ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ సమావేశంలో రచ్చరచ్చ | Congress activist assaulted at party meeting in UP | Sakshi
Sakshi News home page

ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ సమావేశంలో రచ్చరచ్చ

Oct 12 2020 3:48 AM | Updated on Oct 12 2020 3:48 AM

Congress activist assaulted at party meeting in UP - Sakshi

దేవ్‌రియా: ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌రియాలో కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దేవ్‌రియా అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్‌ 3న ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ను ముకుంద్‌ భాస్కర్‌మణికి ఖరారు చేశారు. దీనిపై నిర్వహించిన సమావేశంలో రేపిస్టుకు టికెట్‌ ఇవ్వడం ఏమిటని ఆగ్రహిస్తూ తారా యాదవ్‌ అనే మహిళా కార్యకర్త నిరసన వ్యక్తం చేశారు. సచిన్‌ నాయక్‌ అనే నేతపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. మిగిలిన కార్యకర్తలు తారా యాదవ్‌ను అడ్డుకున్నారు. ఇది సోషల్‌ మీడియా లో వైరలైంది. దీనిపై తారా నాయక్‌  నలుగురు కాంగ్రెస్‌ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తనను కొట్టి, అవమానించారని ఆరోపించారు. మహిళపై దాడి చేయడాన్ని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రేఖా శర్మ తీవ్రంగా పరిగణించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ డీజీపీకి లేఖ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement