illegal arrests
-
చంద్రబాబుకు శ్రీకాంత్ రెడ్డి అదిరిపోయే కౌంటర్
-
LIVE: YS జగన్ సంచలన ప్రెస్ మీట్
-
KSR Live Show: సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల థర్డ్ డిగ్రీ
-
గుంటూరులో మరో సోషల్ మీడియా కార్యకర్త అరెస్ట్
-
అన్యాయాలను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తున్నారు
-
ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్ట్‌లు
సాక్షి, తిరుపతి జిల్లా: వైఎస్సార్సీపీ కీలక నేతలపై అక్రమ కేసుల బనాయింపులు కొనసాగుతున్నాయి. కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డిపై రెండు కేసులు నమోదు చేశారు. ఆయన నాయుడుపేట రూరల్ పోలీస్ స్టేషన్‌కు విచారణకు హాజరయ్యారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు కేసులతో బెదిరించాలని చూస్తే భయపడేది లేదన్నారు. టీడీపీ నాయకులు యథేచ్ఛగా ఇసుక, మట్టి టిప్పర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నా.. వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. మద్యం బెల్టుషాపులు గ్రామాల్లో యథేచ్ఛగా నిర్వహిస్తున్నారని కామిరెడ్డి మండిపడ్డారు.విశాఖలో సోషల్ మీడియా కార్యకర్త వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పీటీ వారెంట్‌పై వెంకటేష్‌ను బాపట్లకు తరలించారు. కాగా, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఇంటూరి రవి కిరణ్‌ను పోలీసులు మళ్లీ అదుపులోకి తీసుకున్నారు.నిన్న 41ఏ నోటీసుల పేరుతో ఇంటూరి రవికిరణ్‌తో పాటు ఆయన భార్యను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన పోలీసులు.. వివాదం కావడంతో వదిలేశారు. ఈ రోజు(ఆదివారం) మరోసారి ఇంటూరి రవి కిరణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు వివరాలు వెల్లడించకుండా స్టేషన్‌కు తరలించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా పోలీసులు చెప్పకపోవడంతో కలకలం రేపుతుంది. -
ఆంధ్రప్రదేశ్‌లో యథేచ్ఛగా అక్రమ కేసులు, నిర్బంధాలు, చిత్రహింసలు... ప్రభుత్వ అరాచకాలపై ప్రజల ఆగ్రహం
-
చంద్రబాబు నియంత పాలన.. అక్రమ కేసులు సహించం: వైఎస్సార్సీపీ
వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ అరాచక పోస్టులపై ఆ పార్టీ మండిపడుతోంది. వైఎస్ జగన్ సహా అనేక మంది నేతలను కించపరిచేలా పెడుతున్న పోస్టులపై ఆధారాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా ఎస్పీలకు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు ఫిర్యాదులు చేస్తున్నారు.కాకినాడ జిల్లా: కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కక్షసాధింపు తప్పా మరో వ్యాపకం లేదని.. వేధింపులు ఆపి పరిపాలనపై దృష్టి పెట్టాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. టీడీపీ సోషల్ మీడియాపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అదనపు ఎస్పీ భాస్కరరావుకు ఆయన ఫిర్యాదు చేశారు.చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీ: కురసాల కన్నబాబు‘‘చంద్రబాబు అబద్దాల ప్యాక్టరీని ఎప్పటి నుండో నడుపుతున్నాడు. డైవర్షన్ పాలిటిక్స్ చంద్రబాబుకు అలవాటుగా మారింది. టీడీపీ కార్యాలయం కేంద్రంగా సోషల్ మీడియా దుష్ప్రచారానికి తెర తీశారు. ఈ మాట డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కల్యాణ్ ఎప్పుడో చెప్పాడు. టీడీపీ తన పద్దతి మార్చుకోవాలి. మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన కుటుంబంపై వచ్చిన సోషల్ మీడియా పోస్ట్‌లపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం’’ అని కన్నబాబు తెలిపారు.అరాచక పాలన పై పోరాటం చేస్తాం: అనంత వెంకటరామిరెడ్డిఅనంతపురం: వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులపై టీడీపీ సోషల్ మీడియాలో నీచమైన పోస్టింగ్‌లు వస్తున్నాయని.. టీడీపీ నేతలపై పోలీసులు చర్యలు తీసుకోరా? అంటూ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి నిలదీశారు. వైఎస్ జగన్ కుటుంబ సభ్యులపై అసభ్యంగా మేసేజ్‌లు పెట్టిన వారిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు? అంటే ఆయన ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయమంటే చంద్రబాబు ఉలికిపడుతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. చంద్రబాబు అరాచక పాలనపై పోరాటం చేస్తాం’’ అని అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు.అక్రమ అరెస్ట్‌లు.. హేయమైన చర్య: దూలం నాగేశ్వరావుఏలూరు జిల్లా: కూటమి ప్రభుత్వం చేపట్టిన సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్‌కు ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరావు, నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు, చింతలపూడి కన్వీనర్ విజయరాజు, ఏలూరు కన్వీనర్ జయప్రకాష్ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ, సోషల్ మీడియాలో గతంలో పెట్టిన పోస్టులపై నేడు విమర్శించినట్లుగా అరెస్టులు చేయడం హేయమైన చర్య. ఎందుకు అరెస్టు చేస్తున్నారో.. వారిని ఎక్కడ ఉన్నారో కూడా తెలపడం లేదు. తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు అడిగినా చెప్పడం లేదని ఆయన మండిపడ్డారు.అక్రమాలను ప్రశ్నిస్తే.. కేసులా: ధర్మాన కృష్ణదాస్శ్రీకాకుళం జిల్లా: కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా కార్యకర్తలపై పెట్టిన అక్రమ అరెస్టులను ఖండిస్తూ జిల్లా అడిషనల్ ఎస్పీ శ్రీనివాస రావుకు వైఎస్సార్సీపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మెంటాడ పద్మావతి, నాయకులు పొన్నాడ రుషి, ఎడ్ల వెంకట్ ,అంబటి శ్రీను ఇతర నాయకులు పాల్గొన్నారు.జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్ మాట్లాడుతూ, రాష్ట్రంలో చంద్రబాబు నియంత పాలనకు స్వస్తి పలకాలన్నారు. జిల్లాలో ఏ సోషల్ మీడియా కార్యకర్తని ఇబ్బంది పెట్టినా చూస్తూ ఊరుకోం. రాష్ట్రంలో అనేక మంది కార్యకర్తలను ఎందుకు అరెస్టు చేస్తున్నారో.. అరెస్టు చేసిన కార్యకర్తలు ఎక్కడ ఉన్నారో కూడా తెలపడం లేదు. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను ప్రశ్నించారనే అక్కసుతో మా సోషల్ మీడియా కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారు’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.ఐటీడీపీ కార్యకర్తలపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు: వరుదు కల్యాణివిశాఖపట్నం: కూటమిపాలనలో మహిళలపై వేధింపులు పెరిగిపోయాయని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి మండిపడ్డారు. ‘‘ఏపీలో ఉన్నామా? ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నామా? సోషల్ మీడియా కార్యకర్తల పేరుతో మహిళలను చిత్రహింసలకు గురి చేస్తున్నారు. మహిళని చూడకుండా సంధ్యారాణిని పోలీసులు ఇష్టానుసారంగా కొట్టారు. వైఎస్సార్సీపీ నేతలపై తప్పుడు పోస్టింగులు పెడుతున్న ఐటీడీపీ కార్యకర్తలపై ఎందుకు కేసులు నమోదు చేయలేదు. పవన్ కల్యాణ్ తల్లిని తిట్టించిన లోకేష్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు’’ అంటూ వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.సాక్షి, ప్రకాశం జిల్లా: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పిల్లలు, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో కీలకంగా వ్యవహరించే సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ధ్వజమెత్తారు. -
ఈ యుద్ధంలో మా ప్రతి సైనికుడికి నేను అండగా నిలుస్తా
-
రాక్షస ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా యుద్ధం.. నేను మీతోనే ఉన్నాను... జగన్ అభయం
-
YSRCP సోషల్ మీడియా కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ కేసులు
-
కూటమి ప్రభుత్వ కుట్రలను ఖండించిన మాజీ మంత్రులు
-
ఖాకీ క్రౌర్యం.. టీడీపీ గూండాల అరాచకం
సాక్షి, అమరావతి / సాక్షి, నెట్వర్క్: చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో పోలీసుల ద్వారా గూండాగిరీకి బరి తెగించింది. ఫలితంగా ఖాకీ క్రౌర్యం కట్టలు తెంచుకుంటోంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ప్రజల్ని చైతన్య పరుస్తున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను వేధించడమే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తోంది. విచారణ పేరుతో వేధిస్తోంది. పౌర హక్కులను కాలరాస్తూ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోంది. సుప్రీంకోర్టు తీర్పును నిర్భీతిగా ఉల్లంఘిస్తూ పోలీసు రాజ్యంతో బెంబేలెత్తిస్తోంది.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసు వ్యవస్థ స్వచ్ఛందంగా సుప్తచేతనావస్థలోకి వెళ్లిపోయింది. వెరసి టీడీపీ గూండాలు హత్యలు, హత్యాయత్నాలు, అత్యాచారాలు, దాడులు, దౌర్జన్యాలతో చెలరేగిపోతున్నారు. టీడీపీ రౌడీ మూకలు కత్తులు, కర్రలు, బాంబులతో విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నారు. 80కి పైగా హత్యలు.. 300కు పైగా హత్యాయత్నాలు.. దాదాపు రెండు వేలకు పైగా దాడులు, విధ్వంసాలతో అల్లకల్లోలం సృష్టించారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై యథేచ్చగా దాడులకు పాల్పడుతుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఈ దారుణాలను ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలపై చంద్రబాబు సరికొత్త కుట్రకు తెరతీశారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తూ, దాడులకు తెగబడే బాధ్యతను పోలీసులకు అప్పగించినట్టున్నారు. అంటే టీడీపీ గూండాగిరీకి పోలీసు ముసుగుతో రాజముద్ర వేయాలన్న పన్నాగం పన్నారు. వెరసి తప్పుడు కేసులతో సోషల్ మీడియా కార్యకర్తలను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు.అక్రమ కేసులు, విచారణ పేరుతో దాడులుచంద్రబాబు మనసెరిగి మసలుకునే పోలీసులు ఖాకీ చొక్కాలు విప్పేసి పచ్చ చొక్కాలు తొడుక్కుంటున్నట్టుంది రాష్ట్రంలో ప్రస్తుత భీతావాహ పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారిగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ అరెస్టులకు తెరతీశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు ఆది, సోమవారాల్లోనే ఏకంగా 86 కేసులు నమోదు చేయడం గమనార్హం. అంటే ఈ అక్రమ అరెస్టుల వెనుక ఎంతటి పక్కా కుట్ర ఉందన్నది స్పష్టమవుతోంది. కేవలం వైఎస్సార్సీపీ శ్రేణులను బెంబేలెత్తించడం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా పోలీసు అస్త్రాన్ని చంద్రబాబు ప్రయోగించారు.సోషల్ మీడియా పోస్టులపై నేరుగా కేసులు నమోదు చేయకూడదని, 41ఏ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. కానీ ఆ ఆదేశాలను ఉల్లంఘిస్తూ.. ఆ తీర్పు స్ఫూర్తికి విఘాతం కలిగిస్తూ అక్రమ కేసులతో పోలీసులు చెలరేగిపోతున్నారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండానే వారిని బలవంతంగా తీసుకుపోతున్నారు. అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న వారిని తీసుకుపోతున్నారు. వ్యాపార కార్యకలాపాల్లో ఉన్న వారిని, పొలం పనులు చేసుకుంటున్న వారిని, ప్రయాణంలో ఉన్న వారిపై విరుచుకుపడి బలవంతంగా వాహనాల్లో పడేసి పట్టుకుపోతున్నారు.కుటుంబ సభ్యులకు కనీస సమాచారం కూడా ఇవ్వడం లేదు. కార్యకర్తల కళ్లకు గంతలు కట్టి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతున్నారు. విచారణ పేరుతో భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. వైఎస్సార్సీపీ న్యాయవాదులు వచ్చి గట్టిగా ప్రశ్నిస్తే తప్ప విడిచి పెట్టడం లేదు. మళ్లీ పోలీస్ స్టేషన్‌కు రావాలని చెబుతున్నారు. తాము కొట్టిన విషయాన్ని ఎవరికైనా చెబితే మరోసారి తమ లాఠీలకు పని చెబుతామని బెదిరిస్తున్నారు. ఖాకీలు అత్యంత క్రూరంగా వ్యవహరిస్తూ పాశవికంగా దాడులకు పాల్పడుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. ‘ఫేక్ అకౌంట్ల’తో ప్రభుత్వ కుట్ర వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే ప్రశ్నిస్తున్నారు. అదీ వారి అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారానే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అది వారి భావ ప్రకటనా స్వేచ్ఛ కిందకు వస్తుంది. ఆ పోస్టులపై కేసులు నమోదు చేయడం సాధ్యం కాదు. అందుకే ప్రభుత్వం కొత్త కుట్రకు తెరతీసింది. కొన్ని సోషల్ మీడియా ఖాతాల నుంచి కించపరిచే పోస్టులు పెట్టారంటూ అక్రమ కేసులు నమోదు చేస్తోంది.ప్రధానంగా ఎక్స్ (ట్విట్టర్) ఖాతాల్లో పెట్టిన పోస్టులను తమ కేసులకు ప్రాతిపదికగా పోలీసులు చెబుతున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే.. ఆ ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలు ఎవరివో కూడా తెలీదు. అవి ఫేక్ ఖాతాలు. వాటిని వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు ఆపాదిస్తూ అక్రమ కేసులు నమోదు చేస్తుండటం ప్రభుత్వ కుట్రకు నిదర్శనం. ఆ ఫేక్ ఖాతాల వెనుక ప్రభుత్వ ప్రమేయం ఉందని తెలుస్తోంది. టీడీపీ సోషల్ మీడియా వర్గాలే ఆ ఫేక్ ఖాతాలతో కించపరిచే పోస్టులు పెట్టి.. వాటి ఆధారంగా వైఎస్సార్సీసీ సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టేందుకు యత్నిస్తున్నట్టు స్పష్టమవుతోంది. అందుకే ఆ కించపరిచే పోస్టులు పెట్టిన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలు ఎవరివో పోలీసులు చెప్పడం లేదు. అవి వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల ఖాతాలు అని ఆధారాలు కూడా చూపించలేకపోతున్నారు. పోలీసు క్రౌర్యంలో ఎన్టీఆర్ జిల్లా టాప్రాజ్యాంగ హక్కులను కాల రాయడంలో ఎన్టీఆర్ జిల్లా పోలీసులు మరింతగా బరి తెగిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై 86 అక్రమ కేసులు నమోదైతే.. వాటిలో ఏకంగా 61 కేసులు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషరేట్ పరిధిలోనే నమోదు చేయడం గమనార్హం. సుప్రీంకోర్టు తీర్పు తమకు వర్తించదనో.. లేక తాము దానిని ఖాతరు చేయమన్నట్టుగా విజయవాడ కమిషనర్ రాజశేఖర్‌బాబు వ్యవహరిస్తున్నారనిపిస్తోంది.ఎంత ఎక్కువుగా అక్రమ కేసులు పెడితే.. అంతగా గుర్తింపు ఇస్తామని ప్రభుత్వ పెద్దలు చెప్పారేమో అన్నట్టుగా పోలీసుల తీరు ఉందని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ సైబర్ పోలీసుల సహకారంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు తమ మార్కు గూండాగిరీ ప్రదర్శిస్తున్నారు. కనీసం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే సోషల్ మీడియా కార్యకర్తలను ఎత్తుకువచ్చేసి తీవ్ర వేధింపులకు గురి చేస్తున్నారు.మాజీ మంత్రి కాకాణిపై రెండు అక్రమ కేసులు పోలీసు వేధింపులు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డినీ తాకాయి. ఏదో వాట్సాప్ పోస్టును ఆయన ఫార్వర్డ్ చేశారనే నెపంతో టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే.. ఆయనపై నెల్లూరు పోలీసులు రెండు అక్రమ కేసులు నమోదు చేయడం గమనార్హం. ఆయన ఎలాంటి పోస్టు పెట్టలేదు. ఎవర్నీ కించపరుస్తూ ఎలాంటి పోస్ట్‌నూ ఫార్వర్డ్ చేయలేదు. కానీ టీడీపీ నేతలు చెప్పారనే ఒకే ఒక్క కారణంతో తప్పుడు కేసు నమోదు చేయడం విభ్రాంతికరం.అన్ని ప్రాంతాల్లోనూ అవే అక్రమ కేసులు⇒ గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు మేకా వెంకటరామిరెడ్డిని తాడేపల్లి పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. ఆయన మార్చిలో ఏదో పోస్టు పెట్టారంటూ టీడీపీ కార్యకర్తలు ఏడు నెలల తర్వాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు సీఐ కళ్యాణ్ రాజు చెప్పడం గమనార్హం. ⇒ తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండల గ్రామం వల్లభాపురానికి చెందిన రైతు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆళ్ల జగదీష్‌రెడ్డిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు గ్రామంలోని జగదీష్‌రెడ్డి ఇంటికి వచ్చిన ముగ్గురు అగంతకులు, అతడిని తీసుకెళ్లటం, ఏ సమాచారం లేకపోవటంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేయటం తెలిసిందే. విజయవాడకు చెందిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు జగదీష్‌రెడ్డిని వెంటబెట్టుకు వెళ్లి, సైబర్ క్రైమ్ విజయవాడ సిటీ పోలీసులకు అప్పగించారు.2018లో ఆయన పెట్టిన పోస్టుపై ఫిర్యాదు వచ్చిందని చెప్పడం గమనార్హం. ఆయన్ని విచారించిన తర్వాత రాత్రి 9.30 గంటల ప్రాంతంలో పంపించివేశారు. విచారణకు మరోసారి రావాలన్న పోలీసుల ఆదేశాల ప్రకారం సోమవారం ఉదయాన్నే మళ్లీ జగదీష్‌రెడ్డి విజయవాడ వెళ్లారు. అక్కడే విచారణ చేస్తుండగా, న్యాయవాదులు, విలేకరులు రావటంతో మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో విడుదల చేశారు. సోషల్ మీడియాలో జగదీష్‌రెడ్డి పెట్టిన పోస్టు, దానిని షేర్ చేయటంపై మొత్తం 16 మందిపై కేసు నమోదు చేసినట్టు తెలిసింది. వీరిలో కొందరిని అరెస్ట్ చేయగా, ఇంకొందరిని అరెస్టు చేయాల్సి ఉందని చెబుతున్నారు.⇒ వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కల్లం హరికృష్ణారెడ్డిపై తాడికొండ పోలీస్‌స్టేషన్‌లో అక్రమంగా కేసు నమోదు⇒ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా వింజమూరు మండల కన్వీనర్ పెసల శివారెడ్డిని అరెస్ట్ చేశారు.⇒ నంద్యాల జిల్లా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్ తిరుమల కృష్ణ ఆలియాస్ జగన్ కృష్ణను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆదివారం రాత్రి కర్నూలు సీసీఎస్ పోలీసులు మహానంది ఎస్ఐ రామ్మోహన్‌రెడ్డితో కలసి గ్రామానికి చేరుకుని తిరుమల కృష్ణ ఇంటికి వెళ్లారు. కుటుంబీకులు ఇంట్లో ఉన్నా ఏమి చెప్పకుండా ఇల్లంతా తనిఖీ చేశారు. పశువుల పాక వద్ద బర్రెలకు మేపు వేస్తున్న తిరుమల కృష్ణను అదుపులోకి తీసుకున్నారు.షార్ట్, టీషర్ట్‌పై ఉన్న అతను చొక్కా, ప్యాంట్ వేసుకుని వస్తానని బతిమలాడితే చివరికి ఒప్పుకున్నారు. మహానంది స్టేషన్‌కు తీసుకొచ్చి అక్కడి నుంచి కర్నూలు సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. తమ కుమారుడు ఎక్కడున్నాడో చెప్పండయ్యా అయ్యా అని కృష్ణ కుటుంబీకులు రాత్రి మహానంది స్టేషన్‌కు వచ్చి పోలీసులను బతిమాలినా చెప్పలేదు. కర్నూలుకు చెందిన ఇంతియాజ్ బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు కర్నూలు వన్‌టౌన్ పోలీసులు తెలిపారు. క్రైమ్ నెంబర్ 148/2024, 352, 353(1),(సీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.⇒ పల్నాడు జిల్లా కంభంపాడు గ్రామానికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త నెమలిదిన్నె రంగారెడ్డిపై మాచర్ల రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేస్తున్నారని అతనిపై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు.⇒ గురజాల మండల సోషల్ మీడియా కన్వీనర్ వెంకటరామిరెడ్డిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. మండల పరిధిలోని తేలుకుట్ల గ్రామానికి చెందిన పప్పుల వెంకటరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న వెంకటరామిరెడ్డిని సోమవారం అరెస్టు చేసి గురజాల పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చారు.⇒ ముఖ్యమంత్రి చంద్రబాబు, అతని కుమారుడు మంత్రి లోకేశ్‌పై సోషల్ మీడియాలో పోస్టింగ్‌లు పెట్టాడని బత్తల శ్రీనివాసులు, మరొకరిపై చిన్నచౌక్ పోలీసులు కేసు నమోదు చేశారు. గతంలో ప్రతిపక్షంలో వున్నపుడు కూడా ఇలాగే పోస్టింగ్‌లు పెట్టారని కడపకు చెందిన టీడీపీ నేత బొజ్జా తిరుమలేష్ ఫిర్యాదు మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ⇒ తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం వడిశలేరుకు చెందిన సోషల్ మీడియా కార్యకర్త వీరాబత్తుల చంద్రశేఖర్‌ను అనపర్తి పోలీసులు అక్రమంగా నిర్బంధించారు. సోమవారం విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి సీఐ సుమంత్‌ను కలిసి ప్రశ్నించారు. అనంతరం పోలీసులు సెక్షన్–41 నోటీసు జారీ చేసి చంద్రశేఖర్‌ను వదిలి పెట్టారు. రంగంపేట మండలం కోటపాడు గ్రామానికి చెందిన శిరిగిన వెంకటేష్‌ను పోలీసులు నిర్బంధించగా, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు అతడిని బయటకు తీసుకొచ్చారు. -
అరాచకాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులా?.. కూటమి సర్కార్ వేధింపుల పర్వం
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై చంద్రబాబు ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలువురిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. వినుకొండ, గుడివాడ, భీమవరం, ఉదయగిరి, నెల్లూరు, పెనుగొండ, నందిగామ సహా అనేక ప్రాంతాల్లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్నారని అక్రమ కేసులు పెడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అండగా నిలిస్తోంది.కాగా, నెల్లూరులో వైఎస్సార్సీపీ వింజమూరు మండల సోషల్ మీడియా కన్వీనర్ పెసల శివారెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. శివారెడ్డి తన ఫోటో స్టూడియోలో ఉండగా ఐడీ పార్టీ పోలీసులమని చెప్పి కారులో తీసుకెళ్లారు. మరో వైపు, తమకు ఎలాంటి సంబంధం లేదంటూ లోకల్ పోలీసులు దాటవేస్తున్నారు. శివారెడ్డి కుటుంబసభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. -
ఆగని టీడీపీ దౌర్జన్యాలు
-
అక్రమ అరెస్టులతో ‘హోదా’ను ఆపలేరు
‘‘ప్రజలు ఆకాంక్షిస్తున్న ప్రత్యేక హోదాను అక్రమ అరెస్టులతో ఆపలేరు. విభజన చట్టంలోని హామీలన్నింటినీ అమలు చేసే వరకు మా పోరాటం ఆగదు. ఒకవైపు రాష్ట్రానికి హోదా ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తుంటే.. మరోవైపు శాంతియుతంగా నిర్వహిస్తున్న బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. చంద్రబాబు బంద్ జరగకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేయడం దారుణం’’ - కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి -
అక్రమ అరెస్ట్‌లను వ్యతిరేకిస్తూ మోకాళ్లపై నిరసన
అనంతపురం క్రైమ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలో మోకాళ్ల నిరసన కార్యక్రమం జరిగింది. శనివారం రాష్ట్ర బంద్ సందర్భంగా ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 60 మంది కార్యకర్తలు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై నించుని నిరసన తెలిపారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రత్యేక హోదా సాధించేవరకూ ప్రజాగర్జన ఆగదన్నారు. -
అక్రమ అరెస్టులపై వైఎస్సార్సీపీ నేతల ఆందోళన
రొద్దం(అనంతపురం): వైఎస్సార్ కాంగ్రెస్ నేతల అరెస్టులకు నిరసనగా రొద్దం పట్టణంలో ఆ పార్టీ నేతలు గురువారం మధ్యాహ్నం ధర్నాకు దిగారు.సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు కోరుతూ హిందూపురంలో గురువారం ఉదయం ఆందోళనకు దిగిన వైఎస్సార్ కాంగ్రెఃస్ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, నవీన్నిశ్చల్లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం శంకరనారాయణను సోమందేవపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై రొద్దంలోని వైఎస్సార్సీపీ నేతలు స్థానిక చౌరస్తాలో గంటపాటు నిరసన తెలిపారు. తమ పార్టీ నేతల అరెస్టు అక్రమమని, వారిని వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. -
ఉద్రిక్తం.. అరెస్టుల పర్వం
శ్రీకాకుళం పాతబస్టాండ్: అక్రమ అరెస్టులపై వెల్లువెత్తిన నిరసన.. అయినా వెనక్కు తగ్గని పోలీసులు.. ర్యాలీలు, ధర్నాలతో పోలీస్స్టేషన్ల వద్ద నిరసన గళం వినిపించేందుకు వచ్చిన మహిళా ఉద్యోగులను చెదరగొట్టేందుకు ఖాకీ బలం ప్రదర్శించడంతో తోపులాటలు, వాగ్వాదాలు వంటి ఘటనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహిళా ఉద్యోగులను విచక్షణారహితంగా ఈడ్చుకెళ్లిన తీరు పోలీసుల దమనకాండకు, ప్రభుత్వం నియంతృత్వ ధోరణికి మరోమారు దర్పణం పట్టింది. జీతాల కోసం గత రెండు నెలలుగా సమ్మె చేస్తున్న ఇందిరాక్రాంతి పథం(ఐకేపీ) వీవోఏలు హైదరాబాద్‌లో తలపెట్టిన నిరసన కార్యక్రమాలను భగ్నం చేసేందుకు ఆదివారం అరెస్టుల పర్వానికి ప్రభుత్వం తెరతీసిన విషయం తెలిసిందే. అక్రమ అరెస్టులకు నిరసనగా సోమవారం జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ల వద్ద వీవోఏలు, సీఐటీయు, ఇతర ప్రజాసంఘాలు ధర్నాలు చేపట్టాయి. ఈ సందర్భంగా కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. ఒక్క శ్రీకాకుళం రెండో పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోనే 27 మందిని అరెస్టు చేశారు. ఆదివారంనాటి అరెస్టులను నిరసిస్తూ జిల్లావ్యాప్త కార్యక్రమంలో భాగంగా వీవోఏలతోపాటు సీఐటీయూ దాని అనుబంధ సంస్థల ప్రతినిధులు ర్యాలీగా వచ్చి రెండో పోలీసుస్టేషన్ వద్ద బైఠాయించారు. అనంతరం ధర్నా నిర్వహించారు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి ధర్నాను భగ్నం చేశారు. సీఐటీయూ నాయకులు కె.నాగమణి, డి.గణేష్, వై.చలపతిరావులతో సహా 27 మందిని అరెస్టు చేశారు. ఈ అరెస్టులను ఆందోళనకారులు ప్రతిఘటించడంతో ఇరుపక్షాల మధ్య తోపులాట జరిగింది. దాంతో పోలీసులు పలువురిని బలవంతంగా ఈడ్చుకుపోయారు. ఈ తోపులాటలో సీఐటీయూ పట్టణ కార్యదర్శి గణేష్ కుడిచేయికి గాయమైంది. ఇది అరాచకపాలన ధర్నా వద్ద పలువురు నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యం లేదని, ప్రజల హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. పోలీసులు టీడీపీ పాలకులకు తొత్తులుగా మారిపోయారని విమర్శించారు. ఐకేపీ సీఎఫ్‌లు తమ జీతాల కోసం శాంతియుతంగా ఉద్యమాలు చేస్తుంటే అరెస్టులు చేసి, స్టేషన్లలో నిర్బంధించడమే కాకుండా బెదిరింపులతో భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. వీవోఏలు 100 రోజులుగా సమ్మె చేస్తుంటే సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా పోలీసులతో బలప్రయోగం ద్వారా ఉద్యమాన్ని అణిచివేయడానికి ప్రయత్నిస్తూ ప్రజల నుంచి, మహిళల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. గతంలో ఇదే రీతిలో వ్యవహరించడం వల్లే ప్రజలు చంద్రబాబును పదేళ్లు అధికారానికి దూరంగా ఉంచిన విషయాన్ని విస్మరిస్తే.. మళ్లీ అదే గతి పడుతుందని స్పష్టం చేశారు. అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నాయకులు ఎన్వీ రమణ, పి.ప్రభావతి, సూరమ్మ, చిన్నమ్మ, కాలేమ్మ, నర్సమ్మ, లత, సత్యనారాయణ, కాన్‌కాస్ట్ యూనియన్ నాయకులు పి.రామచంద్రరావు, బి.మోహనరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్: ఐకేపీ వీవోఏల జీతాలు చెల్లించడంతో ప్రభుత్వ అలక్ష్యం, పోలీసుల అక్రమ అరెస్టులకు నిరసనగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.గోవిందరావు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సోమవారం నిరాహార దీక్ష చేపట్టారు. గోవిందరావును ఆదివారం ఉదయం ఐదుగంటలకు అరెస్టు చేసి తెల్లవారేదాకా ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారు. సోమవారం ఉదయం రెండో పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్టు టుటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అక్కడే ఆయన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లోని వీవోఏల ధర్నాను భగ్నం చేసేందుకు ప్రభుత్వం కుట్రపన్ని అక్రమ అరెస్టులు చేరుుంచిందని ధ్వజమెత్తారు. ఇది ప్రజావ్యతిరేకమని పేర్కొన్నారు. వీవోఏల వ్యవస్థను తనే ప్రవేశపెట్టినట్టు చెప్పుకున్న సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడు వ్యవస్థను నాశనం చేసేందుకు చూస్తున్నారని విమర్శించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరని హెచ్చరించారు. ప్రజలు మద్దతుతో ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. జిల్లాలో అరెస్టు చేసిన వీవోఏలు, సీఐటీయూ నాయకులు, ప్రతినిధులందరినీ విడిచిపెట్టిన తర్వాత ఆయన దీక్షను విరమించారు. -
బరితెగింపు
వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిపై టీడీపీ నేత దాడి - తమ్ముడిని కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ .. ఒట్టి చేతులతో వచ్చాడని కట్టెలతో దాడి - 24 గంటల్లో రూ.5 లక్షలు లేదా ఇల్లు రాసివ్వకపోతే భార్య, పిల్లలను చంపుతానని హెచ్చరిక - రక్షణ కల్పించాలని ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ ఎస్పీకి వినతి అనంతపురం రూరల్ : వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిపై టీడీపీ నాయకుడు తన అనుచరులతో కలిసి దాడి చేసి గాయపరిచాడు. అంతటితో ఆగక 24 గంటల్లోగా రూ.5 లక్షలు ఇవ్వాలని లేదా ఇంటిని తన పేర రాసివ్వాలని హుకుం జారీ చేశాడు. గడువులోపు అడిగింది ఇవ్వకపోతే భార్య, పిల్లలను చంపేస్తానని బెదిరించాడు. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి కాలనీలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు... కక్కలపల్లి కాలనీలో నివాసముంటున్న భవన నిర్మాణ కాంట్రాక్టర్ ఒంగోలు హనుమంతరావు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిగా ఉంటూ ఎన్నికల్లో చురుగ్గా ప్రచారం చేశాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో టీడీపీ నేత మనోహర్‌నాయుడు తన అనుచరులతో కలిసి అక్రమ వసూళ్లు.. వైఎస్సార్సీపీకి చెందిన వారిపై దాడులకు తెగబడ్డాడు. పోలీసుల దృష్టికి వెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో మనోహర్‌నాయుడు మరింత రెచ్చిపోయాడు. రెండు రోజుల క్రితం హనుమంతరావుకు ఫోన్ చేసి తనకు 24 గంటల్లో రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే నీ తమ్ముడు మారుతిని చంపుతామని బెదిరించాడు. తాను డబ్బు ఇచ్చుకోలేనని చెప్పడంతో ఆదివారం రాత్రి మారుతిని కిడ్నాప్ చేసి.. డబ్బు తీసుకుని పలానా చోటుకు రావాలంటూ ఫోన్లో చెప్పాడు. హనుమంతరావు ఒట్టి చేతులతో రావడంతో ఆగ్రహించిన మనోహర్‌నాయుడు అనుచరులతో కలిసి కట్టెలతో చితకబాదాడు. మరో 24 గంటలు సమయం ఇస్తున్నానని, ఈసారి డబ్బు లేదా ఇటీవల నిర్మించిన కొత్త ఇంటిని తన పేరిట రాసివ్వాలని.. ఈసారి మొండిచేయి చూపితే భార్య, పిల్లలను చంపుతామని హెచ్చరించాడు. తీవ్రంగా గాయపడిన హనుమంతరావును తమ్ముడు మారుతి అనంతపురం సర్వజనాస్పత్రిలో చేర్చాడు. చికిత్స పొందుతున్న బాధితుడిని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ధనుంజయయాదవ్ పరామర్శించారు. భౌతికదాడులు, అక్రమ అరెస్టులు నిరోధించండి అనంతపురం జిల్లా పరిషత్ : వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై టీడీపీ నేతల నుంచి భౌతికదాడులు, పోలీసుల నుంచి అక్రమ అరెస్టులు నిరోధించాలని ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ ఎస్పీ సెంథిల్‌కుమార్‌ని కోరారు. ఈ మేరకు సోమవారం ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. కక్కలపల్లి కాలనీలో ఆదివారం రాత్రి జరిగిన సంఘటనను కూడా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలను కట్టడి చేసి.. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం సమర్పించిన వారిలో పార్టీ అధికార ప్రతినిధి సీపీ వీరన్న, రూరల్ మండలం కన్వీనర్ ధనుంజయయాదవ్తో పాటు మరికొందరు బాధితులు ఉన్నారు.