పోటీలను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి
ఓర్వకల్లు: రాష్ట్రంలో వైఎస్సార్‌సీసీ అధికారంలోకి వస్తే రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శ్రీరామనవమి, తిరునాల సందర్భంగా నన్నూరులో జాతీయ స్థాయి ఎద్దుల బండలాగు పోటీలు నిర్వహించారు. పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే పూడిచేర్లలో ఏర్పాటు చేసిన బండలాగు పోటీలను గ్రామ ప్రతినిధి ప్రకాశం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..వర్షాలు సకాలంలో కురిసినప్పుడే రైతులు పాడి పంటలతో ఆనందంగా జీవిస్తారని చెప్పారు. అలాగే పోటీలను తిలకించేందుకు వచ్చిన రైతల కోసం మంచి నీటి వసతి కల్పించిన గ్రామ మైనార్టీ నాయకులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకుడు విశ్వేశ్వరరెడ్డి, బోరెల్లి సుబ్బారెడ్డి, కె. చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ఆవుల శ్రీనివాసు లు, జిల్లా మైనార్టీ నాయకులు దొడ్డిపాడు మ హబూబ్‌బాషా, స్థానిక నాయకులు షంషుద్దీన్, షరీఫ్, ఉశేన్ సర్కార్ పాల్గొన్నారు.
నన్నూరు బండలాగుడు పోటీల్లోవిజేత కానాల
నన్నూరులో జరిగిన బండలాగుడు పోటీల్లో 10 జతల ఎడ్లు పాల్గొనగా సంజామల మండలం కానాలకు చెందిన గుండం చెన్నారెడ్డి ఎడ్లు ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలువగా ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ వారు మొదటి బహుమతి రూ.40,016 , రెండో జత ఎడ్లకు బోరెల్లి సుబ్బారెడ్డి, బోయ రాముడు కుమారుడు బస్తిపాడు బోయ గోకారి రూ.30,016 బహుమతి అందజేశారు. మూడోస్థానంలో వనపర్తి జిల్లా, గుమ్మడం గ్రామానికి చెందిన పరశురామ నాయుడు వృషభాలు మూడోస్థానంలో నిలువగా ఎల్‌ఐసీ మద్దయ్య రూ.20,016, గద్వాల జిల్లా, ఉండవల్లి మండలం, కంచిపాడు గ్రామస్తుడు సుధాకర్‌కు చెందిన ఎడ్లు నాలుగో స్థానం సాధించగా హోటల్ రంగస్వామి రూ.10,016, ఐదో స్థానంలో నిలిచిన వెల్దుర్తి మండలం శ్రీరంగాపురం మేకల సుదర్శన్ వృషభాలకు జి.రంగస్వామి రూ.5016
బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment