న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో చెలరేగిన హింస, పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ అవినీతి తదితర అంశాలపై చర్చ జరగాలంటూ ప్రతిపక్షాలు పట్టుబట్టడంతో ఉభయ సభల కార్యక్రమాలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సోమవారం కూడా పార్లమెంట్‌లో ఇదే పరిస్థితి కొనసాగింది.
శుక్రవారం వాయిదా పడిన ఉభయసభలు తిరిగి ఇవాళ ఉదయం 11 గంటలకు సమావేశమయ్యాయి. భారత్-చైనా సరిహద్దు ఒప్పందం పురోగతిపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్‌సభలో ప్రకటన చేస్తారని ముందుగా భావించారు. కానీ ఎగువ, దిగువ సభలు ప్రారంభం కాగానే సభలో అదానీ, సంభాల్‌లో హింసాకాండపై చర్చకు విపక్ష ఎంపీలు పట్టుబట్టారు.
విపక్షాల ఆందోళనలతో సభలను మధ్యాహ్నం 12 గంటల వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ప్రకటించారు. ఇక సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా నిరసనలు కొనసాగాయి. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించలేదు. విపక్షాల వాయిదా తీర్మానాలను సభాపతులు అనుమతించలేదు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కోరారు.
పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్ సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ కోరారు. విపక్షాల ఆందోళనలతో ఉభయసభలు రేపటికి (డిసెంబర్ 3)కి వాయిదా పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment