deoria
-
జీన్స్ వేసుకుంటానంటే బాలికను కొట్టి చంపేశారు
డియోరియా: జీన్స్ ప్యాంట్ వేసుకుంటానని పట్టుబట్టిన ఓ బాలికను ఆమె కుటుంబీకులే కొట్టి చంపారు. ఈ ఘోరం ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లా సవ్రేజీ ఖర్గ్ గ్రామంలో చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. గ్రామానికి చెందిన నేహా పాశ్వాన్ (17) జీన్స్, టాప్ ధరిస్తానంటూ మొండికేయగా కుటుంబసభ్యులు సోమవారం ఆమెను తీవ్రంగా కొట్టారు. తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని డియోరియా–కస్య మార్గంలోని పటన్వా వంతెనపై నుంచి విసిరేశారు. అయితే, ఆ మృతదేహం రైలింగ్‌కు చిక్కుకుని అక్కడే ఉండిపోయింది. గమనించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, దర్యాప్తు చేపట్టారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు అమ్మమ్మ, తాత సహా 10 మంది కుటుంబసభ్యులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయితే, బాలికను జీన్స్ వేసుకుంటానని చెప్పినందుకే కోపంతో కొట్టి చంపామంటున్న మృతురాలి కుటుంబసభ్యుల మాటలు నమ్మశక్యంగా లేవని పోలీసులు అంటున్నారు. ఈ ఘటన వెనుక వేరే కారణాలు ఉండి ఉండొచ్చుననీ, అవేంటో దర్యాప్తులో వెలుగులో చూస్తాయని చెబుతున్నారు. -
మైనర్ బాలిక దారుణహత్య; రోజు మొత్తం బ్రిడ్జి కింద వేలాడుతూ
లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. 17 ఏళ్ల మైనర్ బాలిక మృతదేహం ఒకరోజు మొత్తం రైల్వే వంతెన కింద వేలాడడం సంచలనం సృష్టించింది. బాలిక జీవనశైలి నచ్చకనే ఆమె తాత, మామలు కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. విషయంలోకి వెళితే.. 17 ఏళ్ల మైనర్ బాలిక తన తల్లితో కలిసి ఇటీవలే డియోరియా జిల్లాలోని తన తాత ఇంటికి వచ్చింది. బాలిక తండ్రి పంజాబ్‌లో వలస కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇంటికి వచ్చిన మైనర్ బాలిక జీవనశైలి, ఆమె కుటుంబ నేపథ్యం తాతకు, మామలకు నచ్చలేదు. దీంతో బాలికపై కోపం పెంచుకున్న ఆమె తాత రెండు రోజలు క్రితం ఇంట్లోనే రాడ్‌తో తీవ్రంగా కొట్టాడు. దీంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో భయపడిన వాళ్లు.. తల్లికి ఆసుపత్రికి తీసుకెళ్తున్నామని చెప్పారు. మార్గ మధ్యలోనే బాలిక ప్రాణాలు కోల్పోవడంతో డియోరియాలోని రైల్వే బ్రిడ్జి మీదకు తీసుకువచ్చారు. బ్రిడ్జి మీద నుంచి బాలికను కిందకు తోసేయగా.. ఆమె కాళ్లు బ్రిడ్జి కింద బాగానికి చిక్కుకొని తలకిందులుగా వేలాడింది. ఇది గమనించని ఆమె కుటుంబసభ్యులు అక్కడినుంచి వెళ్లిపోయారు. సోమవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజామువరకు ఆమె మృతదేహం అక్కడే వేలాడింది. అటు పక్కగా వెళ్తున్న కొందరు స్థానికులు బాలిక మృతదేహం వేలాడుతుండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసుకున్నారు. -
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సమావేశంలో రచ్చరచ్చ
దేవ్రియా: ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌రియాలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దేవ్రియా అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ముకుంద్ భాస్కర్‌మణికి ఖరారు చేశారు. దీనిపై నిర్వహించిన సమావేశంలో రేపిస్టుకు టికెట్ ఇవ్వడం ఏమిటని ఆగ్రహిస్తూ తారా యాదవ్ అనే మహిళా కార్యకర్త నిరసన వ్యక్తం చేశారు. సచిన్ నాయక్ అనే నేతపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. మిగిలిన కార్యకర్తలు తారా యాదవ్‌ను అడ్డుకున్నారు. ఇది సోషల్ మీడియా లో వైరలైంది. దీనిపై తారా నాయక్ నలుగురు కాంగ్రెస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తనను కొట్టి, అవమానించారని ఆరోపించారు. మహిళపై దాడి చేయడాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ తీవ్రంగా పరిగణించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ డీజీపీకి లేఖ రాశారు. -
ఒవైసీ మాట్లాడితే తప్పులేదా.. ఎందుకీ రాద్దాంతం?
లక్నో: ముస్లింల వద్ద కూరగాయలు కొనుగోలు చేయవద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే సురేశ్ తివారిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆయన తనను తాను సమర్థించుకున్నారు. ‘నేనేమైనా తప్పుగా మాట్లాడానా’ అంటూ ఎదురు ప్రశ్నించారు. మహమ్మారి కరోనా వ్యాప్తికి ఢిల్లీలోని తబ్లిగీ జమాత్ ప్రార్థనలు కారణమంటూ సురేశ్ తివారి గతంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వారం రోజుల క్రితం తన నియోజకవర్గం డియోరియాలో పర్యటించిన ఆయన.. ‘‘ ఒక్క విషయం అందరూ గుర్తుపెట్టుకోండి. ముస్లింల వద్ద కూరగాయలు కొనాల్సిన అవసరం లేదు. సరేనా’’ అని వ్యాఖ్యానించారు. (లాక్డౌన్: రోడ్డుపై బైఠాయించిన ఎంపీ) ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మతపరమైన, వివక్షపూరిత వ్యాఖ్యలు చేయవద్దంటూ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినప్పటికీ బీజేపీ ఎమ్మెల్యే ఇలా మాట్లాడటం దేనికి సంకేతమని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇక ఈ విషయం గురించి మంగళవారం మీడియాతో మాట్లాడిన సురేశ్ తివారి.. ‘‘నేను నా నియోజకవర్గంలో పర్యటించినపుడు ఓ పది మందిని కలిశాను. లాక్డౌన్ గురించి మేం మాట్లాడుకున్నాం. అప్పుడు కొంతమంది నా దగ్గరికి వచ్చి ముస్లిం వ్యాపారులు కాయగూరలు అమ్మేటపుడు వాటిపై ఉమ్మివేయడం గమనించామని చెప్పారు. కాబట్టి అలాంటి వాళ్ల దగ్గర వస్తువులు కొని కరోనా తెచ్చుకోవద్దని నేను చెప్పాను. (బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు) ఒక ఎమ్మెల్యేకు సమస్య గురించి ఏం చేయాలని అడిగినపుడు.. నేనేం చెప్పాలి. నేను మాట్లాడిన దాంట్లో తప్పుపట్టడానికి ఏముంది? ఎందుకు దీన్ని రాద్దాంతం చేస్తున్నారు’’అని ప్రశ్నించారు. అదే విధంగా.. మజ్లిస్ పార్టీ చీఫ్ అసుదుద్దీన్ ఒవైసీ, ఆయన సోదరుడు ఎన్నోసార్లు హిందువుల గురించి అభ్యంతరకర, తీవ్రమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ ఎవరూ స్పందించలేదని విమర్శించారు. తనను ఉద్దేశపూర్వకంగానే ఇరికిస్తున్నారని... స్వార్థ ప్రయోజనాల కోసం మాట్లాడే ఒవైసీ లాంటి వారిని మాత్రం ఏమీ అనలేరని అసహనం వ్యక్తం చేశారు. -
చిత్రహింసలు.. ఆపై రెండేసి పెళ్లిళ్లు
లక్నో : బిహార్‌లోని ముజఫర్‌పూర్ షెల్టర్ హోం ఘటన మరువక ముందే ఉత్తర ప్రదేశ్‌లోని డియోరియోలో వసతి గృహంలో బాలికల లైంగిక హింస ఘటన వెలుగులోకి వచ్చింది. డియోరియోలో వసతి గృహం నుంచి పారిపోయి బయటకు వచ్చిన ఓ బాలిక అక్కడ జరిగే అకృత్యాల గురించి బయట పెట్టింది. షెల్టర్ హోం నిర్వహకురాలు గిరిజా త్రిపాఠి బాలికలను చిత్ర హింసలకు గురిచేసేవారని, కొంత మంది బాలికలకు వారి కన్నా రెట్టింపు వయసున్న వారితో రెండేసి పెళ్లిళ్లు చేసేవారని బాలిక ఆవేదన వ్యక్తం చేసింది. బాధిత బాలిక ఫిర్యాదుతో షెల్టర్ హోంపై దాడి చేసిన పోలీసులు మరో 24 మంది బాలికలకు కాపాడారు. షెల్టర్ హోం అకృత్యాల నుంచి బయటపడిన బాలికలతో మంగళవారం ఆరుగురు మహిళా సభ్యుల బృందం మాట్లాడింది. తమను హోంలో చిత్ర హింసలకు గురిచేసేవారని, లైంగికంగా వేధించేవారని బాలికలు తెలిపారు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు నిద్రలేపి ప్లోర్ మొత్తం శుభ్రం చేయించేవారని, తినడానికి కేవలం రెండు చపాతీలు మాత్రమే ఇచ్చేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా పని చేయాడానికి నిరాకరిస్తే వారికి ఆపూట భోజనం పెట్టే వారు కాదని బాలికలు వాపోయారు. కాగా బాలిక ఫిర్యాదుతో సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆ వసతి గృహంపై దాడులు చేసిన పోలీసులు 24 మంది బాలికలను రక్షించామని తెలిపారు. వారిలో 10 మంది మైనర్లు ఉన్నారని పేర్కొన్నారు. అక్కడ మొత్తం 42 మంది ఉండగా వారిలో 18 మంది ఆచూకీ లభించలేదన్నారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందని వెల్లడించారు. ఏడాదికి పైగా వీరు ఎటువంటి అనుమతులు లేకుండా వసతి గృహాన్ని నడుపుతున్నారని తమ విచారణలో తెలిందన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం డియోరియా జిల్లా ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. అనుమతులు లేకుండా నడుస్తున్న వసతి గృహలపై కేంద్ర శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకాగాంధీ లోక్‌సభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
పదేళ్ల బాలిక తెగువ ; 24 మందికి విముక్తి
లక్నో : ఓ పదేళ్ల బాలిక ప్రదర్శించిన తెగువ బాలికల వసతి గృహంలో బంధీలుగా ఉన్న 24 మందికి విముక్తి కల్పించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా జిల్లాలో చోటుచేసుకుంది. వింధ్యవాసిని మహిళ మరియు బాలిక సంరక్షణ గృహం నుంచి తప్పించుకున్న ఆమె అక్కడ జరుగుతున్న ఆకృత్యాల గురించి పోలీసులకు తెలిపింది. బాలిక ఇచ్చిన సమాచారంతో దాడులు జరిపిన పోలీసులు అక్కడ బంధీలుగా ఉన్నవారిని రక్షించారు. అంతేకాకుండా ఆ వసతి గృహం నిర్వహకురాలు గిరిజ త్రిపాఠితోపాటు, ఆమె భర్త, కూతురిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి బయటపడిన బాలికలు తమపై జరిగిన భౌతిక, లైంగిక దాడుల గురించి పోలీసులకు తెలిపారు. ఆ బాలిక కథనం ప్రకారం.. ‘నేను ఆ వసతి గృహంలోని మొదటి అంతస్తులో ఉండేదాన్ని.. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో వార్డెన్ నన్ను కిందికి పిలిచారు. నన్ను ఫ్లోర్ శుభ్రం చేయాల్సిందిగా ఆదేశించారు. ఆ తర్వాత ఆమెకు ఫోన్ కాల్ రావడంతో అందులో లీనమైపోయారు. దీనిని అదునుగా భావించిన నేను మరో ఆలోచన లేకుంగా అక్కడి నుంచి బయటకు వచ్చి పోలీసు స్టేషన్‌కు వెళ్లాను. వారు చెప్పిన పనులు చేయకుంటే మమ్మల్ని దారుణంగా కొడతారు. నా కంటే పెద్దవారిపై లైంగికంగా దాడులు కూడా జరిగాయ’ని తెలిపారు. బాలిక ఫిర్యాదుతో అదే రాత్రి 11 గంటల ప్రాంతంలో ఆ వసతి గృహంపై దాడులు చేసి 24 మంది బాలికలను రక్షించామని పోలీసులు తెలిపారు. వారిలో 10 మంది మైనర్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. అక్కడ మొత్తం 42 మంది ఉండగా వారిలో 18 మంది ఆచూకీ లభించలేదన్నారు. దీనిపై లోతైన విచారణ జరుగుతోందని వెల్లడించారు. ఏడాదికి పైగా వీరు ఎటువంటి అనుమతులు లేకుండా వసతి గృహాన్ని నడుపుతున్నారని తమ విచారణలో తెలిందన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు. బాధితులను వైద్య పరీక్షల నిమిత్తం డియోరియా జిల్లా ఆస్పత్రికి తరలించామని తెలిపారు. -
కార్లలో వచ్చి తీసుకెళ్లేవారు!
దేవరియా/లక్నో: బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో శరణాలయంలోని బాలికలపై లైంగిక దాడులు జరిగిన ఘటన ఇంకా ప్రకంపనలు రేపుతుండగానే అలాంటి మరో ఘటన ఉత్తరప్రదేశ్(యూపీ)లోనూ వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లోని దేవరియాలో ఉన్న ఓ శరణాలయంలోనూ బాలికలపై లైంగిక దోపిడీ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో అక్కడి నుంచి 24 మంది అమ్మాయిలను పోలీసులు రక్షించారు. మరో 18 మంది బాలికల ఆచూకీ తెలియడం లేదు. ఈ శరణాలయాన్ని నడుపుతున్న భార్యాభర్తలతోపాటు అక్కడ పనిచేస్తున్న ఓ మహిళను అరెస్టు చేశారు. ఏడుస్తూ తిరిగొచ్చేవారు: బాలిక శరణాలయం నుంచి తప్పించుకున్న పదేళ్ల బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ఘోరం వెలుగుచూసింది. రోజూ సాయంత్రం కొంత మంది కార్లలో వచ్చి బాలికలను తీసుకెళ్లేవారనీ, వారితోపాటు కాంచనలత వెళ్లేదని బాలిక పోలీసులకు చెప్పింది. ‘చాలా కార్లు వచ్చి అమ్మాయిలను తీసుకెళ్లేవి. మళ్లీ పొద్దున వాళ్లు తిరిగొస్తూ అందరూ ఏడ్చేవారు’ అని తెలిపింది. కాగా, ఈ శరణాలయానికి ఏడాది క్రితమే అనుమతులు రద్దు చేశామనీ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూపీ మంత్రి రీటా బహుగుణ చెప్పారు. ఈ అంశంపై విపక్షాల నుంచి నిరసనలు వ్యక్తమవుతుండటంతో యూపీ బీజేపీ ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది.దేవరియా జిల్లా మేజిస్ట్రేట్ సుజిత్ కుమార్‌ను తక్షణం తొలగిస్తూ సీఎం యోగి ఆదేశాలు ఇచ్చినట్లు యూపీ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి రీటా బహుగుణ జోషి సోమవారం చెప్పారు. దేవరియా ఎస్పీ రోహన్మాట్లాడుతూ ‘మా వింధ్యవాసిని మహిళా ప్రశిక్షణ్ ఎవం సమాజ్ సేవా సంస్థాన్‌లో బాలికలపై లైంగిక దోపిడీ జరుగుతోందని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో శరణాలయాన్ని మూసేశాం. దాన్ని నడుపుతున్న గిరిజ, భర్త మోహన్, మహిళా సూపరింటెండెంట్ కాంచనలతను అరెస్టు చేశాం’ అని చెప్పారు. -
షెల్టర్ షేమ్‌పై మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ముజఫర్‌పూర్, డియోరియా షెల్టర్ హోంలలో చిన్నారులపై అకృత్యాల ఘటనలు కలకలం రేపిన నేపథ్యంలో కేంద్ర మహిళా శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనలు విచారకరమని పేర్కొన్న ఆమె ఏళ్ల తరబడి పాలకుల నిర్లక్ష్యం కారణంగా షెల్టర్ హోంలలో జరుగుతున్న దారుణ ఘటనలు మరిన్ని వెలుగులోకి రావచ్చన్నారు. సంవత్సరాల తరబడి వీటిని మనం పట్టించుకోకుండా వదిలివేయడంతో ఇలాంటి దారుణ ఉదంతాలు చాలా ఉంటాయని తనకు తెలుసన్నారు. ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని షెల్టర్ హోంలను సందర్శించి అక్కడి పరిస్థితులను అంచనా వేయాలని ఆమె కోరారు. వారి నియోజకవర్గాల్లో వసతి గృహాల పరిస్థితిపై తనకు నివేదిక అందిస్తే తక్షణమే చర్యలు చేపడతానన్నారు. వేయి మంది చిన్నారులు, వేయి మంది మహిళలతో కూడిన అతిపెద్ద హోంలను నిర్మించి, మహిళలే సిబ్బంగిగా వీటిని నడపడమే దీర్ఘకాలిక పరిష్కారమని సూచించారు. దీనికి అవసరమైన నిధులను తాను మంజూరు చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. షెల్టర్ హోంలలో చిన్నారులపై జరుగుతున్న అకృత్యాలు దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. -
బాకీ డబ్బులు అడిగిన పాపానికి
-
బాకీ డబ్బులు అడిగితే చెట్టుకు కట్టేసి..
సాక్షి, లక్నో: యూపీలో దారుణం చోటుచేసుకుంది. తనకు ఇవ్వాల్సిన బాకీ డబ్బులు అడిగిన పాపానికి కొందరు వ్యక్తులు ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారు. పైగా ఈ తతంగాన్ని వీడియో తీయగా, అది వైరల్ అయింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. డియోరియాకు చెందిన యువకుడు స్థానికంగా ఉంటున్న ఓ వ్యక్తికి కొన్ని నెలల కిందట కొంత నగదు అప్పుగా ఇచ్చాడు. బుధవారం నాడు తన బాకీ తీర్చాలని యువకుడు అడిగాడు. నగదు తిరిగి చెల్లించకపోగా, అప్పు ఇచ్చిన యువకుడిని చితకబాదారు. ఆపై చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టి పైశాచిక ఆనందం పొందారు. మరికొందరు వీడియో తీస్తూ ఆనందించారే తప్ప వద్దంటూ వారించలేదు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వీడియో వైరల్ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు వీడియో ఆధారంగా ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని డియోరియా పోలీసులు వివరించారు. -
యూపీ స్కూల్లో విద్యార్థిని మృతి.. అనుమానాలు
సాక్షి, డియోరియా: ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉదంతం మరిచిపోక ముందే ఉత్తర ప్రదేశ్ లో మరో విద్యార్థిని మరణం సంచలనంగా మారింది. డియోరియా పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో మూడో అంతస్థు నుంచి పడి బాలిక మృతి చెందగా, అది హత్యేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోడ్రన్ సిటీ మాంటిస్సోరీ స్కూల్లో నీతూ చౌహాన్(16) 9వ తరగతి చదువుతోంది. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మూడో అంతస్థులోని టాయ్ లెట్‌కి వెళ్లింది. ఎంత సేపటికి రాకపోవటంతో అనుమానం వచ్చిన తోటి విద్యార్థినులు వెళ్లి చూడగా.. రక్తపు మడగులో కింది ఫ్లోర్లో పడి ఉంది. వెంటనే విషయాన్ని లెక్చరర్ల దృష్టికి తీసుకెళ్లగా.. వారు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించటంతో గోరఖ్‌పూర్ బీఆర్డీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గ మధ్యలోనే ఆమె మృతి చెందింది. అయితే ఆమెను హత్య చేశారని నీతూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ‘స్కూల్ యాజమాన్యం మాకు ఎలాంటి సమాచారం అందించలేదు. ఘటన తర్వాత ప్రిన్సిపాల్ ఆద్య తివారీ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నారు. తోటి విద్యార్థినులు వచ్చి ఘటన గురించి మాకు తెలియజేశారు’ అని ఆమె తండ్రి పరమహంస్ చౌహాన్ చెబుతున్నారు. ఆస్పత్రికి తరలించే సమయంలో ఆమె తన సోదరుడితో ఎవరో వెనకాల నుంచి తనను తోసేసినట్లు చెప్పిందన్న విషయాన్ని ఆయన వెల్లడించారు. ఇక స్కూల్ యాజమాన్యం మాత్రం తాము త్వరగానే స్పందించామని చెబుతోంది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ సిస్టమ్ గత కొంతకాలంగా పని చేయకపోవటంతో ఫుటేజీని స్వాధీనం చేసుకోలేకపోయామని సీనియర్ అధికారి రాజీవ్ మల్హోత్రా చెప్పారు. ఫోరెనిక్స్ బృందం ఘటనా స్థలి నుంచి ఆధారాలు సేకరించిందని, కేసును వీలైనంత త్వరగా చేధిస్తామని ఆయన అంటున్నారు. -
ఆ గొడవలతో యూపీకి ఏం లాభం: రాజనాథ్ సింగ్
డియోరియా: ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ నేతల అంతర్గత కుమ్ములాటలపై కేంద్ర హోం మంత్రి రాజనాథ్ సింగ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గురువారం డియోరియాలో దివంగత ఎంపీ హరికేవల్ ప్రసాద్ 'శ్రద్ధాంజలి సభ'లో పాల్గొన్న రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. 'ఉదయాన్నే వార్తా పత్రికలు చదువుతున్న ప్రజలకు ప్రభుత్వం కల్పించే ఉపాధి అవకాశాలో లేక ఇతర మంచి విషయాలో కావాలి. ఇక్కడ మాత్రం అధికారంలో ఉన్న పార్టీ నేతల గొడవలు చదువుతున్నారు. వీరి గొడవల వలన ఉత్తరప్రదేశ్ ప్రజలకు ఎలాంటి ఉపయోగం కలుగుతుంది' అని ప్రశ్నించారు. సమాజ్‌వాదీ పార్టీ నేతల గొడవలకు సంబంధించిన విషయాలను తాను తెలుసుకోవడం లేదని, ఇతరుల గొడవలకు సంబంధించిన విషయాలను గమనించడానికి తాను న్యాయాధికారిని కాదని తనకు తెలుసని రాజనాథ్ అన్నారు. ములాయం సీంగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్, కుమారుడు అఖిలేశ్ యాదవ్‌ల మధ్య రాజకీయ ఆదిపత్య పోరు తలెత్తిన నేపథ్యంలో రాజనాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. -
కిసాన్ యాత్ర ప్రారంభించిన రాహుల్
డియోరియా: కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. ఇప్పటికే ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి షీలా దీక్షిత్, పార్టీ రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ రాజ్ బబ్బర్ తదితరులు విస్తృతంగా ప్రచారం చేస్తుండగా ఇప్పుడు పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచార నిమిత్తం ఆయన మంగళవారం డియోరియా నియోజకవర్గం చేరుకున్నారు. పాంచ్‌లారి క్రిత్‌ఫురి గ్రామం నుంచి రాహల్ కిసాన్ యాత్రను ప్రారంభించారు. కిసాన్ యాత్ర పేరుతో సుమారు 2500 కిలోమీటర్ల మేర యాత్ర జరగనుంది. యాత్రా మార్గంలో పేదలు, రైతులు, కార్మికులను కలుసుకొని వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ఈ కార్యక్రమంలో రాహుల్ ఇంటి ఇంటి ప్రచారంలో పాల్గొంటారు. ఖాట్ (మంచం) సభల్లోనూ రాహుల్ పాల్గోనున్నారు. రైతులతో వాళ్ల వాళ్ల గ్రామాల్లోనే మంచాలపై కూర్చుని ముచ్చటించనున్నారు. ఇందుకోసం 2వేల ఖాట్ లను సిద్ధం చేశారు. రాహుల్ తన పర్యటనలో భాగంగా 223 నియోజకవర్గాల్లో పర్యటన చేయనున్నారు. ఈ కిసాన్ యాత్ర డియోరియా నుంచి ఢిల్లీ వరకు సాగుతుంది. కాగా దాదాపు 27 ఏళ్లుగా యూపీలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. Kisan Maang Patras being signed in Rudrapur pic.twitter.com/8A12r7k1ZI — Office of RG (@OfficeOfRG) 6 September 2016 Door to door campaign begins from vill Pachladi. Met farmers, &collected Kisan Maang Patras outlining their demands pic.twitter.com/sdNoZOB11R — Office of RG (@OfficeOfRG) 6 September 2016 -
ఓటు వేయడానికి తనతో రాలేదని...
లక్నో: భార్య మీద కోపంతో క్షణికావేశంతో ఒంటికి నిప్పంటించుకున్నాడో భర్త. ఉత్తరప్రదేశ్ డోరియా జిల్లాలో గ్రామ ప్రధాన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా జరుగుతున్న ఎన్నికల్లో ఓటు వేసేందుకు రమ్మని భార్యను కోరాడు మహేంద్ర చౌహాన్. దీనికి భార్య నిరాకరించడంతో పాటు పక్కింటి మహిళతో ఓటింగ్ కేంద్రానికి వెళ్లింది. ఇది చూసి కోపోద్రిక్తుడైన మహేంద్ర భార్యపై దాడికి దిగాడు. ఆమెను తీవ్రంగా కొట్టడం ప్రారంభించాడు. దీంతో అక్కడున్న పెద్దలు ఇద్దరినీ వారించి ఇంటికి పంపేశారు. ఇంటికి చేరిన తర్వాత మహేంద్ర ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. 40 శాతం గాయాలతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాణాపాయ స్థితిలోచికిత్స పొందుతున్నాడు. -
బ్యాంకులో రెండు కోట్లు గల్లంతు!
ఓ బ్యాంకులో రూ.2.77 కోట్లు గల్లంతయ్యాయి. అంతేకాదు నగదుతోపాటు బ్యాంకు సెక్యూరిటీ గార్డు, ఇద్దరు ఉద్యోగులు కూడా కనిపించకుండాపోయారు! ఉత్తరప్రదేశ్ దెఒరియా జిల్లా కేంద్రంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో జరిగిన ఈ ఘటనను పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తుచేస్తున్నారు. కార్యకలాపాలు పూర్తయిన తర్వాత నగదు నిల్వలన్నింటినీ లాకర్లలో ఉంచడం బ్యాంకు సిబ్బంది రోజూ చేసేదే. కానీ ఆర్థిక సంవత్సరం ఆఖరు రోజైన మార్చి 31న పని ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో రూ2.77 కోట్లను క్యాష్ కౌంటర్ లోని బాక్స్ లో ఉంచి ఇళ్లకు వెళ్లిపోయారు. ఏప్రిల్ 1 సెలవు కావడంతో రెండో తేదీన నగదు గల్లంతైనట్లు గుర్తించామని బ్యాంకు అధికారి వినోద్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. ఓ దుండగుడు నగదు ఎత్తుకెళ్లడం సీసీ టీవీ కెమెరాల్లో రికార్డయిందని, అతడి ఆనవాళ్లు.. కనిపించకుండాపోయిన సెక్యూరిటీగార్డును పోలి ఉన్నాయని దెఒరియా ఎస్సీ మనోజ్ కుమార్ చెప్పారు. అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని, త్వరలోనే నిందితుల్ని అరెస్టు చేస్తామని అన్నారు.