వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తకు టీడీపీ సోషల్ మీడియా వేధింపులు | Tdp Social Media Harassed On Ysrcp Women Activist | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్తకు టీడీపీ సోషల్ మీడియా వేధింపులు

Published Sun, Aug 25 2024 3:17 PM | Last Updated on Sun, Aug 25 2024 4:24 PM

Tdp Social Media Harassed On Ysrcp Women Activist

టీడీపీ సోషల్ మీడియా వేధింపులపై వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్త పోలీసులను ఆశ్రయించింది.

సాక్షి, విజయవాడ: టీడీపీ సోషల్ మీడియా వేధింపులపై వైఎస్సార్‌సీపీ మహిళా కార్యకర్త పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలు సుచిత్ర సైబర్ క్రైంలో ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నందుకు తనను వేధింపులకు గురిచేస్తున్నారని.. టీడీపీ సోషల్ మీడియాలో తనపై అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని సుచిత్ర ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘నా ఫోటోలు మార్ఫింగ్ చేసి అసభ్యంగా పోస్టులు పెడుతున్నారు. టీడీపీ సోషల్ మీడియా పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశా. మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నారు. న్యూడ్ ఫోటోలు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. అత్యాచారం చేస్తామంటూ నన్ను బెదిరిస్తున్నారు’’ అని  సుచిత్ర తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement