మైనర్‌ బాలిక దారుణహత్య; రోజు మొత్తం బ్రిడ్జి కింద వేలాడుతూ | Girl Body Found Hanging On Bridge After Family Fight In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

మైనర్‌ బాలిక దారుణహత్య; రోజు మొత్తం బ్రిడ్జి కింద వేలాడుతూ

Published Thu, Jul 22 2021 11:17 AM | Last Updated on Thu, Jul 22 2021 12:10 PM

Girl Body Found Hanging On Bridge After Family Fight In Uttar Pradesh - Sakshi

బ్రిడ్జి కింద తలకిందులుగా వేలాడుతున్న మైనర్‌ బాలిక మృతదేహం

లక్నో: ఉత్తర్‌ ప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల మైనర్‌ బాలిక మృతదేహం ఒకరోజు మొత్తం రైల్వే వంతెన కింద వేలాడడం సంచలనం సృష్టించింది. బాలిక జీవనశైలి నచ్చకనే ఆమె తాత, మామలు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. విషయంలోకి వెళితే.. 17 ఏళ్ల మైనర్‌ బాలిక తన తల్లితో కలిసి ఇటీవలే డియోరియా జిల్లాలోని తన తాత ఇంటికి వచ్చింది. బాలిక తండ్రి పంజాబ్‌లో వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ఇంటికి వచ్చిన మైనర్‌ బాలిక జీవనశైలి, ఆమె కుటుంబ నేపథ్యం తాతకు, మామలకు నచ్చలేదు. దీంతో బాలికపై కోపం పెంచుకున్న ఆమె తాత రెండు రోజలు క్రితం ఇంట్లోనే రాడ్‌తో తీవ్రంగా కొట్టాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో భయపడిన వాళ్లు.. తల్లికి ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పారు. మార్గ మధ్యలోనే బాలిక ప్రాణాలు కోల్పోవడంతో డియోరియాలోని రైల్వే బ్రిడ్జి మీదకు తీసుకువచ్చారు. బ్రిడ్జి మీద నుంచి బాలికను కిందకు తోసేయగా.. ఆమె కాళ్లు బ్రిడ్జి కింద బాగానికి చిక్కుకొని తలకిందులుగా వేలాడింది. ఇది గమనించని ఆమె కుటుంబసభ్యులు అక్కడినుంచి వెళ్లిపోయారు. సోమవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజామువరకు ఆమె మృతదేహం అక్కడే వేలాడింది. అటు పక్కగా వెళ్తున్న కొందరు స్థానికులు బాలిక మృతదేహం వేలాడుతుండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసుకున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement