సాక్షి, తిరుపతి జిల్లా: వైఎస్సార్‌సీపీ కీలక నేతలపై అక్రమ కేసుల బనాయింపులు కొనసాగుతున్నాయి. కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై రెండు కేసులు నమోదు చేశారు. ఆయన నాయుడుపేట రూరల్ పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు కేసులతో బెదిరించాలని చూస్తే భయపడేది లేదన్నారు. టీడీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుక, మట్టి టిప్పర్‌ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నా.. వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. మద్యం బెల్టుషాపులు గ్రామాల్లో యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని కామిరెడ్డి మండిపడ్డారు.
విశాఖలో సోషల్ మీడియా కార్యకర్త వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్‌పై వెంకటేష్‌ను బాపట్లకు తరలించారు. కాగా, వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌ను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.
నిన్న 41ఏ నోటీసుల పేరుతో ఇంటూరి రవికిరణ్‌తో పాటు ఆయన భార్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పోలీసులు.. వివాదం కావడంతో వదిలేశారు. ఈ రోజు(ఆదివారం) మరోసారి ఇంటూరి రవి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు వెల్లడించకుండా స్టేషన్‌కు తరలించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా పోలీసులు చెప్పకపోవడంతో కలకలం రేపుతుంది.
Comments
Please login to add a commentAdd a comment