Subba Rayudu
-
వైఎస్సార్సీపీ సుబ్బారాయుడు హత్య కేసు.. 11 మంది అరెస్ట్
సాక్షి, నంద్యాల: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లాలో వైఎస్సార్సీపీ నేత పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇక, ఈ కేసులో తాజాగా పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. కానీ, ఏ-1గా ఉన్న బుడ్డా శ్రీనివాస్‌ను మాత్రం పోలీసులు అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.ఇక, మహానంది మండలం సీతారామపురం గ్రామంలో వైఎస్సార్సీపీ నేత పెద్ద సుబ్బారాయుడిని టీడీపీ నేత బుడ్డా శ్రీనివాస్ హత్య చేశాడు. అతడి అనుచరులతో కలిసి పోలీసుల ముందే దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా 11 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మిగతా 15 మంది ముద్దాయిల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిని నంద్యాల సమీపంలోని చాపిరేవుల అండర్ పాస్ దగ్గర అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల నుండి హత్యకు ఉపయోగించిన మూడు కత్తులు, మూడు కర్రలు, రెండు సెల్ఫోన్లను, స్కోడా కారు, ఫార్చునర్ కారులను పోలీసులు సీజ్ చేశారు.అరెస్టు అయిన వారి వివరాలు..A2 బుడ్డా రెడ్డి ప్రభాకర్ రెడ్డి, A3 వంగాల లక్ష్మి రెడ్డి, A4 వంగాల పుల్లారెడ్డి, A5 బుడ్డా రెడ్డి లక్ష్మి నాగశేఖర్ రెడ్డి @ కుంటి శేఖర్ రెడ్డి, A7 తాలూరి శ్రీనివాసులు @ దుబ్బ శ్రీను,A9 పెరుమాళ్ల వెంకటరమణ @ డీలర్ రమణ,A10 మైలాపురం రామచంద్ర రెడ్డి,A11 దూదేకుల బాల హుసేని,A12 జిల్లెల్ల బాస్కర్,A13 గని రంగస్వామి,A14 వంగాల ఈశ్వర్ రెడ్డి, -
పోలీసుల ఎదుటే రెచ్చిపోయిన టీడీపీ గ్యాంగ్.. వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లాలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. టీడీపీ నేతల నాయకులు అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి సుబ్బారాయుడుని హత్య చేశారు. కాగా, పోలీసులు కళ్ల ఎదుటే ఈ దారుణం జరగడం గమనార్హం.వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లాలోని మహానంది మండలం సీతారామపురంలో వైఎస్సార్సీపీ కార్యకర్త పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి కొందరు టీడీపీ నేతలు సుబ్బారాయుడు ఇంటికి వచ్చి ఘర్షణకు దిగారు. అనంతరం, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు అక్కడి నుంచి వెళ్లే క్రమంలో సుబ్బారాయుడుపై కర్రలు, రాళ్లతో విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. దీంతో, సుబ్బారాయుడు మృతిచెందాడు.మరోవైపు.. సుబ్బారాయుడిపై దాడిని ఆయన భార్య బాలసుబ్బమ్మ అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమెపై కూడా దాడులు చేశారు. దీంతో, ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు వారి ఇంట్లోని వస్తువులను, సామాగ్రిని ధ్వంసం చేశారు. అయితే, ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి పనివచేశారనే అక్కస్సుతోనే టీడీపీ నేతలు.. సుబ్బారాయుడిని హత్య చేశారు. నంద్యాల: YSRCP నేత హత్య సుబ్బరాయుడి కేసులో బయటపడ్డ పోలీసుల వైఫల్యం. రాత్రి 12:59 నిమిషాలకు జిల్లా ఎస్పీకి ఫోన్ చేసిన YSRCP నేత నారపురెడ్డి ఫోన్1:02 నిమిషాలకు ఎస్పీకి మరోసారి ఫోన్ చేసిన నారపురెడ్డి. పరిస్థితి తీవ్రంగా ఉందంటూ వేడుకోలు.గ్రామంలో తమను హత్య చేయడానికి @JaiTDP… pic.twitter.com/hrGGg9DMYn— YSR Congress Party (@YSRCParty) August 4, 2024 బాధితురాలు బాల సుబ్బమ్మ మాట్లాడుతూ.. శ్రీనివాస్ రెడ్డి అనుచరులు నా భర్తను హత్య చేశారు. మాకు వ్యతిరేకంగా పనిచేస్తారా? అంటూ హత్యకు పాల్పడ్డారు. అడ్డుకున్న నాపై కత్తులతో దాడి చేశారు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.అయితే, టీడీపీ నేతలు దాడి చేస్తారని ముందుగానే ఎస్పీకి సమాచారం ఇచ్చారు వైఎస్సార్సీపీ నేత నారపురెడ్డి. కేవలం ఇద్దరు కానిస్టేబుల్స్‌ను మాత్రమే అధికారులు అక్కడికి పంపించారు. కాగా, టీడీపీ నేతలు మొదట నారపురెడ్డి ఇంటిపై దాడి చేసేందుకు ప్లాన్ చేశారు. కానీ, నారపురెడ్డి ఇంటికి వెళ్లే మార్గంలోనే సుబ్బారాయుడు నివాసం ఉండటంతో వారిపై దాడికి తెగబడ్డారు. ఇక, దాడిపై పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసు బలగాలను పంపకపోవడం వల్లే ఈ హత్య జరిగిందని ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ రెడ్డిపై ఎస్పీకి గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హత్య జరిగిన ఘటనా స్థలాన్ని ఆదివారం ఉదయం ఎస్పీ పరిశీలించారు. ఇది చదవండి: రాజకీయ హింసకు ఏపీ మారుపేరుగా మారింది: వైఎస్ జగన్ -
బీట్ ఆఫీసర్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
మెదక్, న్యూస్‌లైన్: ఫారెస్టు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పరీక్ష ఆదివారం మెదక్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పరీక్షల కో ఆర్డినేటర్ సుబ్బారాయుడు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షకు సంబంధించి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు. పరీక్షలకు సంబంధించి మెదక్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 400 మంది, సిద్ధార్థ మోడల్ హైస్కూల్లో 800 మంది, గీతా జూనియర్ కళాశాలలో 400 మంది, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 300 మంది, వైపీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 500 మంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 500 మంది, ఆదర్శ జూనియర్ కళాశాలలో 400 మంది, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 208మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. మొత్తం 3508 మంది ఈ పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పార్ట్-2, పార్ట్-3 పేపర్లు, మధ్యాహ్నం 1నుంచి 2గంటల వరకు పార్ట్-1 పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులంతా ఉదయం 8.45 వరకు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు. సిద్దిపేటలో పరీక్ష రాయనున్న 2051 మంది అభ్యర్థులు సిద్దిపేటజోన్: సిద్దిపేటలో ఆదివారం అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సిద్దిపేటలో మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 2051 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షల నిర్వహణ బాధ్యతను సిద్దిపేట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్రావుకు అప్పగించారు. సజావుగా పరీక్ష నిర్వహించేందుకు పరీక్షల కోఆర్డినేటర్ ముందస్తుగా శనివారం నాడు సిబ్బందికి ఆవగాహన సమావేశం నిర్వహించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 700 మంది, ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో 700 మంది, సిద్దిపేట ఎస్ఆర్కే డిగ్రీ కళాశాలలో 651 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అభ్యర్థుల వేలిముద్ర తప్పనిసరి అటవీశాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే ఎంపిక పరీక్షలో హజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షా కేంద్రంలో వేలిముద్ర వేసేలా ఇన్విజిలేటర్లు చొరవ చూపాలని పరీక్షల కోఆర్డినేటర్ నాగేశ్వర్రావు సూచించారు. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎంపిక పరీక్ష నేపథ్యంలో శనివారం స్థానిక ఎస్ఆర్కే పరీక్షా కేంద్రంలో ఆవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష ఐదున్నర గంటలు కొనసాగుతుందన్నారు. ఉదయం 9.30 నుంచి 11.00 వరకు పార్ట్-2, ఉదయం 11.00 నుంచి 2.00 వరకు వరుసగా పార్ట్-3, పార్ట్-1 పేపర్లకు సమాధానం రాయల్సి ఉంటుందన్నారు. బ్లూ, బ్లాక్ బాల్ పెన్‌తో మాత్రమే పరీక్ష రాసేలా చూడాల్సిన బాధ్యత ఇన్విజిలేటర్లపై ఉందన్నారు.