చిందుకూరు వాసులతో మాట్లాడుతున్న గౌరు దంపతులు
గడివేముల: ప్రత్యేక హోదా కోసం ఈనెల 24న వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రబంద్‌ను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పిలుపునిచ్చారు. చిందుకూరు గ్రామంలో ఇటీవల ఎనిమిది మందికి జీవిత ఖైదు పడగా..శనివారం సాయంత్రం గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం విలేకరుల సమావేశంలో గౌరు దంపతులు మాట్లాడారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తోందన్నారు. హోదా కోసమే తమ పార్టీల ఎంపీలు ఐదుగురు రాజీనామా కూడా చేశారని గుర్తు చేశారు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసిన టీడీపీ ఎన్నికల సమయం దగ్గర పడడంతో డ్రామా ఆడుతోందన్నారు.
దొంగ దీక్షలు చేస్తున్న టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. ఐఏబీ సమావేశం నిర్వహించి త్వరగా కేసీకి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కందులు కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్.. రైతులకు రూ. 62కోట్లు అందాల్సి ఉందన్నారు. అయినా ప్రభుత్వానికి బీమకుట్టినట్లు కూడాలేదన్నారు. నాగులదిన్నె ఎత్తిపోతల పథకం కాకుండా గుండ్రేవుల పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు అనసూయమ్మ, వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ సత్యనారాయణరెడ్డి, పార్టీ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సత్యంరెడ్డి, దామోదర్‌రెడ్డి, రంగస్వామినాయక్, సుదర్శన్‌రెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment