![YSRCP Bus Yatra 39th day Panyam constituency - Sakshi](/styles/webp/s3/article_images/2024/01/4/KatasaniRamBhupalReddy.jpg.webp?itok=If-adZaG)
నంద్యాల: అప్రతిహతంగా సాగుతున్న వైఎస్సార్‌సీపీ సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా 39వ రోజు(గురువారం) నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంవలోని కల్లూరులో జరుగనుంది. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బస్సుయాత్రలో మధ్యాహ్నం 12 గంటలకు కేఎస్సార్ కన్వషన్ హాలులో వైఎస్సార్‌సీపీ నేతలు సమావేశం నిర్వహించనున్నారు. రెండు గంటలకు అదే ఫంక్షన్ హాలులో మీడియా సమావేశం ఉంటుంది.
మూడు గంటలకు కేఎస్సార్ కన్వషన్ హాలు నుంచి చెన్నమ్మ సర్కిల్ వరకూ బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు చెన్నమ్మ సర్కిల్‌లో బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు డిప్యూటీ సీఎం నారాయణ స్వాయి, ఎంపీలు గోరంట్ల మాధవ్, గురుమూర్తి, సంజీవ్ కుమార్ తదితరులు హాజరుకానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment