సాక్షి, నంద్యాల: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలే టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లాలో వైఎస్సార్‌సీపీ నేత పెద్ద సుబ్బారాయుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఇక, ఈ కేసులో తాజాగా పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. కానీ, ఏ-1గా ఉన్న బుడ్డా శ్రీనివాస్‌ను మాత్రం పోలీసులు అరెస్ట్ చేయకపోవడం గమనార్హం.
ఇక, మహానంది మండలం సీతారామపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ నేత పెద్ద సుబ్బారాయుడిని టీడీపీ నేత బుడ్డా శ్రీనివాస్ హత్య చేశాడు. అతడి అనుచరులతో కలిసి పోలీసుల ముందే దాడి చేసి చంపేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. తాజాగా 11 మంది ముద్దాయిలను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మిగతా 15 మంది ముద్దాయిల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిని నంద్యాల సమీపంలోని చాపిరేవుల అండర్ పాస్ దగ్గర అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ అయిన నిందితుల నుండి హత్యకు ఉపయోగించిన మూడు కత్తులు, మూడు కర్రలు, రెండు సెల్‌ఫోన్‌లను, స్కోడా కారు, ఫార్చునర్ కారులను పోలీసులు సీజ్ చేశారు.
అరెస్టు అయిన వారి వివరాలు..
A2 బుడ్డా రెడ్డి ప్రభాకర్ రెడ్డి,
A3 వంగాల లక్ష్మి రెడ్డి,
A4 వంగాల పుల్లారెడ్డి,
A5 బుడ్డా రెడ్డి లక్ష్మి నాగశేఖర్ రెడ్డి @ కుంటి శేఖర్ రెడ్డి,
A7 తాలూరి శ్రీనివాసులు @ దుబ్బ శ్రీను,
A9 పెరుమాళ్ల వెంకటరమణ @ డీలర్ రమణ,
A10 మైలాపురం రామచంద్ర రెడ్డి,
A11 దూదేకుల బాల హుసేని,
A12 జిల్లెల్ల బాస్కర్,
A13 గని రంగస్వామి,
A14 వంగాల ఈశ్వర్ రెడ్డి,
Comments
Please login to add a commentAdd a comment