కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఎస్‌పీ కార్యకర్తల తిరుగుబాటు! | Samajwadi Party Workers Protest Against Amroha Congress Candidate | Sakshi
Sakshi News home page

Uttar Pradesh: కాంగ్రెస్‌ అభ్యర్థిపై ఎస్‌పీ కార్యకర్తల తిరుగుబాటు!

Mar 28 2024 12:36 PM | Updated on Mar 28 2024 3:00 PM

Samajwadi Party Workers Protest Against Amroha Congress Candidate - Sakshi

ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికల కోసం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ)తో కాంగ్రెస్‌ పొత్తు కుదుర్చుకుంది. అయితే ఇరు పార్టీలకు చెందిన కొందరు నేతలు, కార్యకర్తలకు ఇది మింగుడుపడటం లేదని పలు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. 

రాష్ట్రంలోని మొరాదాబాద్ సీటు కేటాయింపు విషయంలో గతంలో ఎస్‌టీ హసన్ , రుచి వీర మధ్య  వివాదం తలెత్తింది. ఇప్పుడు సమాజ్‌వాదీ మిత్రపక్షమైన కాంగ్రెస్ అభ్యర్థి డానిష్ అలీ.. ఎస్‌పీ కార్యకర్తల నిరసరనను ఎదుర్కోవలసి వచ్చింది. అమ్రోహా జిల్లాలోని ఎస్‌పీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆ పార్టీ కార్యకర్తలు డానిష్ అలీ అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్ అభ్యర్థి డానిష్ అలీని చూసిన వెంటనే ఎస్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఎస్పీ, కాంగ్రెస్‌ కార్యకర్తల మధ్య తోపులాట తోపులాట జరిగింది. 

వేదికపై కూర్చున్న నేతలు వారిస్తున్నప్పటికీ కార్యకర్తల నిరసన మాత్రం ఆగలేదు. ఎస్పీ కార్యకర్తలు  కార్యాలయం వెలుపల డానిష్ అలీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. డానిష్ అలీని అభ్యర్థిగా నిలబెట్టడాన్ని నిరసిస్తూ కొందరు సమాజ్‌వాదీ పార్టీకి రాజీనామా చేస్తామని బెదిరించారు. డానిష్ అలీ బీఎస్‌పీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. పార్టీ అతనిని అమ్రోహా స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలబెట్టింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement