state bandh
-
‘26వ తేదీన రాష్ట్ర బంద్’
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కిసాన్ సంయుక్త మోర్చా పిలుపు మేరకు భారత్ బంద్‌లో భాగంగా ఈ నెల 26న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి నిర్ణయించింది. సమితి సమావేశం ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం జరిగింది. సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ.. 26న బంద్‌ను విజయవంతం చేయడానికి 17న విజయవాడలో సన్నాహక సమావేశం జరుపుతున్నట్లు తెలిపారు. 19న వ్యవసాయ మార్కెట్ కమిటీల ముందు నిరసన వ్యక్తం చేయాలని, 15న విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో జరిగే పోరాటంలో భాగస్వామ్యం కావాలని సమావేశంలో తీర్మానం చేశామన్నారు. సమావేశంలో రైతు సంఘాల నేతలు రావుల వెంకయ్య, వై.కేశవరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా ఏపీ బంద్
-
ఏపీ బంద్: డిపోలకే పరిమితమైన బస్సులు
-
ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్..
విశాఖపట్నం: విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు అన్ని పక్షాలు ఏకతాటిపై ముందుకు కదులుతున్నాయి. మద్దిలపాలెం బస్టాండ్ వద్ద కార్మిక సంఘాలు నిరసన చేపట్టాయి. రోడ్డుపై బైఠాయించి కార్మికులు నిరసన తెలుపుతున్నారు. ఈ నిరసనలో వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ఎంవీవీ సత్యనారాయణ, మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొన్నారు. విశాఖ ప్లాంట్ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు. మద్దిలపాలెం బస్ స్టాండ్ వద్ద బస్సులు నిలిపివేశారు. నిరసనలో ప్రజాసంఘాల జేఏసీ, సీఐటీయూ, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఛైర్మన్ నరసింగరావు పాల్గొన్నారు. స్టీల్ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉంచాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీడీపీ డ్రామాల పార్టీ: ఎంపీ విజయసాయిరెడ్డి ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో ప్రభుత్వం ప్రత్యక్షంగా పోరాటం చేస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించారని, ప్రత్యామ్నాయ మార్గాలను ఆచరిస్తే లాభాలు వస్తాయని చెప్పారని తెలిపారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైఎస్సార్ సీపీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. కేంద్రానికి సీఎం జగన్మోహన్రెడ్డి లేఖ రాసిన పది రోజులకు.. చంద్రబాబు స్పందించి డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ అంటేనే డ్రామాల పార్టీ అని, ఆయన కుమారుడు పప్పునాయుడని ఆయన విమర్శలు గుప్పించారు. నిలిచిన జన సంచారం.. తూర్పుగోదావరి: విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా బంద్‌కు పిలుపును ఇవ్వడంతో కాకినాడలో బంద్ ప్రభావం కనిపించింది. అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌తో సహా అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ఈ బంద్‌కి సంఘీభావం తెలిపాయి. జెఎన్టీయూలో నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసారు. కాకినాడ సీపోర్ట్ లో కార్మికులు బంద్ ప్రకటించడంతో అక్కడి కార్యకలాపాలు నిలిచిపోయాయి. స్కూల్స్, బ్యాంక్‌లు, వ్యాపార సంస్థలు, దుకాణాలు, సినిమా హాల్స్ మూత పడ్డాయి. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. ట్రావెల్స్, ఆటో డ్రైవర్ లు కూడా బంద్ పాటిస్తుండటంతో జన సంచారం నిలిచిపోయింది. కార్మిక సంఘాల నిరసన.. విజయవాడ: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆంధ్రపదేశ్‌లో బంద్ కొనసాగుతుంది. రాష్ట్ర బంద్‌కు ఏపీ ప్రభుత్వం సంఘీభావం తెలిపింది. పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద కార్మిక సంఘాల నిరసన చేపట్టారు. కార్మిక సంఘాల నిరసనతో బస్సులు బస్టాండ్‌కే పరిమితమయ్యాయి. బంద్‌లో వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు గౌతంరెడ్డి, సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు. స్తంభించిన రవాణా.. కృష్ణా: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర బంద్ కొనసాగుతుంది. మచిలీపట్నంలో డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితయ్యాయి. రవాణా స్తంభించింది. స్వచ్ఛందంగా దుకాణాలు మూతపడ్డాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలు బంద్‌కు సంఘీభావం తెలిపాయి. వామపక్షాల భారీ ర్యాలీ అనంతపురం: నగరంలో వామపక్షాల భారీ ర్యాలీ నిర్వహించాయి. విశాఖ ఉక్కును ప్రవేటీకరించొద్దని డిమాండ్ చేశాయి. బంద్‌కు సంఘీభావం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కమ్యూనిస్టు నేతలు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: చంద్రబాబుకు చుక్కలు చూపించిన న్యాయవాదులు ఏక కాలంలో అంగన్వాడీ భవనాల పనులు -
‘ఉక్కు’ సంకల్పంతో నేడు రాష్ట్ర బంద్
సాక్షి, అమరావతి: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ నినాదంతో నేడు రాష్ట్రవ్యాప్తంగా బంద్ జరుగనుంది. బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలనే నినాదంతో తలపెట్టిన ఈ బంద్‌కు తాము పూర్తిగా సహకరిస్తామని సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) ప్రకటించారు. విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు నినాదంతో ఆవిర్భవించిన స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకునేందుకు అన్ని పక్షాలు ఏకతాటిపై ముందుకు కదులుతున్నాయి. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేసేలా ఐక్య కార్యాచరణ చేపట్టారు. నష్టాల పేరుతో బడా కార్పొరేట్ సంస్థలకు విశాఖ ఉక్కును ధారాదత్తం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని కార్మిక సంఘాలు నినదిస్తున్నాయి. గత ఐదు రోజులుగా రాష్ట్రంలో పలు రాజకీయ పార్టీలు, సంఘాలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టాయి. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బంద్‌ను విజయవంతం చేసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని నిర్ణయించాయి. సీపీఎం, సీపీఐలతోపాటు పలు కార్మిక సంఘాలతో విశాఖ ఉక్కు ఉద్యమంలో పాలుపంచుకుంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు బంద్‌కు సంఘీభావం ప్రకటించారు. వర్తక, వ్యాపార సంస్థలతోపాటు విద్యాసంస్థలు, బ్యాంకులు, సినిమా థియేటర్లను స్వచ్ఛదంగా మూసివేసి బంద్‌కు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేసేలా తాము కూడా ప్రత్యక్షంగా పాల్గొంటామని లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. బంద్ సందర్భంగా ఉదయం 10 గంటల నుంచి ధర్నా నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేస్తామని లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు తెలిపారు. బంద్‌కు మద్దతుగా పలుచోట్ల బైక్ ర్యాలీలు విశాఖ ఉక్కు– ఆంధ్రుల హక్కు నినాదంతో చేపడుతున్న బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల బైక్ ర్యాలీలు నిర్వహించారు. కేంద్రం తీసుకున్న మొండి నిర్ణయంతో కార్మికులు రోడ్డున పడతారని, వెంటనే ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనను ఉ«ధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ బీసెంట్ రోడ్లో నినాదాలు చేస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ బాబూరావు, వి.ఉమామహేశ్వరరావు, సీపీఐ కృష్ణా జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, అనంతపురం తదితర జిల్లాల్లో కూడా ర్యాలీలు నిర్వహించారు. చదవండి: (దేశవ్యాప్తంగా ఉత్తమ సిటీగా విశాఖ) -
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె ఉధృతం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె క్రమంగా ఉధృతమవుతోంది. ఇప్పటివరకు శాంతియుతంగా కార్యక్రమాలు చేస్తున్న కార్మికులు ఇక వ్యూహాత్మక కార్యాచరణతో సమ్మెను తీవ్రతరం చేస్తున్నారు. వీరికి రాజకీయ పార్టీలు సైతం మద్దతుగా నిలిచి కార్మికుల డిమాండ్ల సాధనకు తోడ్పాటు అందిస్తుండడంతో సమ్మె తీవ్రత బలంగా మారుతోంది. ఇదిలావుండగా ఖమ్మం బస్ డిపోకు చెందిన డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలు కావడం, నగరంలోని ఆస్పత్రికి తరలించడం, శ్రీనివాస్‌రెడ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటం... తదితర అంశాలు సమ్మెను మరింత వేడెక్కించాయి. మరోవైపు కార్మికుల చర్యలకు భయపడే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. శని వారం ఉదయం మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. గడువులోగా విధుల్లో చేరని వారు కార్మికులే కాదని, వారితో చర్చలు జరిపేది లేదని తేల్చిచెప్పారు. మూడ్రోజుల్లోగా నూరుశాతం బస్సులు నడపాలని, కొత్త విధానం ప్రకారం బస్సుల నోటిఫికేషన్లు తదుపరి చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం కూడా పట్టు వీడకపోవడం... కార్మికులు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టం చేస్తుండడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఏడు రోజుల కార్యాచరణ విడుదల... సమ్మె పట్ల వెనక్కు తగ్గని కార్మిక సంఘాలు ఏకంగా వారం రోజుల కార్యాచరణను ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రత్యేక కార్యాచరణ ఏదీ లేకుండా రోజు వారీగా నిరసన కార్యక్రమాలు చేస్తూ వచ్చింది. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన అఖి లపక్ష పార్టీ నేతల సమావేవంలో ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఈనెల 19వ తేదీ వరకు రోజువారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వెల్లడించింది. ఈ నెల 13న అన్ని డిపోల వద్ద వంటా–వార్పు చేపట్టాలి. ఈ నెల 14న బస్ డిపోల ఎదుట ఆర్టీసీ కార్మికులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మహా ధర్నాలు నిర్వహించాలి. అదేవిధంగా ఇందిరాపార్క్ వద్ద సమ్మెకు మద్దతిస్తున్న రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, కార్మిక, కర్షక, మహిళా సంఘాలతో మహా ధర్నా. ఈనెల 15న రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు, చౌరస్తాల వద్ద ఆర్టీసీ కార్మికులతో పాటు రాజకీయ, విద్యార్థి సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, కుల సంఘాలు, సబ్బండ వర్ణాల భాగస్వామ్యం తో రాస్తారోకోలు. 16న విద్యార్థి సంఘాలతో ప్రధాన రహదారులు, జాతీయ రహదారులపై ర్యాలీలు. 18న బైక్ ర్యాలీలు. ఈనెల 19న తెలంగాణ రాష్ట్ర బంద్. జేఏసీ కార్యాచరణ ప్రకటించిన గడువులోగా ప్రభుత్వం స్పందించకుంటే సమ్మెను మరింత తీవ్రతరం చేయనున్నట్లు జేఏసీ స్పష్టం చేసింది. -
‘ఇంటర్’ వైఫల్యాలపై నేడు రాష్ట్ర బంద్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పిదాలను నిరసిస్తూ బీజేపీ గురువారం (2న) రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్రంలో 24 మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన ఇంటర్ పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ నేడు తాము చేపట్టబోయే రాష్ట్ర బంద్‌కు ప్రజలు సహకరించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. పిల్లల భవిష్యత్తు కోసం, ఆందోళనలో ఉన్న విద్యార్థి లోకానికి భరోసా ఇచ్చేందుకు, అమాయక విద్యార్థుల బలిదానమైనా అహంకారంతో కళ్లు మూసుకుపోయిన ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు బంద్‌ను జయప్రదం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, పరీక్షల నిర్వహణ, ప్రాసెసింగ్ లోపాలతో పలువురు విద్యార్థులు ఫెయిలయ్యారని అన్నారు. టాప్ ర్యాంక్ వస్తుందని ఆశించిన వారు, ఫస్టియర్‌లో 90 శాతానికి పైగా మార్కులొచ్చిన వారు, మిగతా సబ్జెక్టుల్లో 90 శాతానికి పైగా మార్కులొచ్చిన వారు కూడా ఫెయిలైన వారి జాబితాలో ఉన్నారని వెల్లడించారు. 50 ఏళ్ల ఇంటర్ బోర్డు చరిత్రలో ఎప్పుడూ చోటు చేసుకోని గందరగోళం, ఘోర వైఫల్యం ఈసారి చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మొద్దు నిద్ర నటిస్తున్న ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు, బాధిత విద్యార్థులకు న్యాయం చేసేందుకు బీజేపీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిందని, ఇది రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాదని స్పష్టం చేశారు. నిమ్స్‌లో కొనసాగుతున్న లక్ష్మణ్ దీక్ష.. ఇంటర్ బోర్డు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ లక్ష్మణ్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష బుధవారంతో మూడో రోజుకు చేరింది. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముందు సోమవారం ఆయన దీక్షకు కూర్చోగా, పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి నిమ్స్‌కు తరలించిన విషయం తెలిసిందే. సెలైన్ ఎక్కించేందుకు యత్నించినప్పటికీ ఆయన నిరాకరించి, ఆస్పత్రిలోనే తన దీక్షను కొనసాగిస్తు న్నారు. మూడు రోజులుగా ఆయన ఎలాంటి ఆహా రం తీసుకోకపోవడం వల్ల నాలుగు కేజీల బరువు తగ్గారు. ఆయన ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తుండటం, ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కనీస స్పందన లేకపోవడంతో బీజేపీ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనేక మంది పిల్లల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న గ్లోబరీనా సంస్థ కాంట్రాక్ట్‌ను వెంటనే రద్దు చేయాలని.. విద్యా శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని, బోర్డుకార్యదర్శి అశోక్‌కుమార్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. ‘బంద్‌కు సహకరించండి’ సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పులను నిరసిస్తూ సోమవారం (2న) బీజేపీ తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ప్రజలను కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్ బోర్డులో అవకతవకలకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం ఇంత వరకు చర్యలు చేపట్టలేదని తెలిపారు. నిరసనకు దిగిన ప్రతిపక్షా లపై పోలీసులతో దాడులు చేయిస్తున్నారన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎలాంటి ఒప్పందం లేకుండా గ్లోబరీనా సంస్థ కాంట్రాక్టు ఎలా దక్కించుకుందని ప్రశ్నించారు. పాత్రధారులే న్యాయ నిర్ణేతలుగా ఉన్నారని విమర్శించారు. ఈ విషయం లో తాడోపేడో తేల్చుకునేందుకు తమ పార్టీ సిద్ధమవుతోందని చెప్పారు. తాము చేపట్టనున్న బంద్ రాజకీయం కోసం కాదని స్పష్టం చేశారు. -
ఇంటర్’ వ్యవహారంపై 2న బీజేపీ రాష్ట్ర బంద్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో అవకతవకల అంశాన్ని ఉద్యమంగా మార్చేదిశగా బీజేపీ అడుగులేస్తోంది. మే 2వ తేదీన బంద్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆదివారం(28న) అన్ని జిల్లాకేంద్రాల్లో నిరాహార దీక్ష, 29న విద్యార్థులు, మేధావులతో హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం, 30న ప్రగతిభవన్‌ను ముట్టడించాలని నిర్ణయించినట్టు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈలోపు మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని, బోర్డు కార్యదర్శి అశోక్‌ను తొలగించాలని, అవకతవకలపై సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తాము పెట్టిన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకుంటే మే 2న రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, ఫలితాల్లో భారీస్థాయిలో లొసుగులు చోటుచేసుకోవటం తో ఇప్పుడు ఈ అంశం పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ‘టెన్త్’పై కూడా ఆరోపణలు... ఇంటర్ వ్యవహారంలో తీవ్ర తప్పిదాలు దొర్లిన నేపథ్యంలో పదోతరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనంపై కూడా ఆరోపణలు వస్తున్నట్టు లక్ష్మణ్ చెప్పారు. ఇంటర్ వ్యవహారంలో ఫలితాలకు ముందే ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదని, ఇప్పుడు పదో తరగతి విషయంలో ఎలా జరగబోతోందన్న అనుమానాలున్నాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లక్ష లాది మంది విద్యార్థులను ఆగం చేసినందున పదో తరగతి ఫలితాల విషయంలో జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. అనాలోచిత నిర్ణయంతో గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారని, ప్లాన్ బి లేకుండా గందరగోళం చేశారన్నారు. 23 మంది పిల్లల ఆత్మ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాం డ్ చేశారు. పరీక్షలు, ఫలితాలపై కనీసం సమీక్ష చేయలేకపోయిన విద్యాశాఖ మంత్రి ‘పుండు మీద కారం చల్లినట్టు’సమస్యను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. -
24న రాష్ట్ర బంద్ జయప్రదం చేయండి
గడివేముల: ప్రత్యేక హోదా కోసం ఈనెల 24న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రబంద్‌ను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పిలుపునిచ్చారు. చిందుకూరు గ్రామంలో ఇటీవల ఎనిమిది మందికి జీవిత ఖైదు పడగా..శనివారం సాయంత్రం గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం విలేకరుల సమావేశంలో గౌరు దంపతులు మాట్లాడారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తోందన్నారు. హోదా కోసమే తమ పార్టీల ఎంపీలు ఐదుగురు రాజీనామా కూడా చేశారని గుర్తు చేశారు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసిన టీడీపీ ఎన్నికల సమయం దగ్గర పడడంతో డ్రామా ఆడుతోందన్నారు. దొంగ దీక్షలు చేస్తున్న టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. ఐఏబీ సమావేశం నిర్వహించి త్వరగా కేసీకి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కందులు కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్.. రైతులకు రూ. 62కోట్లు అందాల్సి ఉందన్నారు. అయినా ప్రభుత్వానికి బీమకుట్టినట్లు కూడాలేదన్నారు. నాగులదిన్నె ఎత్తిపోతల పథకం కాకుండా గుండ్రేవుల పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు అనసూయమ్మ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సత్యనారాయణరెడ్డి, పార్టీ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సత్యంరెడ్డి, దామోదర్‌రెడ్డి, రంగస్వామినాయక్, సుదర్శన్‌రెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు తమిళనాడు బంద్
సాక్షి ప్రతినిధి, చెన్నై: తూత్తుకుడి హింసాకాండకు వ్యతిరేకంగా శుక్రవారం తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించాలని ప్రతిపక్షాలు పిలుపునిచ్చాయి. కాల్పులపై డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్‌తో చర్చించేందుకు సీఎం పళనిస్వామి నిరాకరించడంతో డీఎంకే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సచివాలయం ఎదుట రాస్తారోకో నిర్వహించారు. స్టెరిలైట్ యూనిట్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగాయి. మదురై, కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాల్లో నిరసనకారులు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. కేంద్ర పర్యావరణ శాఖ ఆదేశాల మేరకు స్టెరిలైట్ కర్మాగారానికి విద్యుత్ సరఫరాను నిలిపేశారు. నిషేధాజ్ఞలను ధిక్కరించి తూత్తుకుడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన స్టాలిన్, వైగో, కమల్ హాసన్ తదితర నాయకులపై కేసులు నమోదయ్యాయి. -
హోదా కోసం నేడు ఆంధ్రావని బంద్
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి అపర సంజీవని అయిన ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్ర ప్రజలు మరోసారి బంద్‌కు సిద్ధమయ్యారు. ‘హోదా’ కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్న ప్రజలు మరోసారి బంద్‌తో తమ ఆకాంక్షను ఎలుగెత్తి చాటనున్నారు. విభజనతో నష్టపోయిన రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలు దక్కకపోవడంతో ప్రజాస్వామ్యయుతంగా తమ నిరసన తెలపడానికి సంసిద్ధమయ్యారు. హోదా, విభజన హామీలు అమలు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మోసపూరిత వైఖరిని నిరసిస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర బంద్ చేపట్టనున్నారు. ఈ బంద్‌కు టీడీపీ, బీజేపీ మినహా అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలపడమే కాకుండా తాను నిర్వహిస్తున్న ప్రజాసంకల్పయాత్రకు సైతం సోమవారం విరామం ప్రకటించారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు బంద్‌ను విజయవంతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణులు సన్నద్ధమయ్యాయి. మరోవైపు కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ సహా అన్ని పక్షాలు బంద్ విజయవంతం చేయాలంటూ పిలుపునిచ్చాయి. ప్రజాసంఘాలు, ఉద్యోగ, స్వచ్ఛంద సంఘాలు సైతం ఈ ఆందోళనలో పాల్గొననున్నాయి. అయితే బంద్‌కు తమ పార్టీ దూరంగా ఉంటుందని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు బంద్ విచ్ఛిన్నానికి ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. నిరసనల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవంటూ నోటీసుల ద్వారా విపక్షాల నేతలు, కార్యకర్తలను బెదిరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రభుత్వ ఆంక్షలను సైతం లెక్కచేయక పార్టీలు, ప్రజలు బంద్‌కు సర్వసన్నద్ధమయ్యారు. ప్రత్యేకక హోదా సాధన, విభజన హామీల అమలు కోసం సోమవారం చేపట్టనున్న రాష్ట్ర బంద్‌ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. -
వామపక్షాల బంద్‌కు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, అమరావతి : రాష్ట్ర విభజన చట్టంలోని హామీల అమలు కోసం ఈ నెల 8న వామపక్షాలు పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్‌కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, దుగరాజపట్నం పోర్టు, విశాఖ రైల్వే జోన్, కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుతోపాటు విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన అన్ని అంశాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నదని, వీటికి మద్దతుగా ఏ పార్టీ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిచ్చినా మద్దతు ఇవ్వనున్నట్లు పార్టీ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే, బంద్‌కు కేంద్ర కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఏఐటీయూసీ, సీఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఇతర కార్మిక సంఘాల నేతలు జి.ఓబులేసు, వి.ఉమామహేశ్వరరావు, కె.రామారావు మాట్లాడారు. బంద్‌కు కార్మిక, ఉద్యోగ, వర్తక, వాణిజ్య సంఘాలు మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా మద్దతు తెలపాలన్నారు. -
చంద్రబాబు శంకరగిరి మాన్యాలకే..
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తమతో కలిసి పోరాటానికి సిద్ధం కావాలని, దాగుడుమూతలు ఆడితే శంకరగిరి మాన్యాలకే పరిమితం అవుతారని సీపీఐ నేత నారాయణ అన్నారు. చంద్రబాబు లోపలో మాట ఉంచుకుని, ఎంపీలతో మరో మాట చెబుతూ ఆటలాడుతున్నారని విమర్శించారు. ఎంపీలతో ఆట కంటే స్వయంగా ముఖ్యమంత్రే కేంద్ర ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవాలని సూచించారు. ఇప్పటికైనా టీడీపీ కేంద్రంపై తమ పంథా మార్చుకుని సీపీఐ పోరాటానికి మద్ధతు తెలపాలన్నారు. మరోవైపు ఇటీవల ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని, గత నాలుగేళ్లుగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏపీ ప్రజలను మోసం చేస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఆరోపించారు. కేంద్రం తీరుగా నిరసనగా ఈ నెల 8న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చామని, ఇతర పార్టీలు మద్ధతు తెలిపి బంద్‌ను విజయవంతం చేయాలని కోరిన విషయం తెలిసిందే. ప్రజలు, వ్యాపారులు, మేధావులతో పాటు టీడీపీ నాయకులూ బంద్‌లో పాల్గొనాలని సీపీఐ నేతలు సూచించారు. -
‘టీడీపీ నేతలూ.. బంద్‌లో పాల్గొనండి’
సాక్షి, విజయవాడ: రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ ప్రభుత్వం నాలుగు సంవత్సరాలుగా ఏపీ ప్రజలను మోసం చేస్తోందని, బడ్జెట్లోనూ మొండిచేయి చూపిందని విమర్శించారు. కేంద్రం తీరుకు నిరసనగా ఈనెల 8న రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చామని తెలిపారు. బంద్‌కు సహకరించాలని అన్ని పార్టీలను కోరామని, కాంగ్రెస్ నుంచి మద్దతు లభించిందని తెలిపారు. ఇతర పార్టీల నాయకులతో మాట్లాడుతున్నామని, ఈరోజు సాయంత్రానికి అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తాయన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ప్రజలు, వ్యాపారులు, మేధావులు అందరూ స్వచ్ఛంద బంద్‌లో పాల్గొనాలని కోరారు. బంద్‌ను అడ్డుకోకుండా ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ నాయకులు కూడా బంద్‌లో పాల్గొనాలని సూచించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేసి చంద్రబాబు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. -
8న ఏపీ బంద్
సాక్షి, అనంతపురం అర్బన్: కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా ఈ నెల 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ తెలిపారు. అనంతపురంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జెల్లి విల్సన్, జి.ఓబుళేసుతో కలిసి శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టం బిల్లులో రాష్ట్రానికి చేకూర్చాల్సిన లబ్ధిని బడ్జెట్లో ప్రస్తావించకుండా అన్ని రంగాలకు కేంద్రం అన్యాయం చేసిందన్నారు. విశాఖ రైల్వే జోన్, పోర్ట్, కడప ఉక్కు ఫ్యాక్టరీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ అంశాల ఊసెత్తలేదన్నారు. జాతీయ ప్రాజెక్టు పోలవరానికి నాబార్డ్ నుంచి, రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంక్ ద్వారా నిధులు ఇప్పిస్తామని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటికీ ఒక్క మాట మాట్లడలేదని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బంద్ విషయంపై పది వామపక్ష పార్టీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులతో మాట్లాడామన్నారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు ప్రజాసంఘాలు, వ్యాపారులు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలు సహకరించాలని కోరారు. -
అట్టుడికిన మహారాష్ట్ర
సాక్షి, ముంబై: భీమా–కోరేగావ్ ఘటనపై నిరసనలు పుణే నుంచి మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాలు మంగళవారం దళితుల ఆందోళనలతో అట్టుడికాయి. ముంబైలో రైళ్లు, బస్సులు నిలిచిపోయాయి. పుణే దగ్గర్లోని భీమా–కోరేగావ్ యుద్ధ స్మారకం వద్ద 200వ విజయోత్సవాల సందర్భంగా సోమవారం హిందూ, దళిత సంస్థల కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఇది కాస్తా ముదిరి హింసాత్మకంగా మారింది. ఆందోళన కారులు పదుల సంఖ్యలో వాహనాలను తగులబెట్టి ధ్వంసం చేశారు. ఈ ఘర్షణల్లో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ హింసకు ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ భరిపా బహుజన్ మహాసంఘ్(బీబీఎం) బుధవారం మహారాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ పిలుపునకు మహారాష్ట్ర డెమోక్రటిక్ ఫ్రంట్, మహారాష్ట్ర లెఫ్ట్ ఫ్రంట్ తదితర 250 సంస్థలు మద్దతు తెలిపాయని బీబీఎం నేత ప్రకాశ్ అంబేడ్కర్ చెప్పారు. పుణే ఘర్షణలు మంగళవారం ముంబైకి పాకాయి. ప్రభుత్వమే ఘర్షణలకు కారణమంటూ దళితులు చేపట్టిన ఆందోళనలతో ముంబైలో రైళ్లు ఆగిపోయాయి. వందకుపైగా బస్సులు ధ్వంసమయ్యాయి. చాలాచోట్ల దుకాణాలు మూతబడ్డాయి. ఆందోళనకారులు ముంబైలోని ముఖ్య ప్రాంతాల్లో వాణిజ్య, విద్యా సంస్థలు, దుకాణాలను మూసివేయించారు. హార్బర్ లైన్‌లోని గోవండీ, చెంబూర్ రైల్వే స్టేషన్లలో రైళ్లను అడ్డుకున్నారు. ఈ ఘటనలతో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. ఆందోళనకారులు 134 ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారని అధికారులు తెలిపారు. దాదాపు 100 మంది ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కోరేగావ్ విజయోత్సవాలకు వెళ్లి వస్తున్న ఓ మహిళపై సోమవారం దాడికి పాల్పడ్డారనే ఫిర్యాదుపై హిందూ ఏక్తా అఘాదీ నేత మిలింద్ ఎక్బొటే, శివ్‌రాజ్ ప్రతిష్టాన్ నేత సంభాజీ భిండేలపై పోలీసులు హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. ఈ రెండు సంస్థలు బ్రిటిష్ వాళ్ల గెలుపునకు విజయోత్సవాలేమిటంటూ మొదటినుంచీ వ్యతిరేకిస్తున్నాయి. హైకోర్టు జడ్జితో విచారణ: ఫడ్నవిస్ ఈ హింసాత్మక ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయిస్తామని సీఎం ఫడ్నవిస్ చెప్పారు. ఈ ఘటనలో మృతి చెందిన యువకుడి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం అందజేస్తామని, యువకుడి మృతిపై సీఐడీ దర్యాప్తు చేయిస్తామని తెలిపారు. ఆర్ఎస్ఎస్–బీజేపీ ఫాసిస్ట్ విధానాలపై భీమా–కోరేగావ్ ఉత్సవాలు గెలుపునకు ప్రతీకలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ అన్నారు. కోరేగావ్ చరిత్ర ఇదీ... పుణే సమీపంలో భీమా నది ఒడ్డున భీమా–కోరేగావ్ యుద్ధ స్మారకం మహారాష్ట్రలో సంకుల సమరానికి కేంద్ర బిందువుగా మారింది. పీష్వా బాజీరావు–2 సైన్యంతో బ్రిటిష్ సైన్యానికి ఇక్కడే యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ముగిసి 200 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఉత్సవాలు జరిగాయి. ఇక్కడ జరిగిన ఘర్షణలే పెద్దవయ్యాయి. 1857 తొలి స్వాతంత్య్ర సమరానికి ముందే బాంబే ఆర్మీ (బ్రిటీష్)లో 25 శాతం మహర్లు(దళితులు) ఉండేవారు. బ్రిటిష్ మెరైన్ బెటాలియన్‌లో కీలక సైనికులుగా ఉన్నారు. పీష్వాల పాలనలో అంటరానితనం తీవ్రస్థాయిలో అమలవుతున్న రోజులవి. ఆ సమయంలోనే 1818 జనవరి 1న∙పీష్వా బాజీరావు–2 పెద్ద సైన్యంతో పరిమిత సంఖ్యలో ఉన్న బ్రిటిష్ సైన్యం పోరాడింది. పుణేపై దాడికి వస్తున్న పీష్వా సైన్యాన్ని కెప్టెన్ స్టౌంట్సన్ నేతృత్వంలో 21వ రెజిమెంట్ ఆఫ్ ద బాంబే నేటివ్ ఇన్ఫాంట్రీ(మహర్ మెజారిటీ) నిలువరించింది. ఇరవై వేలకు పైబడిన అశ్వికదళం, 8 వేల మంది కాల్బలంతో కేవలం 800మంది సైనికులు (వారిలో 500–600 మంది మహర్లు) ఆహారం, నీరు, ఎలాంటి విశ్రాంతి లేకుండా ఏకధాటిగా 12 గంటల పాటు పోరాడారు. ఈ యుద్ధంలో 21 మంది మహర్ సైనికులు అసువులు బాశారు. మరింత పెద్ద సంఖ్యలో బ్రిటిష్ సైన్యం రావొచ్చునని భావించిన బాజీరావు–2 తన సైన్యాన్ని వెనక్కు రప్పించారు. వీరోచితమైన ఈ సంఘర్షణే మూడో బ్రిటిష్–మరాఠా యుద్ధంలో కీలక పరిణామంగా మారింది. భారత గడ్డపై ఆంగ్లేయులు తమ పట్టును బిగించేందుకు ఇది ఉపయోగపడింది. ఈ సంగ్రామంలో అమరులైన 21 మంది సైనికుల పేర్లు ఈ యుద్ధస్మారకంపై చెక్కి ఉన్నాయి. 1927 జనవరి 1న డాక్టర్ భీమ్రావు అంబేడ్కర్, పలువురు దళిత ప్రముఖులు, బ్రిటిష్ సైన్యంలో పనిచేస్తున్న వారితో కలిసి ఈ స్మారకాన్ని సందర్శించారు. అప్పటికి 109 ఏళ్ల క్రితం జరిగిన కోరేగావ్ యుద్ధంలో పీష్వాలకు వ్యతిరేకంగా బ్రిటిష్ సైన్యంలో అత్యధికంగా ఉన్న మహర్ సైనికులు సాధించిన విజయాన్ని పురస్కరించుకుని ఈ పర్యటన సాగింది. సైనికపరంగా దళితుల శక్తిసామర్థ్యాలకు కోరేగావ్ యుద్ధాన్ని గొప్ప ఉదాహరణగా పరిగణిస్తుంటారు. బ్రిటిష్ ఆర్మీలో అంబేడ్కర్ తండ్రి, ఆయన సోదరులు ఆరుగురు సుబేదార్ మేజర్లుగా పనిచేయటం గమనార్హం. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
మంద కృష్ణ ఉగ్రవాదా..?
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ కోసం 23 ఏళ్లుగా పోరాడుతున్న మంద కృష్ణ మాదిగ ఉగ్రవాదా అని అఖిలపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆయన్ను బేషరతుగా విడదల చేయడంతో పాటు కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 27న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు తమ సంపూర్ణ మద్దతుంటుందని పేర్కొంది. ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అధ్యక్షతన ‘మంద కృష్ణ మాదిగ అరెస్టు, వర్గీకరణ’ అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగింది. దీక్షా దివస్ అని గొప్పగా చెప్పుకొంటున్న కేసీఆర్.. దానికి ముగింపుగా మంద కృష్ణ నిమ్మరసం ఇచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. గతంలో ఎంతోమంది పాలన చేశారు కానీ దళితులపై ఇంత అరాచకంగా ఎవరూ వ్యవహరించలేదన్నారు. రాష్ట్ర బంద్‌కు మద్దతు ప్రకటించారు. దళితులపై దాడులను వ్యతిరేకించాలి: మోత్కుపల్లి దళితులపై దాడులకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలసి పోరాడాలని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు. నిజాం నిరంకుశ విధానాలను సమర్థిస్తున్న కేసీఆర్.. అదే పద్ధతులను అమలు చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. బేషరతుగా మంద కృష్ణను, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకుడు లింగస్వామి మాదిగను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ గురించి ఎవరు మాట్లాడినా అరెస్టు చేసేలా ఉందని, రాష్ట్రంలో రాజ్యహింస పేట్రేగిపోతోందని అరుణోదయ విమలక్క విమర్శించారు. రాజ్యహింసకు వ్యతిరేకంగా ఈ నెల 27న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో చింతా సాంబమూర్తి (బీజేపీ), బాలమల్లేశ్ (సీపీఎం), వెంకన్న (ఎమ్మార్పీఎస్), ఓరుగంటి వెంకటేశం (బీసీ సంఘం) తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక హోదాతోనే భవిత
-
ధర్మాగ్రహం
(సాక్షి ప్రతినిధి, అనంతపురం) : ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. ప్యాకేజీ ద్వారా వచ్చే నిధులు రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలకు మినహా రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రమూ ఉపయోగపడవని, అనంతపురం లాంటి వెనుకబడిన ప్రాంతాలకు ఇసుమంతైనా న్యాయం జరగదని ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్సీపీ ధ్వజమెత్తుతోంది. ప్రత్యేక ప్యాకేజీతో సరిపెట్టిన కేంద్రం, దాన్ని అంగీకరించిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్సార్సీపీ నేడు (శనివారం) బంద్‌కు పిలుపునిచ్చింది. సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్‌తో పాటు వివిధ ప్రజాసంఘాలు ఈ బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు కూడా బంద్‌లో పాల్గొననున్నారు. ‘అనంత’కు తీరని అన్యాయం ప్రత్యేక హోదాకు, ప్యాకేజీకి చాలా తేడా ఉంది.Sహోదా ప్రకటిస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి. హోదా ఎన్నేళ్లు ఉంటుందో ఆ కాలంలో పరిశ్రమలకు ప్రత్యేక పన్ను రాయితీలు ఉంటాయి. కరెంటు సరఫరాలోనూ రాయితీ లభిస్తుంది. దీంతో రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు దేశ,విదేశీ కార్పొరేట్ సంస్థలు ముందుకొస్తాయి. బెంగళూరు విమానాశ్రయం, నేషనల్హైవే అందుబాటులో ఉన్న అనంతపురం జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. లక్షల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. రవాణాకు అనుకూలంగా ఉంది. అవసరమైతే పుట్టపర్తి విమానాశ్రయాన్ని కూడా ప్రభుత్వం పూర్తిగా వినియోగంలోకి తేవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో విస్తీర్ణపరంగా అనంతపురం అతి పెద్ద జిల్లా. 41 లక్షల జనాభా ఉంది. ఇంతపెద్ద జిల్లాలో ప్రస్తుతం కనీసం వెయ్యిమందికి ఉద్యోగం కల్పించే పరిశ్రమ ఒక్కటీ లేదు. తాడిపత్రి పరిధిలోని అల్ట్రాటెక్‌లో 770, గెర్డావ్ స్టీల్ ఫ్యాక్టరీలో 500 మంది ఉన్నారు. పెన్నా–1(తలారిచెరువు)లో 200, పెన్నా–2(బోయిరెడ్డిపల్లి)లో 200 మంది ఉన్నారు. వీటిల్లో కూడా 90శాతం మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారే. ఈ పరిస్థితుల్లో హోదా ఇస్తే జిల్లాలో పదుల సంఖ్యలో పరిశ్రమలు ఏర్పాటవుతాయి. లక్షలాదిమందికి ఉద్యోగాలతో పాటు ఉపాధి కూడా దొరుకుతుంది. పనికోసం కేరళ, కర్ణాటకకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. కానీ ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఒక్క పరిశ్రమ కూడా జిల్లాకు రాదు. ప్యాకేజీ రూపంలో కొన్ని సంస్థలు, నిధులను రాష్ట్రానికి కేంద్రం కేటాయిస్తుంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా వినియోగిస్తుంది. అస్మదీయులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తుంది. కాబట్టి వ్యవసాయం కష్టంగా ఉన్న ‘అనంత’ లాంటి జిల్లాలకు ప్రత్యేక హోదానే అపర సంజీవని. ‘అనంత’కు ప్యాకేజీ చట్టంలో ఉన్న హక్కు వెనుకబడిన ప్రాంతాలకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేకప్యాకేజీని ఇవ్వాలని విభజన చట్టంలో ఉంది. ఈ తరహా ప్యాకేజీకి రూ.3,200 కోట్లు ఇవ్వాలి. రాయలసీమకు ఇప్పటికే ప్యాకేజీ ప్రకటించారు. కాబట్టి కేంద్రం ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీ వల్ల అదనపు ప్రయోజనం చేకూరదు. ప్రత్యేకSహోదాతో పాటు చట్టంలో ఉన్నట్లు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇచ్చేలా కేంద్రంపై రాష్ట్రం ఒత్తిడి తెస్తేనే ప్రయోజనం ఉంటుంది. కానీ కేంద్రం మాత్రం జిల్లాకు ఏడాదికి రూ.50కోట్ల చొప్పున రెండేళ్లలో రూ. వంద కోట్లు విడుదల చేసింది. ఈ నిధుల్లోనూ జిల్లా యంత్రాంగం కేవలం రూ.18లక్షలు ఖర్చు చేసింది. ఈ ఏడాదికి సంబంధించి మరో రూ.50కోట్లు ప్రకటించింది. ఇలా చిల్లర రూపంలో కాకుండా ఒకేసారి బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ నిధులను విడుదల చేసేలా కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన అవసరముంది. ‘అనంత’కు హక్కుగా ప్యాకేజీ ఎలాగూ వస్తుంది కాబట్టి ప్రత్యేకహోదా తప్పనిసరిగా ఇచ్చి తీరాలని వైఎస్సార్సీపీ పట్టుబడుతోంది. దీని సాధన కోసం ఉద్యమిస్తోంది. ఇందులో భాగంగా విపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు ఆందోళనలు చేశారు. ఇప్పుడు మరోసారి క్షేత్రస్థాయి ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. బంద్ భగ్నానికి కుట్ర! వైఎస్సార్సీపీ తలపెట్టిన బంద్‌ను భగ్నం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా 30 పోలీస్‌యాక్ట్‌ను అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం జనం ఒకే చోట గుమిగూడరాదని, ముందస్తు అనుమతి లేనిదే ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు, ఊరేగింపులు చేపట్టరాదని జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
టీడీపీ కుట్రలు ఫలించలేదు
ప్రొద్దుటూరు: టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా, మంగళవారం నిర్వహించిన రాష్ట్ర బంద్‌ను అడ్డుకోలేకపోయిందని, ప్రజల స్వచ్ఛంద సహకారంతో బంద్ విజయవంతమైందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.ఓబులేసు తెలిపారు. బుధవారం ప్రొద్దుటూరుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. బంద్ విజయవంతమవడాన్ని టీడీపీ మంత్రులు జీర్ణించుకోలేకపోతున్నారని, అందులో భాగంగానే పల్లె రఘునాథరెడ్డి, యనమల రామకృష్ణ చౌకబారు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి పోరాడుతున్నా, చంద్రబాబు సహకరించకపోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికీ చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అవలంబిస్తుండడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవీపీ బిల్లుతో టీడీపీ, బీజేపీల కుటిల రాజకీయాలు ప్రజలకు అర్థమయ్యాయని ఆయన తెలిపారు. తమ్ముళ్లకే పుష్కరాల పనులు కృష్ణానది పుష్కరాల సందర్భంగా చంద్రబాబు రూ.3 వేల కోట్ల నామినేషన్ పనులను తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టారని ఓబులేసు విమర్శించారు. శ్రీశైలం నీటిలో ప్రభుత్వం రాయలసీమకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.రామయ్య, పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు, జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు ఎంవి.సుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో నేడు రాష్ట్ర బంద్
-
ప్రజాప్రయోజనాల కోసమే ‘బంద్’
-
ప్రజాప్రయోజనాల కోసమే ‘బంద్’
టీడీపీ, బీజేపీ రెండూ రాష్ట్ర ప్రజలను మోసం చేశాయి. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి రేపు బంద్‌కు పిలుపునిచ్చిన వైఎస్సార్ సీపీ నెల్లూరు(సెంట్రల్) : రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు మంగళవారం బంద్ చేపడుతున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాకాణి మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, ఆ పార్టీతో అంటకాగుతున్న సీఎం చంద్రబాబు వైఖరికి నిరసనగా మంగళవారం రాష్ట్ర బంద్‌ను చేపడుతున్నామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీతో లాలూచీ పడి ప్రత్యేక హోదాపై నిలదీయడం లేదని విమర్శించారు. హోదా అనేది సంజీవిని కాదు అంటూ బాబు బహిరంగంగానే వ్యాఖ్యానించడం ఇందుకు నిదర్శనమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజల అవసరాల దృష్ట్యా ప్రత్యేక హోదా కోసం ఎన్నో పోరాటాలు చేశారని, చంద్రబాబు ఎందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడం లేదని ప్రశ్నించారు. లోక్‌సభ, రాజ్యసభలలో టీడీపీ ఎంపీల చేత ఆయన డ్రామాలు ఆడిస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యసభలో చర్చ జరుగుతున్నప్పుడు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్, ప్రస్తుత పీఎం నరేంద్రమోది సైతం సభలో లేకపోవడం చూస్తుంటే మన రాష్ట్రంపై వారికి ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నరేంద్ర మోది, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులు తప్పారని విమర్శించారు. హోదా విషయం వచ్చే సరికి అనేక సాకులు చెపుతుండటం అన్యాయమన్నారు. మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇప్పుడెంత అవసరమో అందరికీ తెలుసునన్నారు. హోదా సాధించేందుకు కేంద్రంపై ఒత్తిడి తేవడానికే బంద్‌ను చేపడుతున్నట్లు కాకాణి వివరించారు. కమ్యూనిస్టు నాయకులతో చర్చ ప్రత్యేక హోదా విషయంలో మంగళవారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బంద్ చేపడుతున్న నేపధ్యంలో ఆదివారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గూడూరు సమన్వయ కర్త మేరిగ మురళి, సీఈజీ సభ్యులు ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, ఫ్లోర్ లీడర్ పి.రూప్‌కుమార్ యాదవ్, శ్రావణ్‌లతో కలసి సీపీఎం కార్యాలయానికి వెళ్లారు. సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు చండ్ర రాజగోపాల్, పార్థసారథి, జక్కా వెంకయ్య, పముజుల దశరథరామయ్య, మాదాల వెంకటేశ్వర్లు, మూలం రమేష్, మోహన్‌రావులతో బంద్ విషయంపై చర్చించి కలసి రావాలని కోరారు. -
నిర్ణయం తీసుకుంటే రేపు రాష్ట్ర బంద్
హైదరాబాద్: ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ అఖిలపక్షం నిర్ణయం తీసుకుంటే రేపు రాష్ట్ర బంద్ ఉంటుందని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ అన్నారు. అలా నిర్ణయం తీసుకోకుంటే టీడీపీ, బీజేపీ కలిసి గజ్వేల్‌లో ఆందోళన నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు. -
అక్రమ అరెస్ట్‌లను వ్యతిరేకిస్తూ మోకాళ్లపై నిరసన
అనంతపురం క్రైమ్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ ఆ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో ఆదివారం అనంతపురంలో మోకాళ్ల నిరసన కార్యక్రమం జరిగింది. శనివారం రాష్ట్ర బంద్ సందర్భంగా ఏపీ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజీవ్‌రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 60 మంది కార్యకర్తలు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై నించుని నిరసన తెలిపారు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరని, ప్రత్యేక హోదా సాధించేవరకూ ప్రజాగర్జన ఆగదన్నారు. -
‘ప్రత్యేక’ బంద్ విజయవంతం
వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, వామపక్షాల మద్దతు సాక్షి, విజయవాడ బ్యూరో/హైదరాబాద్: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నిర్వహించిన రాష్ట్ర బంద్ విజయవంతమైంది. సీపీఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ బంద్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, వామపక్షాలు మద్దతు పలికాయి. బంద్ నేపథ్యంలో మంగళవారం సెలవు ఇస్తున్నట్లు విద్యా సంస్థలు ముందుగానే ప్రకటించాయి. పెట్రోల్ బంకులు, లారీ ఓనర్స్ అసోసియేషన్, వ్యాపార సంస్థల యజమానులు, ప్రజలు సంఘీభావం ప్రకటించి స్వచ్ఛందంగా బంద్ పాటించారు. పలు ప్రాంతాల్లో మానవ హారాలు నిర్వహించారు. న్యాయవాదులు నిరసన ప్రదర్శనలు, దీక్షలు చేశారు. అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు డిపోలు, బస్టాండ్ల నుంచి కదల్లేదు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ నినాదాలతో హోరెత్తించారు. బంద్‌ను విచ్ఛిన్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 861 మందిని అరెస్టు చేశారు. ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేసిన మునికోటి అంత్యక్రియల రోజైన సోమవారం తిరుపతిలో బంద్ పాటించడంతో మంగళవారం అక్కడ బంద్‌కు మినహాయింపు ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో బంద్ యథావిధిగా జరిగింది. విజయవాడలో నిర్వహించిన బంద్‌లో పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొన్నారు. -
బంద్ సంపూర్ణం
అనంతపురం అర్బన్ : ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపు మేరకు మంగళవారం చేపట్టిన రాష్ట్ర బంద్ జిల్లాలో సంపూర్ణంగా జరిగింది. చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, సీపీఐఎంల్(న్యూడెమోక్రసీ) బంద్‌లో కలిసి వచ్చాయి. న్యాయవాదుల సంఘం, జర్నలిస్టుల సంఘం, ఎస్సీ, ఎస్టీ సేన, విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏఐవైఎఫ్, అఖిల భారత యువజన సమాఖ్య, ఏపీ రైతు సంఘాలు మద్దతుగా ర్యాలీలు నిర్వహించాయి. బంద్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కలేదు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబుళు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక హోదా ద్రోహులంటూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్క్‌లు వేసుకుని సీపీఎం కార్యకర్తలు నిరసన తెలిపారు. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి రమణ ఆధ్వర్యంలో కార్యకర్తలు సప్తగిరి సర్కిల్లో అర్ధనగ్నంగా పడుకుని నిరసన తెలియజేశారు. పీసీసీ ఉపాధ్యక్షుడు సాకే శైలజానాథ్, నగర కమిటీ అధ్యక్షుడు దాదాగాంధీ, పీసీసీ నాయకుడు నాగరాజు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు టవర్ క్లాక్ సమీపంలోని ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ ) జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జయరామప్ప, నాయకులు బంద్‌కి మద్దతు ఇచ్చి విధులు బహిష్కరించారు. అనంతపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మనోహర్‌నాయుడు, ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఇస్తాక్ అహ్మద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఏపీడబ్ల్యూజేయు జిల్లా అధ్యక్షుడు మచ్చా రామలింగారెడ్డి ఆధ్వర్యంలో విలేకరులు ర్యాలీ నిర్వహించారు. ఐఎంఎం అధ్యక్షుడు మహబూబ్‌బాషా ఆధ్వర్యంలో కార్యకర్తలు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. బంద్‌కి మద్దతుగా వైఎస్సార్సీపీ నాయకులు కొర్రపాడు హుసేన్ పీరా, రాజారెడ్డి, పెన్నోబుళేసు పాల్గొన్నారు. ఎస్సీ,ఎస్టీ సేన రాష్ట అధ్యక్షులు బీకేఎస్ ఆనంద్ ఆధ్వర్యంలో నగరంలో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. చెదురుమదురు సంఘటనలు చెదురుమదురు సంఘటనలు మినహా జిల్లా అంతటా ప్రశాంతంగా జరిగింది. తిలక్ రోడ్డులో దివాకర్ ట్రావెల్స్‌కి చెందిన బస్సు అద్దాన్ని ఆందోళనకారులు పగలగొట్టారు. టవర్ క్లాక్, సప్తగిరి సర్కిల్, పాతూరు, ప్రాంతాల్లో ఆటోలను నిలువరించారు. కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మూత బంద్ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంక్‌లు మూతపడ్డాయి. ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ జగదీష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు తపోవనం వద్ద హైవే దిగ్బంధం నిర్వహించారు. అక్కడే వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. పీసీసీ ఉపాధ్యక్షుడు శైలజానాథ్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు కార్యాలయాలను మూయించారు. జిల్లా పరిషత్ కార్యాలయంలోకి చొచ్చుకుపోయిన కార్యకర్తలు చైర్మన్ చమన్‌ను చాంబర్ నుంచి బయటికి పంపించివేశారు. అనంతరం సప్తగిరి సర్కిల్ వద్దకు చేరుకుని అర్ధనగ్నంగా రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. వివధ ప్రాంతాల్లో... ఉరవకొండలో కవితా హోటల్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు. బస్సులు నిలిపివేశారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. రెండు రోజుల పాటు కోర్టు విధులను బహిష్కరిస్తున్నట్లు బార్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. ధర్మవరం నియోజకవర్గం కేంద్రంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. నేసేపేట, గాంధీనగర్ ప్రాంతాల్లో నిరసనలు తెలియజేశారు. గుంతకల్లు పట్టణంలో అఖిలపక్ష పార్టీ ఆధ్వర్యంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. శ్రీరాములు సర్కిల్ నుంచి గాంధీ చౌక్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. హిందూపురంలో అఖిలపక్ష నాయకులు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సర్కిల్ వద్ద రాస్తారోకో చేశారు. కదిరిలో బంద్ సందర్భంగా అంద్కేర్ సర్కిల్లో అఖిలపక్ష పార్టీ నాయకులు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు దిష్టి బొమ్మని దహనం చేశారు. కళ్యాణదుర్గంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. మడకశిర, పెనుకొండ, రాయదుర్గం, శింగనమల నియోజకవర్గ కేంద్రాల్లోనూ బంద్ ప్రశాంతంగా జరిగింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఎండగట్టిన నేతలు ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని పార్టీల నేతల ఎండగట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధించుకునే వరకు పోరాటం సాగించాలని పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మాటమార్చిందన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోదీ ముందుకు మోకరిల్లిందన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఓబులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని దుమ్మెత్తి పోశారు. -
ప్రత్యేక హోదా కోసం నేడు ఏపీ బంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్త బంద్ జరుగుతోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆనాడు రాజ్యసభలో మన్మోహన్సింగ్, వెంకయ్యనాయుడు, అరుణ్‌జెట్లీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో పలు ప్రజా సంఘాలు, సీపీఐ రాష్ట్ర బంద్‌కు పిలుపిచ్చాయి. దీనికి అధికారపక్షం మినహా ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీతోపాటు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛం దంగా సెలవు ప్రకటించాయి. వాణిజ్య, వ్యాపార సంస్థల్ని మూసి వేస్తామని ఆయా వర్గాల సంఘాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఆచితూచి వ్యవహరిస్తోంది. మొదటి రెండు గంటల్లో బంద్ ప్రభావాన్ని అంచనా వేసి బస్సుల్ని తిప్పాలా వద్దా? అనేది నిర్ణయిస్తామని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. బంద్‌కు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ, పది వామపక్ష పార్టీలు, ఆంధ్రా మేథావుల ఫోరం, దళిత, బహుజన, విద్యార్థి, యువజన సంఘాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. బంద్‌ను జయప్రదం చేసి ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేసిన మునికోటికి నివాళులర్పించాలని కాంగ్రెస్ కోరగా, ప్రత్యేక హోదా సాధనలో ఇది తొలిమెట్టు మాత్రమేనని సీపీఐ, సీపీఎం ప్రకటించాయి. జగన్ మద్దతు తెలిపారు : రామకృష్ణ ప్రత్యేక హోదా సాధనకై దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేసిన ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి రాష్ట్ర బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. ధర్నాలో ఉన్నప్పుడే జగన్ తనకు ఫోన్ చేసి ప్రజల ఆకాంక్ష మేరకు జరిగే ఏ ఉద్యమానికై నా తమ మద్దతు ఉంటుందని చెప్పారన్నారు. రేషన్ డీలర్ల సంఘం మద్దతు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మంగళవారం చేపట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతుగా నేడు రేషన్ షాపులు మూసివేస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బుగతా వెంకటేశ్వరరావు, దివి లీలామాధవరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
హోదా ఇచ్చి తీరాల్సిందే..
-
ప్రత్యేక హోదాకై నేడు రాష్ట్ర బంద్
-
నేడు రాష్ట్ర బంద్
కావేరీ నదీ జలాల ప్రవాహాన్ని అడ్డుకుంటూ, కర్ణాటక ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణాన్ని నిరసిస్తూ అఖిలపక్షం పిలుపుమేరకు శనివారం రాష్ట్రవ్యాప్త బంద్ జరగనుంది. కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, బీజేపీ మినహా అన్ని పార్టీలు బంద్‌కు మద్దతు ప్రకటించాయి. చెన్నై, సాక్షి ప్రతినిధి: కావేరీ నది పరివాహక ప్రాంతమైన మేఘదాతుపై రెండు ఆనకట్టల నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇందుకోసం 2015-16 వార్షిక బడ్జెట్లో తొలివిడతగా *26 కోట్లు కేటాయించింది. ఈ రెండు ఆనకట్టల నిర్మాణం జరిగితే తమిళనాడులోని వ్యవసాయభూములు బీడుబారిపోతాయని రైతాంగం ఆందోళన చెందుతోంది. కర్ణాటక వైఖరిని నిరసిస్తూ అఖిలపక్ష రైతు కమిటీ ఈనెల 28వ తేదీన రాష్ట్రబంద్‌కు పిలుపునిచ్చింది. బంద్ నిర్వాహకులు అధికార, ప్రతిపక్ష పార్టీలను మద్దతు కోరినా, అన్నాడీఎంకే, బీజేపీ మినహా అన్ని పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. రాష్ట్రంలోని వాణిజ్య, వ్యాపార సంస్థలను మూసివే సి బంద్‌లో పాల్గొంటారని నిర్వాహకులు చెబుతున్నారు. రైళ్లు, బస్సుల రాకపోకలకు ఎటువంటి అంతరాయం ఉండబోదని ప్రభుత్వ యంత్రాగం భరోసా ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షమంది పోలీసు బలగాలను బందోబస్తులో ఉంచుతున్నామని, బంద్‌ను అడ్డుపెట్టుకుని శాంతి భద్రతల సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీస్ అధికారులు హెచ్చరించారు. అసెంబ్లీ తీర్మానం-డీఎంకే వాకౌట్ ఇదిలా ఉండగా, కావేరీ నదిపై ఆనకట్టల నిర్మాణం శుక్రవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన అంశంగా మారింది. ఆనకట్టల నిర్మాణం సాగకుండా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ శుక్రవారం నాటి అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు నినాదాలు చేసి ఆమోదించారు. అయితే కర్ణాటక తీరును ఎండగడుతూ డీఎంకే కేంద్రానికి ఉత్తరం రాసిన సంగతిని ఎందుకు మరుగుపరిచారని ఆపార్టీ సభ్యులు దురైమురుగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అఖిలపక్ష రైతుల సంఘాలు తలపెట్టిన బంద్‌లో పాల్గొనేలా శనివారం అసెంబ్లీకి సెలవు ప్రకటించాలని దురైమురుగన్ కోరారు. అయితే ఆయన మాటలను పట్టించుకోకుండా తీర్మానంపై వివరణ ఇచ్చేందుకు సీఎం పన్నీర్‌సెల్వం సిద్ధమై ప్రసంగాన్ని ప్రారంభించడంతో స్టాలిన్, దురైమురుగన్ సహా డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ తీర్మానాన్ని తమిళనాడుకు చెందిన పార్లమెంటు సభ్యుల బృందం స్వయంగా ప్రధానికి అందజేస్తారని సీఎం చెప్పారు. కావేరీపై కర్ణాటక ప్రభుత్వం తలపెట్టిన ఆనకట్టల నిర్మాణంపై స్టే విధించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
ఈనెల 17, 18 తేదీల్లో బంద్‌కు పిలుపునిచ్చిన ఏపీఎన్జీవోలు
-
సమైక్య పోరు.. రేపు రాష్ట్ర బంద్
-
విభజనపై జనం ఆగ్రహంతో ఉన్నారు