gouru charitha reddy
-
మృతుల కుటుంబాలకు వైఎస్సార్సీపీ చేయూత
కల్లూరు(రూరల్): ఓర్వకల్లు సమీపంలో ఈ నెల ఏడున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్న రాముడు, బెస్త రాముడుతో పాటు పంచలింగాలకు చెందిన డ్రైవర్ రాఘవేంద్ర కుటుంబాలకు వైఎస్సార్సీపీ అండగా నిలిచింది. వీరు కోడుమూరు నేత కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీలో చేరేందుకు వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురై మృతిచెందిన విషయం విదితమే. వీరి కుటుంబాలను ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ పార్టీ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి శనివారం ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల ప్రకారం మొత్తం రూ.9 లక్షల నగదు అందించారు. ముందుగా ఆయన పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కోడుమూరు నియోజకవర్గ నేత కోట్ల హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి నగరంలోని 33వ వార్డు శివరామకృష్ణనగర్లో నివాసం ఉంటున్న చిన్నరాముడు, బెస్త రాముడు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కన్నీటి పర్యంతమైన వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. చిన్నరాముడు భార్య భార్గవికి రూ.3 లక్షలు, బెస్త రాముడు అక్క కాంతమ్మకు రూ.3 లక్షలు, డ్రైవర్ రాఘవేంద్ర కుమార్తెలు ఆదిలక్ష్మీ, నాగమణి, కుమారుడు ఛత్రపతికి రూ.3 లక్షలు, గాయపడిన పరుశురాముడుకు రూ.20 వేలు, లక్ష్మన్నకు రూ.20 వేల నగదు అందజేశారు. అనంతరం నిర్మాణంలో ఉన్న చిన్నరాముడు ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మృతుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం రాగానే చిన్నరాముడు ఇంటిని కూడా పూర్తి చేయిస్తామన్నారు. పిల్లల చదువుకు చేయూతనిస్తామన్నారు. బీవై రామయ్య మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ఎవరూ అధైర్యపడొద్దని, ఏ కష్టం వచ్చినా వెన్నంటే ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కల్లూరు మండల కన్వీనర్ రెడ్డిగారి చంద్రకళాధర్‌రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఆదిమోహన్‌రెడ్డి, అక్కిమి హనుమంతరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు రఘు, పర్ల శ్రీధర్‌రెడ్డి, కర్నూలు పార్లమెంటరీ జిల్లా కార్యదర్శులు కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, జిల్లా కార్యదర్శి తోఫిక్, రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి ఫిరోజ్, 33, 36 వార్డు ఇన్‌చార్జ్‌లు షరీఫ్, నాగరాజు, పార్టీ నాయకులు పాణ్యం మహేశ్వర్‌రెడ్డి, కాటసాని శివనరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కళ్లు మూసుకుని కూర్చున్నారా?
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాకు రావాల్సిన నీటి వాటా ఇతర జిల్లాలకు తరలించుకుపోతుంటే టీడీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు కళ్లు మూసుకుని కూర్చు న్నారా అంటూ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధ్వజమెత్తారు. కేసీ నీటి వాటాను అనంతపురానికి తరలించరాదని, హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి జీడీపీకి రెండు టీఎంసీల నీటిని నింపాలనే డిమాండ్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు రైతులు భారీ స్థాయిలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాకు సాగునీటి వాటా రాకుండా అన్యా యం జరుగుతున్నా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి అఖిలప్రియ మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. ఇరిగేషన్ మం త్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇన్చార్జి మంత్రి కాలువ శ్రీనివాసరావు కర్నూలు జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా నీటి వాటాలోని ఐదు టీఎంసీల్లో రెండు టీఎంసీలను అనంతపురానికి తరలించుకుపోవడానికి ఒప్పుకోబోమని, అదే జరిగితే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. హంద్రీనీవా నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు రెండు టీఎంసీల నీటిని నింపితే కర్నూలు, డోన్, పత్తికొడ, కోడు మూరు పట్టణాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా నివారించవచ్చన్నారు. అనంతరం డీఆర్వో వెంకటేశంకు వినతిపత్రం సమర్పించారు. నాయకులు కృష్ణారెడ్డి, ఫిరోజ్, కంది సులోచన, సంజీవరరెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రమణారెడ్డి, నాగేశ్వరరెడ్డి, దొడ్డిపాడు బాషా, ఉమభాయ్, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు. -
24న రాష్ట్ర బంద్ జయప్రదం చేయండి
గడివేముల: ప్రత్యేక హోదా కోసం ఈనెల 24న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్రబంద్‌ను జయప్రదం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి పిలుపునిచ్చారు. చిందుకూరు గ్రామంలో ఇటీవల ఎనిమిది మందికి జీవిత ఖైదు పడగా..శనివారం సాయంత్రం గ్రామానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అనంతరం విలేకరుల సమావేశంలో గౌరు దంపతులు మాట్లాడారు. రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తోందన్నారు. హోదా కోసమే తమ పార్టీల ఎంపీలు ఐదుగురు రాజీనామా కూడా చేశారని గుర్తు చేశారు. నాలుగేళ్లు బీజేపీతో కాపురం చేసిన టీడీపీ ఎన్నికల సమయం దగ్గర పడడంతో డ్రామా ఆడుతోందన్నారు. దొంగ దీక్షలు చేస్తున్న టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధిచెబుతారన్నారు. ఐఏబీ సమావేశం నిర్వహించి త్వరగా కేసీకి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కందులు కొనుగోలు చేసిన మార్క్‌ఫెడ్.. రైతులకు రూ. 62కోట్లు అందాల్సి ఉందన్నారు. అయినా ప్రభుత్వానికి బీమకుట్టినట్లు కూడాలేదన్నారు. నాగులదిన్నె ఎత్తిపోతల పథకం కాకుండా గుండ్రేవుల పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు అనసూయమ్మ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సత్యనారాయణరెడ్డి, పార్టీ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, సత్యంరెడ్డి, దామోదర్‌రెడ్డి, రంగస్వామినాయక్, సుదర్శన్‌రెడ్డి, శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్‌సీపీతోనే రైతన్న రాజ్యం
ఓర్వకల్లు: రాష్ట్రంలో వైఎస్సార్సీసీ అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శ్రీరామనవమి, తిరునాల సందర్భంగా నన్నూరులో జాతీయ స్థాయి ఎద్దుల బండలాగు పోటీలు నిర్వహించారు. పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే పూడిచేర్లలో ఏర్పాటు చేసిన బండలాగు పోటీలను గ్రామ ప్రతినిధి ప్రకాశం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..వర్షాలు సకాలంలో కురిసినప్పుడే రైతులు పాడి పంటలతో ఆనందంగా జీవిస్తారని చెప్పారు. అలాగే పోటీలను తిలకించేందుకు వచ్చిన రైతల కోసం మంచి నీటి వసతి కల్పించిన గ్రామ మైనార్టీ నాయకులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా నాయకుడు విశ్వేశ్వరరెడ్డి, బోరెల్లి సుబ్బారెడ్డి, కె. చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ఆవుల శ్రీనివాసు లు, జిల్లా మైనార్టీ నాయకులు దొడ్డిపాడు మ హబూబ్‌బాషా, స్థానిక నాయకులు షంషుద్దీన్, షరీఫ్, ఉశేన్ సర్కార్ పాల్గొన్నారు. నన్నూరు బండలాగుడు పోటీల్లోవిజేత కానాల నన్నూరులో జరిగిన బండలాగుడు పోటీల్లో 10 జతల ఎడ్లు పాల్గొనగా సంజామల మండలం కానాలకు చెందిన గుండం చెన్నారెడ్డి ఎడ్లు ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలువగా ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ వారు మొదటి బహుమతి రూ.40,016 , రెండో జత ఎడ్లకు బోరెల్లి సుబ్బారెడ్డి, బోయ రాముడు కుమారుడు బస్తిపాడు బోయ గోకారి రూ.30,016 బహుమతి అందజేశారు. మూడోస్థానంలో వనపర్తి జిల్లా, గుమ్మడం గ్రామానికి చెందిన పరశురామ నాయుడు వృషభాలు మూడోస్థానంలో నిలువగా ఎల్ఐసీ మద్దయ్య రూ.20,016, గద్వాల జిల్లా, ఉండవల్లి మండలం, కంచిపాడు గ్రామస్తుడు సుధాకర్‌కు చెందిన ఎడ్లు నాలుగో స్థానం సాధించగా హోటల్ రంగస్వామి రూ.10,016, ఐదో స్థానంలో నిలిచిన వెల్దుర్తి మండలం శ్రీరంగాపురం మేకల సుదర్శన్ వృషభాలకు జి.రంగస్వామి రూ.5016 బహూకరించారు. -
ముఖ్యమంత్రి మాట తప్పారు: గౌరు
కర్నూలు జిల్లా : కేసీ కెనాల్ రైతులకు 365 రోజులు నీళ్లు ఇస్తామన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాట తప్పారని పాణ్యం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి విమర్శించారు. జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో గౌరు చరిత విలేకరులతో మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వం, ఇరిగేషన్ అధికారుల వైఖరి వల్ల కర్నూల్ జిల్లా రైతాంగం తీవ్రంగా నష్టపోతోందన్నారు. శ్రీశైలంలో 858 అడుగుల నీటి నిల్వ ఉన్నప్పటికీ జిల్లా రైతులకు చుక్క నీరు అందడం లేదని మండిపడ్డారు. ముచ్చుమర్రి నుంచి కేసి కేనాల్‌కు నీటిని నిలిపేయడం దారుణమని వ్యాఖ్యానించారు. తుంగభద్ర నుంచి నీటి వాటా సాధించడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారని విమర్శించారు. శ్రీశైలం నిల్వ జలాల పంపిణీలో కర్నూల్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, కేసీ కెనాల్ కింద వేల ఎకరాల్లో పంట పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. -
'150 ఓట్లు రాలేదు.. నాపై విమర్శలా'
సాక్షి, కర్నూలు: ఉనికి కోసం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తనపై ఆరోపణలు చేయడం హ్యాస్యాస్పదమని వైఎస్సార్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పాణ్యం నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. బైరెడ్డి చరిత్ర ప్రజలందరికీ తెలుసని.. ఆప్తులు అంటూనే, వారిపై కొడుకుతో దాడి చేయించిన ఘనత బైరెడ్డిదన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన బైరెడ్డి తిరిగి ఆయన పంచనే చేరారని తెలిపారు. ఎన్నికల ముందు హత్యలు, దాడులతో ప్రజలను భయపెట్టడం బైరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఆరోపించారు. చేతనైతే రానున్న ఎన్నికల్లో తనపై పోటీ చేయాలని ఆమె సవాల్ విసిరారు. 150 ఓట్లు కూడా రాని బైరెడ్డి తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. -
ప్రజల కోసమే ప్రజా సంకల్పయాత్ర
సాక్షి, వీరపునాయునిపల్లె : ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునేందుకే ఏపీ ప్రతిపక్షనేతగా జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర చేపట్టాడని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. గతంలో మహానేత రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకొని ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అదే రీతిలో జగన్మోహనరెడ్డి కూడా ప్రజా సంకల్పయాత్ర చేపడుతున్నాడని, ఆయనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో కర్నూలు జిల్లా నాయకుడు గౌరు వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ కేంద్ర కమిటీ సభ్యులు రాజగోపాల్‌రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు అబద్ధాల కోరు
కర్నూలు, నందికొట్కూరు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అబద్ధాల కోరు అని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం మండల పరిధిలోని కొణిదేల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. మూడున్నరేళ్లలో మూడు సార్లు అంబూజా, జైన్, మెగా సీడ్ పార్క్ ప్రారంభోత్సవాలు ఆర్భాటంగా చేసిన సీఎం బాబు నేటికీ ఒక ప్రాజెక్టు నిర్మాణ పనులు కూడా మొదలు పెట్టలేదన్నారు. జిల్లాపై కపట ప్రేమ చూపించడం తప్ప ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఎకరా రూ.10లక్షలు పలికే తంగెడంచ ఫారం భూములను అంబూజ, జైన్, మెగా సీడ్ పార్కుకు రూ.4.50 లక్షలకే కట్టబెట్టడం ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. ప్రారంభోత్సవాల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయడం సీఎంకు అలవాటేనన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. రాజన్న రాజ్యం వస్తే అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారన్నారు. ప్రజా సంక్షేమం కోసం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నవంబర్ 2నుంచి చేపట్టే పాదయాత్రను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ గ్రామ నాయకులు భాస్కరరెడ్డి, తదితరులు ఉన్నారు. -
చంద్రబాబు ఏకపాత్రాభినయం వల్లే ...
కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బి.రాజశేఖరరెడ్డి, ఎస్వీ.మోహన్‌రెడ్డి, గౌరు. చరితారెడ్డి బుధవారం కర్నూలులో నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలున్నప్పటికీ అధికార పార్టీ మాత్రం తమ పార్టీనే టార్గెట్ చేస్తుందని వారు ఆరోపించారు. రాష్ట్రాభివృద్ధిపై టీడీపీ నేతలు దృష్టి పెట్టకుండా తమ నేతలపై అక్రమకేసులు పెట్టే పనిలో ఉన్నారని విమర్శించారు. అలాగే టీడీపీ ప్రభుత్వానికి అధికారులు కొమ్ము కాస్తున్నారని... ఈ నేపథ్యంలో అధికారులను పార్టీలో చేర్చుకుంటే మంచిదని టీడీపీ నేతకు హితవు పలికారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రిలో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృతి చెందడంపై వారు స్పందించారు. పుష్కరాలపై చంద్రబాబు ఏకపాత్రాభినయం వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని ఆరోపించారు. మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మెకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు వారు ప్రకటించారు. -
ఎన్టీఆర్ పార్టీలో ఉండి అలా మాట్లాడతారా?
హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజాపై టీడీపీ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని వైఎస్సార్ సీపీ మహిళా ఎమ్మెల్యేలు ఖండించారు. కళాకారుడు స్వర్గీయ ఎన్టీఆర్ పెట్టిన పార్టీ టీడీపీ అని, అలాంటి పార్టీలో ఉన్న నాయకులు కళాకారులను అవమానించేలా వ్యవహరించడం శోచనీయమని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈరకమైన ప్రవర్తన మానుకోవాలని హితవు పలికారు. ఆత్మస్తుతి, పరనింద తరహాలో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సభ్యసమాజం తలదించుకునేలా అధికార ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని మరో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధ్వజమెత్తారు. ఎన్టీఆర్, బాలకృష్ణ ఇద్దరు కళాకారులే కదా అని గుర్తు చేశారు. షరతులతో రుణమాఫీ చేస్తామని ఎన్నికలకుముందు ఎందుకు చెప్పలేదని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. -
ఆస్తులు పెంచుకునేందుకే విజయవాడలో రాజధాని
కర్నూలు: ఎన్నికల్లో సహాయపడిన వారిని కోటీశ్వరులను చేసేందుకే సీఎం చంద్రబాబు విజయవాడను రాజధానిగా ప్రకటించారని వైఎస్ఆర్సీపీ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, ఐజయ్య, మణిగాంధీలతో కలసి కర్నూలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో రూ.1,000 కోట్ల పెట్టుబడులను సిద్ధం చేసుకోవడంలో భాగంగానే రాజధానిని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారన్నారు. భౌగోళికంగా రాజధాని ఏర్పాటుకు విజయవాడ అనువైన ప్రాంతంకాదని సర్వేలు వెల్లడించినా సీఎం ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. 45 అంతస్తుల భవనాలు ఆ ప్రాంతంలో నిర్మిస్తే ఎప్పటికైనా ప్రమాదమని, జరగరాని ప్రమాదం చోటు చేసుకుంటే అందుకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. రాజధానిగా కర్నూలుకు అన్ని అర్హతలున్నా కనీసం చర్చకు కూడా అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. విజయవాడను రాజధానిగా ప్రకటించగానే రాయలసీమ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో బల్లలు చరిచి హర్షం వెలిబుచ్చడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగంగా చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేరాలంటే దేశ బడ్జెట్ కూడా సరిపోదన్నారు. ప్రజలను మోసగించేందుకే సీఎం మాయమాటలు చెబుతున్నారని మండిపడ్డారు. ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీసే రోజు ఎంతో దూరంలో లేదని మోహన్‌రెడ్డి హెచ్చరించారు.