డోన్: ఇచ్చిన మాట తూ.చ తప్పకుండా పాటించడం సీఎం జగన్ నైజమైతే, చెప్పిందేదీ చేయకపోవడమే చంద్రబాబు నైజమని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో ఆదివారం సుమారు రూ. 102 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, రాష్ట్ర మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన ప్రభుత్వాసుపత్రి ఆవరణలో జరిగిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ.. 40 ఏళ్ల రాజకీయ అనుభవమని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పెద్ద అబద్దాల పుట్ట అని విమర్శించారు.
సంపద సృష్టించడమంటే తాత్కాలిక, గ్రాఫిక్స్ కట్టడాలు కాదని, ఉన్నచోటనే పారిశ్రామిక, వ్యవసాయ, ఉపాధి రంగాలలో అభివృద్ధి సాధించడమని మంత్రి పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనకు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన నవరత్నాల పథకాలు దేశంలోనే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సీఎం జగన్ సాకారం చేశారన్నారు. ఉద్యోగులు, వయోవృద్ధులు, దివ్యాంగులు, ఫ్రీడం ఫైటర్లు, జర్నలిస్టులకు ఆర్టీసీ చార్జీలో రాయితీలు ఇవ్వడం ద్వారా సంస్థ నష్టాల్లో కూరుకుపోయిందని నాడు మనుసులో మాట అనే పుస్తకంలో రాసిన చంద్రబాబు.. నేడు సూపర్ సిక్స్ పథకాలంటూ ప్రజల్ని మభ్యపెడుతున్నారన్నారు.
డ్వాక్రా, రైతు రుణమాఫీలంటూ చేతులెత్తేసిన మాయగాడు, నేడు అదే రైతులకు రెట్టింపు మొత్తం ఇస్తాననడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు మాయమాటలకు ప్రజలు మోసపోరని, వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని మంత్రి స్పష్టంచేశారు. జిల్లాపరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ.. కర్నూలు జిల్లాను న్యాయ రాజధాని చేయడం, లా యూనివర్సిటీ ఏర్పాటు చేయడం వంటి కీలక నిర్ణయాల్లో ఆరి్థక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సీఎంకు చేదోడుగా ఉన్నారన్నారు. సభలో మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజే‹Ù, ఎంపీపీ రేగటి రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ చిన్నకేశవయ్యగౌడ్ తదితరులు ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment