జరిగింది. ఏసుపాదం, రమణ దంపతుల కుమార్తె మొవ్వ ద్వారక(8) ఆదివారం అదృశ్యమైంది. బాలిక తల్లిదండ్రులు అదే రోజు రాత్రి భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక ఇంటి పక్కనే ఉండే మర్లపూడి ప్రకాష్ భార్య సోమవారం ఊరి నుంచి వచ్చి ఇంటి తలుపులు తెరచి చూడగా ఒక మూటలో బాలిక శవం కనిపించింది. ఈ విషయాన్ని ఆమె చుట్టుపక్కల వారికి, పోలీసులకు తెలిపింది. ఆగ్రహంతో స్థానికులు ప్రకాష్‌ను చితకబాది పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలిక మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు. బాలిక తండ్రి ఓ లిక్కర్ షాపులో పనిచేస్తుండగా, తల్లి రమణ ఓ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తుంది. పోలీసులు నిందితుడుని అదుపులోకి తీసుకున్నారు. బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడబోగా కేకలు వేయడంతో గొంతు నులిమి చంపేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నిందితులను వదిలేది లేదు : వాసిరెడ్డి పద్మ బాలికలపై దారుణాలకు పాల్పడుతున్న నిందితులను వదిలే ప్రసక్తే లేదని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చెప్పారు. బాలిక ద్వారక కుటుంబీకులను ఆమె సోమవారం పరామర్శించారు. -
దారుణం: చిన్నారిని గోడకు కొట్టి..
సాక్షి, చెన్నై: నైవేలి సమీపంలో శుక్రవారం చిన్నారిని గోడకుకొట్టి దారుణంగా హత్య చేసిన మహిళతో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. విల్లుపురం జిల్లా కళ్లమేడు గ్రామానికి చెందిన ఉత్తండి భార్య రాజేశ్వరి (32). వీరికి హంసవల్లి (7), మీనా (5), కనకవల్లి (3) పిల్లలు ఉన్నారు. వీరు కుటుంబంతో కడలూర్ జిల్లా నైవేలి సమీపంలో ఉన్న మేలకుప్పమ్ రోడ్డు వీధికి చెందిన రాజమాణిక్కమ్ భార్య కమలమ్ (59) ఇంట్లో ఉంటూ, వ్యవసాయ పనిచేస్తూ వస్తున్నారు. రెండేళ్లుగా వీరిని బయటకి ఎక్కడికీ పంపకుండా, బానిసలుగా కమలమ్ చూసింది. గత 26వ తేదీ సాయంత్రం కమలమ్ తన ఇంటి మిద్దెపై వేరుశనగ గింజలు ఎండబెడుతోంది. ఆ సమయంలో అక్కడకు చిన్నారి మీనా వెళ్లింది. బాలిక వేరుశనగలను తొక్కినట్టు తెలుస్తోంది. దీన్నిగమనించిన కమలమ్ ఆవేశంతో ఆ చిన్నారి తల వెంట్రుకలను పట్టుకుని లాగి, మిద్దె గోడకేసి బాదింది. తలపై తీవ్రగాయాలయ్యాయి. మీనా సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. అనంతరం హత్యని కమలమ్ దాచిపెట్టడానికి తన కుమారుడు అరుల్‌మురుగన్, కుమార్తె అంజలై (34), ఈమె స్నేహితుడు అయ్యప్పన్ (31) రంగంలోకి దిగారు. వీరితో విరుదాచలం సమీపంలో ఉన్న జీడిపప్పు తోటకి తన కారులో మీనా మృతదేహాన్ని తీసుకుని వెళ్లారు. అక్కడ చిన్నారి మృతదేహాన్ని పాతిపెట్టి ఇంటికి వచ్చారు. మీనా కోసం తల్లి రాజేశ్వరి తీవ్రంగా గాలించారు. కానీ కమలమ్ వారిని బయటకి ఎక్కడికీ వెళ్లి వెతకనివ్వకుండా అడ్డుకొని, ఇంట్లోనే పెట్టి హింసించినట్లు తెలుస్తోంది. ఈ స్థితిలో శుక్రవారం తన బిడ్డ హత్యకు గురైందన్న సమాచారం రాజేశ్వరికి తెలిసింది. అనంతరం ఆమె తన మిగతా ఇద్దరు పిల్లలతో ఇంటి నుంచి తప్పించుకుని, తెర్మల్ పోలీసు స్టేషన్‌కి వచ్చి ఫిర్యాదు చేసింది. పోలీసులు మేలకుప్పమ్కి వెళ్లి కమలమ్‌ని పట్టుకుని విచారణ చేశారు. ఇందులో ఆమె మీనాని హత్య చేసినట్లు ఒప్పుకుంది. కమలమ్‌ని ముదనైకి తీసుకెళ్లి జీడిపప్పుతోటలో పాతిపెట్టిన చిన్నారి మృతదేహాన్ని బయటకి తవ్వి తీశారు. పోస్టుమార్టం తరువాత చిన్నారి మృతదేహాన్ని అక్కడే పాతిపెట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి కమలమ్, అంజలై, అయ్యప్పన్ ముగ్గురినీ అరెస్టు చేశారు. అజ్ఞాతంలో ఉన్న అరుల్ మురుగన్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కమలమ్ ఇంట్లో ఉన్న రాజేశ్వరి భర్త ఉత్తండి కనపడడం లేదు. అతను ఎక్కడికి వెళ్లాడో తెలియని పరిస్థితి. అతనిని వెదికే పనుల్లో కుటుంబీకులు నిమగ్నులయ్యారు. ఇంకా ఉత్తండికి కమలమ్ తరఫున ఏదైనా దారుణం జరిగి ఉండవచ్చా..?అని పోలీసులు శోధిస్తున్నారు. -
వినయంగా ఉంటోందని.. బాలికపై ట్యూటర్ దారుణం
లక్నో : గురువు పట్ల చూపిన వినయ, విధేయతలే ఓ చిన్నారి ప్రాణాలను బలితీసుకున్నాయి. ఆరేళ్ల బాలికపై కన్నేసిన ఓ ట్యూటర్ చిన్నారిని దారుణంగా హత్యచేశాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఘజియాబాద్‌కు చెందిన ఫైజల్ ఇస్లామ్ అనే వ్యక్తి చదువుకుంటూనే చిన్నపిల్లలకు ట్యూషన్ చెబుతున్నాడు. అతడి వద్దకు ట్యూషన్‌కు వచ్చే వారిలో చిన్నదైన, మిక్కిలి వినయ, విధేయతలు కలిగిన ఆరేళ్ల బాలికపై అతడు కన్నేశాడు. ఈ నెల 21వ తేదీన పిల్లలందర్ని ఇంటికి పంపేసిన తర్వాత బాలికను అతడి మామ ఇంటికి తీసుకెళ్లాడు. ఇస్లామ్ మామ కుటుంబసభ్యులతో కలిసి పనిమీద రాజస్తాన్ వెళ్లటం అతడికి కలిసొచ్చింది. ఆ తర్వాత బాలికపై లైంగిక దాడికి దిగటంతో చిన్నారి ప్రతిఘటించింది. దీంతో అతడు బాలికను హత్య చేశాడు. బాలిక మృతదేహన్ని పరుపులో చుట్టి మసీదు బయట పడవేసి అక్కడినుంచి పరారయ్యాడు. చిన్నారి కుటుంబసభ్యులు ఎంతసేపటికి బాలిక ఇంటికి రాకపోవటంతో వెతకటం ప్రారంభించారు. ఇస్లామ్ మీద అనుమానంతో అతడి ఇంటికి వెళ్లి వెతికినా లాభం లేకపోయింది. ఇంటి పక్కవారు బాలిక ఇస్లామ్‌తో వెళ్లటం చూశామని చెప్పటంతో వారు పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేశారు. బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని విచారించగా బాలికను హత్య చేసిన సంగతి వెల్లడించాడు. ట్యూషన్లో చిన్నదైన, మిక్కిలి వినయ, విధేయతలు కలిగినదైన కారణంగా తను చెప్పినట్లు విని వెంట వచ్చిందని, ఆపై బాలికపై లైంగిక దాడికి దిగగా ప్రతిఘటించటంతో ఈ దారుణానికి ఒడిగట్టానని తెలిపాడు. -
ప్రాణాలు తీసిన పిన్ని
⇒ గత ఏడాది ఆగస్టులో నాలుగేళ్ల బాలిక హత్య ⇒ వివాహేతర సంబంధం, అసూయతో పిన్ని దురాగతం ⇒ తిరుమలలో ఘటన... ఛేదించిన పోలీసులు సాక్షి, తిరుమల: అభం శుభం తెలియని నాలుగేళ్ల పసిహృదయాన్ని పిన్ని చిదిమేసింది. తానూ ఒక బిడ్డకు తల్లిననే విషయాన్ని మరిచి ముక్కుపచ్చలారని ఆడబిడ్డను కట్టెతో మోది, చెట్టుకు కటేసి అతి కర్కశంగా హత్య చేసింది. గత ఆగస్టు 24వ తేది జరిగిన ఈ హత్యాఘటన తిరుమల పోలీసులు దర్యాప్తులో ఛేదించారు. పోలీసుల కథనం కర్ణాటకలోని ఎట్టిగ గ్రామానికి చెందిన దేవరాజ్ (40) కొంతకాలంగా తిరుమలలో కూలి పనులు చేస్తున్నాడు. ఇతని భార్య ఉలిగమ్మ (35), ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. అయినా, అదేప్రాంతంలోని జ్యోతి (30)ని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కుమారుడున్నాడు. తల్లి దుర్గమ్మ, మొదటి భార్యతోపాటు దేవరాజ్ కూలీ పనులకెళితే వారి పిల్లల ఆలనాపాలనా రెండో భార్య జ్యోతి చూసుకునేది. వివాహేతర సంబంధం జ్యోతికి పెళ్లికి ముందే సొంతూరిలోని జయానాయక్‌తో వివాహేతర సంబంధం ఉంది. మరో కులానికి చెందిన దేవరాజ్ జ్యోతిని పెళ్లి చేసుకోవడం జయానాయక్‌కు నచ్చలేదు. ఇదే సందర్భంలో దేవరాజ్ కూడా మొదటిభార్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. దీంతో జ్యోతి ఆగ్రహం పెంచుకుంది. వారి ముగ్గురు కుమార్తెల్లో నాలుగేళ్ల రాధను హత్య చేయాలని నిర్ణయించుకుంది. గత ఏడాది ఆగస్టు 24వ తేదిన ఉదయం జ్వరం పేరుతో రాధను అశ్విని ఆస్పత్రికి తీసుకెళ్లి పేరు నమోదు చేసి చికిత్స చేయించింది. తర్వాత బాటగంగమ్మ ఆలయం మీదుగా పాపవినాశానికి వెళ్లే మెట్ల మార్గానికి 500 మీటర్ల దూరంలోని ముళ్ల పొదల్లో పెద్ద కట్టెతో మూడుసార్లు మోది రాధను హత్య చేసింది. బతికి వస్తుందేమో అన్న అనుమానంతో బండరాయిపై కూర్చోబెట్టి రాధ ప్యాంట్‌తోనే చేతులను పక్కనే ఉన్న చెట్టుకు కట్టేసి తిరిగి వచ్చేసింది. తర్వాత అనుమానం రాకుండా అదే రోజు భర్త దేవరారాజ్‌తో కలసి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేసింది. దాగని నేరం పోలీసు విచారణలో నేరం బయటపడింది. సోమవారం ఉదయం డీఎస్పి మునిరామయ్య, సీఐ తులసీరామ్, ఫోరెన్సిక్‌క్లూస్‌టీం బృందం నిందితురాలు జ్యోతిని వెంట బెట్టుకుని ఘటన స్థలికి వెళ్లారు. అక్కడ రాధకు చెందినదిగా భావిస్తున్న పుర్రె, వెంట్రుకలు, ఎముకలు, దుస్తులు, పాదరక్షలు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇదే సందర్భంగా రాధను ఎలా కూర్చోబెట్టింది? ఎలా కట్టెతో మోదింది? ఆ బిడ్డ ప్యాంటుతో ఎలా చెట్టుకు కట్టేసి హత్య చేసిందన్న వివరాలను ఘటన స్థలంలో పోలీసులకు చూపింది. -
మైసూరులో రెండేళ్ల చిన్నారి హత్య
– అవయవాలను వేరు చేసిన హంతకులు మైసూరు (కర్ణాటక) : రాచనగరి మైసూరులో దారుణం చోటుచేసుకుంది. రెండేళ్ల వయసున్న గుర్తు తెలియని చిన్నారిని దుండగులు దారుణంగా హత్య చేశారు. తల, కాలు, చేయి వేరు చేసి చెత్తకుప్పల్లో పడేసి వెళ్లారు. ఈ ఉదంతం గురువారం రాత్రి వెలుగు చూసింది. ఎన్ఆర్ మోహల్లా పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నగరంలోని గాంధీనగర సమీపంలో కుక్కలు మానవ శరీర అవయవాలను పీక్కుతింటూ పోట్లాడుకుంటుండగా స్థానికులు గమనించారు. కుళ్లిన స్థితిలో మానవ అవయవాలు కనిపించడంతో పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిశితంగా పరిశీలించారు. చిన్నారిని హత్య చేసి తల, కాళ్లు, చేతులు వేరు చేసినట్లు గుర్తించారు. బాలుడా లేక బాలికా అనేది కూడా గుర్తు పట్టకుండా సున్నిత ప్రదేశంలో అత్యంత కిరాతకంగా కత్తులతో పొడిచినట్లు పోలీసుల పరిశీలనలో తేలింది. అనంతరం అవయవాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక కేఆర్ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బాలిక దారుణహత్య
పెట్రోల్ పోసి తగలబెట్టిన దుండగులు తాడిపర్తి శివారులో వెలుగుచూసిన ఘటన క్లూస్‌టీంతో పోలీసుల విస్తృతతనిఖీలు గోపాల్పేట : గుర్తుతెలియని బాలికను దుండగులు అతికిరాతంగా హత్యచేసి, ఆపై మృతదేహాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగులబెట్టారు. స్థానికంగా సంచలనం రేకెత్తించిన ఈ ఘటన శనివారం మండలంలోని తాడిపర్తిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గుర్తుతెలియని బాలిక(14)ను ఎక్కడో చంపి తాడిపర్తి సమీపంలోని ప్రధానరహదారి పక్కనుంచి జమ్మికుంటకు వెళ్లే దారిలో వ్యవసాయ పొలంలో పడేసి నిప్పంటించారు. ఉదయం అటువైపు వెళ్తున్న కొందరు రైతులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వనపర్తి టౌన్ ఎస్ఐ గాంధీనాయక్, గోపాల్పేట ఏఎస్ఐ ఇలియాజ్, హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాస్‌రెడ్డి సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. అప్పటికే పొగలు వస్తుండటాన్ని గమనించిన నీళ్లు పోయించి మంటలను ఆర్పించారు. తెల్లవారుజామునే శవాన్ని తీసుకువచ్చి ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని తెలుస్తోంది. మృతదేహం పక్కనే బైకు టైరు గుర్తులు ఉన్నాయి. బైకుపై తీసుకొచ్చి ఉంటారని, శరీరంపై బురఖా ధరించి ఉండటంతో ముస్లిం బాలికగా పోలీసులు భావిస్తున్నారు. ముఖం పూర్తిగా కాలిపోవడంతో ఆమెను గుర్తుపట్టలేకపోతున్నారు. మృతదేహం పక్కనే ఓ బెడ్‌షిట్, చున్నీ, లోదుస్తులు, ఓ చిన్న కత్తి పడి ఉంది. కుడికాలి బోటన వేలు పూర్తిగా రాసుకుపోయి ఉండడంతో మృతదేహాన్ని బైకుపై తీసుకొచ్చే సమయంలో రోడ్డుపై రాసుకుపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తలపై కొట్టి.. ఆపై ఈడ్చుకొచ్చి మతురాలి కుడి చేతికి ఓ ఎర్రని దారం ఉంది. తల వెనుక భాగంలో బలమైన రక్తపు గాయాన్ని పోలీసులు గుర్తించారు. తలపై కొట్టిచంపి తీసుకొచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. బెడ్‌షిట్, దుస్తులు ఉండటంతో బాలికను హాస్టల్ నుంచిగానీ, ఇంటి నుంచిగానీ తీసుకువచ్చారా? ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికలను గుర్తించడం కోసం అన్ని పీఎస్‌లకు సమాచారం ఇచ్చి మిస్సింగ్ కేసులపై ఆరా తీస్తున్నారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీంతో గాలించగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. బాలిక వంటిపై చిలుకపచ్చ రంగు పైజామా (లెగ్గిన్) ఉంది. తాడిపర్తి వీఆర్ఓ మంజుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనతో తాడిపర్తిలో భయాందోళనలు నెలకొన్నాయి. -
అదృశ్యమైన బాలిక శవమై తేలింది
పింప్రి, న్యూస్‌లైన్: లోనావాలాలోని కుమార్ రిసార్ట్‌లో రెండు రోజుల క్రితం జరిగిన ఓ పెళ్లిలో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక మంగళవారం శవమై కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... రాయిగడ్ జిల్లా ఇందాపూర్‌ుకు చెందిన ఓ జైన్ కుటుంబం ఈ నెల 15న ఇక్కడ జరిగిన వివాహానికి హాజరైంది. ఆ రోజు సాయంత్రం నుంచి వారి ఏడేళ్ల కుమార్తె కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం ఉదయం తల్లిదండ్రులు లోనావాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం కుమార్ రిసార్ట్ టైపై ఓసోలార్ బోర్డు కింద బాలిక శవం కనిపించింది. ఆమె మెడను పదునైన ఆయుధంతో కోసి హత్య చేశారని పోలీసులు చెప్పారు. బాలికపై అత్యాచారం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానంవ్యక్తం చేశారు. బాలిక మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని, శవ పరీక్షకు తరలించి, దర్యాప్తులు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకొని రిసార్ట్‌పై రాళ్లు రువ్వారు. స్థానికుల ఆగ్రహం బాలిక హత్యకు నిరసనగా బుధవారం లోనావాలాలో స్థానికులు స్వచ్ఛందంగా బంద్ పాటించి, రాస్తారోకో నిర్వహించారు. కుమార్ రిసార్ట్ భవనంపై రాళ్ల వర్షం కురిపించారు. ప్రజలను శాంతింపజేయడానికి పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో లాఠీ చార్జీ చేశారు. బాలికపై అత్యాచారం జరిగినట్టు అనుమానాలు వ్యక్తం కావడంతో, ఆగ్రహం చెందిన ప్రజలు లోనావాలా నగరంతో పాటు మావల్, ఖపోలి పరసరాల నుంచి భారీ సంఖ్యల ఉదయం నుంచే ఇక్కడికి చేరుకోవడం ప్రారంభించారు. పోలీసుల లాఠీ చార్జీలో పలువురు మహిళలు గాయపడ్డారు. -
ప్రేమ పేరుతో నమ్మించి ప్రాణాలు తీశాడు
హైదరాబాద్ : హైదరాబాద్‌లో అదృశ్యమైన మైనర్ బాలిక, 3 నెలల తర్వాత ప్రకాశం జిల్లాలో శవమై తేలింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. వనస్థలిపురంలో నివసించే శిరీష, అదే ప్రాంతానికి వెంకటేష్ మాయమాటల్లో పడింది. అతడిని నమ్మి, ఇంట్లోంచి లక్షా 50వేల నగదు, 2 తులాల బంగారం, తీసుకుని వెళ్లిపోయింది. మొదట వీరిద్దరు మహేశ్వరం మాచేపల్లిలో రెండ్రోజులు గడిపారు. అయితే, పెళ్లి చేసుకోవాలంటూ శిరీష తీవ్ర ఒత్తిడి తేవడంతో .. గతంలోనే పెళ్లైన వెంకటేష్ ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. పెళ్లాడతానని నమ్మించి, ఆమెను మాలకొండ అటవీ ప్రాంతానికి తీసుకొచ్చాడు, అక్కడే ఆమె చున్నీని గొంతుకు బిగించి హత్య చేశాడు. శిరీష మృతదేహంపై ఆకులు కప్పి హైదరాబాద్ ఆ తర్వాత బెంగళూరుకు పారిపోయాడు. ఇటు కూతురు కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో జనవరి 7న ఫిర్యాదు చేశారు. అప్పట్నించి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు, వెంకటేష్ కోసం గాలించి, చివరికి బెంగళూరులో అరెస్ట్ చేశారు. నిందితుడు చెప్పిన వివరాల మేరకు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీయగా ... కుళ్లిపోయిన ఎముకల గూడు కనిపించింది.