PANYAM constituency
-
నేటి సామాజిక సాధికార యాత్ర షెడ్యూల్
నంద్యాల: అప్రతిహతంగా సాగుతున్న వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా 39వ రోజు(గురువారం) నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంవలోని కల్లూరులో జరుగనుంది. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బస్సుయాత్రలో మధ్యాహ్నం 12 గంటలకు కేఎస్సార్ కన్వషన్ హాలులో వైఎస్సార్సీపీ నేతలు సమావేశం నిర్వహించనున్నారు. రెండు గంటలకు అదే ఫంక్షన్ హాలులో మీడియా సమావేశం ఉంటుంది. మూడు గంటలకు కేఎస్సార్ కన్వషన్ హాలు నుంచి చెన్నమ్మ సర్కిల్ వరకూ బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు చెన్నమ్మ సర్కిల్లో బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు డిప్యూటీ సీఎం నారాయణ స్వాయి, ఎంపీలు గోరంట్ల మాధవ్, గురుమూర్తి, సంజీవ్ కుమార్ తదితరులు హాజరుకానున్నారు. -
నాలుగైదు రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేస్తాం
-
ఉత్సాహంగా ‘రావాలి జగన్.. కావాలి జగన్’
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): జిల్లాలో రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, సమన్వయ కర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికీ తిరుగుతూ.. నవరత్నాలతో కలిగే లక్షల రూపాయల లబ్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. అంతేకాకుండా టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకుల అవినీతిని ఎండగడుతుండడంతో ప్రజలు ఈ కార్యక్రమంపై ఆసక్తిని కనబరుస్తున్నారు. శనివారం.. పాణ్యం నియోజకవర్గం కల్లూరు అర్బన్ 28వ వార్డులో శ్రీకృష్ణకాలనీ, విజ్జినగర్లలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ఆధ్వర్యంలో రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమాన్ని చేపట్టారు. నాలుగేళ్ల టీడీపీ పాలనలో తమ వార్డులో కనీసం సీసీరోడ్లు, కాలువలు, తాగునీటి సమస్యను పరిష్కరించలేదని పలువురు స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఇంటింటా నవరత్నాలను ప్రచారం చేస్తూ స్థానిక సమస్యలు తెలుసుకోవడానికి ఎమ్మెల్యే అధిక ప్రాధాన్యం ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి ఫిరోజ్, వార్డు ఇన్చార్జి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ♦ నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలం లక్ష్మాపురంలో ఎమ్మెల్యే ఐజయ్య, సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డి రావాలి జగన్ కావాలి జగన్ కార్యక్రమంలో పాల్గొని నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముందుగా గ్రామంలోని వైఎస్ఆర్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం గ్రామంలో ఇళ్లిళ్లు తిరిగి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. ♦ ఎమ్మిగనూరు పట్టణం 10వ వార్డు పరిదిలోని ముస్లిం, వడ్డేగేరుల్లో నిర్వహించిన రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో పార్టీ నేత ఎర్రకోట జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. స్థానిక సమస్యలు తెలుసుకుంటూ నవరత్నాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో నాయకులు బుట్టా రంగయ్య, ఖాజా, రియాజ్ అహ్మద్, పాల శ్రీనివాసరెడ్డి, సునీల్‌కుమార్, నజీర్అహ్మద్ పాల్గొన్నారు. ♦ బనగానపల్లె మండలం పసుపల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటా తిరిగి నవరత్నాల కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు సిద్ధంరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, కాటసాని తనయుడు ఓబులురెడ్డి, కాటసాని రమాకాంతరెడ్డి, మాజీ సర్పంచ్ జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు. ♦ కర్నూలులో నిర్వహించిన రావాలి జగన్–కావాలి జగన్ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పంద న లభించింది. సమన్వయ కర్త హఫీజ్‌ఖాన్ నేతృత్వంలో అశోకనగర్ పరిసర ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంటింటా తిరిగి నవరత్నా ల కరపత్రాలను పంపిణీ చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కాగానే సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, రాజావిష్ణువర్ధన్‌రెడ్డి, మద్దయ్య, రెహమాన్ పాల్గొన్నారు. -
అన్ని ఓట్లు ఎలా తగ్గాయి?
కర్నూలు(అగ్రికల్చర్): పాణ్యం నియోజకవర్గంలో భారీస్థాయిలో ఓట్లు ఎలా తగ్గాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి ప్రశ్నించారు. ఓటర్లు పెరగాల్సింది పోయి తగ్గడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాణ్యం నియోజకవర్గంలో 2014 ఎన్నికల్లో 2.80 లక్షల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇప్పుడు ఆ సంఖ్య 2.30 లక్షలకు తగ్గిందన్నారు. ఇందుకు కారణాలేమిటని ప్రశ్నించారు. కలెక్టర్ సమాధానమిస్తూ డీ డూప్లికేట్ సాఫ్ట్‌వేర్‌తో రెండు చోట్ల ఓటు కలిగిన వారందరినీ తొలగించామని, డోర్ టు డోర్ సర్వేకు వచ్చినప్పుడు ఇళ్లలో లేనివారిని కూడా తొలగించామని తెలిపారు. దీనివల్ల ఓటర్లు తగ్గారని చెప్పారు. ఓటరు నమోదు పెద్దఎత్తున చేపట్టేందుకు మునిసిపల్, తహసీల్దారు కార్యాలయాల్లో ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ప్రతినిధి తోట వెంకటకృష్ణారెడ్డి సూచించారు. ఓటరు నమోదుపై విస్తృత ప్రచారం చేయాలని, ముఖ్యంగా విద్యాసంస్థల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని కోరారు. కర్నూలు నగరంలోని పలు పోలింగ్ కేంద్రాలకు బీఎల్వోలుగా పొదుపు మహిళలను నియమించడాన్ని సీపీఎం నేతలు రాముడు, షడ్రక్ తప్పుబట్టారు. వీరు అర్హులైన వారిని ఓటర్లుగా నమోదు చేయడం లేదని, అక్రమాలకు తావిస్తున్నారని ఆరోపించారు. వీరిని తొలగించి అంగన్వాడీ కార్యకర్తలను నియమించాలని కోరారు. దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామంలో 20 ఏళ్ల క్రితం ఊరొదిలి వెళ్లిన వారు ఇప్పటికీ అక్కడ ఓటర్లుగా ఉన్నారని, ఇదెలా సాధ్యమని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి పెద్దారెడ్డి ప్రశ్నించారు. ఓటర్ల నమోదుకు అందరూ సహకరించాలి: కలెక్టర్ వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్నందున అర్హులైన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేసేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. గుర్తింపు పొందిన అన్ని పార్టీలు వెంటనే అన్ని పోలింగ్ కేంద్రాలకు బీఎల్ఏలను నియమించుకోవాలని సూచించారు. ఆ వివరాలను అక్టోబరు ఐదులోగా ఇవ్వాలన్నారు. ఓటర్ల జాబితా సవరణ అక్టోబరు 31 వరకు కొనసాగుతుందని, జనవరి నాలుగున తుది జాబితా ప్రకటిస్తామని తెలిపారు. తహసీల్దార్, మండల పరిషత్, మునిసిపల్ కార్యాలయాల్లో ఓటరు నమోదు దరఖాస్తులు వేసేందుకు ప్రత్యేక బాక్స్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి ఒకటి నాటికి 18 ఏళ్లు నిండే యువతీ యువకులు, జాబితాలో లేని ఇతరులను ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు. 18–19 ఏళ్ల యువత జిల్లాలో 1.80 లక్షల మంది ఉండగా.. 30వేల మంది మాత్రమే ఓటర్లుగా ఉన్నారని, యువ ఓటర్ల నమోదుకు రాజకీయ పార్టీలు సంపూర్ణ సహకారం ఇవ్వాలని కోరారు. 19 నుంచి 30 ఏళ్ల మధ్య వారు కూడా చాలామంది ఓటుకు దూరంగా ఉన్నారని, వీరిపైనా దృష్టి సారించాలని అన్నారు. చనిపోయిన వారు, గ్రామాలు వదిలి వెళ్లిన వారు ఓటర్లుగా ఉంటే ఫారం–7 ద్వారా తొలగింపునకు దరఖాస్తు చేయవచ్చని సూచించారు. అర్హత కలిగిన వారందరూ ఓటర్లుగా నమోదయ్యేందుకు స్వీప్ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. విశ్వవిద్యాలయంతో పాటు డిగ్రీ కళాశాలలు, ఇతర వృత్తి విద్యాసంస్థల్లో స్వీప్ యాక్టివిటీ కింద అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ పూర్తి అయ్యిందని, దీనివల్ల పోలింగ్ కేంద్రాల సంఖ్య 3,780కి పెరిగిందని తెలిపారు. ఇంకా ఎక్కడైనా కొత్త పోలింగ్ కేంద్రం అవసరమనుకుంటే తమకు చెప్పవచ్చని, ప్రతిపాదనలు పంపుతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్వీప్ కార్యాక్రమాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్ విడుదల చేశారు. ఓటరు నమోదు ప్రచార వాహనాలను కూడా జెండా ఊపి ప్రారంభించారు. సమావేశంలో డీఆర్వో వెంకటేశం, ఈఆర్వోలు శశీదేవి, సుధాకర్‌రెడ్డి, అనురాధ, సత్యం, జయకుమార్, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
'150 ఓట్లు రాలేదు.. నాపై విమర్శలా'
సాక్షి, కర్నూలు: ఉనికి కోసం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తనపై ఆరోపణలు చేయడం హ్యాస్యాస్పదమని వైఎస్సార్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పాణ్యం నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. బైరెడ్డి చరిత్ర ప్రజలందరికీ తెలుసని.. ఆప్తులు అంటూనే, వారిపై కొడుకుతో దాడి చేయించిన ఘనత బైరెడ్డిదన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన బైరెడ్డి తిరిగి ఆయన పంచనే చేరారని తెలిపారు. ఎన్నికల ముందు హత్యలు, దాడులతో ప్రజలను భయపెట్టడం బైరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఆరోపించారు. చేతనైతే రానున్న ఎన్నికల్లో తనపై పోటీ చేయాలని ఆమె సవాల్ విసిరారు. 150 ఓట్లు కూడా రాని బైరెడ్డి తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. -
నీటి సమస్య పరిష్కరించండి
కర్నూలు(కలెక్టరేట్): పాణ్యం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో తీవ్రమైన నీటి సమస్య ఉందని, వెంటనే చొరవ తీసుకుని పరిష్కరించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కోరారు. శనివారం ఆమె కలెక్టర్‌ను ఆయన చాంబర్లో కలసి నియోజకవర్గ సమస్యలపై చర్చించారు. ఓర్వకల్లు మండలంలోని ఉప్పలపాడు, ఉయ్యాలవాడ, గుమితంతండా, గుడుంబాయితండా, కల్లూరు మండలంలో పుసులూరు, ఉలిందకొండ, పాణ్యం మండలంలో పిన్నాపురం, తొగర్చేడు, నెరవాడ, గడివేముల మండలంలో ఉండట్ల తదితర గ్రామాల్లో నీటి సమస్య ఎక్కువగా ఉందని తెలిపారు. సమస్య పరిష్కారానికి తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు తక్షణం నిధులు విడుదల చేయాలని కోరారు. కర్నూలు నగరపాలక సంస్థలోని వార్డుల్లో ఓటర్ల సంఖ్యలో తేడా ఎక్కువగా ఉందని కలెక్టర్‌కు వివరించారు. కొన్ని వార్డుల్లో అత్యధికంగా ఓటర్లు ఉంటే, మరికొన్ని వార్డుల్లో తక్కువగా ఉన్నారని, అలా కాకుండా అన్ని వార్డుల్లో ఓటర్ల సంఖ్య సమానంగా ఉండేలా చూడాలని కోరారు. అవసరమైతే వార్డులను పునర్విభజన చేయాలని సూచించారు. ఈ మేరకు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యే సూచించిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కలెక్టర్ తెలిపారు.