Byreddy Rajasekhar reddy
-
అంతుచూస్తా.. టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి దౌర్జన్యం
సాక్షి, నంద్యాల జిల్లా: నందికొట్కూరు మునిసిపాలిటీలో స్థల వివాదంలో సీపీఎం నాయకులపై టీడీపీ నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నోరు పారేసుకున్నారు. రెచ్చిపోయిన బైరెడ్డి.. అంతుచూస్తానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ నుంచి వెళ్లిపోండి అంటూ సీపీఎం నాయకులపై చిందులు తొక్కారు.20 ఏళ్లుగా ఈ స్థలంలోనే ఉన్నాం.. పన్నులు చెలిస్తున్నాం. న్యాయం చేయకపోగా మాపైనే దౌర్జన్యం చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి మేము పన్నులు కూడా చెల్లించామని.. తమకు న్యాయం చేయమంటే మున్సిపాలిటీ అధికారులు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్యాయం చేస్తున్నారంటూ బాధితులు ఆందోళన బాటపట్టారు. -
కూతురు ఎంపీ.. తండ్రి పెత్తనం
ఒకరు రాజకీయంగా కనుమరుగయ్యారని భావిస్తున్న తరుణంలో కుమారై పదవితో తనదైన రాజకీయానికి తెరతీశారు.. జీవితంలో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తి మరొకరు. వీరిద్దరి కంటే ముందు నుంచి నందికొట్కూరు రాజకీయాన్ని అన్నీ తానై నడిపిస్తున్న నేత ఇంకొకరు. అధికారం దక్కి 50రోజులు ముగియకనే ఈ ముగ్గురు నేతల మధ్య విభేదాలు వీధికెక్కాయి. సైకిల్ పారీ్టతో సంబంధం లేని బైరెడ్డి నందికొట్కూరులో పెత్తనం చేస్తుంటే.. పెత్తనం చేయడానికి బైరెడ్డి ఎవరు? ఆయనకు టీడీపీతో సంబంధం ఏంటని ఎమ్మెల్యే జయసూర్య ధ్వజమెత్తుతున్నారు. మాండ్ర శివానందరెడ్డి పెత్తనం చెలాయించాలని చూస్తున్నా అధిష్టానం సహకరించకపోవడంతో పార్టీ పరువు బజారున పడుతోంది. చివరకు ఈ పంచాయతీ అధిష్టానం వద్దకు చేరినా పరిష్కారం చూపలేక చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నందికొట్కూరు ‘తమ్ముళ్ల’ విభేదాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి ప్రతినిధి కర్నూలు: బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి. మోతుబరి రాజకీయనాయకుడే. రాజకీయం, ఆయనపై ఫ్యాక్షన్ ఆరోపణలు వెరసి ‘సీమ’రాజకీయాల్లో కీలకంగా ఎదిగారు. తెలుగుదేశం పారీ్టలో సుదీర్ఘంగా పనిచేసిన ఆయన 2012లో విభేదించారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ భుజానికెత్తుకున్నట్లు ‘రాయలసీమ పరిరక్షణ సమితి’ పేరుతో రాజకీయ పార్టీ స్థాపించి ప్రత్యేక రాయలసీమ వాదాన్ని వినిపించారు. ఎలక్షన్లో పోటీ చేసి అట్టరఫ్లాప్ అయ్యారు. ఆపై కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ దెబ్బతో బైరెడ్డి రాజశేఖరరెడ్డి రాజకీయ జీవితం ముగిసిందని అంతా భావించారు. అయితే కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. సమకాలీన రాజకీయాల్లో బైరెడ్డి ప్రస్తావన లేకుండానే 2014, 2019లో కర్నూలు ఎన్నికలు ముగిశాయి. 2024లో తనతో పాటు బీజేపీలో ఉన్న కుమార్తె శబరిని టీడీపీలోకి పంపారు. ఈ చేరికలో శబరి మాత్రకమే ‘పచ్చకండువా’ వేసుకున్నారు. బైరెడ్డి వేసుకోలేదు. నంద్యాల ఎంపీగా శబరి గెలుపొందారు. పేరుకే శబరి.. అంతా బైరెడ్డే! ఎన్నికల తర్వాత బైరెడ్డి నందికొట్కూరుపై తిరిగి పట్టుకోసం ప్రయతి్నస్తున్నారు. మునిసిపల్ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్లను టీడీపీ కండువా వేసి పార్టీలోకి ఆహా్వనించారు. ఆపై మిడుతూరు, పగిడ్యాలలో ఎంపీటీసీ, సర్పంచ్‌లకు ‘పచ్చకండువా’ వేశారు. దీనిపై జయసూర్య తీవ్రస్థాయిలో స్పందించారు. ‘టీడీపీలో చేర్చుకోవడానికి బైరెడ్డి ఎవరు? ఆయన టీడీపీ వ్యక్తి కాదు. టీడీపీలో చేరలేదు. సభ్యత్వం లేదు. కుమారై టీడీపీలో చేరినంత మాత్రాన ఈయన టీడీపీ అవుతారా?’ అని ఘాటుగా స్పందించారు. ఆ తర్వాత బైరెడ్డి కూడా అదేస్థాయిలో స్పందించారు. ‘నందికొట్కూరు తమ అడ్డా అని, కొందరు వస్తుంటారు.. పోతుంటారు!’ అని ఎమ్మెల్యేను తేలిగ్గా కొట్టిపారేశారు. ఈ వ్యవహారం తర్వాత బైరెడ్డిపై జయసూర్య మాండ్ర శివానందరెడ్డితో కలిసి టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ తతంగం తర్వాత కూడా ఆదివారం బైరెడ్డి శివపురం ఎంపీటీసీ, మరికొందరికి కండువా వేసి టీడీపీలోకి ఆహా్వనించారు. ఒక్కమాటలో చెప్పాలంటే తానే ఎంపీ అనే భావనలో నందికొట్కూరులో బైరెడ్డి రాజకీయం సాగిస్తున్నారు మునిసిపల్ చైర్మన్ మార్పు బైరెడ్డికి చెక్ పెట్టేందుకేనా? బైరెడ్డికి చెక్‌పెట్టేందుకు మాండ్రశివానందరెడ్డి కొత్త ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీ నుంచి చేరిన సుధాకర్‌రెడ్డి టీడీపీ వ్యక్తి కాదని, అలాంటి వ్యక్తిని మునిసిపల్ చైర్మన్‌గా కొనసాగించొద్దని ఎమ్మెల్యే, మాండ్ర అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అయితే 4ఏళ్ల వరకూ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టలేని పరిస్థితి. ఈక్రమంలో సుధాకర్‌రెడ్డి నిజంగా టీడీపీపై విశ్వాసంతో పారీ్టలో చేరి ఉంటే చైర్మన్ పదవికి రాజీనామా చేసి పారీ్టలో కొనసాగాలే ఆదేశించాలని పార్టీ పెద్దలకు చెప్పినట్లు సమాచారం. రాజీనామా చేస్తే చైర్మన్ పదవి ఖాళీ అవుతుంది. అప్పుడు టీడీపీ కౌన్సిలర్‌ను చైర్మన్ చేయొచ్చు అనేది మాండ్ర ఎత్తుగడ. ఇందుకు నాలుగేళ్ల వరకు ఆగాల్సిన పని కూడా లేదు. ఇదే జరిగితే బైరెడ్డికి చెక్ పెట్టినట్లే. లేదంటే మాండ్రతో పాటు దళిత ఎమ్మెల్యే జయసూర్యను టీడీపీ లైట్‌గా తీసుకున్నట్లే!! ఎమ్మెల్యే, మాండ్రకు టీడీపీ ప్రాధాన్యత ఇవ్వడం లేదా? ⇒ బైరెడ్డి చర్యలను పట్టించుకోకపోవడం చూస్తే టీడీపీ పరోక్షంగా ఆయనను సమరి్థంచినట్లే కనపడుతోంది. ⇒ మొన్నటి ఎన్నికల్లో మాండ్ర శివానందరెడ్డి నంద్యాల ఎంపీ టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. ⇒ శబరికి ఎంపీ టిక్కెట్ ఇచ్చే సందర్భంలో నందికొట్కూరు టిక్కెట్ మాండ్ర చెప్పిన వారికే ఇచ్చేలా ఒప్పందం జరిగింది. ఆ మేరకు జయసూర్య ఎమ్మెల్యే అయ్యారు. ⇒ ఇప్పుడు బైరెడ్డి చర్యలను టీడీపీ సమర్థిస్తూ, జయసూర్యను పట్టించుకోవం లేదంటే మాండ్రను పక్కనపెట్టినట్లేనని టీడీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతోంది. ⇒ ఒకవేళ ఈ వివాదానికి చెక్ పెట్టాలనుకుంటే బైరెడ్డిని టీడీపీలో చేరాలని అధిష్టానం సూచించాలి. అదీ చేయలేదు. ⇒ చేరికల సమయంలో ఎమ్మెల్యేను కలుపుకుని వెళ్లాలని చెప్పాలి. అలా కూడా జరగలేదు. ⇒ టీడీపీలోని ముఖ్య నేతలందరితో బైరెడ్డికి సంబంధాలు ఉన్నాయి. అందువల్లే ఆయన ముందు జయసూర్య తేలిపోతున్నారు. ⇒ పైగా జయసూర్య దళిత ఎమ్మెల్యే కావడంతో బైరెడ్డి లెక్కపెట్టడం లేదని తెలుస్తోంది. ⇒ టీడీపీ కూడా అదే కోణంలో చూస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ⇒ రెండేళ్ల తర్వాత డీలిమిటేషన్లో రిజర్వేషన్లు మారితే జయసూర్యకు రాజకీయ భవితవ్యం కూడా ఉండదనే ప్రచారం బైరెడ్డి వర్గం చేస్తోంది. -
షాడో ఎంపీగా బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి..?
ఎస్సీ రిజర్వ్డ్ అయిన నందికొట్కూరు నియోజకవర్గంలోని టీడీపీలో నిప్పు లేకుండానే ‘పచ్చ’గడ్డి భగ్గుమంటోంది. అగి్నకి ఆజ్యం తోడైనట్లు ఎన్నికల వేళ ఏర్పడిన విభేదాలకు ఇప్పుడు అధికార దర్పం చాటేందుకు ఇరువర్గాలు పోటాపోటీ పడుతున్నాయి. నియోజకవర్గంలో పెత్తనం చెలాయించేందుకు నాయకులు లోలోపల పావులు కదుపుతున్నారు. ఓ వైపు బైరెడ్డి రాజశేఖరరెడ్డి పట్టు సాధించేందుకు చక్రం తిప్పుతుండగా మాండ్ర శివానందరెడ్డి వర్గం చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. సాక్షి, నంద్యాల: నందికొట్కూరు నియోజకవర్గంలో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, మాండ్ర శివానందరెడ్డి మధ్య వర్గపోరు భగ్గుమంటోంది. సాధారణ ఎన్నికల నుంచి వీరి మధ్య విభేదాలు మరింత ముదిరాయి. రెండు వర్గాల మధ్య మొదటి నుంచి విభేదాలు ఉన్నా గత ఎన్నికల్లో టీడీపీ ఎంపీ టికెట్ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి కుమార్తె బైరెడ్డి శబరికి, నందికొట్కూరు అసెంబ్లీ టికెట్ మాండ్ర శివానందరెడ్డి వర్గానికి చెందిన జయసూర్యకు దక్కాయి. రెండు వర్గాలు టీడీపీలో ఉన్నా ఒకరినొకరు సహకరించుకున్న పరిస్థితి లేదు. ఎవరి ప్రచారం వారే చేసుకున్నారు. ప్రత్యర్థుల్లానే వ్యవహరించారు. ఎన్నికల ఫలితాల అనంతరం అదే ధోరణి వ్యవహరిస్తుండటంతో వ్యవహారం తారా స్థాయి చేరుకుంటుంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రెండు వర్గాల మధ్య రగడకు దారి తీశాయి. మాండ్ర వర్గం బైరెడ్డి ఫొటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో చంద్రబాబు సమక్షంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అప్పటి నుంచే రెండు వర్గాలు ఉప్పు.. నిప్పులా.. వ్యవహరిస్తూ వస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఎంపీ ఓటు ‘నీకు ఇష్టమొచ్చిన వారికి వేసుకోవచ్చని’ మాండ్ర వర్గం బాహటంగానే పిలుపునిచ్చింది. అలాగే ‘ఎమ్మెల్యే ఓటు మీకు నచ్చిన వారికి వేసుకొని ఎంపీ ఓటు శబరికి వేయండి’ అంటూ బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి లోలోపల ప్రచారం చేశారు. మొత్తానికి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మాండ్ర వర్గానికి చెందిన జయసూర్య, ఎంపీగా బైరెడ్డి శబరి ఇద్దరూ గెలుపొందారు. అప్పటి నుంచి నియోజకవర్గంపై పెత్తనం కోసం రెండు వర్గాలు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించేందుకు చేస్తున్న ప్రయత్నాలు నియోజకవర్గంలో శాంతిభద్రతల సమస్యకు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బైరెడ్డి వ్యాఖ్యలు కలకలం.. ఇటీవల బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఓ సందర్భంలో మాట్లాడుతూ.. వలంటీర్లు, మధ్యాహ్న భోజనం కార్మికుల ఉద్యోగాలకు కొంత మంది నాయకులు డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. టీడీపీకి చెడ్డ పేరు వచ్చేలా నియోజకవర్గంలో ఎవరైనా ప్రవర్తిస్తే ‘తోలు ఒలిచి ఉప్పుకారం పెడతానని’ ఘాటుగా హెచ్చరించారు. ఎమ్మెల్యే జయసూర్యను ఉద్దేశించే బైరెడ్డి హెచ్చరికలు చేశారని పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ సాగింది. దీతో వారి మధ్య దూరం మరింత పెరిగింది. షాడో ఎంపీగా బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి..? నంద్యాల ఎంపీగా బైరెడ్డి శబరి గెలిచి నప్పటికీ ఆమెను డమ్మీని చేసి జిల్లాలో రాజకీయం మొత్తం తన చేతుల్లోకి తీసుకోవాలని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. ఫలితాలు వెలువడిన నాటి నుంచి జిల్లా అధికారులతో పాటు నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. సమస్యలు ఏమైనా ఉంటే తన దృష్టికే తీసుకొని రావాలని అధికారులకు సూచిస్తున్నట్లు సమాచారం. టీడీపీ సభ్యత్వమే తీసుకోకుండా టీడీపీ నాయకులపై బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పెత్తనం చేస్తుండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నంద్యాల షాడో ఎంపీగా వ్యవహరిస్తున్న బైరెడ్డిపై సొంత పార్టీ నేతలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ముదిరిన వివాదం తాజాగా శుక్రవారం నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్‌రెడ్డితో పాటు మరో 12 మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పారీ్టలో చేరారు. ఈ చేరికలపై ఎమ్మెల్యే గిత్తా జయసూర్యకు కనీస సమాచారం ఇవ్వలేదు. బైరెడ్డి మొత్తం చక్రం తిప్పారు. తనకు తెలియకుండా టీడీపీలో కౌన్సిలర్లు చేరడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ సభ్యత్వం లేని బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి పెత్తనాన్ని సహించేది లేదని బహిరంగంగానే ఎమ్మెల్యే తేలి్చచెబుతున్నారు. నా సత్తా ఏమిటో చూపిస్తా.. ఎమ్మెల్యే జయసూర్య ఇంత వరకు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి తెలుగుదేశం పారీ్టలో సభ్యత్వమే లేదని, అలాంటి వ్యక్తి వైఎస్సార్సీపీ కౌన్సిలర్లను, చైర్మర్ను టీడీపీలో ఎలా చేర్చుకుంటారని ఎమ్మెల్యే జయసూర్య విలేకరుల సమావేశంలో ఘాటుగా స్పందించారు. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టీడీపీకి చెందిన వ్యక్తి కాదని, బైరెడ్డి ఇప్పటి వరకు కండువా కూడా కప్పుకోలేదని, అలాంటి వ్యక్తి వేరే వాళ్లకు ఎలా కండువ కప్పి పారీ్టలో చేర్చుకుంటారని ప్రశ్నించారు. మున్సిపాలిటీలో అవినీతి చేసిన వ్యక్తులను కాపాడేందుకే బైరెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పాదయాత్ర సందర్భంగా మున్సిపాలిటీలో జరిగిన అవినీతిని నారా లోకేష్ రెడ్ బుక్‌లో రికార్డు చేశారన్నారు. బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆడుతున్న డ్రామా ఇది అన్నారు. ఎన్నికల్లో తనను ఓడించేందుకు కృషి చేసిన వ్యక్తుల్లో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఒకరన్నారు. నందికొట్కూరు నియోజకవర్గంలో పెత్తనం చేయాలంటే కుదరదని, ‘నా సత్తా ఏమిటో చూపిస్తా’ అంటూ సమావేశంలో వ్యాఖ్యానించారు. ఎవరికి భయపడొద్దు.. మీకు నేను ఉన్నా : బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ‘ఎవరి బెదిరింపులకు భయపడవద్దు. అందరం కలిసికట్టుగా పేదల అభ్యున్నతికి పని చేద్దాం. నేను మీకు అండగా ఉంటా’ అంటూ మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. మున్సిపల్ చైర్మన్ సుధాకర్‌రెడ్డితో పాటు 12మంది వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు వైఎస్సార్సీపీ నుండి టీడీపీలో చేరిన సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాను రెండు సార్లు నందికొట్కూరు ఎమ్మెల్యేగా పని చేశానని, ఆ సమయంలో తాను నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధే నేటికి అందరికీ కనబడుతుందన్నారు. తమ కుటుంబం ఇప్పటికీ ప్రజల్లో ఉండేందుకు అప్పట్లో చేసిన అభివృద్ధే కారణమన్నారు. ఎంపీ శబరి ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి నందికొట్కూరు నియోజకవర్గానికి ఎక్కువ నిధులు సాధించి మరింత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. -
జయసూర్య Vs బైరెడ్డి: నందికొట్కూరు టీడీపీలో రచ్చ రచ్చ
సాక్షి, నంద్యాల జిల్లా: నందికొట్కూరు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గమన్నాయి. టీడీపీ సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డికి టీడీపీ ఎమ్మెల్యే జయసూర్య సవాల్ విసిరారు.బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి టీడీపీకి చెందిన వ్యక్తి కాదని.. బైరెడ్డి టీడీపీ కండువా కప్పుకోలేదు.. నందికొట్కూరు రాజకీయంలో తలదూర్చి పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకోం’’ అంటూ జయసూర్య హెచ్చరించారు. నా ఓటమికి కృషి చేసిన వ్యక్తులలో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఒకరు. ఎంపీ తండ్రిగా నియోజకవర్గంలో పెత్తనం చేయాలంటే కుదరదు. నియోజకవర్గ పరిధిలోని నా సత్తా ఏంటో చూపిస్తా అంటూ బైరెడ్డికి జయసూర్య సవాల్ విసిరారు. -
‘ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం’
సాక్షి, కర్నూలు : బీజేపీ నాయకుడు బైరెట్టి రాజశేఖర్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలపై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఘాటుగా స్పందించారు. శ్రీశైల ప్రతిష్ఠను దిగజార్చే విధంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తన కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆయన సీబీఐ విచారణ జరిపి అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. బీజేపీ పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని, అలా కాదని పార్టీలో ఉంటూ తను ప్రవర్తిస్తున్న తీరు బాగాలేదని రాజశేఖర్‌రెడ్డిపై మండిపడ్డారు. మత విశ్వాసాలను హిందూ ధర్మాన్ని పెంచేలా చేయాలో తప్ప ఇలా దేవస్థానాలపై బురద చల్లడం మంచింది కాదని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి హితవు పలికారు. -
'ఆయనను రాజకీయ క్వారంటైన్‌కు తరలించారు'
సాక్షి, కర్నూలు: రాజకీయ నిరుద్యోగిగా ఉన్న బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అప్పుడప్పుడు తన ఉనికి కోసమే మీడియా ముందుకు వచ్చి అసత్య ఆరోపణలు చేస్తుంటాడని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య విమర్శించారు. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అక్రమాలపై శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు కోట్ల రూపాయలు అవినీతి, అక్రమాలపై పోలీసులు విచారణ చేస్తుంటే దానిని బూతద్దంలో చూస్తున్నారు. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చిన్న మెదడు చిట్లిపోయి ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. చదవండి: శ్రీశైలం నిధుల స్వాహా కేసులో మరికొందరి హస్తం అవినీతి, అక్రమాస్తుల కబ్జాలు చేసిన వ్యక్తికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం విచారణ చేస్తోంది. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. శ్రీశైలం ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోం. బైరెడ్డి ఎప్పడు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలియదు. బహుశా ఆయనకు కూడా తెలియదు. చంద్రబాబు ధోరణిలోనే అడ్డగోలు విమర్శలు చేయడం ఈయనకి వంటపట్టిందన్నారు. చదవండి: వ్యర్థాల నిర్వహణకు 'ఆన్లైన్' వేదిక ప్రారంభం బైరెడ్డిని కర్నూలు జిల్లా ప్రజలు రాజకీయ క్వారంటైన్‌కు తరలించారన్న సంగతి గుర్తుకు తెచ్చుకోవాలి. తిరుపతి దేవస్థానం భూములపై ఆనాడు మాట్లాడని బైరెడ్డి ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకొని లేని ఆరోపణలు చేస్తున్నారు. పోతిరెడ్డిపాడు, రైతులకు మేలు చేసే కార్యక్రమాలపై పోరాటం వంటి ఆలోచనలు చేయాలి తప్ప మరో విధంగా మాట్లడితే రాజకీయంగా బుద్ధి చెబుతాం అంటూ పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య.. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని హెచ్చరించారు. చదవండి: 'కెలికి తిట్టించుకోవడం బాబుకు అలవాటే' -
బీజేపీలో చేరిన బైరెడ్డి, కౌశల్
సాక్షి, న్యూడిల్లీ : మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బిగ్‌బాస్ తెలుగు సీజన్ 2 విన్నర్ కౌశల్ గురువారం బీజేపీలో చేరారు. ఢిల్లీలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో వీరు బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు బైరెడ్డి కుమార్తె శబరి, కౌశల్ సతీమణి నీలిమ బీజేపీ చేరినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. వారిని బీజేపీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. అనంతరం బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలన్నదే తన కోరిక అని తెలిపారు. దేశంలో పరిస్థితులు బాగుపడాలంటే ప్రధాని నరేంద్ర మోదీ నిస్వార్థ రాజకీయాలు అవసరం అని అభిప్రాయపడ్డారు. అందుకోసమే తాను బీజేపీలో చేరారని వెల్లడించారు. త్వరలోనే కర్నూలులో బహరింగ సభ నిర్వహిస్తామని.. ఆ సభకు రావాల్సిందిగా జేపీ నడ్డాను కోరినట్టు చెప్పారు. కౌశల్ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు దేశం కోసం పనిచేస్తున్న తీరు ఆకట్టుకుందని తెలిపారు. వారి నాయకత్వంలో పనిచేయడం కోసం బీజేపీలో చేరినట్టు చెప్పారు. -
కాంగ్రెస్‌కు బైరెడ్డి బై..బై..!
సాక్షి, కర్నూలు : సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో అభ్యర్థులు వలసల బాట పడతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు తీరు నచ్చక అధికార టీడీపీ నుంచి భారీగా వలసలు పెరగగా.. ఉన్న అర కొర నేతలు కూడా కాంగ్రెస్ పార్టీని వీడుతున్నారు. దీంతో ఏపీ కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా తయారయింది. తాజాగా కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన చేసిన వాఖ్యలను చూస్తే పార్టీనీ వీడేందుకే సిద్దపడినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఏపీలో కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి రఘువీరానే కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఉంటే పార్టీ నాశనం అవుతుంది ‘కాంగ్రెస్‌లో చేరినప్పటి నుంచి గ్రామ గ్రామానికి తిరుగుతూ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. నేను పాదయాత్రను చేపడితే రఘువీరా అడ్డుపడ్డారు. ఇంకో నాయకుడు ఎదగడం ఆయనకు ఇష్టం ఉండదు. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని రఘువీరా మరింత దిగజార్చారు. అయన కోటరీలో అందరూ చెంచాలే ఉన్నారు. ఏ ఒక్కరు కూడా నాలుగు ఓట్లు వేయించలేదు. కాంగ్రెస్ పార్టీలోకి ఎవరూ చేరని పరిస్థితుల్లో నేను బలోపేతం చేశాను. పీసీసీ అధ్యక్ష పదవి మతి స్థిమితం లేని వ్యక్తి చేతిలో పెట్టారు. తిరుపతిలో భరోసా యాత్రను రఘువీరా రెడ్డి నీరు గార్చారు. కాంగ్రెస్ నాశనం కావడానికి రఘువీరానే కారణం. అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రఘువీరాపై మాకు నమ్మకం లేదు. ఆయన ఉంటే పార్టీ నాశనం అవుతుంది. నేను, మా నాయకులు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయము.. రేపు కార్యకర్తల సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాము’అంటూ బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. -
‘ప్రాణాలు అర్పించైనా రాహుల్‌ను ప్రధాని చేస్తాం’
సాక్షి, కర్నూలు : ప్రాణాలు అర్పించైనా తమ అధినేత రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని కాంగ్రెస్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాహుల్, ప్రియాంక గాంధీలను త్వరలోనే కర్నూలుకు తీసుకువస్తామన్నారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కుటుంబం కాంగ్రెస్‌ను వీడినా పార్టీకి వచ్చే నష్టం ఏమి లేదన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందన్నారు. ఇతర పార్టీల నాయకుల్ని లాక్కోవడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని విమర్శించారు. జిల్లాలో రెండు పార్లమెంట్, 14 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ కర్నూల్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డికి దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో ఆయన తన దూకుడును పెంచినట్లు తెలుస్తోంది. -
కాంగ్రెస్ పార్టీలో చేరిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : రాయలసీమ సీనియర్ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అనంతరం బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, రఘువీరారెడ్డి రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఇటీవల మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. -
'150 ఓట్లు రాలేదు.. నాపై విమర్శలా'
సాక్షి, కర్నూలు: ఉనికి కోసం బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి తనపై ఆరోపణలు చేయడం హ్యాస్యాస్పదమని వైఎస్సార్సీపీ పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత అన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. పాణ్యం నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. బైరెడ్డి చరిత్ర ప్రజలందరికీ తెలుసని.. ఆప్తులు అంటూనే, వారిపై కొడుకుతో దాడి చేయించిన ఘనత బైరెడ్డిదన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసిన బైరెడ్డి తిరిగి ఆయన పంచనే చేరారని తెలిపారు. ఎన్నికల ముందు హత్యలు, దాడులతో ప్రజలను భయపెట్టడం బైరెడ్డికి వెన్నతో పెట్టిన విద్య ఆరోపించారు. చేతనైతే రానున్న ఎన్నికల్లో తనపై పోటీ చేయాలని ఆమె సవాల్ విసిరారు. 150 ఓట్లు కూడా రాని బైరెడ్డి తనపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. -
బైరెడ్డి అరెస్టు
నంద్యాలవిద్య: రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డిరాజశేఖర్‌రెడ్డి శనివారం నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు పర్యటన సందర్భంగా పోలీసులు శనివారం పట్టణంలో బలగాలను మోహరించారు. ఇదే సమయంలో స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డు ఎల్ఐసీ కార్యాలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్పీఎస్ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వచ్చిన బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని టూటౌన్ సీఐ శ్రీనివాసులు, సిబ్బందితో బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. సీఎం సభా ప్రాంగణానికి సమీపంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల పర్యటనను అడ్డుకోవచ్చనే ఉద్దేశంతో ముందస్తు చర్యల్లో భాగంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. అనంతరం బైరెడ్డిని పాణ్యం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
ఒక్క అమరావతి మీదే ఎందుకింత ప్రేమ?
కడప : రాయలసీమ అభివృద్ధి విషయంలో టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం వైఎస్ఆర్ జిల్లాలోని రాజంపేటలో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బయటపడ్డ 300 ఏళ్లకు సరిపడే అపారమైన ఖనిజ సంపద సర్వే ఫలితాలు ఎందుకు బయటపెట్టడం లేదని టీడీపీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. రాయలసీమలో బయటపడ్డ ఒక్క పుల్లరిన్ ఖనిజ సంపదతోనే ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం తారు రోడ్డులకు బదులు బంగారు రోడ్డులు వేయించుకోవచ్చని తెలిపారు. రాష్ట్రానికి సంపదనిచ్చే రాయలసీమను కాదని ఒక్క అమరావతి మీదే ఎందుకింత ప్రేమ అని ముఖ్యమంత్రి చంద్రబాబును బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. -
పుష్కర నిధులు ‘తమ్ముళ్ల’ జేబుకే
సర్కారుపై బెరైడ్డి ధ్వజం ఆగష్టు 12 నుంచి రాయలసీమ పుష్కరాలు నందికొట్కూరు: ‘సీఎం చంద్రబాబు పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణా నదిలోకి తెచ్చి కృష్ణా పుష్కర స్నానాలు చేయమంటున్నారు.. ఆయనకేమైనా మతి ఉంది మాట్లాడుతున్నారా?. ఆ నీటిలో పుష్కర స్నానం చేస్తే పాపాలు పోకపోగా మరిన్ని అంటుకుంటాయి’ అంటూ రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని స్వగృహంలో ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. పిచ్చోడి చేతి రాయి అనే చందంగా రాష్ట్రంలో పాలన కొనసాగుతోందన్నారు. పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం రూ.1277 కోట్లు మంజూరు చేసిందని, అయితే ఇందులో 75శాతం నిధులను టీడీపీ నాయకులు, కార్యకర్తలే కొల్లగొట్టారని ఆరోపించారు. కృష్ణ పురష్కరాల నిధులు తెలుగు తమ్ముళ్ల జేబులు నింపేందుకేనని ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ సొమ్ము వడ్డీలకు కూడా సరిపోవడం లేదన్నారు. ఆగస్టు 12న రాయలసీమ పుష్కరాలు ఆగష్టు 12 సాయంత్రం 4 గంటలకు రాయలసీమ పురష్కరాలు ప్రారంభిస్తునట్లు బెరైడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వెయ్యి మంది మత్తయిదువులతో కృష్ణమ్మకు మంగళహారతులిచ్చే కార్యక్రమం చేపడతామన్నారు. 13న హోమాలు నిర్వహిస్తునట్లు చెప్పారు. -
పశువుల్లా ఎమ్మెల్యేల కొనుగోలు
ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి ధ్వజం కోడుమూరు రూరల్: సంతలో పశువుల బేరం చేసినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రలోబాలకు గురిచేసి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్)వ్యవస్థాపక అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో డబ్బున్నోడిదే రాజ్యమైందని చెప్పారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట సాధనే లక్ష్యంగా చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా బెరైడ్డి రాజశేఖరరెడ్డి మంగళవారం కోడుమూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సమర్థమైన పాలన అందించలేక ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, కోట్లరూపాయాలు ఎరగా వేస్తున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వ్యవహర తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఏదో ఓ రోజు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ప్రజా పాలన మరిచి రాజధాని పేరుతో ఇప్పటికే కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారన్నారు. రుణమాఫీ హామీని బాబు నెరవేర్చకపోవడంతో రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు పెరగిపోయాయన్నారు. విభజన చట్టంలో పదేళ్ల పాటు హైదరాబాద్ నుంచి పాలన సాగించాలని ఉన్నా, రియల్ఎస్టేట్ వ్యాపారం కోసం బాబు రాజధానిని అమరావతికి మార్చరన్నారు. ప్రత్యేక రాయలసీమతోనే అభివృద్ధి ప్రత్యేక రాయలసీమ రాష్ట్రంతోనే సీమ అభివృద్ధి సాధ్యమని ఆర్పీఎస్ వ్యవస్థాప అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరెడ్డి అన్నారు. చైతన్య యాత్రలో భాగంగా బైరెడ్డి బస్సు యాత్ర మంగళవారం మండలంలోని ప్యాలకుర్తి, కొత్తూరు గ్రామాల్లో సాగింది. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ అన్ని విభాగాల్లో రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందన్నారు. చెంతనే నీరున్నా వినియోగించుకోలేని దురదృష్టం మనదన్నారు. దీనికంతంటికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. కార్యక్రమంలో రాయలసీమ పోరాట సమితి అధ్యక్షుడు కృష్ణయ్య, సుంకన్న తదితరులు పాల్గొన్నారు. -
సీమద్రోహి చంద్రబాబు: బైరెడ్డి
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రాయలసీమ ద్రోహి అని రాయలసీమ పరిరక్షణ సమితి(ఆర్పీఎస్) అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రమే లక్ష్యంగా ఆదివారం..కర్నూలు జిల్లా ఆలూరు మండలం మూసానహళ్లి గ్రామం నుంచి రాయలసీమ చైతన్య బస్సు యాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ జిల్లాల అభివద్ధిని చంద్రబాబు మరిచిపోయారన్నారు. సీమవాసి అయినప్పటికీ కోస్తా జిల్లాలపై ప్రేమ చూపుతున్నారన్నారు. సీమలో కష్ణా, పెన్నా, తుంగభద్ర నదులు పారుతున్నా.. ఇక్కడి ప్రజలకు తాగు, సాగునీరు అందడం లేదన్నారు. సీమ జిల్లాల్లో పేదరికం, నిరుద్యోగ సమస్య మున్ముందు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందని బైరెడ్డి అన్నారు. ఉన్నత చదువులు చదివిన ఎంతోమంది నిరుద్యోగులు ‘ఉపాధి’పనులకు వెళ్తున్నారన్నారు. రాజధాని అమరావతి జపం చేస్తూ సీమ జిల్లాలను సీఎం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. కనీసం వర్షపాతం లేకపోవడంతో పంటల సాగు కోసం చేసిన అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నప్పటికీ.. ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. అంతకముందు గ్రామానికి చేరుకున్న బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డికి గ్రామ సర్పంచ్ సోమశేఖర్, ప్రజలు పెద్ద సంఖ్యలో స్వాగతం తెలిపారు. జై రాయలసీమ అంటూ నినాదాలు చేశారు. -
రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి
ఆర్పీయస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): రెండు వందల శాతం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిపై అంత శ్రద్ధ చూపుతున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీయస్)వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, బీజేపీలకు ఆర్థికంగా సాయపడిన వ్యాపారులు, రాజకీయ నాయకులు, ఓ సామాజిక వర్గానికి దోచిపెట్టేందుకు ప్రభుత్వం ఇంతటి దుర్మార్గానికి పాల్పడుతోందన్నారు. రైతుల భూములు లాక్కొని హడావుడి చేస్తున్న ప్రభుత్వంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ చర్యలు తీసుకోకుండా శంకుస్థాపనకు హాజరుకావడం శోచనీయమన్నారు. బుధవారం జిల్లా కేంద్రం కర్నూలులో అమరావతి శంకుస్థాపనను నిరసిస్తూ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం ఎదుట రాయలసీమ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నల్ల దుస్తులు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బెరైడ్డి మాట్లాడుతూ రాయలసీమలో ఏర్పాటు కావాల్సిన రాజధానిని విజయవాడకు తరలించారన్నారు. -
'22న సీమవాసులకు చీకటి దినం'
-
'22న సీమవాసులకు చీకటి దినం'
శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కొన్ని దశాబ్ధాలుగా అన్ని అంశాల్లో రాయలసీమకు అన్యాయమే జరుగుతుందని, మరోసారి దీనిని చంద్రబాబు కొనసాగించారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి తెరలేపారని, లక్షల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, ఆయన అనుయాయులు వేల ఎకరాల భూములు కొన్నారని ఆరోపించారు. చంద్రబాబు అబ్బసొత్తైనట్టు రాజధాని నిర్మాణానికి రూ. వందల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. అమరావతికి ఖర్చు చేస్తున్న రూ. వందలకోట్ల దుర్వినియోగంపై హైకోర్టులో 'పిల్' వేస్తామని తెలిపారు. అమరావతి శంకుస్థాపనకు ముహుర్తమైన 22వ తేదీని రాయలసీమ వాసులకు చీకటిదినంగా ఆయన అభివర్ణించారు. -
ప్యాకేజీల కోసమే ‘ప్రత్యేక’ నాటకాలు
కర్నూలు సిటీ: ప్రత్యేక హోదా అంటూ రాజకీయ పార్టీల నాయకులు ప్యాకేజీల కోసమే దొంగల్లా నాటకాలు ఆడుతున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖర్ రెడ్డి ఆరోపించారు. గురువారం స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో రాయలసీమ జల వనరులు, కరువు కాటకాలపై రౌండ్‌టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1870 నాటి నుంచి రాయలసీమలో కరువు ఉందని బ్రిటీష్ ప్రభుత్వం గెజిట్‌లో తెలిపిందన్నారు. నాడు వారు విదేశీయులైనా సీమ కరువు నివారణ కోసం సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం చర్యలు తీసుకున్నారన్నారు. నేటి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని.. కరువు నివారణ చర్యలు తీసుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయన్నాయని ఆరోపించారు. పెట్టుబడుల కోసం కొంత మంది రైతులు కిడ్నీలు..అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీమలో 60 శాతం మందికి ఒక్క పూట కూడా తిండి దొరకనంత కరువు నెలకొందని, 45 ఏళ్లలో ఎప్పుడూ ఇలాంటి దుస్థితి చూడలేదన్నారు. కరువు ప్రాంతాన్ని వదిలేసి.. సీఎం చంద్రబాబు నిద్ర లేచినప్పటి నుంచి పడుకునే వరకు అమరావతి పేరుతోనే కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. సొంత లాభం కోసం పట్టిసీమను నిర్మిస్తున్నట్లు అనుమానం వస్తోందన్నారు. సీమ కరువుపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలనే వచ్చే నెల 9న ఢిల్లీలో జల సాధన దీక్ష చేపట్టనున్నట్లు బెరైడ్డి తెలిపారు. ప్రముఖ విద్యా సంస్థల అధినేత కె.వి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఏటా వందల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతున్నా వాటిని వినియోగించించుకునేలా పాలకులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రాయల సీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ సోమశేఖర్ శర్మ మాట్లాడుతూ..బ్రిటీష్ ఇంజనీర్ సర్ మెకంజీ సూచించిన విధంగా తుంగ, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేయాలన్నారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో దళిత సంఘం నాయకుడు బాలసుందరం, ప్రముఖ రిటైర్ హైడ్రాలాజీకల్ నిపుణుడు సుబ్బరాయుడు, ప్రైవేటు స్కూళ్ల సంఘం మాజీ అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో పలు విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోండి
సాక్షి, కర్నూలు: కర్ణాటక జల దోపిడీని తక్షణమే కేంద్ర ప్రభుత్వం, సీడబ్ల్యూసీ దృష్టికి తీసుకెళ్లాలని, రాజకీయాలను పక్కనపెట్టి రెం డు తెలుగు రాష్ట్రాల ప్రజానీకం, రైతంగానికి మేలు జరిగేలా ముఖ్యమంత్రులిద్దరు కలిసి నిర్ణయం తీసుకోవాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన కర్నూలులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘పూడికతో టీబీ డ్యాం సామర్థ్యం తగ్గింది. దీనికితోడు చుట్టూ 62 ఎత్తిపోత పథకాల ద్వారా 15 టీఎంసీ నీటిని చోరీ చేస్తున్నారు. వాటికి ఆ ప్రభుత్వం అధికారికంగా విద్యుత్ సౌకర్యం కల్పించింది. సింగటలూరు ప్రాజెక్టువల్ల మరో 40 టీఎంసీల దోపిడీ జరుగుతోంది. ఇక పరిశ్రమలకు 3.5 టీఎంసీలు వాడుకుంటున్నామంటూ ఏకం గా 15 టీఎంసీల నీటిని వినియోగిస్తున్నా రు. ఇవి కాకుండా తాజాగా భద్రపైన 30 టీఎంసీలు, తుంగపైన 30 టీఎంసీల చొ ప్పున 60 టీఎంసీల నీటి వినియోగంతో రెండు కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం ఆసియా అభివృ ద్ధి బ్యాంకునుంచి రూ.900 కోట్ల రుణం తీసుకున్నారు. ఇవి పూర్తయితే మనకొచ్చే 130 టీఎంసీల నీటిని తన్నుకుపోవడంతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల కు.. ప్రధానంగా రాయలసీమకు తీరని నష్టం జరుగుతంది.’ అని బెరైడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. తెలుగు రా ష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయాలకు అతీతంగా ఈ గండం నుంచి బయటపడే మార్గాలను అన్వేషించాల న్నారు. సుప్రీంకోర్టులోనూ న్యాయపోరాటం చేయాలన్నారు. -
చంద్రబాబు ఒప్పుకుంటే టీడీపీలో చేరతా..
కర్నూలు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ తెలుగుదేశం తన సొంత పార్టీ అని, అవసరం అయితే రాయలసీమ అభివృద్ధి కోసం టీడీపీ చేరతానని తెలిపారు. రాయలసీమను అభివృద్ధి చేయలని చంద్రబాబు, ప్రధాని నరేంద్ర మోదీని కోరతానని బైరెడ్డి చెప్పారు. చంద్రబాబుతో కలిసి పనిచేస్తానని ఆయన తెలిపారు. కాగా గతంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి...మరోచోట గత్యంతరం లేని ఎమ్మెల్యేలు, నాయకులే టీడీపీలో చేరుతున్నారని ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. ఎవరైతే విభజనవాదులో... అలాంటి నేతలందరూ ఒక్కచోటికి చేరిపోతున్నారని ఆయన విమర్శలు చేశారు. -
కోర్టులో లొంగిపోయిన బైరెడ్డి
-
రాయలసీమ రాష్ట్రాన్ని ప్రకటించాల్సిందే: బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి
కర్నూలు(సిటీ), న్యూస్‌లైన్: రాయలసీమ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి కర్నూలును రాజధానిగా ప్రకటించాలని రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బెరైడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రత్యేక రాయలసీమ డిమాండ్‌తో బెరైడ్డి చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్ష సోమవారం ప్రారంభమైంది. స్థానిక జిల్లా పరిషత్ గాంధీ విగ్రహం ఎదుట జరిగిన దీక్షలో ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా మూడేళ్లపాటు కొనసాగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైందని, దీంతో రాజధాని కర్నూలును కాదని హైదరాబాద్‌కు తరలిపోయిందన్నారు. ప్రస్తుతం సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని విభజించి రాయలసీమకు తీవ్ర అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ఇందుకు కారణమైన కాంగ్రెస్‌తోపాటు సహకరించిన టీడీపీ, బీజేపీలను తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వెనుకబాటుతో ఉన్న రాయలసీమ బాగు పడాలంటే ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఈ ప్రాంత ప్రజాప్రతి నిధులు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం ద్వారా ఒత్తిడి తేవాలని సూచించారు. అంతకుముందు గౌరీ గోపాల్ ఆసుపత్రి ఎదురుగా ఉన్న శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి ఆయన పూలమాల వేశారు. అక్కడి నుంచి రాజ్‌విహార్, జిల్లా పరిషత్తు గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. రాయలసీమ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి మహబూబ్ సాహెబ్, సమితి నాయకులు శ్రీరాములు, రామచంద్రారెడ్డి, త్యాగరాజు, కొండయ్య, సురేంద్రారెడ్డితోపాటు సివి.రామన్, కేవిఆర్, పుల్లయ్య, రవీంద్ర కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి యువజన సంఘాలు, ఇరిగేషన్ ఉద్యోగుల సంఘం నాయకులు బెరైడ్డిని కలిసి సంఘీభావం ప్రకటించారు. -
సీమ జోలికొస్తే చీరేస్తా!
రాష్ట్ర విభజన ప్రక్రియ చురుగ్గా సాగుతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ప్రాంతాలవారీగా విడిపోయిన నేతలు పరస్పరం వాగ్బాణాలు విసురుకుంటున్నారు. నువ్వొకటి అంటే నేరెండంటా తరహా తన్నుకుంటున్నారు. ఇదే సమయంలో పరుష పదజాలం వాడేందుకు కూడా వెనుకాడడం లేదు. తాము ప్రజా ప్రతినిధులమన్న సంగతి మర్చిపోయి దిగజారుతున్నారు. సినిమా డైలాగులు చెబుతూ రెచ్చగొడుతున్నారు. కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుపై రాయలసీమ పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) నాయకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి చేసిన వ్యాఖ్యలు తాజాగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. రాయల తెలంగాణ ప్రతిపాదన చేసిన కావూరిపై పరుష పదజాలంతో బైరెడ్డి విరుచుకుపడ్డారు. రాయలసీమ జోలికొస్తే చీరేస్తా అంటూ ఊగిపోయారు. కావాలంటే కోస్తా ప్రాంతాన్ని చీల్చుకోమని సలహాయిచ్చారు. 'కోయాలనుకుంటే కోస్తాను కోసుకోండి, సీమను కోయాలని చూస్తే... కోస్తాం జాగ్రత్త' అంటూ బైరెడ్డి హెచ్చరించారు. తమ ప్రాంత అస్తిత్వాన్ని కాలరాసే హక్కు కావూరికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. సీమాంధ్రకు రాయలసీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలని బైరెడ్డి డిమాండ్ చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదనను బహిరంగంగా సమర్ధించిన జేసీ దివాకర్ రెడ్డిని బైరెడ్డి ఒక్కమాట అనకపోవడం గమనార్హం. కాగా బుధవారం హైదరాబాద్‌లో జరిగిన రాయలసీమ ప్రజా ప్రతినిధుల సమావేశంలోనూ కావూరిపై పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. కొత్త రాజధానిని కృష్ణా జిల్లాకు తరలించాలన్న కుట్రతోనే కావూరి రాయల తెలంగాణ ప్రతిపాదన చేశారని మండిపడినట్టు తెలిసింది. రాయల తెలంగాణ ప్రతిపాదన మరుగున పడకుంటే కావూరిని కడిగిపారేసే వాళ్లమని అన్నారు(ట). మొత్తానికి రాష్ట్ర విభజన నేతల మధ్య పెద్ద చిచ్చే పెట్టిందనే చెప్పాలి. -
సీమను విడదీస్తే కోర్టుకు వెళతాం: బైరెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాయలసీమను విడదీసి ఇతర ప్రాంతాల్లో కలిపేందుకు ప్రయత్నిస్తే.. అడ్డుకునేందుకు కోర్టులను ఆశ్రయిస్తామని ‘రాయలసీమ పరిరక్షణ సమితి’ పార్టీ అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి తెలిపారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని అడ్డుకుంటామని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పడం ఆయన అవగాహనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. సోమవారం బెరైడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ఈనెల 28, 29 తేదీల్లో ఢిల్లీలో ధర్నా చేయనున్నట్లు తెలిపారు. -
రాయలసీమ విచ్ఛిన్నాన్ని అడ్డుకుంటాం: బైరెడ్డి
హైదరాబాద్: రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి డిమాండ్ చేశారు. రాయల తెలంగాణ ప్రతిపాదన తెస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆగినట్టేనని వ్యాఖ్యానించారు. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలంటే రాజ్యాంగ సవరణ అవసరమన్నారు. రాయలసీమ విచ్ఛిన్నాన్ని కోర్టు ద్వారానైనా అడ్డుకుంటామన్నారు. సీమ విచ్ఛిన్న మవుతుంటే చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. విభజన అనివార్యమైతే ఆంధ్రప్రదేశ్‌ను మూడు రాష్ట్రాలుగా విభజించాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బైరెడ్డి రాజశేఖరరెడ్డి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. -
బెరైడ్డి బస్ యాత్రలో ఘర్షణ
బుచ్చినాయుడుకండ్రిగ, న్యూస్‌లైన్: రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాజశేఖరరెడ్డి బస్సు యాత్రలో ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా బుచ్చినాయుడుకండ్రిగ మండలంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. బస్సు యాత్ర సభ జరుగుతున్న సమయంలో రెండు కార్లలో ఆయన అనుచరులు బుచ్చినాయుడుకండ్రిగకు బయలుదేరారు. మార్గమధ్యంలోని గోవర్థనపురం వద్ద ఆ కార్లను ఓ ఆటో ఓవర్టేక్ చేసింది. దీంతో బెరైడ్డి అనుచరులు ఆటోను ఆపి డ్రైవర్ వెంకటేష్, మరో వ్యక్తిని చితకబాదారు. వెంకటేష్ అక్కడికి సమీపంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందినవాడు. జరిగిన విషయాన్ని కాలనీలోని బంధువులకు ఫోన్లో తెలిపాడు. దీంతో కాలనీవాసులు కార్లను అడ్డుకోబోయారు. ఓ కారు వెళ్లిపోగా, మ రో కారులో ఉన్న ముగ్గురిపై కాలనీ వాసులు దాడి చేశారు. వారిలో మధు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. కారు వెనుక అద్దాలు పగిలాయి. ఇంతలో సభను ముగించుకుని బస్‌లో వస్తున్న బెరైడ్డి రాజశేఖరరెడ్డిని కాలనీవాసులు చుట్టుముట్టారు. బెరైడ్డి గంటసేపు బస్‌లోనే ఉండిపోయారు. ఈలోపు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాలనీవాసులకు సర్ది చెప్పారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.