వివరాలు వెల్లడిస్తున్న ఎస్‌పీ నితిన్ కుశలాకర్
ఒడిశా, జయపురం: నవరంగపూర్ జిల్లాలోని కొశాగుమడలోని గుముండల గ్రామ బాలిక హత్య సంఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమైంది. తొలుత బాలికను ఎవరో గుర్తు తెలియని దుండగులు సామూహిక లైంగికదాడికి పాల్పడి, అనంతరం హత్య చేశారన్న ఆరోపణలు బాగా వినిపించాయి. ఇదే విషయంపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించగా, బాలికపై ఎవరూ లైంగి కదాడి చేయలేదని, కేవలం హత్య మాత్రమే చేశారన్న విషయం బయటపడింది.
ఈ క్రమంలో దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఎట్టకేలకు ఇదే కేసుకు సంబంధించి శుక్రవారం ఇద్దరు నింది తులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో కొరాపుట్ జిల్లాలోని కొట్‌పాడ్ సమితిలో ఉన్న పొనకగుడ గ్రామవాసి ఖాడి భొత్ర(18), గుముండల గ్రామానికి చెందిన బొలి మఝి(20) ఉన్నారు. ప్రస్తుతం నిందితులను కోర్టుకు తరలించినట్లు నవరంగపూర్ ఎస్‌పీ నితిన్‌కుశలాకర్ తెలిపారు. ఈ నేపథ్యంలో సంఘటన జరిగిన 20రోజులైనా నిందితులను పట్టుకోవడంలో విఫలమైన పోలీ సుల తీరుకు నిరసనగా కొ«శాగుమడ క్రిస్టియన్ సమాజ్ శనివారం చేపట్టాలనుకున్న బంద్ విరమించుకున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment