Nandyal Assembly Constituency
-
పోలీసుల ఎదుటే రెచ్చిపోయిన టీడీపీ గ్యాంగ్.. వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. టీడీపీ నేతల నాయకులు అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి సుబ్బారాయుడుని హత్య చేశారు. కాగా, పోలీసులు కళ్ల ఎదుటే ఈ దారుణం జరగడం గమనార్హం.వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లాలోని మహానంది మండలం సీతారామపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి కొందరు టీడీపీ నేతలు సుబ్బారాయుడు ఇంటికి వచ్చి ఘర్షణకు దిగారు. అనంతరం, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లే క్రమంలో సుబ్బారాయుడుపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. దీంతో, సుబ్బారాయుడు మృతిచెందాడు.మరోవైపు.. సుబ్బారాయుడిపై దాడిని ఆయన భార్య బాలసుబ్బమ్మ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై కూడా దాడులు చేశారు. దీంతో, ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు వారి ఇంట్లోని వస్తువులను, సామాగ్రిని ధ్వంసం చేశారు. అయితే, ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పనివచేశారనే అక్కస్సుతోనే టీడీపీ నేతలు.. సుబ్బారాయుడిని హత్య చేశారు. నంద్యాల: YSRCP నేత హత్య సుబ్బరాయుడి కేసులో బయటపడ్డ పోలీసుల వైఫల్యం. రాత్రి 12:59 నిమిషాలకు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన YSRCP నేత నారపురెడ్డి ఫోన్1:02 నిమిషాలకు ఎస్పీకి మరోసారి ఫోన్ చేసిన నారపురెడ్డి. పరిస్థితి తీవ్రంగా ఉందంటూ వేడుకోలు.గ్రామంలో తమను హత్య చేయడానికి @JaiTDP… pic.twitter.com/hrGGg9DMYn— YSR Congress Party (@YSRCParty) August 4, 2024 బాధితురాలు బాల సుబ్బమ్మ మాట్లాడుతూ.. శ్రీనివాస్ రెడ్డి అనుచరులు నా భర్తను హత్య చేశారు. మాకు వ్యతిరేకంగా పనిచేస్తారా? అంటూ హత్యకు పాల్పడ్డారు. అడ్డుకున్న నాపై కత్తులతో దాడి చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.అయితే, టీడీపీ నేతలు దాడి చేస్తారని ముందుగానే ఎస్పీకి సమాచారం ఇచ్చారు వైఎస్సార్సీపీ నేత నారపురెడ్డి. కేవలం ఇద్దరు కానిస్టేబుల్స్‌ను మాత్రమే అధికారులు అక్కడికి పంపించారు. కాగా, టీడీపీ నేతలు మొదట నారపురెడ్డి ఇంటిపై దాడి చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ, నారపురెడ్డి ఇంటికి వెళ్లే మార్గంలోనే సుబ్బారాయుడు నివాసం ఉండటంతో వారిపై దాడికి తెగబడ్డారు. ఇక, దాడిపై పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు బలగాలను పంపకపోవడం వల్లే ఈ హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డిపై ఎస్పీకి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హత్య జరిగిన ఘటనా స్థలాన్ని ఆదివారం ఉదయం ఎస్పీ పరిశీలించారు. ఇది చదవండి: రాజకీయ హింసకు ఏపీ మారుపేరుగా మారింది: వైఎస్ జగన్ -
చెప్పింది చేయకపోవడం బాబు నైజం
డోన్: ఇచ్చిన మాట తూ.చ తప్పకుండా పాటించడం సీఎం జగన్ నైజమైతే, చెప్పిందేదీ చేయకపోవడమే చంద్రబాబు నైజమని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఆదివారం సుమారు రూ. 102 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన ప్రభుత్వాసుపత్రి ఆవరణలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. 40 ఏళ్ల రాజకీయ అనుభవమని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పెద్ద అబద్దాల పుట్ట అని విమర్శించారు. సంపద సృష్టించడమంటే తాత్కాలిక, గ్రాఫిక్స్ కట్టడాలు కాదని, ఉన్నచోటనే పారిశ్రామిక, వ్యవసాయ, ఉపాధి రంగాలలో అభివృద్ధి సాధించడమని మంత్రి పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన నవరత్నాల పథకాలు దేశంలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ సాకారం చేశారన్నారు. ఉద్యోగులు, వయోవృద్ధులు, దివ్యాంగులు, ఫ్రీడం ఫైటర్లు, జర్నలిస్టులకు ఆర్టీసీ చార్జీలో రాయితీలు ఇవ్వడం ద్వారా సంస్థ నష్టాల్లో కూరుకుపోయిందని నాడు మనుసులో మాట అనే పుస్తకంలో రాసిన చంద్రబాబు.. నేడు సూపర్ సిక్స్ పథకాలంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారన్నారు. డ్వాక్రా, రైతు రుణమాఫీలంటూ చేతులెత్తేసిన మాయగాడు, నేడు అదే రైతులకు రెట్టింపు మొత్తం ఇస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు మాయమాటలకు ప్రజలు మోసపోరని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని మంత్రి స్పష్టంచేశారు. జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాను న్యాయ రాజధాని చేయడం, లా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వంటి కీలక నిర్ణయాల్లో ఆరి్థక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సీఎంకు చేదోడుగా ఉన్నారన్నారు. సభలో మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజే‹Ù, ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ చిన్నకేశవయ్యగౌడ్ తదితరులు ప్రసంగించారు. -
పోటీ చేద్దామా.. వద్దా?
సాక్షి, నంద్యాల: టికెట్ల విషయంలో టీడీపీ అధిష్టానం నానుస్తుండడంతో నంద్యాలలో ఆ పార్టీ కేడర్ అయోమయంలో పడింది. మాజీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్‌కే టికెట్ అని గతంలో చంద్రబాబు చెప్పినా ప్రస్తుత నాన్చుడు ధోరణితో ఆయన ముందుకు కదలడం లేదు. పైగా ఎన్నికల్లో పోటీ చేయాలా... వద్దా అన్న సందిగ్ధంలో ఉన్నారు. ఓడిపోయే సీటు నుంచి పోటీ చేసేందుకు నిరాసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఇన్చార్జే డైలమాలో ఉండడంతో కార్యకర్తలు తలోదిక్కు చూసుకుంటున్నారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్సార్సీపీకి కంచుకోట. 2017 ఉప ఎన్నికలో తప్ప ప్రతీసారీ వైఎస్సార్ సీపీ హవానే కొనసాగుతోంది. ఇక్కడ నుంచి ఈసారీ గెలవడం అసాధ్యమని ఫరూక్ ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ క్షేత్రస్థాయి కేడర్ నుంచీ ఆశించినంత మద్దతు లేకపోవడంతో పోటీ చేసేందుకు విముఖత చూపిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కోట్లకు కోట్లు ఖర్చు పెట్టుకునేందుకు సిద్ధంగా లేనని ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. ఫరూక్, బ్రహ్మానందరెడ్డి ఎడమొహం పెడమొహం మరోవైపు మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్ ఎడమొహం పెడమొహంగా మెలుగుతున్నారు. టీడీపీ నంద్యాల నియోజకవర్గ ఇన్చార్జిగా గతేడాది నవంబర్ 27న ఫరూక్ చార్జి తీసుకున్న నాటి నుంచి నేటి వరకు వీరిద్దరూ కలిసింది లేదు. ఎవరికి వారు విడివిడిగా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. కలిసి మాట్లాడదామని ఫరూక్ అనేకసార్లు భూమా బ్రహ్మానందరెడ్డిని కోరినా ఫలితం లేకపోయింది. ఫరూక్ ముఖం చూసేందుకు కూడా భూమా ఇష్టపడడం లేదని చెబుతున్నారు. కేడర్ తన ఆధీనంలో ఉందని, టికెట్ తనకేనని ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ రాని పక్షంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవాలని బ్రహ్మం ఆలోచనగా ఉందని అంటున్నారు. ఈ మేరకు కొంతమంది నాయకుల ఇళ్లకు వెళ్లి మరీ మద్దతు కోరుతున్నారు. కేడర్‌లో గందరగోళం ఇద్దరు నాయకుల మధ్య సమన్వయం కొరవడడంతో కేడర్ గందరగోళంలో పడింది. కలిసికట్టుగా పనిచేస్తేనే విజయం దక్కడం కష్టం.. ఇక కలహాలతో గెలవడం అసాధ్యమన్న భావన కార్యకర్తల్లో నెలకొంది. ఇన్చార్జిగా ప్రకటించిన తర్వాత కూడా పోటీ చేసేందుకు ఫరూక్ తటపటాయింపు, ఇద్దరు నేతల అనైక్యతతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో అధిష్టానం ఉంది. -
ఆళ్లగడ్డ: రా..రమ్మన్నా.. రాని జనం.. చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్
సాక్షి, నంద్యాల: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రా కదలిరా సభ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సుమారు లక్ష మందితో సభ నిర్వహిస్తామని టీడీపీ నాయకులు గొప్పగా చెబుతూ వచ్చారు. కానీ, పదివేల మంది కూడా సభకు రాలేదు. నంద్యాల జిల్లా నుంచే కాకుండా కర్నూలు, కడప, అనంతపురం నుంచి కూడా జనాలను తరలించినప్పటికీ అనుకున్న లక్ష్యం దరిదాపుల్లోకి చేరలేదు. నియోజకవర్గాల నుంచి భారీగా జనాలను తరలించాలని ముందుగానే చెప్పినప్పటికీ జనాలను తరలించలేక నాయకులు చేతులెత్తేశారు. రూ.2 కోట్లు వృథా.. సభ కోసం సుమారు రూ.రెండు కోట్లు ఖర్చుచేసినట్లు సమాచారం. అయినా తెలుగుదేశం పార్టీ సభకు జనం రాకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఆ పార్టీ నాయకులుండిపోయారు. సభపై జనాలకు ఆసక్తిలేకపోతే తాము మాత్రం ఏం చేయగలమని తెలుగుదేశం పార్టీ నాయకులే మాట్లాడుకున్నారు. వైఎస్ జగన్ కుటుంబం టార్గెట్‌గా విమర్శలు.. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకుని చంద్రబాబు మాట్లాడడం విమర్శలకు తావిచ్చింది. తాను అధికారంలో ఉండి ఉంటే రాయలసీమను సస్యశ్యామలం చేసేవాడినని చెప్పడంతో స్థానికులు విస్మయానికి గురయ్యారు. బిర్యానీ, మందు ఇచ్చి జనాలను తరలించినా చంద్రబాబు ఉపన్యాసం బోరు కొట్టడంతో చాలామంది సభ నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ సభలో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు పట్టుకున్నారు. ఇక ఆళ్లగడ్డ టికెట్ విషయంలోనూ భూమా అఖిలప్రియకు ఎలాంటి హామీ లభించకపోవడంతో కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. మరోవైపు.. టీడీపీ–జనసేన కూటమి ఏర్పడిన తర్వాత నంద్యాల జిల్లాలో ఏర్పాటుచేసిన మొదటి సభకు జనసేన నుంచి ఏ ఒక్క నేతా హాజరుకాలేదు. అసహనానికి గురైన చంద్రబాబు సభకు జనాలు లేకపోవడంతో చంద్రబాబు తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సభలకు కూడా జనాలను తరలించలేకపోతే ఇక మీరెందుకంటూ నాయకులపై మండిపడినట్లు తెలిసింది. సభ ఆద్యంతం ఆయన ముఖంలో అసహనం కనిపించింది. మరోవైపు.. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వచ్చిన అరకొర జనం కూడా వెనుదిరగడంతో ఏం చేయాలో తెలియక టీడీపీ నాయకులు తలలు పట్టుకున్నారు. సభకు వచ్చేందుకు స్థానిక కార్యకర్తలు ఆసక్తి కనబరచలేదు. ఆళ్లగడ్డ నుంచి కేవలం రెండు, మూడు వేల మందే వచ్చినట్లు ఆ పార్టీ నాయకులే మాట్లాడుకోవడం గమనార్హం. -
నేటి సామాజిక సాధికార యాత్ర షెడ్యూల్
నంద్యాల: అప్రతిహతంగా సాగుతున్న వైఎస్సార్సీపీ సామాజిక సాధికార బస్సుయాత్రలో భాగంగా 39వ రోజు(గురువారం) నంద్యాల జిల్లా పాణ్యం నియోజకవర్గంవలోని కల్లూరులో జరుగనుంది. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించనున్న బస్సుయాత్రలో మధ్యాహ్నం 12 గంటలకు కేఎస్సార్ కన్వషన్ హాలులో వైఎస్సార్సీపీ నేతలు సమావేశం నిర్వహించనున్నారు. రెండు గంటలకు అదే ఫంక్షన్ హాలులో మీడియా సమావేశం ఉంటుంది. మూడు గంటలకు కేఎస్సార్ కన్వషన్ హాలు నుంచి చెన్నమ్మ సర్కిల్ వరకూ బైక్ ర్యాలీ నిర్వహిస్తారు. అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు చెన్నమ్మ సర్కిల్లో బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు డిప్యూటీ సీఎం నారాయణ స్వాయి, ఎంపీలు గోరంట్ల మాధవ్, గురుమూర్తి, సంజీవ్ కుమార్ తదితరులు హాజరుకానున్నారు.