
సాక్షి, కర్నూలు : బీజేపీ నాయకుడు బైరెట్టి రాజశేఖర్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలపై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఘాటుగా స్పందించారు. శ్రీశైల ప్రతిష్ఠను దిగజార్చే విధంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తన కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆయన సీబీఐ విచారణ జరిపి అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. బీజేపీ పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని, అలా కాదని పార్టీలో ఉంటూ తను ప్రవర్తిస్తున్న తీరు బాగాలేదని రాజశేఖర్‌రెడ్డిపై మండిపడ్డారు. మత విశ్వాసాలను హిందూ ధర్మాన్ని పెంచేలా చేయాలో తప్ప ఇలా దేవస్థానాలపై బురద చల్లడం మంచింది కాదని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment