సాక్షి, గుంటూరు: సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గుంటూరు జైల్లో ఉన్న సోషల్ మీడియా యాక్టివిస్టులు మేకా వెంకట్రామిరెడ్డి, కళ్ళం హరికృష్ణ రెడ్డితో పాటు పానుగంటి చైతన్యను ఆ పార్టీ నేతలు పేర్ని నాని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు మంగళవారం పరామర్శించారు. అనంతరం అంబటి మీడియాతో మాట్లాడుతూ, మహిళ అని చూడకుండా పోలీసులు టార్చర్ చేస్తున్నారన్నారు. సుధారాణి దంపతులను పోలీసులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.
వర్రా రవీంద్రారెడ్డిని రాత్రి ఎందుకు అరెస్ట్‌చేశారు.? ముసుగు వేసి మీడియా ముందు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏముంది?. ఏపీలో పౌర హక్కులు ఏమౌతున్నాయి.’’ అని అంబటి రాంబాబు ప్రశ్నించారు. పోలీసులు చట్ట ప్రకారం పనిచేయాలి. టీడీపీకి అనుకూలంగా పనిచేయొద్దన్న అంబటి.. పోలీసులు కక్షగట్టి అందరిని కేసుల్లో ఇరికించాలని ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు.
..గుంటూరు సబ్ జైలులో సోషల్ మీడియా కార్యకర్త సుధారాణి, ఆమె భర్తలను రిమాండ్ చేశారు. సుధారాణి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవారు. భార్య, భర్తలు ఇద్దరూ జిల్లా జైలులో లేరు. పిటి వారెంట్ వేసి ఎక్కడికి తీసుకెళ్లారు తెలీదు. చిలకలూరిపేట సుధారాణి దంపతులను అక్రమంగా అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌లో కొట్టి, కోర్టులో ప్రవేశ పెట్టారు. మేజిస్ట్రేట్ సోషల్ మీడియా కార్యకర్త సుధారాణి వాగ్మూలాన్ని రికార్డు చేసి ఆమె చేతికి ఉన్న గాయాలను పరిశీలించి వైద్య సేవలకు ఆదేశించారు. అనంతరం జిల్లా జైలుకు రిమాండ్ విధించారు.
ఎన్నికల అనంతరం ఊరు విడిచి హైదారాబాద్ ఇతర ప్రాంతాలకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. ప్రవీణ్ అనే ఐపీఎస్ అధికారి అరబ్ దేశాలలో అయితే ఇలాంటి వ్యవహారాల్లో నడిరోడ్డుపై కొట్టి చంపుతారంటూ మాట్లాడడం దారుణం. కోయ ప్రవీణ్ పైకి ఖాకీ చొక్కా వేసుకున్నాడు.. లోపల అంతా పసుపు పచ్చే. ఐపీఎస్ అధికారులు చట్ట పరిధిలో పని చేయాలి. చంద్రబాబు పులి మీద స్వారీ చేస్తున్నాడు.. ఆ పులే రేపు చంద్రబాబును తింటుంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై ఐటీడీపీ సోషల్ మీడియాలో చాలా దారుణంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. వాటిపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేసిన చర్యలు లేవు. చాలా మంది ఐపీఎస్ అధికారులు పైకి ఖాకీచొక్కా వేసుకొని లోపల ఎల్లో ఇన్నర్స్ వాడుతున్నారు.
టీడీపీ వల్లే ఫేక్ ఎకౌంట్లు పెట్టి, అక్రమ పోస్టింగులు పెడుతున్నారు. చట్టాన్ని పాటించకపోతే సర్వనాశనం అవుతారు. పోలీసులు అక్రమంగా నిర్బంధించి వైఎస్ జగన్ పేరు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలపై పేర్లు చెప్పమని బెదిరిస్తున్నారు. మా సోషల్ మీడియాలో కార్యకర్తలకు అండగా ఉంటాం. త్వరలో సుప్రీంకోర్టును, రాష్ట్ర గవర్నర్ లను కలుస్తాం’’ అని అంబటి రాంబాబు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment