Women Activist
-
నువ్వెవరు ఇక్కడ ఇసుక తీసుకెళ్లడానికి...బీజేపీ మహిళా కార్యకర్తపై టీడీపీనేత దౌర్జన్యం!
సాక్షి టాస్క్‌ఫోర్స్: ‘‘ఏయ్..! నీకు ఎంత ధైర్యం ఉంటే ఇక్కడకు వచ్చి ఇసుకను తీసుకెళ్తావ్. ఇది మా ఊరి వంక. ఇక్కడ మా ఇష్టం వచ్చినట్టు మేమే ఎత్తుకోవాలి. ఇంకో మాట మాట్లాడావంటే నీ అంతు చూస్తా..’’ అంటూ బూతులు తిడుతూ తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లికి చెందిన టీడీపీ నేత, బీజేపీ మహిళా కార్యకర్తపై దౌర్జన్యానికి పాల్పడి, దాడికి యత్నించిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బుధవారం వైరల్‌గా మారింది. నాగయ్యగారిపల్లికి చెందిన బీజేపీ మహిళా కార్యకర్త లక్ష్మికి చెందిన పొలం వద్ద బోరు పూడుకుపోవడంతో మరమ్మతులు చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం బోరు పైపు చుట్టుపక్కల ఇసుకతో సరిచేసుకునేందుకు నిర్ణయించారు. స్వర్ణముఖినదిలో ఇసుక కోసం వెళ్లారు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు నాగరాజు నాయుడు ఇసుక ట్రాక్టర్‌ను అడ్డుకుని దౌర్జన్యానికి దిగాడు. దీంతో తన పొలంలో అవసరానికి ఇసుక తీసుకుంటున్నానని లక్ష్మి చెప్పారు. మహిళపై విచక్షణరహితంగా బూతులుఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికిలోనైన నాగరాజ నాయుడు ఒక్కసారిగా లక్ష్మిపై బూతులు తిడుతూ చెలరేగిపోయాడు. ‘నీకు ఎంత ధైర్యముంటే ఇక్కడ నుంచి ఇసుకు తీసుకెళ్తావు. నీ జాగీరనుకున్నావా.. మా ఇష్టమైన వాళ్లకు మాత్రమే ఇసుక ఇస్తాం. నీకు దిక్కున్న చోట చెప్పుకో’’ అంటూ పత్రికల్లో రాయలేని విధంగా మహిళా అని కూడా చూడకుండా బూతులతో రెచ్చిపోయాడు. దీంతో సొంత అవసరాలకు ఎవరి అనుమతి అవసరం లేదంటూ లక్ష్మీ సమాధానం చెప్పారు. దీనికి ఆగ్రహించిన నాగరాజ నాయుడు ఒక్కసారిగా ఆమెపై దాడికి యత్నించాడు. అక్కడే ఉన్న తోటి గ్రామస్తులు నాగరాజ నాయుడును నిలువరించి అక్కడ నుంచి తీసుకెళ్లారు. అనంతరం నాగరాజ నాయుడు ఇసుకను తరలిస్తుండటంతో లక్ష్మి అక్కడకు వెళ్లి ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ నాయకులు మహిళా అని కూడా చూడకుండా ఆమెను తోసేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.మహిళలపై రెచ్చిపోతున్న పచ్చనేతలుఈ ఘటనపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో మహిళలకే రక్షణ లేకపోవడం చూస్తుంటే, ప్రభుత్వం మహిళలకు ఏ స్థాయిలో గౌరవం ఇస్తుందో తెలుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేతలు చేస్తున్న దౌర్జన్యాలపై చర్యలు తీసుకోకపోతే నష్టం తప్పదంటున్నారు. ఇప్పటికే టీడీపీ నేతల అక్రమ ఇసుక దందా కారణంగా గతంలో గొడవలు జరిగాయనీ, ఇదే కొనసాగితే పెనుప్రమాదం పొంచి ఉందంటున్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
వైఎస్ఆర్ సీపీ మహిళ కార్యకర్తపై టీడీపీ నేతలు దాడి
-
వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తకు టీడీపీ సోషల్ మీడియా వేధింపులు
సాక్షి, విజయవాడ: టీడీపీ సోషల్ మీడియా వేధింపులపై వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్త పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు సుచిత్ర సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నందుకు తనను వేధింపులకు గురిచేస్తున్నారని.. టీడీపీ సోషల్ మీడియాలో తనపై అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని సుచిత్ర ఆవేదన వ్యక్తం చేశారు.‘‘నా ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియా పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశా. మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. న్యూడ్ ఫోటోలు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. అత్యాచారం చేస్తామంటూ నన్ను బెదిరిస్తున్నారు’’ అని సుచిత్ర తెలిపారు. -
'హెల్త్‌కేర్ మహిళలలో కనిపించని రోల్‌మోడల్..' ఫ్రంట్లైన్కే పరిమితమా?
'హెల్త్‌కేర్ ఇండస్ట్రీలో మహిళలు తక్కువ ఆదాయాలను పొందే ఫ్రంట్‌లైన్ పాత్రలలోనే కనిపిస్తున్నారు అని దస్రా ఆర్గనైజేషన్ ఒక డేటా విడుదల చేసింది. మహిళలు వైద్యవిద్యలలో 29 శాతం ఉంటే, నర్సింగ్ సిబ్బందిలో 80 శాతం ఉన్నారు. ఇక 100 శాతం ఆశావర్కర్లుగా ఉన్నారు.ఆరోగ్య సంరక్షణలో నాయకత్వ స్థానాల్లో కేవలం 18 శాతం మాత్రమే మహిళలు ఉన్నారు. ఈ రంగంలో పురుషుల కంటే 34 శాతం స్త్రీలు తక్కువ సంపాదిస్తున్నారు.' లాభాపేక్ష లేకుండా, అన్ని రంగాలలో సామాజిక మార్పునకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థ దస్రా. ఈ సంస్థ హెల్త్ కేర్ రంగంపై దృష్టి పెట్టి, ఓ నివేదికను రూపొందించింది. ఈ నివేదికలో పొందుపర్చిన విషయాలలో ముఖ్యంగా గమనించాల్సింది మహిళలకు రోల్‌మోడల్స్ లేకపోవడం, వారి పనిని తక్కువ అంచనా వేయడం, అంతర్గత పక్షపాతాలు, లింగ సమానత్వం గురించి సరైన అవగాహన లేకపోవడం అని పేర్కొంది. ఫ్రంట్‌లైన్ పాత్రలలోనే.. భారతదేశంలో ప్రధానమైన హెల్త్‌కేర్ రంగం కొన్ని సంవత్సరాలుగా సాంకేతికత, నైపుణ్యాలు, విద్య, వృత్తిపరంగా గణనీయమైన అభివృద్ధి, విస్తరణను చవిచూసింది. అయినప్పటికీ ఆరోగ్య సంరక్షణ రంగంలో మహిళలు తక్కువ ఆదాయాలను పొందే ఫ్రంట్‌లైన్ పాత్రలలో కనిపిస్తున్నారని దస్రా నివేదిక సూచిస్తుంది. దస్రా డైరెక్టర్ శైలజా మెహతా మాట్లాడుతూ ‘ఆరోగ్య సంరక్షణరంగంలో మహిళల నాయకత్వంలో మార్పు తీసుకురావడం చాలా అవసరం. ఎందుకంటే, ఇతర రంగాలను కూడా హెల్త్‌కేర్ ప్రభావితం చేయడమే కారణం. లింగ సమానత్వం విషయంలో మా పనిలో మేం మహిళల పురోగతికి సంబంధించిన గ్యాప్‌పై దృష్టి పెట్టాలనుకున్నాం’ అని తెలిపారు. అతి తక్కువ శాతం! నివేదిక ఫలితాల ప్రకారం మొత్తం హెల్త్‌కేర్ వర్క్ ఫోర్స్‌లో 54 శాతం ఉన్న ప్రైవేట్ హాస్పిటల్ సెక్టార్లో మహిళలు దాదాపు 25 నుంచి 30 శాతం నాయకత్వ స్థానాలను ఆక్రమించారు. ఫార్మాస్యూటికల్, బయోటెక్ రంగాలలో 5 నుంచి 10 శాతం మాత్రమే నాయకత్వపాత్రల్లో మహిళలు ఉన్నారు. మార్కెటింగ్ కార్యకలాపాల స్థానాల్లో కూడా మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. ప్రవేశ స్థాయి స్థానాల్లో మహిళలు 40 నుంచి 50 శాతం ఉండగా, సీనియర్ పాత్రలలో ఈ శాతం గణనీయంగా 15 నుంచి 20 శాతానికి పడిపోయింది. పరిమిత ప్రాధాన్యం.. మహిళలు ఆర్ అండ్ డి, నర్సింగ్, హెచ్ఆర్, పరిపాలన, నాణ్యత హామీ, చట్టపరమైన, నియంత్రణ వ్యవహారాలు వంటి విధుల్లో బాగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇవి పరిమిత ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఎంట్రీ లెవల్ హెచ్ఆర్ పాత్రల కోసం మహిళలకు ప్రాధాన్యత ఉంటుంది. దీని ఫలితంగా గణనీయంగా 70–80 శాతం ప్రాతినిధ్యం ఉంది. ఇదే నాయకత్వ స్థానాల్లో 20 నుంచి 30 శాతానికి పడిపోతుంది. నివేదిక ఫలితాలు, రోగుల సేవా బృందాలు, ఎఫ్ అండ్ బి మొదలైన వాటిలో ఇదే విధమైన నమూనాను గమనించాయి. ప్రవేశ స్థాయులలో 40 నుంచి 60 శాతం మహిళలను ప్రాధాన్యంగా నియమించుకుంటారు. అయితే సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ స్థాయులకు వారి పురోగతి పరిమితంగా ఉంది. ఇది 15 నుంచి 20 శాతానికి మాత్రమే చేరుకుంది. రోల్ మోడల్స్ లేకపోవడమే.. లీడర్షిప్ క్వాలిటీ పెంపొందించుకోవడానికి మహిళలకు ప్రధాన అవరోధం రోల్ మోడల్స్ లేకపోవడమే. మహిళల పనిని తక్కువ అంచనా వేయడం, అంతర్గత పక్షపాతాలు, లింగ సమానత్వం, వైవిధ్యం గురించి నమ్మదగిన సాంస్కృతిక కథనం లేకపోవడం అని నివేదిక హైలైట్ చేసింది. శైలజా మెహతా మరిన్ని వివరాలు చెబుతూ ‘అడ్డంకులు చాలా రెట్లు ఉన్నాయి. మహిళలు నిజంగా ప్రభావవంతంగా ఉన్నారా.. మంచి నాయకులు కాదా... అని ప్రశ్నించే మూస పద్ధతి కూడా ఒక కారణంగా ఉంది. మహిళల నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రతికూల పక్షపాతాలు, నిబంధనలు, ప్రవర్తనలు, ఊహాజనితాలు ఎన్నో ఉన్నాయి. వీటిని వదులుకోవడం అంత సులభం కాదు. సంస్థలు మెరుగైన వ్యాపారం కోసం ఆలోచిస్తాయే తప్ప మహిళా ఉన్నతిని పెద్దగా పట్టించుకోవు. హెల్త్‌కేర్ రంగంలో మహిళలు లీడర్షిప్ స్థాయిలో ప్రాతినిధ్యం వహించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది. భారతదేశంలో చాలా మంది మహిళలకు వారి ఆకాంక్షలకు కఠినమైన అడ్డంకులు ఉంటాయి. మహిళల లక్ష్యం నర్సు కావడమే అన్నట్టుగా ఉంటుంది. మేనేజర్‌గా లేదా సీఇవోగా ఉండటానికి వారికి అవకాశం ఇవ్వరు. ‘మహిళలు తమ పరిమితులను దాటి, విస్తరించాలి. అడ్డుగోడలను, నిబంధనలను తొలగించుకుంటూ తమను తాము ప్రోత్సహించుకుంటూ ముందడుగు వేయాలి. అప్పుడే భవిష్యత్తు తరాలకు రోల్‌మోడల్స్‌గా నిలుస్తారు’ అని చెబుతున్న దస్రా నివేదిక మనందరినీ ఆలోచింపజేస్తుంది. ఇవి చదవండి: కుమారులకి వంట నేర్పిస్తే.. ఏం జరుగుతుందో ఈ అమ్మ చూపించింది! -
సమున్నత స్త్రీవాద ఉద్యమ శిఖరం
సెప్టెంబర్ 25న ఢిల్లీలో కన్నుమూసిన కమలా భాసిన్ రాజీపడని, అలుపెరగని మహిళా ఉద్యమకారిణి, అద్భుతమైన వక్త. గాయని, రచయిత్రి, ఆర్గనైజర్. భారతదేశంలోనూ, దక్షిణాసియా వ్యాప్తంగా మహిళా ఉద్యమంపై విశిష్టమైన ముద్రను వదలిపెట్టి వెళ్లారు. స్త్రీవాద సిద్ధాంతానికి విభిన్నంగా ఆలోచించేవారిపై కూడా ఆమె తనదైన ప్రభావం చూపారు. పంజాబ్‌లోని షహీదన్వాలి గ్రామంలో (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది) 1946లో పుట్టిన కమలా భాసిన్ రాజస్తాన్‌లో పెరిగారు. రాజస్తాన్ యూనివర్సిటీలో పీజీ పూర్తి చదివాక జర్మనీలో సోషియాలజీని అధ్యయనం చేశారు. 1972లో దేశానికి తిరిగొచ్చిన కమల ఉదయ్‌పూర్ కేంద్రంగా పనిచేసే వాలంటరీ సంస్థ సేవామందిర్లో చేరారు. గ్రామీణ, పట్టణ పేదలను స్వీయాభివృద్ధి వైపు కదిలించే లక్ష్యంతో పనిచేసే సంస్థ ఇది. ఆ రోజునుంచి 2021 సెప్టెంబర్ 25న కేన్సర్ వ్యాధితో అంతిమ శ్వాస వదిలేంతవరకు ఆమె జీవితాంతం జెండర్, అభివృద్ధి, శాంతి, అస్తిత్వ రాజకీయాలు, సైనికీకరణ, మానవ హక్కుల, ప్రజాస్వామ్యం వంటి అంశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంపై నిమగ్నమవుతూ వచ్చారు. కమలా భాసిన్ని నేను 1990లో తొలిసారిగా కలిశాను. అప్పుడు నా వయస్సు పాతికేళ్లు. ఢిల్లీకి నేను కొత్త. మహిళా ఉద్యమంపై నా పీహెచ్డీ పరిశోధనను పూర్తి చేయాలనుకుంటున్న సమయం. ఎవరిని ప్రశ్నించినా సరే తరచుగా వారందరూ పేర్కొనే పేరు కమలా భాసిన్. విరామమెరుగని ఫెమినిస్టుగా, 1970లలో మహిళా ఉద్యమాల క్రమంలో చాలా తరచుగా వినిపించిన పేరు ఆమెది. పితృస్వామ్య భావజాలాన్ని అత్యంత పదునైన స్వరంతో అపహాస్యం చేసిన గొప్ప వ్యక్తుల్లో ఆమె ఒకరు. ఆమెను నేను కలిసిన సమయానికే, కమల రెండు దశాబ్దాలుగా మహిళా ఉద్యమ నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారు. వరకట్నం, అత్యాచారం (మధుర రేప్ కేసు నేపథ్యంలో), గృహ హింసకు వ్యతిరేకంగా మహిళా బృందాలు తమదైన నిరసనతో వీధుల్లోకి వస్తున్నప్పుడు ఈ అన్ని క్యాంపెయిన్లలో ఆమె అంతర్భాగమై ఉండేవారు. ‘వ్యక్తిగతం కూడా రాజకీయమే’ అనే ఫెమినిస్టు నినాదం నాటి నిరసన ప్రదర్శనల్లో మారుమోగేది. ఈ నేపథ్యంలోనే ఇండియా గేట్ వద్ద జరిగిన ఒక మహిళా ప్రదర్శనలో ఆమెను కలిశాను. ఆరోజుల్లో ఆక్కడ నిరసనలకు అనుమతించేవారు. ఒక పెద్ద చీరపై మహిళల హక్కుల నినాదాలను చిత్రించిన బ్యానర్‌ని కార్యకర్తలు పట్టుకునేవారు. శరీర రాజకీయాలపై ఒక సామూహిక ప్రకటన చేయడానికి కులం, వర్గం, మతంతో సంబంధం లేకుండా మహిళల శరీరాలను ఒక చీరపై చిత్రించడం చూసి ఆశ్చర్యపోయాను. అనేకమంది మహిళలకు లాగే ఆ రోజు కమలను చూసి నేను కూడా ప్రేమలో పడిపోయాను. ‘ప్రేమలో పైకి ఎదగండి, ఓడిపోవద్దు’ అని కమల ఎల్లప్పుడూ మాకు ప్రబోధించేవారు. ఆ ప్రదర్శన ముగిశాక, కమల నన్ను ‘జాగోరి’కి పంపారు. జాగోరి అనేది మహిళా ఉద్యమంలో భాగమైన మరో ఆరుగురు మహిళలతో కలిసి 1984లో ఆమె స్థాపించిన మహిళా కలెక్టివ్. గ్రామీణ ప్రాంతాలకు, చిన్న పట్టణాలకు మహిళా చైతన్యాన్ని తీసుకెళ్లి సిద్ధాంతాన్ని, కార్యాచరణను ఒకచోటికి చేర్చడంలో నిమగ్నమైన సంస్థ జాగోరి. మల్టీమీడియా కమ్యూనికేషన్ అనే పదం ఇంకా వ్యాప్తిలోకి రాకముందే ఫెమినిస్టు భావాలను పాటలు, సంగీతం, కవిత్వం, పోస్టర్లు, ఫెమినిస్టు థీమ్‌తో కూడిన డైరీల ద్వారా ప్రచారం చేసి విస్తృతంగా శ్రోతలను ఆకట్టుకోవడంలో జాగోరి సంస్థ గొప్ప విజయం సాధించింది. అది అత్యంత కష్టభరితమైన సమయం. భన్వరీదేవి అత్యాచారం కేసు 1992లో ఢిల్లీ, రాజస్తాన్‌కి చెందిన అనేక మహిళా బృందాలను ఏకం చేసింది. భన్వరీదేవికి న్యాయం చేయాలంటూ ఈ మహిళా బృందాలు చేసిన విస్తృత ప్రచారం కారణంగా 1997లో పనిస్థలాల్లో లైంగిక వేధింపుల పరిష్కారం కోసం సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తీసుకురావడానికి దారితీసింది. ఆ సమయంలోనే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కమలా భాసిన్ రోడ్డు మధ్యలోని ట్రాఫిక్ పోలీసు బూత్‌పైకి ఎక్కి ‘నా సోదరీమణులు స్వేచ్ఛ కోరుకుంటున్నారు’ అంటూ గొంతెత్తి చేసిన నినాదం ఆ పరిసరాల్లో ప్రతిధ్వనించింది. ఈ నినాదాన్ని పాకిస్తాన్ ఫెమినిస్టుల నుంచి తీసుకున్న కమల దాన్ని ఫెమినిస్టు ఉద్యమ గీతంగా మార్చింది. అది ఈనాటికీ మహిళా ఉద్యమాలకు బలమైన నినాదంగా కొనసాగుతోంది. ప్రజలతో, వారి భిన్నాభిప్రాయాలతో దాపరికం లేకుండా వ్యవహరించడం కమల విశిష్ట గుణాల్లో ఒకటి. ఎవరు చెప్పినా ముందు ఆమె శ్రద్ధగా వినేవారు. ప్రజల నుంచి నేర్చుకోవడానికి ఆమె సర్వదా సిద్ధంగా ఉండేవారు. ఒకసారి రాత్రి 10 గంటల సమయంలో నా కుమార్తెను నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తుండగా కమల నాకు కాల్ చేశారు. ముందుగా నా కూతురే ఫోన్ తీసుకుని ‘మా అమ్మతో మాట్లాడే సమయం ఇది కాదు’ అనేసింది. నేను వెంటనే ఫోన్ లాక్కుని కమలకు క్షమాపణ చెప్పాను. కానీ ‘నీ కూతురు మాట్లాడిందే సరైనది’ అంటూ కమల నాకు క్షమాపణ చెప్పారు. ఆ తర్వాత రాత్రిపూట ఆమె నాకు ఎన్నడూ ఫోన్ చేయలేదు. దేశదేశాల్లో ఆమెను ఎరిగిన వ్యక్తులు, ఉద్యమ కార్యకర్తలు సైతం ఆమెను తమలో ఒకరిగా భావించేవారు. దక్షిణాసియాలో శాంతి సామరస్యాలు వెల్లివిరియాలని ఆమె ప్రగాఢంగా కోరుకునేవారు. అద్భుతమైన వక్తగా, భావ ప్రచారకర్తగా వెలిగిన కమల ఎనిమిది పిల్లల పుస్తకాలతో సహా 35 పుస్తకాలు రచించారు. స్త్రీవాదం, పితృస్వామ్యంపై ఆమె రాసిన పుస్తకాలు విస్తృతంగా ప్రచారానికి నోచుకున్నాయి. అతి సాధారణమైన భాషలో సైద్ధాం తిక భావనలను రాయడంలో ఆమె ఆరితేరారు. విజిల్ వేయడం ఆమె ట్రేడ్ మార్క్. ఈ ఒక్కటి మాత్రం ఎంత ప్రయత్నించినా మేం నేర్చుకోలేకపోయాం. మానవ మాత్రురాలిగా కమల తప్పిదాలకు అతీతం కాదు. కానీ తాను తప్పులు చేశానని ఒప్పుకునే అరుదైన గుణం ఆమెకి ఉంది. స్నేహాల్ని కొనసాగించడం ఆమె జీవితంలో కేంద్రబిందువు. కమల సృజనకు హద్దుల్లేవు. ఫెమినిస్టు వర్క్‌షాపుల్లో ఆమె 200 పాటలు రాశారు. భారత్‌లోనే కాకుండా దక్షిణాసియా వ్యాప్తంగా అనేక నిరసన ప్రదర్శనల్లో వాటిని ఆమె పాడింది. కనీసం పది భాషల్లోకి ఆమె పాటలు అనువదించారు. ‘బంధనాలను తెంచుకుని సోదరీమణులు వచ్చారు’ అనే ఆమె పాట విన్నప్పుడల్లా మహిళలుగా మేం చేస్తున్న ప్రయాణంలో అన్ని రకాల సాంప్రదాయాలను, శృంఖలాలను నిజంగానే తెంచుకున్నట్లు భావించేవాళ్లం. అందుకే సెప్టెంబర్ 25న ఆమె అంత్యక్రియల సందర్భంగా ఆమె పాటనే కాకుండా అనేక ఫెమినిస్టు గీతాలనూ పాడి ఆమెకు నిజమైన నివాళిని అర్పించాము. కల్పనా విశ్వనాథ్ వ్యాసకర్త సేఫ్టీపిన్ సీఈఓ, స్త్రీవాద ఉద్యమకారిణి -
అబ్బాయిల వేషం కట్టి... తప్పించుకుంది
తాలిబన్లు చెప్పే మాటలు న మ్మకండి. వాళ్లు చేసే ప్రమాణాలు ఎప్పుడైనా మారిపోవచ్చు. మీరు మీ కుంటుంబాలతోపాటు స్నేహితులను అఫ్గానిస్తాన్ నుంచి తరలించండి అని హెచ్చరిస్తోంది స్పెయిన్‌లో నివసిస్తోన్న అఫ్గాన్ మహిళా కార్యకర్త, రచయిత నదియా గులామ్. ప్రస్తుతం నదియా అఫ్గాన్‌లో లేనప్పటికీ తన కుటుంబం మాత్రం ఇంకా అక్కడే ఉండడంతో ఆమె తీవ్ర ఆందోళన చెందుతోంది. ‘‘నా కుటుంబమే కాదు, అక్కడ ఉన్న వేలమంది కూడా నా కుటుంబ సభ్యులే. తాలిబన్లు తమ మాతృదేశాన్ని ఆక్రమించుకున్నప్పటి నుంచి నా కంటనీరు ఆగడం లేదు.గతంలో కంటే తాలిబన్లు ఇప్పుడు మరింత తెగబడతారు. గత ప్రభుత్వంలో పనిచేసిన ఉద్యోగులు ఒక్కొక్కరుగా కనపడకుండా పోతారు’’ అని వణికిపోతోంది. నదియా ఇంతగా భయపడడానికి... గతంలో తాలిబన్ల అరాచకాల వల్ల తను అనుభవించిన నరకయాతనలే. తాలిబన్లు అఫ్గానిస్తాన్‌ను పరిపాలిస్తున్న రోజులవి. అప్పుడు నదియాకు పదకొండేళ్లు ఉంటాయి. ఒకరోజు నదియా వాళ్ల ఇంటిపై బాంబు పడింది. ఇంట్లో ఉన్న అమ్మానాన్నలు తీవ్రంగా గాయపడ్డారు. నదియా వాళ్ల అన్నయ్య ఏకంగా ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలపాలై ప్రాణాలతో బయట పడిన నదియాకు రూపురేఖలు వికృతంగా మారిపోయాయి. ఒక బాంబు దాడి కుటుంబాన్నే నాశనం చేసింది. ఇది ఇలా ఉండగా... అదే సమయంలో ‘‘మహిళలు చదువుకోకూడదు, ఉద్యోగాలు చేయకూడదు, ఇల్లు విడిచి బయటకు రాకూడదు’’ అని తాలిబన్లు హుకుం జారీ చేశారు. ఒకపక్క అన్నయ్య లేడు, నాన్న ఉన్నప్పటికీ మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబానికి తనే ఆధారం కావాల్సి వచ్చింది. అడపిల్లలు బయటకు వెళ్లకూడదు. వెళ్లకపోతే ఇల్లు గడిచే పరిస్థితి లేదు. ఇంతటి క్లిష్టసమయంలో సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది నదియా. అమ్మాయిగా బయటకు వెళ్తే తప్పు గానీ, అబ్బాయిగా కాదు కదా! అనుకుని బయటకు వెళ్లేటప్పుడు అబ్బాయిలా బట్టలు వేసుకుని, అబ్బాయిలా తిరుగుతూ మగవాళ్లలా పనులు చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉండేది. ఇలా పదేళ్ల పాటు తన బాల్యాన్ని, గుర్తింపును కోల్పోయి బతికింది. పదేళ్ల తరవాత ఓ ఎన్జీవో సాయంతో స్పెయిన్‌కు శరణార్థిగా వెళ్లింది. స్పెయిన్ వచ్చాక మళ్లీ పుట్టినట్లు అనిపించింది తనకు. కొత్త జీవితాన్ని ప్రారంభించే క్రమంలో ముఖానికి సర్జరీ చేయించుకుని వికృతంగా ఉన్న రూపాన్ని కాస్త మార్చుకుంది. అలాగే తనలా శరణార్థులుగా వస్తోన్న నిరాశ్రయుల కోసం ‘‘పాంట్స్ పర్ లా పావ్’’ను స్థాపించి, శరణార్థులకు వివిధ రకాల భాషలు, వృత్తిపరమైన నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తూ వారికి బతుకుదెరువు చూపిస్తోంది. అంతేగాక చిన్నతనంలోనే అనేక కష్టాలను ప్రత్యక్షంగా అనుభవించిన నదియా అనుభవాలతో ‘‘ద సీక్రెట్ ఆఫ్ మై టర్బన్’’, టేల్స్ దట్ హీల్డ్ మీ’’, ‘‘ద ఫస్ట్ స్టార్ ఆఫ్ ది నైట్’’ పుస్తకాలను రాసి రచయిత్రిగా గుర్తింపు తెచ్చుకుంది. తనలా ఇంకెంతమందో... ఇన్ని కష్టాలు పడిన నదియా ఇప్పటికీ ఆ చీకటిరోజులను మర్చిపోలేక పోతోంది. తాజాగా తాలిబన్లు మరోసారి పిల్లలు, అమ్మాయిలు, మహిళలపై ఎంతటిదారుణమైన చర్యలకు పాల్పడతారోనని వణికి పోతుంది. తనలాగా ఇంకెంతమంది అమ్మాయిలు తమ జీవితాలను కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేస్తోంది.‘‘ప్లీజ్ మా దేశానికి గన్స్ సరఫరా చేయకండి. నా దేశం గత యాభై ఏళ్లుగా యుద్ధంలో పోరాడుతూనే ఉంది. అఫ్గాన్‌లో 85 శాతం మంది ప్రజలు మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. నిజంగా మీరు మాకు సాయం చేయాలంటే మానసిక ధైర్యాన్ని ఇవ్వండి. మహిళలు చదువుకునేందుకు సహకరించండి’’ అని అంతర్జాతీయ సమాజాన్ని అర్థిస్తోంది. అంతేగాదు, గత పదిరోజులుగా అఫ్గాన్ నుంచి ప్రజలను తరలించేందుకు శాయశక్తులా కృషిచేస్తోంది. నిజంగా కష్టాలు పడిన వారికే ఆ బాధ తెలుస్తుంది అనడానికి నదియా నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. నదియా గులామ్ -
మహిళను మెడవంచి కొట్టిన అశోక్‌గజపతిరాజు
విజయనగరం రూరల్: కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు పూసపాటి అశోక్‌గజపతిరాజు సోమవారం విజయనగరంలో ఒక మహిళను మెడవంచి కొట్టారు. మహిళా దినోత్సవం నాడు విజయనగరంలో మహిళకు ఘోర అవమానం జరిగింది. విజయనగరంలోని 14వ వార్డులో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొంతమంది టీడీపీ మహిళా కార్యకర్తలు హారతి ఇచ్చారు. ఆయన వద్దని వారించారు. ఈ సమయంలో నేత మీద గౌరవంతో హేమలత అనే మహిళ పూలు చల్లడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ఒక్కసారిగా వెనుదిరిగి వెళ్లిన ఆయన విచక్షణ లేకుండా ఆమె మెడవంచి కొట్టారు. దీంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. హేమలత అవమానభారంతో వెళ్లిపోయారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున టీడీపీ నేత చర్యతో మహిళలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సాయంత్రానికి టీడీపీ నేతలు.. తనపై అశోక్‌గజపతిరాజు చేయి చేసుకోలేదని బాధితురాలితో విలేకరుల ఎదుట చెప్పించడం విశేషం. కాగా గతకొన్నిరోజులుగా టీడీపీ సీనియర్ నేతలు వీరంగం సృష్టిస్తున్నారు. ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే , సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఓ ఫోటోగ్రాఫర్పై చేయిచేసుకున్న విషయం తెలిసిందే. హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలయ్య .. తన అనుమతి లేకుండా ఫోటోలు తీయడంతో సదరు ఫోటోగ్రాఫర్ చెంపమీద కొట్టాడు. ఇదిలా ఉండగా ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సైతం సహనం కోల్పోయి శ్రుతి మించి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ సంఘటనలన్నీ వారం రోజుల సమయంలోనే వెలుగులోకి రావడం గమనార్హం. చదవండి: మరోసారి అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన బాలయ్య -
3 ఏళ్ల తర్వాత హక్కుల కార్యకర్త విడుదల.. కారణం అదేనా?
దుబాయ్ : దాదాపు మూడేళ్లు నిర్బంధంలో ఉన్న ప్రముఖ మహిళా హక్కుల కార్యకర్త లౌజన్ అల్ హథ్లౌల్ (31)ను సౌదీ అధికారులు విడుదల చేశారు. మహిళా డ్రైవర్లపై నిషేధం ఎత్తివేయాలని కోరుతూ దీర్ఘకాలంగా పోరాడుతున్న లౌజస్ సహా మరో పన్నెండు మంది మహిళలను 2018 మేలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనూహ్యంగా సౌదీలో మహిళా డ్రైవర్లపై నిషేధాన్ని ఎత్తివేస్తూ చారిత్రక నిర్ణయం వెలువడింది. ఉగ్రవాద నిరోధక చట్టం కింద అరెస్ట్ చేసిన లౌజన్కు కోర్టు దాదాపు ఆరేళ్ల జైలుశిక్ష విధించింది. అయితే ఆమె నిర్భంధంపై ఐక్యరాజ్యసమితి, ప్రపంచ మానవ హక్కుల సంఘాలు ఖండించాయి. ఆమెను వెంటనే విడుదల చేయాల్సిందిగా సౌదీ ప్రభుత్వాన్ని కోరాయి. ఈ నేపధ్యంలో రెండు సంవత్సరాల పది నెలల శిక్షాకాలన్ని తగ్గిస్తున్నట్లు 2020 మార్చిలో కోర్టు తీర్పునిచ్చింది. అప్పటి నుంచి ఆమె త్వరలోనే విడుదలవుతారంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. అయితే వెయ్యి రోజుల జైలు శిక్ష అనంతరం ఎట్టకేలకు లౌజన్ విడుదలయ్యింది. (హక్కుల కార్యకర్తకు ఆరేళ్ల జైలు) సౌదీలో మానవ హక్కుల పరిస్థితిపై అమెరికా ఒత్తిడి నేపథ్యంలో లౌజన్ విడుదల కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అమెరికా-సౌదీ దేశాలు మానవహక్కులు, ప్రజాస్వామ్య సూత్రాల కోసం నిలబడాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిజ్ఞ చేస్తూ..మహిళా హక్కుల కార్యకర్తలతో సహా రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని సౌదీ రాజ్యానికి పిలుపునిచ్చారు. బైడెన్ విజ్ఞప్తి మేరకే లౌజన్ను సౌదీ ప్రభుత్వం విడుదల చేసినట్లు తెలుస్తోంది. లౌజస్ను విడుదల చేయడం చాలా సంతోషకరమని బైడెన్ పేర్కొన్నారు. ఇక ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సైతం లౌజన్ విడుదలను స్వాగతిస్తూ..ఎట్టకేలకు ఆమె కుటుంబానికి ఉపశమనం కలిగినందుకు సంతోషంగా ఉందని ట్వీట్ చేశారు. (ట్రంప్ అభిశంసనపై విచారణ మొదలు) -
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సమావేశంలో రచ్చరచ్చ
దేవ్రియా: ఉత్తరప్రదేశ్‌లోని దేవ్‌రియాలో కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దేవ్రియా అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. కాంగ్రెస్ పార్టీ టికెట్‌ను ముకుంద్ భాస్కర్‌మణికి ఖరారు చేశారు. దీనిపై నిర్వహించిన సమావేశంలో రేపిస్టుకు టికెట్ ఇవ్వడం ఏమిటని ఆగ్రహిస్తూ తారా యాదవ్ అనే మహిళా కార్యకర్త నిరసన వ్యక్తం చేశారు. సచిన్ నాయక్ అనే నేతపై దాడి చేసేందుకు ప్రయత్నించారు. మిగిలిన కార్యకర్తలు తారా యాదవ్‌ను అడ్డుకున్నారు. ఇది సోషల్ మీడియా లో వైరలైంది. దీనిపై తారా నాయక్ నలుగురు కాంగ్రెస్ నాయకులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు తనను కొట్టి, అవమానించారని ఆరోపించారు. మహిళపై దాడి చేయడాన్ని జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ తీవ్రంగా పరిగణించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ యూపీ డీజీపీకి లేఖ రాశారు. -
నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు : సదాఫ్ జాఫర్
-
నన్ను అన్యాయంగా అరెస్టు చేశారు : సదాఫ్ జాఫర్
లక్నో : లక్నోలో పౌరసత్వ సవరణ చట్టంకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నసమయంలో అక్కడే ఉన్న యుపీకి చెందిన కాంగ్రెస్ కార్యకర్త, సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్‌ను పోలీసులు అరెస్టు చేసి తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆమె అరెస్టుకు ముందు అక్కడ ఘర్ణణకు సంబంధించిన వీడియోలనూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. పౌరసత్వ సవరణ చట్టం వ్యతిరేకిస్తూ డిసెంబర్ 19 న లక్నోలో హింసాత్మక నిరసనలు చోటుచేసుకున్నాయి. పోలీస్‌స్టేషన్ బయట పార్క్ చేసి ఉన్న వాహనాలపై దాదాపు 200 మంది ఆందోళనకారులు పెద్ద ఎత్తున రాళ్లు రువ్వి తమ నిరసనను తెలియజేశారు. ఈ నేపథ్యంలో నిరసనకారులు, భద్రతా దళాల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో వారందరిని అదుపులోకి తీసుకున్నారు. అందులో సామాజిక కార్యకర్త సదాఫ్ జాఫర్ కూడా ఉన్నారు. నిరసనకారులు ఆందోళన చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న సదాఫ్ జాఫర్‌తో పాటు మరో 34మందిపై లక్నోలోని హజ్రత్ఘంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఐఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అయితే ఆమె అరెస్టుకు ముందు తీసిన వీడియోలో సదాఫ్ జాఫర్ మాట్లాడుతూ.. అల్లరి ముకలు రాళ్లతో దాడి చేస్తున్నా వాళ్లను ఆపడానికి ఎందుకు ప్రయత్నించడం లేదని, వారిని పట్టుకోవాల్సింది పోయి అలాగే చూస్తు నిలబడడమేంటని ప్రశ్నించారు. మీకు రక్షణగా ఇచ్చిన హెల్మెట్ల వల్ల ఉపయోగం ఉపయోగం ఏంటని విమర్శించారు.దీంతో పాటు ఇంకో వీడియోను కూడా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. సదాఫ్ జాఫర్ ఆందోళన జరుగుతున్న ప్రదేశంలో ఉండగా ఆమెను అరెస్టు చేయడానికి వచ్చిన మహిళా కానిస్టేబుల్‌ను ఉద్దేశించి .. రాళ్లతో దాడి చేస్తున్న వారిని వదిలేసి నన్నెందుకు అరెస్టు చేస్తున్నారు. ఇది అన్యాయమని అడిగారు. ఇదే అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విట్టర్లో స్పందిస్తూ 'మా కార్యకర్త సదాఫ్ జాఫర్‌ను అన్యాయంగా అరెస్టు చేశారు. యూపీ పోలీసులు అసలు దోషులను వదిలేసి సదాఫ్ జాఫర్‌ను అరెస్టు చేసి తీసుకెళ్లారని, ఆమెను తీవ్రంగా కొట్టారని తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ఒక మహిళపై అణచివేత ధోరణి తగదని, వెంటనే ఆమెను రిలీజ్ చేయాలని' డిమాండ్ చేశారు. हमारी महिला कार्यकर्ता सदफ ज़फ़र पुलिस को बता रही थीं कि उपद्रवियों को पकड़ो और उन्हें यूपी पुलिस ने बुरी तरह से मारा पीटा व गिरफ्तार कर लिया। वह दो छोटे-छोटे बच्चों की मां हैं। ये सरासर ज्यादती है। इस तरह का दमन एकदम नहीं चलेगा।https://t.co/ydS8uYuosM — Priyanka Gandhi Vadra (@priyankagandhi) 22 December 2019 -
సారీ చెప్పిన దలైలామా!
న్యూఢిల్లీ: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమత ప్రబోధకులు దలైలామా ప్రపంచ మహిళా లోకానికి క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు దలైలామా కార్యాలయం ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని రోజుల క్రితం బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో దలైలామా మహిళల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఓ మహిళ మీ వారసురాలు కావడం మీకు అంగీకారమేనా అని విలేకరి అడిగిన ప్రశ్నకు దలైలామా సమాధానమిస్తూ.. మహిళా దలైలామా వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే ఆమె తనలా కాకుండా చాలా అందంగా ఉండాలన్నారు. అలా అయితేనే జనాలు ఆమెను చూడ్డానికి ఉత్సాహం చూపిస్తారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు దలైలామా. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆయన వ్యాఖ్యలు పితృస్వామ్య వ్యవస్థకు అద్దం పడుతున్నాయని మండిపడ్ద సంగతి విధితమే. గతంలో స్త్రీ పురుషులిద్దరికీ బౌద్ధమతంలో సమాన హక్కులు ఉంటాయని చెప్పిన దలైలామా ఇప్పుడిలా మాట్లాడటం తగదన్నారు. అందంగా ఉంటేనే ఎక్కువ ఆధ్యాత్మికత ఉన్నాట్లా అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో వెనక్కి తగ్గిన దలైలామా క్షమాపణలు చెప్పారు. -
నోటి మాటే నినాదం అయింది!
‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అనే నినాదం భగత్‌సింగ్‌ది. ‘ఆకాశంలో సగం’ అనే నినాదం విప్లవనేత మావోది. ‘డూ ఆర్ డై’ అనే నినాదం గాంధీజీది.‘మహిళల హక్కులూ మానవహక్కులే’ అనే నినాదం.. ఎవరిది? ఆ అజ్ఞాత నినాదకర్త గురించి చదవండి. 1984. జెనీవాలో యు.ఎన్. కాన్ఫరెన్స్ జరుగుతోంది. మానవ హక్కుల మీద చర్చ. ఇండియా నుంచి మాట్లాడ్డానికి మాలా పాల్ అనే ఆవిడ వెళ్లారు. ముగ్గురు పిల్లల తల్లి. ఆమె వంతు వచ్చింది. ‘‘ఇండియాలో, ఇంకా అనేక ప్రపంచ దేశాల్లో మహిళలు కనీస హక్కులకు కూడా నోచుకోకుండా దుర్భరమైన జీవితం సాగిస్తున్నారు. మనం మానవ హక్కుల గురించి మాట్లాడుకుంటున్నాం. మహిళల హక్కులూ మానవ హక్కులేనని ఎందుకు గుర్తించలేకపోతున్నాం! ఉమెన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్ కాదా?!’’ అన్నారు మాలా. ఆ మాటకు మాలా పక్కన ఉన్నావిడ గట్టిగా బల్లను చరిచి మాలాను సమర్థించారు. మరుక్షణం హాలంతా హర్షధ్వానాలు. మాలా పాల్ ‘ఆలిండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్’ ప్రతినిధిగా ఆ సదస్సుకు హాజరు అయ్యారు. ఆ బల్లగుద్దిన ఆవిడ సెనెగల్ రాయబారి. కొన్ని వారాల తర్వాత ఐక్యరాజ్యసమితి.. మాలా అన్న మాటను తన అధికారిక నినాదంగా స్వీకరించింది. ‘ఉమెన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్’ అనే ఆ మాట అప్పట్నుంచి వాడుకలోకి వచ్చింది. ఏమిటి అంత పవర్ ఆ మాటలో! మహిళ కూడా మనిషేనని గుర్తు చేయడం. గుర్తు చేయవలసినంతగా మహిళల హక్కుల గురించి పట్టించుకోవడం మానేశాం అని చెప్పడం. 1995లో ఐక్యరాజ్యసమితి చైనా రాజధాని బీజింగ్‌లో నిర్వహించిన నాల్గవ ప్రపంచ మహిళా సదస్సులో ప్రసంగిస్తూ అప్పటి అమెరికా ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్ ‘ఉమెన్ రైట్స్ ఆర్ హ్యూమన్ రైట్స్’ అని అనడంతో అప్పట్నుంచీ అదొక పొలిటికల్–ఫెమినిస్ట్ నినాదం కూడా అయింది. 1984 అంటే ఇంటర్నెట్కు ముందు కాలం. అందుకే మాలా పాల్ అజ్ఞాతంగా ఉండిపోయారు. ఆమె నినాదానికి లభించిన ప్రాధాన్యం నినాదకర్తగా ఆమెకు గుర్తింపు లభించలేదు. అయితే గుర్తింపు కోసం మాలా నినదించలేదు. మహిళల హక్కులను మానవహక్కులుగా గుర్తించమని మాత్రమే అడిగారు. ప్రస్తుతం మాలా వయసు 87 సంవత్సరాలు. యాభైఏళ్ల పాటు విదేశాల్లో గడిపాక, భర్త మరణానంతరం జన్మభూమి జ్ఞాపకాలతో తిరిగి ఇండియా చేరుకుని ఢిల్లీలో ఉండిపోయారు. మాలా 1932లో లాహోర్‌లో జన్మించారు. ఆరుగురు తోబుట్టువులలో ఆఖరి బిడ్డ. తండ్రి ఇండియన్ సివిల్ సర్వీస్‌లో పనిచేసేవారు. అంత గొప్ప హోదా పిల్లలకీ గొప్ప జీవితాన్ని ఇచ్చింది. క్రమశిక్షణతో పెరిగారు. సిటీలోని టాప్ స్కూళ్లలో చదివారు. అయితే దేశ విభజనతో ఆ కుటుంబ పరిస్థితి తలకిందులయింది. 18వ ఏట మాలా పెళ్లయే వరకు వారు ఢిల్లీలోని బరోడా హౌస్‌కి అనుబంధంగా ఉన్న ఒక ఇంట్లో ఉన్నారు. మాలా భర్త డాక్టర్ రాజీందర్ పాల్ ఆమె కన్నా 13 ఏళ్లు పెద్ద. మలేరియాలజిస్టు. ఆయన వృత్తి జీవితమంతా పూర్తిగా విదేశాల్లోనే గడిచింది. భార్యాభర్తలు కెనడాలో ఉన్నారు. యు.ఎస్.లో ఉన్నారు. చివరికి స్విట్జర్లాండ్‌లో ఉండిపోయారు. అక్కడి ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయంలో భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ తరఫున మాలా భర్త వివిధ రకాలైన ప్రాజెక్టులలో తలమునకలై ఉండేవారు. స్విట్జర్లాండ్‌లోని జెనీవా నగరంలో ఉన్నప్పుడు మాలా ‘ఆలిండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్’ (ఎ.ఐ.డబ్లు్య.సి) వలంటీర్‌గా పని చేశారు. తర్వాత ఆ సంస్థకు ఐక్యరాజ్యసమితి గుర్తింపు రావడంతో సమితిలోని ‘ఎకోసాక్’ (ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్)లో శాశ్వత సభ్యురాలయ్యారు. ఎ.ఐ.డబ్లు్య.సి. కి సమితి గుర్తింపు లభించడం అన్నది అప్పట్లో భారత్‌కు గర్వకారణమైన విషయం అయింది. అక్కడి నుంచి మాలా ‘కాంగ్రెస్ ఆఫ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్’ సంస్థకు వైస్–ప్రెసిడెంట్ అయ్యారు. ఆ హోదాలో మాలా అనేక సమస్యలపై ఐక్యరాజ్యసమితిలో పోరాటం జరిపారు. బాలికల హక్కుల పరిరక్షణ, పర్యావరణం, గృహ వసతి, వృద్ధాప్యం, ఆధ్యాత్మిక జీవనం వంటి అనేక ముఖ్యమైన అంశాలపై ఆమె ప్రభుత్వాల ఉదాసీనత్వాన్ని వేలెత్తి చూపేవారు. సమస్యల పరిష్కారానికి స్పష్టమైన సూచనలు చేసేవారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘ఇంటర్నేషనల్ అలయెన్స్ ఆఫ్ ఉమెన్’లో కూడా మాలా సభ్యురాలు. సొంత ఖర్చుతో వెళ్లి అంతర్జాతీయ వేదికలపై ఆమె ప్రసంగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటిని నడుపుతూనే. పిల్లల ఆలనాపాలనా చూస్తూనే. ఎప్పుడూ బిజీగా, అందుబాటులో లేకుండా ఉండే భర్తతో సర్దుకు వస్తూనే! ప్రస్తుతం మాలా తన కుమార్తె దగ్గర ఉంటున్నారు. పిల్లల పిల్లలతో ఉల్లాసంగా గడుపుతున్నారు. వంట మనిషి కూతుర్ని మంచి స్కూల్లో చదివిస్తున్నారు. తనే స్వయంగా ఆ అమ్మాయికి పాఠాలు చెబుతుంటారు. ‘ఆడపిల్లకు చదువే రక్షణ. చదువే భద్రత’ అంటారు మాలా పాల్. -
భవిష్యత్‌లో మహిళా దలైలామా!
ముంబై: భవిష్యత్తులో మహిళా దలైలామా వచ్చే అవకాశ ముందని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, బౌద్ధమత ప్రబోధకులు దలైలామా అన్నారు. బౌద్ధ సంప్రదాయం చాలా ఉదారమైనదని, స్త్రీపురుషులిద్దరికీ బౌద్ధమతంలో సమాన హక్కులు ఉంటాయని పేర్కొన్నారు. శుక్రవారం ఐఐటీ బాంబేలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ‘భవిష్యత్‌లో సమర్థవంతమైన మహిళ వస్తే కచ్చితంగా ఆమె మహిళా దలైలామా అవ్వచ్చు. ఎందుకంటే, బౌద్ధ సంప్రదాయం చాలా ఉదారవాదమైంది. ప్రస్తుతం భారత్, టిబెట్ దేశాల్లోని అత్యున్నత స్థానాల్లో పురుషులతో సమానంగా మహిళలు ఉన్నారు. చిన్ననాటి నుంచే మానసిక పరిశుభ్రతకు చాలా ప్రాముఖ్యం ఇవ్వాలి. ఎందుకంటే శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా మెదడు ప్రశాంతంగా ఉండాలి. మెదడు, భావోద్వేగాలకు సంబంధించిన జ్ఞానం భారత్‌లో 3 వేల ఏళ్ల కంటే పురాతనమైంది. 3 వేల ఏళ్ల పురాతన నాగరికత కలిగిన దేశం భారత్ ఒక్కటే. మెదడుని ప్రశాంతంగా ఉంచే పద్ధతులు భారత్‌లో అప్పటి నుంచే ఉన్నాయి. ఆనందం అనేది ప్రశాంతతకు సంబంధించినది. అయితే 20వ శతాబ్దంలో అత్యంత హింస చెలరేగుతోంది. 21వ శతాబ్దం మాత్రం దీన్ని పునరావృతం చేయరాదు. దయా హృదయంతో మానవ మేధస్సు అత్యంత ఆవశక్యమైంది’ అని దలైలామా అన్నారు. -
సహృదయ సామ్రాజ్ఞి!
దాదాపు మూడున్నర దశాబ్దాలపాటు తెలుగు పాఠక లోకాన్నేలిన హృదయ సామ్రాజ్ఞి యద్దనపూడి సులోచనా రాణి కన్నుమూశారు. తన చుట్టూ ఉన్న... తనకు తెలిసిన మధ్య తరగతి కుటుంబాల్లోని జీవితాలను ఇతివృత్తాలుగా తీసుకుని ఆ జీవితాల్లో మనుషుల మధ్య ఏర్పడే అనుబంధాలనూ... ఆ అనుబంధాల్లోని సున్నితత్వాన్ని, వారి ఆశలనూ, ఆకాంక్షలనూ, కలల్ని అద్భుతంగా చిత్రించిన ప్రతిభాశాలి ఆమె. పట్టుమని పదిహేనేళ్లు కూడా నిండని వయసులో ఆమె రాసిన తొలి కథ ‘చిత్ర నళినీయం’ ‘ఆంధ్రపత్రిక’ వీక్లీలో అచ్చయినప్పుడు ఇంట్లో వాళ్లూ, ఊళ్లోవాళ్లూ సులోచనారాణిని చూసి గర్వపడ్డారట. ‘సెక్రటరీ’తో మొదలుపెట్టి సులోచనా రాణి రాసిన దాదాపు 70 నవలలు తెలుగు సమాజంలోని ఆడపిల్లలకు అలాంటి గర్వాన్నే కలిగించాయి. ఎందుకంటే ఆ నవలల్లోని ఆడపిల్లలు భయంగా, బేలగా ఉండరు. తమకేదో అన్యాయం జరిగిందని శోకిస్తూ కూర్చోరు. వారు ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కొనేవారే కావొచ్చుగానీ... ఉన్నతమైన వ్యక్తిత్వంతో, నిండైన ఆత్మాభిమానంతో మెలగుతారు. ఆ ఆత్మాభిమానాన్ని లేదా ఆత్మ గౌరవాన్నీ దెబ్బతీయడానికి జరిగే చిన్న ప్రయత్నాన్నయినా నిలదీసే మనస్తత్వంవారిది. ఆ ఆడపిల్లలు మాటకారులు. స్వతంత్రంగా ఆలోచిస్తారు. సొంతంగా ఎదగాలని చూస్తారు. తెలివి తేటల్ని ప్రదర్శిస్తారు. ఎవరి దయాదాక్షిణ్యాలకూ ఎదురుచూడరు. అలాగని వారు చలం రచనల్లోని స్త్రీల మాదిరి సమాజం, కుటుంబం విధించిన కట్టుబాట్లను ప్రశ్నించే రకం కాదు. వాటిని ఛేదించేంత సాహసం చేయరు. బహుశా సులోచనా రాణి నవలల్లోని ఈ లక్షణాలే లక్షలాదిమంది మధ్య తరగతి మహిళలను, యువతులను ఆమె రచనలవైపు ఆకర్షించేలా చేశాయి. ఆమె నవలల్లోని కథా నాయకులూ అంతే. వారు పురుషాధిక్యతను ప్రదర్శించరు. ఆడవాళ్లను అణిచేయాలనే మనస్తత్వంతో ఉండరు. వారిని తక్కువ చేసి మాట్లాడరు. ఆడపిల్లల వ్యక్తిత్వాలను గౌరవించడం, వారితో ప్రేమగా మెలగడం... పొరబాటున మనసు కష్టపెట్టానని అనిపించినా ఏమాత్రం అభిజాత్యాన్ని ప్రదర్శించకుండా క్షమించమని కోరడం ఆ కథానాయకుల వ్యక్తిత్వం. మనలాంటి అసమ సమాజంలో, కుటుంబాల్లో ఇలాంటి లక్షణాలున్నవారు దుర్భిణి వేసి గాలించినా కనబడరన్న విమర్శల్లో అవాస్తవమేమీ లేదు. కానీ స్త్రీ, పురుషుల మధ్య ఇలాంటి సంబంధాలుండాలని... అచ్చం ఇలాగే సమాజం ఉంటే ఎంతో బాగుంటుందని ప్రగాఢంగా కోరుకునే మధ్యతరగతి మహిళల, యువతుల ఆకాంక్షలకు సులోచనారాణి అద్దం పట్టారు. అందుకే వారికి ఆమె అంతగా చేరువయ్యారు. ఆమె నవలల్లోని పాత్రలు ఎదుటివారితో సంఘర్షించవు. అంతస్సంఘర్షణకు లోనవుతాయి. ఆ క్రమంలో తమను తాము తీర్చిదిద్దుకుంటాయి. ఎదుటివారిలో మార్పు తెస్తాయి. ఆమె నవలలు సీరియల్‌గా వస్తున్న కాలంలో మధ్యతరగతి కుటుంబాల మహిళలు, యువతులు మరుసటి వారం గురించి ఆత్రంగా ఎదురు చూసేవారట. ఆ పాత్రలు ఎలా ప్రవర్తిస్తాయన్న విషయంలో రకరకాలుగా చర్చించుకునేవారట. కుటుంబమే సర్వస్వంగా భావిస్తూ పొద్దు పొడిచింది మొదలు పొద్దు గడిచేవరకూ దానికోసమే అంకి తమవుతూ...తీరిక చిక్కితే పురాణగాథలు, పిచ్చాపాటీలతో కాలక్షేపం చేసే మహిళలంతా సులోచనారాణి రచనలతో ఇటు మళ్లారని చెబుతారు. దశాబ్దాలపాటు కొన్ని తరాలపై ఒక రచయిత ఇంతగా ప్రభావాన్ని చూపగలగటం ఎంతో అరుదైన విషయం. సులోచనారాణి ఆ ఘనత దక్కించుకున్నారు. ఆ కాలంలో యద్దనపూడితో పాటు అనేకమంది మహిళలు తెలుగు నవలను సుసంపన్నం చేశారు. ఇల్లిందల సరస్వతీ దేవి, డాక్టర్ పి. శ్రీదేవి, మాలతీ చందూర్, తెన్నేటి హేమలత, రంగనాయకమ్మ, ద్వివేదుల విశాలాక్షి, కోడూరి కౌసల్యాదేవి, వాసిరెడ్డి సీతాదేవి, సి. ఆనం దారామం వంటి అనేకులు నవలా రంగంలో అప్పట్లో సుప్రసిద్ధులు. వారి ప్రభావం ఎంత ప్రగాఢమైనదంటే చాలామంది పురుష రచయితలు సైతం మహిళల పేరుతో రాయకతప్పని స్థితి ఏర్పడింది. మహిళా రచయితల్లో ఇతరుల కంటే ఎక్కువగా యద్దనపూడి రచనలు తెలుగు చలనచిత్ర పరిశ్రమను ఆకర్షించాయి. అప్పటివరకూ కథల కోసం బెంగాలీ అనువాద సాహి త్యంవైపు, బెంగాలీ చిత్రాలవైపూ చూసే అలవాటున్న చిత్రపరిశ్రమను... కొత్త దృక్పథంతో, కొత్త ఆలోచనలతో మధ్య తరగతి జీవితాలను ప్రతిభావంతంగా, ఆకర్షణీయంగా చిత్రిస్తున్న యద్దనపూడి రచనలు సహజంగానే ఆకట్టుకున్నాయి. డాక్టర్ పి. శ్రీదేవి ‘కాలాతీత వ్యక్తులు’ నవల ఆధారంగా ‘చదువుకున్న అమ్మాయిలు’ రూపుదిద్దుకుంటుండగా అనుకోకుండా ఆ రచయిత్రి కన్నుమూసినప్పుడు ఆ లోటును పూడ్చడం కోసం యాదృచ్ఛికంగా యద్దనపూడి సినీ రంగంవైపు వచ్చారు. ఆ తర్వాత ఆమె రచించిన ‘మీనా’, ‘సెక్రటరీ’, ‘జీవనతరంగాలు’, ‘చండీప్రియ’, ‘ఆత్మీయులు’ వంటి సుప్రసిద్ధ నవలలెన్నో చలనచిత్రాలుగా రూపుదిద్దుకున్నాయి. అయితే యద్దనపూడి పాఠకులు ఆ చలనచిత్రాలతో ఏనాడూ పూర్తిగా సంతృప్తిపడిన దాఖలాలు లేవు. వెండితెరపై సమ్మోహనపరిచే దృశ్య కావ్యాలకన్నా ఆమె రచనల్లోని నాటకీయత, సంభాషణలే వారిని బాగా ఆకట్టుకునేవి. నవలారంగం నుంచి సినీ మాధ్యమానికీ...అక్కడి నుంచి టెలివిజన్ రంగానికీ వచ్చి అన్నిచోట్లా సమానంగా మన్ననలు పొందిన ఏకైక రచయిత్రి బహుశా యద్దనపూడే కావొచ్చు. దాదాపు నూటయేభై ఏళ్లక్రితం పుట్టిన తెలుగు నవల ఎన్నో పోకడలకు పోయింది. ఈ క్రమంలో వచ్చిన పాపులర్ నవలా ప్రపంచంలో యద్దనపూడి సులోచనారాణి తనదైన ముద్ర వేసి అగ్రగామిగా నిలిచారు. స్త్రీ, పురుష సంబంధాలు ప్రజాస్వామికంగా ఉండాలని కోరుకుని...తన రచ నల ద్వారా మహిళల్లో ఆత్మ విశ్వాసాన్ని, వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి ప్రయత్నించిన సులో చనారాణి రాగలకాలంలో సైతం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు. -
దాడులనూ ఎదుర్కొన్నా... ధైర్యంగా ..!
‘దేవుడే పిట్టకు రెక్కలిచ్చాడు. ఎగరవద్దని ఆదేశించడానికి మీరెవరు? జ్ఞానమెప్పుడూ కాంతులనే ప్రసరిస్తుంది. దానికి నల్ల బురఖా వేయడం సరికాదు. ఇలా ఏ మతమూ చెప్పదు’... అంటారు జమీలా. దాంతో ఆమెకు లెక్కలేనన్ని చిక్కులూ... ఎన్నో ఇక్కట్లు. ఇల్లు అద్దెకు ఇవ్వడాన్ని సైతం కొందరు వ్యతిరేకించారు. మత వ్యతిరేకి అని ఆమెను అడ్డుకున్నారు. ఎవరాక్షేపించారో వారే ఇప్పుడు ఆశీర్వదిస్తున్నారు. దిక్కులేని వారెదురైతే ఆమె గూటికి చేరమంటున్నారు. జమీలా ఏర్పరచిన ‘షాహీన్’ సంస్థకు దక్కిన గౌరవమిది. మతానికి అతీతంగా మానవతావాదులందిస్తున్న చేయూత ఇది. • ‘మా నాన్న (సయ్యిద్దీన్ మహ్మద్ ) పెయింటర్. జేఎన్టీయూలో ప్రొఫెసర్. కాస్మోపాలిటన్ కల్చర్‌లో చాలా స్వేచ్ఛగా పెరిగాం మేం. మా ఇంట్లో వాతావరణం, చదివిన పుస్తకాలు, మా సర్కిల్ వల్ల నాకు డిఫరెంట్ ఎక్స్పోజర్ దొరికింది. పైగా నాకు సాహిత్యం అంటే చాలా ఇష్టం. విమెన్ యాక్టివిస్ట్ కన్నా ముందు నేను పొయెట్‌ను. ఇస్లాంలోని బుర్ఖా, బహుభార్యత్వం, ట్రిపుల్ తలాఖ్ పద్ధతుల మీద ఎక్కువగా రాసేదాన్ని. వాటిని ముస్లిం రచయితలు చాలా వ్యతిరేకించేవారు. అయినా రాయడం ఆపలేదు నేను. సంప్రదాయ ముస్లింకు వ్యతిరేకంగా చూసేవారు నన్ను. అలా నా కవితలతోనే స్త్రీల మీద జరుగుతున్న హింస, వాళ్లకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకించడం మొదలు పెట్టాను. • మతకలహాలు 1980లో హైదరాబాద్ పాతబస్తి మతకలహాలతో అట్టుడికిపోయింది. ఆ టైమ్‌లోనే అంటే 1980 చివర్లలో షాబాను ఇష్యూ వచ్చింది. తను భరణం (మెయింటనెన్స్) కోసం పోరాటం మొదలుపెట్టింది. ఆమెకు న్యాయం చేయకపోగా ఆ సమస్యను పెద్దది చేశారు. 90ల వరకు కొనసాగింది అది. షాబానును అబ్యూజ్ కూడా చేశారు. ఆమెకు మద్దతుగా నిలబడ్డాం. ఒకరకంగా నా ఉద్యమం షాబాను కేస్తోనే స్టార్టయిందని చెప్పొచ్చు. స్త్రీల మీద చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా! ఆ సందర్భంగానే 1996లో ముంబైలోని ఓ సంస్థతో కలిసి పాతబస్తీలో ముస్లిం స్త్రీల స్థితిగతుల పై సర్వే చేశాం. చాలా మంది ట్రిపుల్ తలాక్ (భర్త మూడుసార్లు తలాక్ తలాక్ తలాక్ అంటూ విడాకులైపోయే పద్ధతి)కి వ్యతిరేకంగా, జెండర్ జస్టిస్ కావాలనే అభిప్రాయాన్నే వ్యక్తం చేశారు. అప్పుడు అనిపించింది నాకు ఇక సీరియస్‌గా పనిచేయాలి అని. గుంపు వచ్చింది... సమాధానం చెప్పాను.... పాతబస్తీలో మా ఆఫీస్‌కి దగ్గరగా ఉన్న ఆడపిల్లలందరినీ పోగేసి వాళ్లకు పెయింటింగ్, మ్యూజిక్ నేర్పించడం మొదలుపెట్టాం. అయితే పాటలు, ఆటలు నేర్పిస్తూ ఆమ్మాయిలను చెడగొడ్తున్నానే దాడులు మొదలయ్యాయి నా మీద. ఒక శుక్రవారం నాడు మధ్యాహ్నం రెండున్నరకు అనుకుంటా... నమాజ్ ముగించుకొని ఓ ఇరవై, ముప్పై మంది మగవాళ్లు గుంపుగా మా ఆఫీస్కొచ్చారు దాడికి. దాదాపు మూడు గంటలు నా మీద ప్రశ్నల వర్షం కురిపించారు. ఒకరకంగా ఇంటరాగేషనే! అన్నిటికీ తొణక్కుండా బెణక్కుండా సమాధానం ఇచ్చా. చివరికి ఈమెకు ముస్లిం సంప్రదాయం అంటే తెలియదు.. తెలియజెప్పాలి... ప్రతి శుక్రవారం మనం ఇక్కడికి వచ్చైనా సరే.. లేదా ఏదైనా కార్యక్రమానికి ఆమెను పిలిచైనా సరే అని కన్‌క్లూజన్ ఇచ్చుకొని వెళ్లారు. నిజానికి ముస్లిం మగవాళ్లెవరూ స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు అలా గుంపుగా వెళ్లరు. కాని మా ఆఫీస్‌కు వచ్చారు నన్ను భయపెడదామని, బెదరగొడదామని. నేను తప్పు చేయనప్పుడు నాకెందుకు భయం, ఎందుకు బెరుకు? అందుకే కంటిన్యూ అయ్యాను. • ఆమెకు ఇల్లు ఎందుకిచ్చారు? ఆ ఆలోచనతోనే 1998లో అస్మితలో చేరాను. ఆ ఆర్గనైజేషన్‌లో వర్క్ చేయడం వల్ల అసలు మొత్తం స్త్రీల సమస్యల పట్ల పూర్తి అవగాహన వచ్చింది. ముస్లిం మహిళల్లో చైతన్యం తేవాలని 2002లో పాతబస్తీలోనే ఓ ఆఫీస్ తెరిచాను. అప్పటికే నాకు పెళ్లయింది. హుమాయున్ నగర్ (హైదరాబాద్ ఓల్డ్‌సిటీలో)లో ఉండేవాళ్లం. పని మీద నేను బయటకు వెళ్లగానే కొంతమంది పెద్దలు మా ఇంటి ఓనర్‌కి ఓ లెటర్ పంపారు.. ‘మీ ఇంట్లో ఉంటున్న జమీలా మంచిది కాదు, తస్లీమా నస్రీన్లా మాట్లాడుతుంది. అలాంటి ఆమెకు ఇల్లు అద్దెకు ఎందుకు ఇచ్చారు వెంటనే ఖాళీ చేయించండి’అంటూ! అప్పుడు మావారు (సయ్యిద్దుల్ రెహమాన్) వాళ్లకు నేను చేస్తున్న పని గురించి వివరించి నచ్చజెప్పారు. అయినా కమ్యునిటీ పెద్దల నీడ ఎప్పుడూ ఉండేది నామీద. • ఈసారి పిల్లలను.. మాటలతో చెప్పితే వినలేదని ఫత్వా కూడా జారీ చేశారు నామీద. నేను కోర్టుకు వెళ్లాను. ఆ ఫత్వా చెల్లదని స్టేట్మెంట్ ఇచ్చింది కోర్ట్. ఇంకోసారి ఏకంగా కేసే పెట్టారు. లాయర్ ద్వారా డీల్ చేశాను. గెలిచాను. ఇవన్నీ జరుగుతున్నా మా ఆఫీస్‌లో ఆడపిల్లలకు చదువు చెప్పే యాక్టివిటీ ఆగలేదు. ఇది నచ్చలేదు కమ్యూనిటీ పెద్దలకు. అందుకే ఈసారి పిల్లల తల్లిదండ్రుల వైపు నుంచి వచ్చారు. పెద్దవాళ్ల దగ్గరకు వెళ్లి ‘ఆమె మీ పిల్లలకు స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అంటూ వాళ్లను నాలుగు గోడలు దాటేలా చేస్తోంది... చెడగొడ్తోంది.. ఎందుకు పంపిస్తున్నారం’టూ నూరిపోశారు. అప్పటిదాకా నలభై మందిదాకా ఉన్న బ్యాచ్ కాస్తా అయిదుగురికి పడిపోయింది. అయిదుగురు వచ్చినా సరే.. నా యాక్టివిటీ ఆపొద్దు అని కొనసాగించా. ఆ అయిదుగురికీ ఇంగ్లీష్ క్లాసెస్ స్టార్ట్ చేశాం. పెయింటింగ్ కాంపిటీషన్ పెట్టాం. ఒక అమ్మాయి పంజరంలో పక్షిని గీసింది. దానర్థం ఏమిటని అడిగితే ‘ఆ పంజరంలోంచి ఆ పక్షికి ఎలా స్వేచ్ఛ కావాలో మాకూ అలా స్వేచ్ఛ కావాలి’ అంది. అప్పుడే మా సంస్థకు షాహీన్ అని పేరు పెడదామని ఆ పిల్లలే సజెస్ట్ చేశారు. షాహీన్ అంటే స్వేచ్ఛగా ఎగిరే పక్షి అని అర్థం. అలా మా సంస్థ ‘షాహీన్ విమెన్ రిసోర్స్ అండ్ వెల్ఫేర్’ అసోసియేషన్‌గా రిజిస్టర్ అయింది. • ఆ అయిదురుగు మరో అయిదుగురిని... ఆగిపోయిన పిల్లల్ని మళ్లీ రప్పించాలి చైతన్యవంతం చేయాలి. అందుకే ఈ అయిదుగురు పిల్లలు... తాము ఏం నేర్చుకున్నారో, ఆగిపోయిన వాళ్లు ఏం మిస్ అవుతున్నారో తెలిపేందుకు ఇంటింటికి వెళ్లారు. వాళ్లను మోటివేట్ చేసి ఒకొక్కరు మరో అయిదుగురు అమ్మాయిలను తీసుకొచ్చారు. ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈలోపే మళ్లీ కమ్యునల్ టెన్షన్ ఎక్కువైంది పాతబస్తీలో. అయినా అధైర్యపడలేదు. ఈసారి ముస్లిం మహిళలు దళిత బస్తీల్లోకి అక్కడి స్త్రీలను చైతన్యం చేశారు. దళిత్ మహిళలు ముస్లిం బస్తీలోకి వెళ్లి ముస్లిం మహిళలతో మాట్లాడారు. ఇద్దరి మధ్యా ఒకరకమైనా ఫ్రెండ్షిప్ ఏర్పడింది. దాంతో మగవాళ్ల మాటలను వినిపించుకోలేదు. వీళ్ల అవగాహన, ఫ్రెండ్షిప్ కొంతవరకు మతకల్లోలాల హింసను కంట్రోల్ చేయగలిగింది. తమ బస్తీల వరకైతే డిస్టర్బ్ కాకుండా చూసుకున్నారు. • ఇప్పుడు.. ఒకప్పుడు ‘షాహీన్’కు అమ్మాయిలను రానివ్వకుండా అడ్డుకున్న కమ్యూనిటీ పెద్దలే ఇప్పుడు అమ్మాయిల మీద హింస జరిగితే షాహీన్‌కు వెళ్లండి, మీకు న్యాయం జరిగేలా చూస్తారు అని సలహా ఇస్తున్నారు. ఒక్క కేంద్రంతో మొదలైన షాహీన్‌కు ఇప్పుడు పాతబస్తీలోని పలు చోట్ల నాలుగు సెంటర్లున్నాయి. అక్కడ శిక్షణ పొందుతున్న మహిళలు సాధికారత సాధిస్తున్నారు. వాళ్లు ఇంకో పదిమందిని చైతన్యంవంతులను చేస్తున్నారు. ఒకప్పుడు నా కవిత్వాన్ని వ్యతిరేకించిన వారే ఇప్పుడు ఆదరిస్తున్నారు. గౌరవిస్తున్నారు. విమెన్ స్టడీ కమిటీలో అడ్వయిజరీ బోర్డ్ మెంబర్‌గా నియమించారు. అయినా నా పోరాటం ఆగదు. షాబాను కేస్‌తో మొదలుపెట్టింది ఇంకా పరిష్కారం కానేలేదు. జెండర్ జస్టిస్ అనే గమ్యాన్ని చేరుకోలేదు. ఇప్పటి తరం అమ్మాయిలూ ఇందులో పాలుపంచుకోవాలి. ఇప్పటి తరం అమ్మాయిలకు నేను చెప్పేది ఒకటే .. ధైర్యంగా ఉండాలి... తమ మీద జరుగుతున్న హింస, అన్యాయాల పట్ల సెలైంట్‌గా ఉండకూడదు. దైర్యంగా ఎదుర్కోవాలి. డోంట్ బీ సెలైంట్! - సంభాషణ : సరస్వతి రమ -
మహిళలపై దాడులు.. 200 మంది బుక్కు
నాసిక్: నాసిక్‌లో కొంతమంది మహిళా ఉద్యమకారులపై దాడి జరిగింది. ఇక్కడి ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించడంతో సదరు మహిళపై స్థానికులు దాడులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు మొత్తం 200 మందిపై కేసులు నమోదుచేశారు. నాసిక్ లో ప్రముఖ త్రయంబకేశ్వర్ ఆలయం ఉంది. ఇందులోకి అనుమతించాలంటూ కొందరు మహిళలు అక్కడికి వెళ్లారు. అయితే ఉదయం పూట అనుమతి కుదరదంటూ వారిని అడ్డుకున్నారు. దీంతో ఆలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దీంతో స్థానికులు వారిపై దాడులు చేశారు. ఈ దాడికి పాల్పడిన వారిలో త్రయంబకేశ్వర్ మున్సిపల్ కౌన్సిల్ మాజీ అధ్యక్షడు అనఘా పఖడే కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో పుణెకి చెందిన స్వరాజ్య సంఘటన అధ్యక్షురాలు వనిత గుత్తి విలేకరులతో మాట్లాడుతూ తమ మహిళల పక్షాన నిలబడి ఉదయం 5గంటల నుంచి ఆలయ ప్రవేశం కోసం ఎదురుచూస్తామని, ఆలయ నిబంధనల ప్రకారం డ్రెస్ కోడ్ వేసుకొని వచ్చిన అనుమతి ఇవ్వలేదని చెప్పారు.