సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. టీడీపీ నేతల నాయకులు అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి సుబ్బారాయుడుని హత్య చేశారు. కాగా, పోలీసులు కళ్ల ఎదుటే ఈ దారుణం జరగడం గమనార్హం.
వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లాలోని మహానంది మండలం సీతారామపురంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి కొందరు టీడీపీ నేతలు సుబ్బారాయుడు ఇంటికి వచ్చి ఘర్షణకు దిగారు. అనంతరం, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లే క్రమంలో సుబ్బారాయుడుపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. దీంతో, సుబ్బారాయుడు మృతిచెందాడు.
మరోవైపు.. సుబ్బారాయుడిపై దాడిని ఆయన భార్య బాలసుబ్బమ్మ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై కూడా దాడులు చేశారు. దీంతో, ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు వారి ఇంట్లోని వస్తువులను, సామాగ్రిని ధ్వంసం చేశారు. అయితే, ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి పనివచేశారనే అక్కస్సుతోనే టీడీపీ నేతలు.. సుబ్బారాయుడిని హత్య చేశారు.
నంద్యాల: YSRCP నేత హత్య సుబ్బరాయుడి కేసులో బయటపడ్డ పోలీసుల వైఫల్యం.
రాత్రి 12:59 నిమిషాలకు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన YSRCP నేత నారపురెడ్డి ఫోన్
1:02 నిమిషాలకు ఎస్పీకి మరోసారి ఫోన్ చేసిన నారపురెడ్డి.
పరిస్థితి తీవ్రంగా ఉందంటూ వేడుకోలు.
గ్రామంలో తమను హత్య చేయడానికి @JaiTDP… pic.twitter.com/hrGGg9DMYn— YSR Congress Party (@YSRCParty) August 4, 2024
బాధితురాలు బాల సుబ్బమ్మ మాట్లాడుతూ.. శ్రీనివాస్ రెడ్డి అనుచరులు నా భర్తను హత్య చేశారు. మాకు వ్యతిరేకంగా పనిచేస్తారా? అంటూ హత్యకు పాల్పడ్డారు. అడ్డుకున్న నాపై కత్తులతో దాడి చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
అయితే, టీడీపీ నేతలు దాడి చేస్తారని ముందుగానే ఎస్పీకి సమాచారం ఇచ్చారు వైఎస్సార్‌సీపీ నేత నారపురెడ్డి. కేవలం ఇద్దరు కానిస్టేబుల్స్‌ను మాత్రమే అధికారులు అక్కడికి పంపించారు. కాగా, టీడీపీ నేతలు మొదట నారపురెడ్డి ఇంటిపై దాడి చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ, నారపురెడ్డి ఇంటికి వెళ్లే మార్గంలోనే సుబ్బారాయుడు నివాసం ఉండటంతో వారిపై దాడికి తెగబడ్డారు. ఇక, దాడిపై పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు బలగాలను పంపకపోవడం వల్లే ఈ హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డిపై ఎస్పీకి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హత్య జరిగిన ఘటనా స్థలాన్ని ఆదివారం ఉదయం ఎస్పీ పరిశీలించారు.
ఇది చదవండి: రాజకీయ హింసకు ఏపీ మారుపేరుగా మారింది: వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment