AP: BJP Leaders Attack on YSRCP Activists in Kurnool District - Sakshi
Sakshi News home page

బీజేపీ నేతల పెట్రోల్‌ దాడి.. ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మృతి

Published Thu, Jan 27 2022 12:57 PM | Last Updated on Thu, Jan 27 2022 3:30 PM

Kurnool BJP Leaders Attack on YSRCP Activistes in Kurnool District - Sakshi

సాక్షి, కర్నూలు: బీజేపీ నేతలు దారుణానికి తెగబడ్డారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై బీజేపీ నేతలు వేట కొడవళ్లు దాడి చేశారు.  వివరాల ప్రకారం...కామవరం గ్రామంలో గత కొద్ది రోజుల నుంచి శివప్పకు సంబంధించిన భూవివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఇటీవల కోర్టు కూడా భూవివాదం విషయంలో శివప్పకే అనుకూలంగా తీర్పు నిచ్చింది.

ఇది తట్టుకోలేని బీజేపీ నేతలు ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేసి వైఎస్సార్‌సీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ శివప్పుపై తీవ్రమైన ఆరోపణలు చేయడం ప్రారంభించారు. దీంతో ఈ ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలతో మాట్లాడటానికి వెళ్లిన శివప్ప, ఈరన్న పై వేట కొడవళ్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచడంతో పాటు పెట్రోల్‌తో దాడి చేశారు. ఈ దాడిలో శివప్ప, ఈరన్న అనే ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement