ధర్నాలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, చిత్రంలో గౌరు వెంకట రెడ్డి తదితరులు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాకు రావాల్సిన నీటి వాటా ఇతర జిల్లాలకు తరలించుకుపోతుంటే టీడీపీ మంత్రులు, ప్రజాప్రతినిధులు కళ్లు మూసుకుని కూర్చు న్నారా అంటూ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ధ్వజమెత్తారు. కేసీ నీటి వాటాను అనంతపురానికి తరలించరాదని, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ నుంచి జీడీపీకి రెండు టీఎంసీల నీటిని నింపాలనే డిమాండ్లతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌరు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాకు రైతులు భారీ స్థాయిలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాకు సాగునీటి వాటా రాకుండా అన్యా యం జరుగుతున్నా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి అఖిలప్రియ మాట్లాడకపోవడం శోచనీయమన్నారు.
ఇరిగేషన్ మం త్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఇన్‌చార్జి మంత్రి కాలువ శ్రీనివాసరావు కర్నూలు జిల్లాకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా నీటి వాటాలోని ఐదు టీఎంసీల్లో రెండు టీఎంసీలను అనంతపురానికి తరలించుకుపోవడానికి ఒప్పుకోబోమని, అదే జరిగితే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. హంద్రీనీవా నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు రెండు టీఎంసీల నీటిని నింపితే కర్నూలు, డోన్, పత్తికొడ, కోడు మూరు పట్టణాల్లో తాగునీటి ఎద్దడి లేకుండా నివారించవచ్చన్నారు. అనంతరం డీఆర్వో వెంకటేశంకు వినతిపత్రం సమర్పించారు. నాయకులు కృష్ణారెడ్డి, ఫిరోజ్, కంది సులోచన, సంజీవరరెడ్డి, మాజీ గ్రంథాలయ చైర్మన్ రమణారెడ్డి, నాగేశ్వరరెడ్డి, దొడ్డిపాడు బాషా, ఉమభాయ్, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment