బీట్ ఆఫీసర్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
మెదక్, న్యూస్‌లైన్: ఫారెస్టు అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పరీక్ష ఆదివారం మెదక్‌లో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు పరీక్షల కో ఆర్డినేటర్ సుబ్బారాయుడు తెలిపారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ పరీక్షకు సంబంధించి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్నారు. పరీక్షలకు సంబంధించి మెదక్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 400 మంది, సిద్ధార్థ మోడల్ హైస్కూల్‌లో 800 మంది, గీతా జూనియర్ కళాశాలలో 400 మంది, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 300 మంది, వైపీఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో 500 మంది, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 500 మంది, ఆదర్శ జూనియర్ కళాశాలలో 400 మంది, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 208మంది పరీక్ష రాయనున్నట్లు తెలిపారు. మొత్తం 3508 మంది ఈ పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పార్ట్-2, పార్ట్-3 పేపర్లు, మధ్యాహ్నం 1నుంచి 2గంటల వరకు పార్ట్-1 పరీక్ష నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులంతా ఉదయం 8.45 వరకు పరీక్షా కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు.
సిద్దిపేటలో పరీక్ష రాయనున్న 2051 మంది అభ్యర్థులు
సిద్దిపేటజోన్: సిద్దిపేటలో ఆదివారం అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పరీక్ష నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సిద్దిపేటలో మూడు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 2051 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. పరీక్షల నిర్వహణ బాధ్యతను సిద్దిపేట పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వర్‌రావుకు అప్పగించారు. సజావుగా పరీక్ష నిర్వహించేందుకు పరీక్షల కోఆర్డినేటర్ ముందస్తుగా శనివారం నాడు సిబ్బందికి ఆవగాహన సమావేశం నిర్వహించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 700 మంది, ఇందూరు ఇంజినీరింగ్ కళాశాలలో 700 మంది, సిద్దిపేట ఎస్‌ఆర్‌కే డిగ్రీ కళాశాలలో 651 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
అభ్యర్థుల వేలిముద్ర తప్పనిసరి
అటవీశాఖలో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే ఎంపిక పరీక్షలో హజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షా కేంద్రంలో వేలిముద్ర వేసేలా ఇన్విజిలేటర్లు చొరవ చూపాలని పరీక్షల కోఆర్డినేటర్ నాగేశ్వర్‌రావు సూచించారు. అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎంపిక పరీక్ష నేపథ్యంలో శనివారం స్థానిక ఎస్‌ఆర్‌కే పరీక్షా కేంద్రంలో ఆవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్ష ఐదున్నర గంటలు కొనసాగుతుందన్నారు. ఉదయం 9.30 నుంచి 11.00 వరకు పార్ట్-2, ఉదయం 11.00 నుంచి 2.00 వరకు వరుసగా పార్ట్-3, పార్ట్-1 పేపర్లకు సమాధానం రాయల్సి ఉంటుందన్నారు. బ్లూ, బ్లాక్ బాల్ పెన్‌తో మాత్రమే పరీక్ష రాసేలా చూడాల్సిన బాధ్యత ఇన్విజిలేటర్లపై ఉందన్నారు.