
వైఎస్సార్‌సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత
సాక్షి, కర్నూలు: ఉనికి కోసం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తనపై ఆరోపణలు చేయడం హ్యాస్యాస్పదమని వైఎస్సార్‌సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పాణ్యం నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. బైరెడ్డి చరిత్ర ప్రజలందరికీ తెలుసని.. ఆప్తులు అంటూనే, వారిపై కొడుకుతో దాడి చేయించిన ఘనత బైరెడ్డిదన్నారు.
నాలుగేళ్లుగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన బైరెడ్డి తిరిగి ఆయన పంచనే చేరారని తెలిపారు. ఎన్నికల ముందు హత్యలు, దాడులతో ప్రజలను భయపెట్టడం బైరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఆరోపించారు. చేతనైతే రానున్న ఎన్నికల్లో తనపై పోటీ చేయాలని ఆమె సవాల్ విసిరారు. 150 ఓట్లు కూడా రాని బైరెడ్డి తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.