వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలో మోకాళ్ల నిరసన కార్యక్రమం జరిగింది.
అనంతపురం క్రైమ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలో మోకాళ్ల నిరసన కార్యక్రమం జరిగింది. శనివారం రాష్ట్ర బంద్ సందర్భంగా ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆదివారం యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 60 మంది కార్యకర్తలు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై నించుని నిరసన తెలిపారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రత్యేక హోదా సాధించేవరకూ ప్రజాగర్జన ఆగదన్నారు.