Shilpa chakrapani Reddy
-
లోకేష్ పై శిల్పా చక్రపాణి రెడ్డి సంచలన కామెంట్స్
-
నామినేషన్ దాఖలు చేసిన శిల్పా చక్రపాణిరెడ్డి
-
అడ్డగోలుగా వాడుకుని గాలికి వదిలేసాడు: శిల్పా చక్రపాణి రెడ్డి
-
‘ ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం’
సాక్షి, కర్నూలు : బీజేపీ నాయకుడు బైరెట్టి రాజశేఖర్‌రెడ్డి చేస్తున్న ఆరోపణలపై శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఘాటుగా స్పందించారు. శ్రీశైల ప్రతిష్ఠను దిగజార్చే విధంగా బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. తన కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న ఆయన సీబీఐ విచారణ జరిపి అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. బీజేపీ పార్టీకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయని, అలా కాదని పార్టీలో ఉంటూ తను ప్రవర్తిస్తున్న తీరు బాగాలేదని రాజశేఖర్‌రెడ్డిపై మండిపడ్డారు. మత విశ్వాసాలను హిందూ ధర్మాన్ని పెంచేలా చేయాలో తప్ప ఇలా దేవస్థానాలపై బురద చల్లడం మంచింది కాదని ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి హితవు పలికారు. -
ఏడాది పాలన అద్బుతంగా సాగింది
-
చదువుకున్న ప్రతి నిరుద్యోగికి ఉపాధి - శిల్పా చక్రపాణి
సాక్షి, ఆత్మకూరు: చదువుకున్న ప్రతి నిరుద్యోగికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నదే తమ లక్ష్యమని వైఎస్ఆర్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. ఆత్మకూరు పట్టణంలోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో శనివారం మెగా జాబ్‌మేళా నిర్వహించారు. శిల్పాతో పాటు నంద్యాల ఎంపీ పోచాబ్రహ్మానందరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని జ్యోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శిల్పాచక్రపాణిరెడ్డి మాట్లాడుతూ శ్రీశైల నియోజవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్నారు. ఆత్మకూరులో అత్యధికంగా పేద కుటుంబాలు ఉన్నాయని.. వీరికి ఉపాధి కల్పించే పరిశ్రమల ఏర్పాటకు కృషి చేస్తానన్నారు. త్వరలో ఈ ప్రాంతాన్ని ఉద్యోగుల ఖిల్లాగా మారుస్తానని చెప్పారు. అందులో భాగంగానే 1500 మందికి ఉద్యోగాలు ఇచ్చేందుకు 23 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జాబ్‌మేళాకు భారీగా హాజరైన నిరుద్యోగులు డీఎస్సీకీ ప్రిపేర్ అవుతున్న వారికి స్థానికంగా ఉచిత కోచింగ్ ఇప్పిస్తానని చెప్పారు. నందికొట్కూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీశైల నియోజకవర్గ అభివృద్ధి శిల్పాతోనే సాధ్యమన్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా గ్రామ,వార్డు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అంతకుమునుపు వైఎస్సార్సీపీ నాయకులు శిల్పాకార్తీక్ రెడ్డి, శిల్పా భువనేశ్వరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో డీఆర్డీఎ పీడీ శ్రీనివాసులు, తహసీల్దార్ ఆదినారాయణ, ఎంపీడీఓ కృష్టమోహన్, సీఐ కళావెంకటరమణ, వైఎస్సార్సీపీ నాయకులు అంజాద్‌అలీ, చిట్యాల వెంకటరెడ్డి, శరభారెడ్డి, సులేమాన్, సుల్తాన్, ఫరుక్, సురేష్, దినకర్, నాగేశ్వరరెడ్డి, డిగ్రీకళాశాల కరస్పాండెంట్ గోపిశెట్టి వసుంధర, వెంకటేశ్వర్లు, వార్డు కౌన్సిలర్ సభ్యులు స్వామి, ముర్తుజా, రెహమాన్, కలిములా పాల్గొన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అందివచ్చిన ఉపాధి, ఉద్యోగ అవకాశాలను నిరుద్యోగ యువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి అన్నారు. పని ఏదైనా ఇష్టపడి చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారని..ప్రయోజకులై వాటిని తీర్చాలన్నారు. – ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి జాబ్‌మేళా నిర్వహించడం అభినందనీయం జిల్లాలో మారుమూల నియోజకవర్గం శ్రీశైలమని ఆలాంటి ప్రాంతంలో ఎమ్మెల్యే శిల్పా మెగా జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శ్రీశైలాన్ని మోడల్ నియోజకవర్గంగా చేస్తామని చెప్పారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడం గొప్ప విషయమన్నారు. – చల్లా రామకృష్టారెడ్డి, ఎమ్మెల్సీ -
జగన్ సూచనతో 90 రోజుల్లోనే రాజీనామా..
సాక్షి, అమరావతి: రాజకీయ నైతిక విలువలకు కట్టుబడి ఎమ్మెల్సీగా గెలిచిన 90 రోజుల్లోనే పదవికి రాజీనామా చేశారని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన శాసససభలో మాట్లాడుతూ.. దేశ చరిత్రలో అతి తక్కువ రోజుల్లో రాజీనామా చేసిన మండలి సభ్యుడిని తానేఅని తెలిపారు. నంద్యాల ఉప ఎన్నికల సందర్భంగా తాము వైఎస్సార్సీపీలో చేరాలని నిర్ణయించుకున్నామని.. అయితే టీడీపీ ద్వారా వచ్చిన పదవికి రాజీనామా చేస్తేనే తమ పార్టీలో చేర్చుకుంటామని వైఎస్ జగన్ చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. ఆయన సూచన మేరకు, విలువలకు గౌరవించి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని పేర్కొన్నారు. గత ప్రభుత్వం నైతిక విలువలు అనే పదానికి అర్థం లేకుండా చేసిందని.. చట్టాలను చుట్టాలుగా మార్చుకుని అనేక అవినీతి చర్యలకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనవద్దని తాను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి అనేక సార్లు చెప్పానని.. కానీ తన మాట వినకుండా పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసి 23 ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని చక్రపాణి మండిపడ్డారు. ఆనాడు తన మాటవిని ఉంటే ఈరోజు చంద్రబాబు పరువు కాపుడుకునేవారని అన్నారు. రాజకీయ నాయకులు పార్టీలు మారకుండా పటిష్టమైన చట్టాలను తీసుకురావాలని సభలో ఆయన కోరారు. శ్రీశైలం నియోజకవర్గంలోని శ్రీశైలం మండలం సున్నిపేట గ్రామం 60 ఏళ్లుగా కనీసం గ్రామ పంచాయతికి నోచుకోలేదని.. ఇటీవల సీఎం దృష్టికి తాను తీసుకువస్తే.. కేవలం పదిహేను రోజుల్లోనే గ్రామ పంచాయతీ చేశారని అభినందించారు. ఇలాంటి సీఎం దేశ చరిత్రలో ఎవరూ ఉండరని ఆయన కొనియాడారు. చంద్రబాబు అసెంబ్లీలోఅడుగుపెట్టడానికి అనర్హుడు.. ఐదేళ్ల పాలనలో వ్యవస్థలను నీరుగార్చి ఘనుడు చంద్రబాబు నాయుడని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు విమర్శించారు. గత ప్రభుత్వంలో ప్రజలను అనేక మోసాలకు గురిచేసిన చంద్రబాబు శాసన సభలో అడుగుపెట్టడానికి అనర్హుడని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులను తొలుత ప్రోత్సహించింది ఆయన కాదా అని సభలో ప్రశ్నించారు. అంతేకాకుండా ఫిరాయింపు ఎమ్మెల్యేకు ఏకంగా మంత్రి పదవులు కూడా ఇచ్చారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో అనేక మంది అధికారులపై దాడులు జరిగాయని ఆయన సభ దృష్టికి తీసుకువచ్చారు. -
గ్రామ పంచాయతీగా సున్నిపెంట
కర్నూలు(అర్బన్): రెవెన్యూ గ్రామంగా ఉన్న సున్నిపెంట ఇక గ్రామ పంచాయతీగా మారనుంది. మంగళవారం రాజధాని అమరావతిలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన హై లెవెల్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర పంచాయతీరాజ్, నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలు గోపాలక్రిష్ణ ద్వివేది, ఆదిత్యనాథ్ దాస్, పీఆర్ కమిషనర్ గిరిజాశంకర్, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి కేఎల్ ప్రభాకర్‌రావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జె. హరిబాబుతో పాటు అటవీ శాఖ అధికారులు హాజరయ్యారు. ముందుగా నీటి పారుదల, అటవీ, పంచాయతీకి సంబంధించిన పలు అంశాలపై సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా సున్నిపెంటను గ్రామ పంచాయతీగా గుర్తించేందుకు అడ్డంకిగా ఉన్న స్టేను ఎత్తివేసేందుకు నిర్ణయం తీసుకున్నారని జిల్లా పంచాయితీ అధికారి కేఎల్ ప్రభాకర్‌రావు చెప్పారు. అలాగే ప్రాజెక్టు పరిధిలో ప్రస్తుతం ఉన్న జనవాసాలు 1468 ఎకరాలకు మించకుండా రెవెన్యూ, అటవీ శాఖలకు చెందిన అధికారులు సంయుక్తంగా సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసుకోవాలని సమావేశంలో నిర్ణయించారన్నారు. గ్రామ పంచాయతీ ఏర్పాటుకు సంబంధించి ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే ప్రతిపాదనల రూపంలో పంపాలని జిల్లా కలెక్టర్‌ను కోరారన్నారు. త్వరలోనే సున్నిపెంటను గ్రామ పంచాయతీగా గుర్తిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నట్లు డీపీఓ తెలిపారు. నాడు వైఎస్ఆర్ ప్రకటించారు 2006 వ సంవత్సరంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీఓ నంబర్ 2 జారీ చేస్తూ సున్నిపెంటను గ్రామ పంచాయతీగా ప్రకటించారు. ఈ విషయాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి కమిటీ ముందు పెట్టారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో సున్నిపెంట గ్రామం ఉందని పంచాయతీగా మారిస్తే అటవీ శాఖ భూములు అన్యాక్రాంతమవుతాయని అభ్యంతరం తెలపగా అందుకు శిల్పా అటవీభూముల సరిహద్దుల వద్ద ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునేందుకు రూ. 25 లక్షల నిధుల మంజూరుకు హామీ ఇచ్చారు. ఇందుకు అటవీ అధికారులు సమ్మతించడంతో గ్రామ పంచాయతీ ప్రకటనకు లైన్ క్లియర్ అయింది. ఈ విషయం తెలియగానే సున్నిపెంటలోని పార్టీ కార్యాలయలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు శిల్పాభువనేశ్వరరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వట్టి వెంకటరెడ్డి , ముస్లిం మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఎంఏ రజాక్, మండల నాయకులు భరత్‌రెడ్డి, పార్టీ కార్యకర్తలు బాణ సంచాపేల్చి సంబరాలు చేసుకున్నారు. ఇచ్చిన హామీ నెరవేర్చా సున్నిపెంటను గ్రామపంచాయతీ చేయిస్తానని ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకున్నాను. ఇందు కోసం ముఖ్యమంత్రిని పలుమార్లు కలిశాను. ఎల్టకేలకు గ్రామ పంచాయతీ కావడంతో గ్రామవలంటీర్ల నియామకాలతో పాటు గ్రామ సచివాలయం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. స్థానికులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక నుంచి సున్నిపెంట అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారిస్తా. భవిష్యత్‌లో నగర పంచాయతీగా మార్చేందుకు నా వంతు కృషి చేస్తా. – ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి -
కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి తిరుగులేదు
-
నిరుద్యోగ సమస్య పరిష్కారమవ్వాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలి
-
నందుల కోటలో ‘‘శిల్పా’’ పట్టు..
సాక్షి, నంద్యాల : నందుల కోట నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో రసవత్తర పోరు నెలకొంది. వైఎస్సార్సీపీ తరఫున మాజీ మంత్రి శిల్పామోహన్‌రెడ్డి కుమారుడు శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి బరిలో ఉన్నారు. టీడీపీ తరఫున భూమా బ్రహ్మానంద రెడ్డి పోటీ చేస్తున్నారు. శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి.. పల్లెనిద్ర–రచ్చబండ కార్యక్రమాల ద్వారా పల్లె ప్రజలకు చేరువయ్యారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. అంతేకాకుండా శిల్పా సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశారు. టీడీపీ నాయకుల అవినీతి కార్యక్రమాలు ఎక్కడికక్కడ ఎండగట్టారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి ప్రజా సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారు. ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. రోడ్డు విస్తరణ బాధితులకు పరిహారం అందించలేకపోయారు. భూమా అనుచరులు అభివృద్ధి పనుల్లో కమీషన్లు తీసుకోవడంతో టీడీపీకి వ్యతిరేక గాలి వీస్తోంది. నంద్యాల నియోజకవర్గం 1952లో అవతరించింది. ప్రస్తుతం నంద్యాల పట్టణం, నంద్యాల, గోస్పాడు మండలాలు నియోజకవర్గం లో ఉన్నాయి. ఇప్పటి వరకు 15సార్లు నంద్యాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. 2009లో నంద్యాల నియోజకవర్గంలో ఉన్న బండిఆత్మకూరు, మహానంది మండలాలను శ్రీశైలం నియోజకవర్గంలో కలిపారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఉన్న గోస్పా డు మండలాన్ని నంద్యాల నియోజకవర్గానికి కలిపారు. ఇప్పటి వరకు నంద్యాల పార్లమెంట్, అసెంబ్లీ ఏ వర్గానికి రిజర్వ్ కాలేదు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2004లో ఎన్ఎండీ ఫరూక్‌పై శిల్పామోహన్‌రెడ్డి 40,677ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇది నియోజకవర్గ చరిత్రలో అత్యధిక మెజార్టీ. 1978లో నబీ సాహెబ్‌పై బొజ్జా వెంకటరెడ్డి 1,693 ఓట్లతో గెలుపొందారు. ఇది నియోజకవర్గంలో అత్యల్ప మెజార్టీ. పదవులు..నంద్యాల నియోజకవర్గం నుంచి గెలిచిన నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతి పదవిని, పీవీనరసింహరావు ప్రధాన మంత్రి పదవిని, పెండే కంటి వెంకటసుబ్బయ్య కేంద్ర హోం శాఖ మంత్రి పదివిని అలంకరించారు. అలాగే శిల్పామోహన్‌రెడ్డి, ఎన్ఎండీ ఫరూక్‌లు మంత్రి పదవులు చేపట్టారు. -
‘అక్షయ గోల్డ్ బాధితుల పక్షాన పోరాడుతాం’
సాక్షి, కర్నూలు: అగ్రిగోల్డ్ బాధితులు పక్షాన పోరాడిన విధంగానే అక్షయ గోల్డ్ బాధితుల తరఫున కూడా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. అక్షయ గోల్డ్ బాధితుల పక్షాన ప్రత్యేక అధ్యయన కమిటీ వేసి వారికి అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీని బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కర్నూల్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్‌గా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. సమావేశంలో వేమిరెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కర్నూలు జిల్లాల్లోని రెండు లోక్‌సభ స్థానాలతోపాటు 14 అసెంబ్లీ సీట్లను కూడా సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజలతో పార్టీని సమన్వయ పరిచి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపుకు కృషిచేయాలని పేర్కొన్నారు. జిల్లాలో మరిన్ని స్థానాలకు గెలిపించి వైఎస్ జగన్‌కు బహుమతిగా ఇస్తామని నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. -
బాబుకు బుద్ధి చెప్పండి
కర్నూలు, నంద్యాల: హామీలు నెరవేర్చకుండా బీసీలను మోసం చేస్తున్న సీఎం చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పాచక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలో గురువారం నిర్వహించిన బీసీల మహా ర్యాలీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పద్మావతినగర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ఇన్చార్జి ఆర్డీఓ అనురాధకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 110 హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఎన్నికలు వస్తున్న తరుణంలో ఆదరణ పథకం అంటూ మోసం చేస్తున్నారన్నారు. జగనన్న సీఎం అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోగోలు శివశంకర్‌నాయుడు, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, కర్రాహర్షవర్ధన్రెడ్డి, దేశం సుధాకర్‌రెడ్డి, చైర్పర్సన్ దేశం సులోచన, పీపీ మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ రాకేష్‌రెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, శ్రీశైలం నాయకులు మద్దిలేటి, వెంకటేశ్వర్లు, కదిరి శీను, సురేష్, రంగయ్య, నంద్యాల నాయకులు రమేష్నాయు డు, శివప్రసాద్, జగన్‌ప్రసాద్, సుబ్బరాయుడు, పున్నా శేషయ్య, ప్రసాద్ యాదవ్, ఆళ్లగడ్డ నాయకులు బోయిలకుంట్ల నాగన్న, సింగం భరత్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి, నాగేశ్వరరావు, నరసింహ పాల్గొన్నారు. ఓట్ల కోసమే ఆదరణ పథకం బీసీల ర్యాలీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తారనే నమ్మకం కలుగుతోంది. వైఎస్సార్ హయాంలో ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలతో బీసీలు లబ్ధి పొందారు. ఓట్ల కోసం ప్రస్తుతం చంద్రబాబు ఆదరణ పథకాన్ని తెరపైకి తెచ్చారు.– గౌరు చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే దోచుకోవడమే టీడీపీ నేతల పని.. ప్రజాసంక్షేమాన్ని మరచి టీడీపీ నేతలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు హామీలు అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారు. వీరి ఆటలు ఇక సాగబోవు. జగనన్న అధికారంలోకి వస్తే బడుగు, బలహీన వర్గాల సంక్షేమం సాధ్యమవుతుంది. –గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్వేతపత్రం విడుదల చేయాలి నాలుగున్నరేళ్ల కాలంలో బీసీలకు ప్రభుత్వం ఏయే పనులు చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలి. కోటి హామీలు అమలు చేయకపోవడంతో 2004లో ప్రజలు చంద్రబాబును తరిమికొట్టారు. 2019 ఎన్నికల్లో అదే పునరావృతం అవుతుంది. వైఎస్సార్ హయాంలో బీసీల సంక్షేమం సాధ్యమైంది. –కాటసాని రాంభూపాల్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కులానికో హామీ ఇచ్చారు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు..కులానికో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని అ మలు చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. చేనేతలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యా రు. గొర్రెల కాపరుల కోసం రైతు బజారుల మాదిరి విక్రయ బజారులు ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పారు. –శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, నంద్యాల నియోజకవర్గ నేత మోసం..బాబు నైజం వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తానని మోసం చేశారు. పద్మశాలీయులను ఎస్సీ–ఏలుగా, బలిజలను బీసీలుగా మారుస్తామని ఇష్టమొచ్చినట్లు వాగ్దానాలు చేసిన చరిత్ర చంద్రబాబుకే దక్కింది. మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారు. ఉనికి కోసం, అధికారం కోసం టీడీపీ అధినేత ఏమైనా చేస్తారని నిరూపించుకున్నారు. – బైరెడ్డి సిద్ధార్థరెడ్డి,నందికొట్కూరు నియోజకవర్గ ఇన్చార్జ్ బీసీలపై పెరుగుతున్న దాడులు టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలపై రోజురోజుకు దాడులు అధికమవుతున్నాయి. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. జగనన్న పాదయాత్రలో బీసీలు పెద్ద ఎత్తున పాల్గొంటూ సమస్యలపై వినతి పత్రాలు అందజేస్తున్నారు. చంద్రబాబు చేసిన మోసాలను ఏకరువు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి బీసీలు వెన్నుద న్నుగా ఉండి గెలిపిస్తారనే నమ్మకం ఉంది.– కాటసాని రామిరెడ్డి,బనగానపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్ వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం వైఎస్సార్ పాలన మళ్లీ రావాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. వైఎస్సార్ హయాంలో బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగింది. ప్రస్తుతం బీసీలు అంతా వైఎస్సార్సీపీ వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం. – గంగుల బిజేంద్రారెడ్డి,ఆళ్లగడ్డ నియోజకవర్గ నేత -
కబడ్డీ.. కబడ్డీ
కర్నూలు, బండిఆత్మకూరు: నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి కాసేపు క్రీడాకారుడిగా మారిపోయారు. బండిఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జోనల్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని కబడ్డీ క్వార్టర్ ఫైనల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో జోష్ నింపేందుకు శిల్పా.. కబడ్డీ... కబడ్డీ అంటూ రైడింగ్‌కు వెళ్లి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని ఉరకలెత్తించారు. -
‘ఆయన దళితుల పట్ల వివక్షత చూపటం దారుణం’
సాక్షి, కర్నూలు : సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితుల పట్ల వివక్షత చూపటం దారుణమని వైఎస్సార్ సీపీ నందికోట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యానించారు. గురువారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐజయ్య మాట్లాడుతూ.. దళితులను కించపరుస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమన్నారు. దళితుల సంక్షేమాన్ని పక్కనపెట్టి దళితుల సబ్ ప్లాన్ నిధులను ఇతర రంగాలకు కేటాయించి చంద్రబాబు దళితులను మోసం చేశారని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ : శిల్పా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని వైఎస్సార్ సీపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. గురువారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ.. బి.ఆర్ అంబెద్కర్ రాజ్యంగ రచయిత , ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అయినటువంటి గొప్పవ్యక్తిగా పేర్కొన్నారు. -
బుడ్డా..నోరు అదుపులో పెట్టుకో
సాక్షి, ఆత్మకూరు: ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం నియోజకవర్గ సమన్వయకర్త శిల్పా చక్రపాణిరెడ్డి హితవు చెప్పారు. సోమవారం ఆయన ఆత్మకూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బుడ్డా రాజశేఖరరెడ్డి అయ్యప్ప మాలధారణ చేసి అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. నైతిక విలువలు, అవినీతి గురించి ఆయన మాట్లాడడం విడ్డూరమన్నారు. ‘నేను అవినీతికి పాల్పడుతున్నానని చెప్పడం సిగ్గుచేటు. శ్రీశైలం పాతాళగంగలో మునిగి అవినీతిపై బహిరంగంగా చర్చిద్దాం.. సవాల్‌కు సిద్ధమేనా? వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన నీవు టీడీపీలో చేరినప్పుడు సీఎం చంద్రబాబు దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండానే చేరావా? పార్టీ మారేటప్పుడు మీరు రాజీనామా చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా ఇస్తానని అన్నావు. నేను నైతిక విలువలకు కట్టుబడి రాజీనామా చేశా. మరి నీవెందుకు చేయలేదు’ అని సూటిగా ప్రశ్నించారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరినప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పశువులను కొన్నట్లు కొన్నారని చంద్రబాబు అన్నారని, మరి అదే ఏపీలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 23 మందిని ఎలా కొన్నారని నిలదీశారు. ఎమ్మెల్యే బుడ్డా ఎన్ని కోట్లకు అమ్ముడుపోయారో నియోజకవర్గ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. ‘నీరు– చెట్టు, మట్టి, ఇసుక ..ఇలా ప్రతి పనిలో అవినీతికి పాల్పడలేదా? నీ వెంట ఉన్న వారే నీవు అవినీతికి పాల్పడుతున్నావని అంటున్నారు. వినిపించడం లేదా? ఏ అవినీతికీ పాల్పడని నన్ను విమర్శించడం భావ్యమా? ప్రతిపక్ష పార్టీలో ఉన్న మాకు ప్రశ్నించే అధికారం ఉంది. విమర్శలను స్వీకరించి బాధ్యతగా నడుచుకోవాలే తప్ప ఇష్టారాజ్యంగా మాట్లాడడం తగదు. శ్రీశైలంలో శిల్పా ఇళ్లు ఎలా కట్టిస్తారని అంటున్నావు. అది కూడా తెలియదా? చంద్రబాబును అడుగు.. ఆయనే చెబుతాడు. అటవీ భూములు కావాల్సి వస్తే.. అందుకు ప్రతిగా మరో భూమిని ఇప్పిస్తే క్లియరెన్స్ వస్తుంది. ప్రభుత్వం ఉంటే ఇళ్లు కట్టించడం పెద్ద సమస్య కాద’ని అన్నారు. సిద్ధాపురం చెరువు కింద పంటలు ఎండిపోతున్నా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి వెలుగోడు రిజర్వాయర్‌కు నీరు నింపే సమయంలోనే సిద్ధాపురం చెరువుకూ నింపివుంటే పంటలు ఎండేవి కాదన్నారు. చెరువులో సగం టీఎంసీ నీరు లేకున్నా పది వేల ఎకరాలకు పారించానని ఎమ్మెల్యే చెప్పడం శోచనీయమన్నారు. తెలుగుగంగ రిజర్వాయర్‌లోని మూడు టీఎంసీల నీరు ఇప్పిస్తే మహానంది, బండిఆత్మకూరు, వెలుగోడు మండలాల్లోని వరి పొలాలకు నీరు పారించి పంటలు ఎండిపోకుండా కాపాడతానని, మరి నీరిప్పించే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. ఇందిరేశ్వరం, వడ్లరామాపురం గ్రామాలకు ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయించి నీరు ఎందుకివ్వరని ప్రశ్నించారు. ఎలాంటి జీఓలు లేకుండా నెల్లూరు జిల్లా సోమశిలకు 50 టీఎంసీల నీరు తీసుకెళ్తున్నా బుడ్డా నోరు మెదపడం లేదన్నారు. తాను, తన తమ్ముడు శిల్పా భువనేశ్వరెడ్డి అవినీతికి పాల్పడి ఉంటే అన్ని విషయాల్లో క్వాలిటీ కంట్రోల్ అధికారులతో విచారణ చేయించుకోవాలని సూచించారు. ఇక పవన్‌కల్యాణ్ వైఎస్ జగన్ గురించి మాట్లాడటం సరికాదన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు శిల్పా భువనేశ్వరరెడ్డి మాట్లాడుతూ తాము అక్రమాలకు పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రజాసేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చామని, దోచుకునేందుకు కాదని పేర్కొన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణ, మండల అధ్యక్షులు అంజాద్‌అలీ, దరగమ్మ, నాయకులు పార్వతి, లాలు, స్వామి, రమణమ్మ, జిలానీ, సుల్తాన్, తిమోతి, కలీముల్లా, ఫరూక్ తదితరులు పాల్గొన్నారు. -
రూ.20 లక్షలు ఇస్తా..స్టోర్ ప్రారంభించండి
శ్రీశైలంప్రాజెక్ట్: సున్నిపెంటలోని కో–ఆపరేటీవ్ స్టోర్స్‌ను అధికార పార్టీ నాయకులు ఆక్రమించుకోవడంపై వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అ«ధ్యక్షుడు శిల్పాచక్రపాణిరెడ్డి ఫైర్ అయ్యారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని స్థానిక ప్రజల కోసం వెంటనే ఆ స్టోర్స్‌ను పునఃప్రారంభించాలని అధికారులను కోరారు. నిర్వహణ కోసం తన వంతుగా రూ. 20 లక్షలు ఇస్తానని చెప్పారు. ఈమేరకు మంగళవారం జలవనరుల శాఖ కార్యాలయంలో క్యాంప్స్ అండ్ బిల్డింగ్స్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పాండురంగయ్యతో శిల్పా సమావేశమై చర్చించారు. కో–ఆపరేటివ్ స్టోర్స్ భవనం, పక్కనున్న ఖాళీస్థలాలను కబ్జా చేస్తుంటే మీరేం చేస్తున్నారని ఈఈని శిల్పా ప్రశ్నించారు. తక్షణమే పాలకమండలిపై కేసు నమోదు చేయించాలన్నారు. స్టోర్స్ భవనాలు, స్థలాలను రెవెన్యూ, పోలీసుల సహకారంతో సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో కాలయాపన చేసినా, స్టోర్స్ తెరవకపోయినా స్థానిక ప్రజల కోసం అదే స్థలంలో రూ.20 లక్షలతో కల్యాణ మండపం నిర్మించి ఇస్తానని చెప్పారు. దీనిపై స్పందించిన ఈఈ పాండురంగయ్య, డీఈ సేనానంద్ 10 రోజుల్లోగా స్టోర్స్ భవనాలు , ఖాళీ స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని హామీచ్చారు. అలాగే బాధ్యులపై కేసు నమోదు చేస్తామని చెప్పారు. సున్నిపెంటలో ఆక్రమణలు పెరిగిపోతున్నాయని, ఎవరిపైన చర్యలు తీసుకోవాలన్నా అసభ్య పదజాలంతో దూషిస్తున్నారన్నారు. అధికారులతో చర్చించిన వారిలో శ్రీశైలం నియోజక వర్గ నేత శిల్పా భువనేశ్వర రెడ్డి, వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా సంయుక్త కార్యదర్శి వట్టి వెంకటరెడ్డి, మండల నాయకులు ఎంఎ రజాక్ , జింకా గుండయ్య యాదవ్, విష్ణు, హనుమన్న , బక్కన్న, గౌస్‌మొహిద్దీన్, అంబేడ్కర్ న్యాయ సేవాసంఘం అధ్యక్షుడు మైలా తులసీరాం, దళిత సంఘం నాయకులు చందం గాలయ్య తదితరులు ఉన్నారు. -
పోలీసుల జులుం.. సొమ్మసిల్లిన వైస్సార్సీపీ నేత
సాక్షి, కర్నూలు : ప్రజా సమస్యలు తీర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ నిరసన తెలుపుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై పోలీసులు దౌర్జన్యం చేశారు. దీంతో కర్నూలు జిల్లా పరిషత్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. వివరాలు.. జడ్పీ సర్వసభ్య సమావేశంలో సాగు, తాగునీటి సమస్యలపై గళమెత్తిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలుపుతున్న తమపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపించారు. తమను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు, వైఎస్సార్సీపీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో నిరసనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పోలీసుల దాడిలో కర్నూలు పార్లమెంట్ అధ్యక్షులు బి.వై.రామయ్య సొమ్మసిల్లి పడిపోయారు. పార్టీ ఎమ్మెల్యేలతో పాటు నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు శిల్పా చక్రపాణి రెడ్డి, కాటసాని రామిరెడ్డి సహా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. -
కార్యకర్తలకు అండగా ఉంటాం
కర్నూలు, ఆత్మకూరు: వైఎస్సార్సీసీ కార్యకర్తలకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. కర్నూలులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఆత్మకూరు వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, ప్రజా సమస్యలను పరిష్కరిం చేందుకు కృషి చేస్తామన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మండలాల నూతన కమిటీ సభ్యులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం గ్రామాల్లో రావాలి జగన్..కావాలి జగన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారని, ఏ గ్రామానికి వెళ్లినా ప్రజాదరణ తగ్గడంలేదన్నారు. శ్రీశైలం నియోజకవర్గంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, వర్షాలు కురవకపోవడంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అవేవీ పట్టించుకోకుండా కేవలం కమీషన్లకు కక్కుర్తిపడి అక్రమాలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. వెలుగోడు రిజర్వాయర్ నుంచి సిద్ధాపురం ఎత్తిపోల పథకానికి సాగు నీరు అందించడంపై ఎమ్మెల్యే ఏ మాత్రం శ్రద్ధ చూపకపోవడంతోనే పంటలు ఎండిపోయాయన్నారు. రైతులకు అండగా ఉండి ఆదుకుంటామని చెప్పారు. జగన్‌పై హత్యాయత్నం అమానుషం రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని శిల్పా చక్రపాణిరెడ్డి, కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షడు బీవీ రామయ్య అన్నారు. జగన్ పై హత్యాయత్నం టీడీపీ నాయకుల కుట్రేనని, ఇందుకు ప్రధానసూత్రధారుడు చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. ఈ సందర్భంగా శిల్పా, బీవై రమయ్యలను ఆత్మకూరు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. పార్టీని మరింత బలోపేతం చేస్తాం ఎస్సీ సెల్ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బాలన్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి, నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చక్రపాణిరెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బాలన్న అన్నారు. ఎస్సీలను మరింత చైతన్య వంతులు చేసి వైఎస్సార్సీపీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల, పట్టణ అధ్యక్షలు చిట్యాల వెంకటరెడ్డి, అంజాద్ అలీ, యూత్ అధ్యక్షుడు సుల్తాన్, కౌన్సిలర్లు స్వామి, రాజగోపాల్, ముర్తుజా, షంషూర్, నాయకులు పాన్బాషా, యూనుస్, ఫరుక్, ఎలిషా, రాజమోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పక్కా ప్లాన్ ప్రకారమే జగన్‌పై హత్యాయత్నం కర్నూలు, నందికొట్కూరు: పక్కా ప్లాన్ ప్రకారమే వైస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి హత్యకు టీడీపీ కుట్రపన్నిందని వైఎస్ఆర్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ఆరోపించారు. ఆదివారం పట్టణంలోని వైస్సార్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఐజయ్య అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గాయపడిన వైఎస్ జగన్‌ను పరామర్శకుండా, సానుభూతి ప్రకటించకుండా పబ్లిసిటి కోసమే దాడి చేయించుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించడం సిగ్గుచేటన్నారు. ఆపరేషన్ గరుడపై ప్రభుత్వం ఎందుకు విచారణ చేపట్టలేదని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజమెత్తారు. ప్రభుత్వ పెద్దల సహకాంతోనే నిందితుడు జగన్ హత్యకు పథకం రూపొంచుకున్నాడన్నారు. నిందితులు ఎంతటివారైన శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం పట్టణంలోని సీఎస్ఐ టౌన్ చర్చిలో ఎమ్మెల్యే, శిల్పా, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్దార్థరెడ్డి, పార్టీ శ్రేణులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి, రాష్ట్ర నాయకులు చెరుకుచర్ల రఘురామయ్య, వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, కౌన్సిలరు శ్రీనివా సరెడ్డి, జిల్లా నాయకులు చంద్రమౌళి, కోకిల రమణారెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఏసన్న, ఆయా మండలాల నాయకులు లోకేష్‌రెడ్డి, రమాదేవి, తులసిరెడ్డి, వెంకటరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, చిన్న మల్లారెడ్డి, స్వామిరెడ్డి, చిట్టిరెడ్డి, రవికుమార్, తదితరులు పాల్గొన్నారు. -
‘పాదయాత్ర చూసి చంద్రబాబుకు నిద్రపట్టడంలేదు’
సాక్షి, కర్నూలు : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడుకి నిద్రపట్టడంలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యానించారు. మంగళవారం కర్నూలులో భారీ ఎత్తున వైఎస్సార్సీపీలోకి చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు రోజులు దగ్గర పడ్డాయని, నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు వేల కోట్ల రూపాయలను అక్రమంగా దోచ్చుకున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను చూసి టీడీపీ నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని ఐజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతల మేకపాటి గౌతమ్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి పార్టీ నేతలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో పలవురు నేతుల చేరారు. వీరిలో.. బన్నురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జగన్ మోహన్ రెడ్డి, మిడుతుర్ నాగిరెడ్డి, బన్నుర్ చంద్రరెడ్డి, పీరుసాహెబ్, పెట్ట జగదీష్ రెడ్డి, పేరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను పార్టీ నేతలు కండువా కప్పి ఆహ్వానించారు. -
బాబూ..ఒక్క హామీనైనా అమలు చేశారా?
కర్నూలు (కొండారెడ్డి ఫోర్టు): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014 స్వాతంత్య్ర దిన వేడుకల్లో జిల్లాకు 50 హామీలు ఇచ్చి, ఒక్కదాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయలేదని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ నెల25న ధర్మపోరాట దీక్ష చేయడానికి చంద్రబాబు..కర్నూలుకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని ప్రశ్నించారు. స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ.. చంద్రబాబు హామీలపై దమ్మూధైర్యం ఉంటే టీడీపీ నాయకులు 24వ తేదీన బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. 2014 ఎన్నికలకు ముందు వివిధ బ్యాంకుల్లో అన్నదాతలు కుదువపెట్టిన బంగారం ఎక్కడుందో చెప్పి చంద్రబాబునాయుడు ధర్మ పోరాట దీక్ష చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 40 వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదని, వారి నుంచి వ్యతిరేకత రాకుండా ఉండేందుకు తూతూమంత్రంగా రుణమాఫీ ఫిర్యాదులు స్వీకరిస్తున్నారన్నారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి పట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని ఒక్క గ్రామంలో కూడా మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయలేదని, అన్న క్యాంటీన్లు అట్టర్ ప్లాప్ అయ్యాయన్నారు. రెయిన్గన్ల కొనుగోలులో పెద్ద అవినీతి జరిగిందన్నారు. రాష్ట్ర వాస్తవ పరిస్థితులను వివరించకుండా ప్రత్యేక హోదాకు సీఎం చంద్రబాబునాయుడు అడ్డుగా ఉన్నారన్నారు. కేవలం తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించడానికే ధర్మపోరాట దీక్షలకు వందల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి ఓటర్లను ప్రలోభ పెట్టడానికే అమరావతి బాండ్లను రూ. 60 వేల కోట్లకు కుదువ పెట్టడానికి సీఎం సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఈ తతంగంపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే అవినీతిపైవిచారణ జరిపిస్తాం... తెలుగుదేశం, కాంగ్రెస్ కలసి వచ్చినా వైఎస్సార్సీపీ విజయాన్ని అడ్డుకోలేవని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. తెలుగుకాంగ్రెస్ను పాతాళ లోకానికి తొక్కడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్‌తో పొత్తంటే ఉరేసుకుంటానన్న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి...ఏ తాడుతో సిద్ధమవుతారో ఆయనకే తెలియాలన్నారు. జిల్లాలో నీరు– చెట్టు పథకంలో రూ.1000 కోట్ల అవినీతి జరిగిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విచారణ జరిపిస్తామన్నారు. నంద్యాల మైనర్ ఇరిగేషన్ ఈఈ.. అధికార పార్టీ నేతల తొత్తుగా మారిపోయారని విమర్శించారు. జిల్లాలో అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ధర్మం తప్పిందెవరో ప్రజలకు తెలుసు ఏపీకి ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకొని.. ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని ధర్మం తప్పింది సీఎం చంద్రబాబునాయుడే అని ప్రజలకు తెలుసని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తికి ధర్మ పోరాట దీక్షలు చేసే హక్కులేదన్నారు. గతంలో కలెక్టర్‌గా పనిచేసిన విజయమోహన్.. నీరు–చెట్టు పనుల్లో 20 శాతం కమీషన్‌తో రూ.150 కోట్లను టీడీపీ నాయకులకు కట్టబెట్టారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత సీఎం చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులకు లేదని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. కార్యక్రమంలో కర్నూలు, నందికొట్కూరు సమన్వయ కర్తలు హఫీజ్‌ఖాన్, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర నాయకులు తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, కర్నాటి పుల్లారెడ్డి, హనుమంతరెడ్డి, పర్ల శ్రీధర్‌రెడ్డి, శ్రీనివాసులు, నాయకులు కరుణాకరెడ్డి, గోపాల్‌రెడ్డి, రాజశేఖరరెడ్డి, మహేశ్వరరెడ్డి, మహేష్ యాదవ్, పొలూరు భాస్కరరెడ్డి, కటారి సురేష్, విజయలక్ష్మి, జమీల పాల్గొన్నారు. చంద్రబాబుది వంచన దీక్ష ధర్మపోరాట దీక్షను పార్టీ తరఫున చేస్తున్నారో.. ప్రభుత్వం తరఫున చేపడుతున్నారో స్పష్టం చేయాలని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అ«ధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు నుంచి పోరాటం చేస్తున్నారని, దీనిని పట్టించుకోకుండా ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని.. ఇప్పుడు ఎన్ని పోరాటాలు చేస్తే ఏమి లాభమని ప్రశ్నించారు. ఢిల్లీలో చేయాల్సిన దీక్షలు గల్లీలో చేస్తే ఏమి లాభమన్నారు. సీఎం చంద్రబాబు చేస్తున్నది ధర్మపోరాట దీక్ష కాదని..వంచన దీక్ష అని విమర్శించారు. -
ఎమ్మెల్యేలను కొన్నందుకా..రుణమాఫీతో ముంచినందుకా
కర్నూలు జిల్లా: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న నవనిర్మాణ దీక్షలు, ధర్మపోరాటం దేనికోసమని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు శిల్పాచక్రపాణి రెడ్డి ప్రశ్నించారు. ప్రజలను వంచించినందుకా లేక మహిళలను మోసం చేసినందుకా, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను కొన్నందుకా లేక రైతన్నలను రుణమాఫీ పేరుతో నిట్టనిలువునా ముంచినందుకా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. ఆత్మకూరులో ముస్లిం సోదరులు శుక్రవారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో శిల్పా చక్రపాణి రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు బీవై రామయ్య, కర్నూలు అసెంబ్లీ ఇంచార్జ్ హఫీజ్ ఖాన్, పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణి మాట్లాడుతూ..‘ టీడీపీ ప్రభుత్వంలో అసలైన లబ్దిదారులకు న్యాయం జరగడం లేదు. కేవలం టీడీపీ కార్యకర్తలకు మాత్రమే న్యాయం జరుగుతోంది. చంద్రబాబుపై ఎవరు మాట్లాడినా జగన్ మోహన్ రెడ్డే వాళ్లతో మాట్లాడిస్తున్నారని ఆరోపిస్తున్నారు. నవ నిర్మాణ దీక్షలు మొత్తం జగన్‌ను తిట్టడానికే సరిపోయాయి. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు చేసిన రాజీనామాలను డ్రామాలుగా వర్ణించడం సిగ్గు చేటు. 14 నెలల ముందు రాజీనామా చేసిన ఎంపీల త్యాగాన్ని అందరూ కీర్తించాలి. దమ్ము, చిత్తశుద్ది ఉంటే టీడీపీ ఎంపీలు ఇప్పటికైనా రాజీనామాలు చేయాలి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యం చేశారు. అసెంబ్లీని టీడీపీ కార్యాలయంగా మార్చార’ని తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులు బీవై రామయ్య మాట్లాడుతూ.. నాలుగేళ్ల చంద్రబాబు ప్రభుత్వం పరిపాలనలో ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఆరువందల హామీలతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ప్రజలని మోసం చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా చేసిన తొలి సంతకాలు అపహాస్యం అయ్యాయని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మంచి నీళ్లు దొరకడం లేదు కానీ మద్యం డోర్ డెలివరీ జరుగుతోందని ఎద్దేవా చేశారు. పంచభూతాలను సైతం దోచుకుతిన్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనన్నారు. నాలుగేళ్లుగా ఏ ఏడు కా ఏడు నవ నిర్మాణ దీక్షలు చేయడం సిగ్గు చేటని తీవ్రంగా మండిపడ్డారు. నవనిర్మాణ దీక్షల పేరుతో ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాన్ని విమర్శించడానికి మాత్రమే నవనిర్మాణ దీక్షలు ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఉప ముఖ్యమంత్రి ఉరి వేసుకున్నా ఎవరికీ లాభం లేదని, కాంగ్రెస్‌తో జతకట్టేందుకు టీడీపీ సిద్ధపడి, వైఎస్సార్సీపీని విమర్శించడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారి అని ఆయన మామ స్వర్గీయ ఎన్టీఆర్ అన్న వ్యాఖ్యలను గుర్తు చేశారు. దిగజారుడు టీడీపీ రాజకీయాలకు పాడె కట్టేందుకు ప్రజలు సిద్ధపడ్డారని, విలువలతో కూడిన రాజకీయం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతమని అన్నారు. కర్నూల్ జిల్లాలో 14 ఎమ్మెల్యే, 2 ఎంపీ సీట్లు తప్పక గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. హాఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చేసిన మంచి పనులు గురించి చెప్పే ధైర్యం లేదని విమర్శించారు. నాలుగేళ్లలో యూటర్న్ అంకుల్ అన్న పేరు మాత్రమే చంద్రబాబు సాధించిందని ఎద్దేవా చేశారు. మైనార్టీలకు దుల్హన్ కార్యక్రమంలో అసలైన లబ్ధిదారులకు లాభం చేకూరడం లేదని తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీలో చేరికలకు గేట్లు ఎత్తితే టీడీపీ ఖాళీ కావడం ఖాయమని వ్యాఖ్యానించారు. -
చెప్పేదొకటి.. చేసేది మరొకటి
సాక్షి, ఆత్మకూరు : జిల్లాకు వచ్చినప్పుడల్లా సీఎం చంద్రబాబు మాటలు కోటలు దాటుతున్నాయని, అభివృద్ధి మాత్రం జిల్లా కూడా దాటడం లేదని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం చెప్పేదొకటి..చేసేది మరొకటిగా మారిందన్నారు. 2014లో జిల్లాకు 35 హామీలు ఇచ్చారని, నాలుగేళ్లయినా ఒక్కటీ నెరవేరలేదన్నారు. జిల్లాకు రూ. 80 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారని, అభివృద్ధి ఎక్కడ జరిగిందో ముఖ్యమంత్రి చూపించాలని సవాల్ విసిరారు. 80 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని సీఎం చెబుతున్నారని, అలా జరిగివుంటే చదువుకున్న విద్యార్థులందరికీ ఉద్యోగాలు వచ్చేవని తెలిపారు. ఒక్క పర్మినెంట్ ఉద్యోగం అయినా ఇచ్చారా? కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఒక్కరినైనా రెగ్యులర్ చేశారా అని ప్రశ్నించారు. పట్టిసీమ నుంచి రాయలసీమకు 140 టీఎంసీల నీరు ఇచ్చానని గొప్పలు చెబుతున్నారని, మరి సీమలో రెండో పంట సాగు చేయొద్దని ప్రభుత్వం ఎందుకు చెప్పిందని చక్రపాణిరెడ్డి ప్రశ్నించారు. గిట్టుబాటు ధర లేక అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటుంటే.. రాష్ట్రంలో రైతులు పండగ చేసుకుంటున్నారని సీఎం పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. శ్రీశైలం నీటిని కోస్తాకు తరలించి..రాయలసీమకు సాగుకు ఇస్తానని చెప్పుకోవడం శోచనీయమన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని సజీవంగా ఉంచింది తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. చంద్రబాబు చేస్తున్న ధర్మ దీక్షలు ..ప్రజలను పక్కదోవ పట్టించడానికేనన్నారు. వైఎస్సార్సీపీ పాదయాత్రలు విజయవంతం చేయండి: ప్రజా సంకల్పయాత్ర 2000 కి.మీ మైలురాయిని ఈనెల 14న దాటనుండడంతో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఈ నెల 14, 15న సంఘీభావ పాదయాత్రలను చేపడుతున్నామని, వాటిని ప్రజలు విజయ వంతం చేయాలని శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు. మహానంది మండలం తిమ్మాపురం నుంచి వెలుగోడు మండలం మోతుకూరు వరకు తాము పాదయాత్ర చేయనున్నట్లు చెప్పారు. సమావేశంలో పార్టీ నాయకులు శిల్పా భువనేశ్వర రెడ్డి, చిట్యాల వెంకటరెడ్డి, బాలన్న, ఎలిషా, నాగేశ్వరరెడ్డి, కరిముల్లా, స్వామి, పుల్లారెడ్డి, రాజగోపాల్ పాల్గొన్నారు. -
ప్రజా సంక్షేమమే వైఎస్ జగన్ ధ్యేయం
పాములపాడు: వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిలాగా ప్రజా సంక్షేమమే ధ్యేయంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన అందిస్తారని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, మాజీ ఎమ్మెల్సీ, వైఎస్ఆర్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పాచక్రపాణిరెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పెంచికలపల్లి గ్రామంలో సుంకులమ్మదేవత విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఎడ్ల బండలాగుడు పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు అతిథులుగా హాజరయ్యారు. వీరిని గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఐజయ్య మాట్లాడుతూ రాజకీయాల్లో పాటించాల్సిన విలువలను టీడీపీ కాలరాసిందన్నారు. వైఎస్ఆర్సీపీ గుర్తుతో గెలిచిన ఎమ్మెల్యేలను సీఎం చంద్రబాబు డబ్బు ఎరవేసి కొనుగోలు చేశారన్నారు. తమ అధినేత వెఎస్ జగన్మోహన్రెడ్డి విలువలతో కూడిన రాజకీయం చేస్తున్నారని..అందులో భాగంగానే శిల్పా చక్రపాణిరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీలో చేరారన్నారు. అనంతరం శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ముఖ్య కారకుడు చంద్రబాబే అన్నారు. మాయమాటలు చెప్పి ఆయన అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చి న ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డికి లభిస్తున్న ప్రజా ఆదరణను చూసి టీడీపీకి వెన్నులో వణుకు పుట్టిందన్నారు. అందుకే బీజేపీతో తెగదెంపులు చేసుకుని ప్రత్యేక హోదా విషయంలో యూటర్న్ తీసుకున్నారని చెప్పారు. బాబు నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ఓటుతో ఆయనకు గుణపాఠం చెబుతారన్నారు. విజేతలకు బహుమతులు హోరాహోరీగా సాగిన బండలాగుడు పందెంలో కానాలకు చెందిన చెన్నారెడ్డి వృషభాలు 2700 అడుగుల దూరం లాగి మొదటి బహుమతి రూ.30,000 గెలుపొందాయి. వైఎస్ఆర్జిల్లా మల్లాయపల్లె గ్రామానికి చెందిన గోవిందరెడ్డి వృషభాలు 2528 .2 అడుగుల దూరం లాగి రెండవ బహుమతి రూ. 20,000 , కానాలకు చెందిన చెన్నారెడ్డి వృషభాలు మూడవ బహుమతి రూ.10,000 గెలుపొందాయి. మొదటి బహుమతిని ఎమ్మెల్యే ఐజయ్య తనయుడు, వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు రాజశేఖర్ అందజేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల కన్వీనర్ చౌడయ్య, ఎస్ఐ రాజగోపాల్ వైఎస్ఆర్సీపీ నాయకులు బాలసుబ్బారెడ్డి, రమణారెడ్డి, దాతలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. -
బాబూ..ఇంకెన్నాళ్లీ మోసం!
వేల్పనూరు(వెలుగోడు): మాయమాటలతో ప్రజలను ఇంకెన్నాళ్లు మోసం చేస్తారని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రశ్నించారు. కేంద్రంతో నాలుగేళ్లు కలిసి ఉండి సాధించని ప్రత్యేకహోదాను ఇప్పుడు తెస్తానంటే నమ్మేదెలా అన్నారు. మీ నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెబుతారని సీఎంను హెచ్చరించారు.శుక్రవారం వేల్పనూరులో జరిగిన రేగడగూడురు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మండల నాయకుడు అంబాల ప్రభాకర్‌రెడ్డి కుమార్తె వివాహానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ ఇచ్చిన హామీకి విలువ లేకుండా పోయిందన్నారు. రాష్ట్ర విభజన సమయంలో పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని డిమాండు చేసిన అప్పటి బీజేపీ నేత వెంకయ్యనాయుడు ఇప్పుడు నోరు మెదపడం లేదన్నారు. తమను గెలిపిస్తే పదేళ్లు కాదు పదిహేనేళ్లు ప్రత్యేక హోదా తీసుకొస్తామని వెంకటేశ్వరస్వామి సాక్షిగా తిరుపతి సభలో చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. ప్రజలు నమ్మి అధికారం కట్టబెడితే ఆయన ప్రత్యేక హోదాను మరిచిపోయారన్నారు. ఓటుకు నోటు కేసు నుంచి తప్పించుకునేందుకు ప్రత్యేక హోదాను కేంద్రానికి తాకట్టు పెట్టారన్నారు. 2016, నవంబర్ 8న కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామంటే అదేరోజు అర్ధరాత్రి చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టి స్వాగతించారని, మరుసటి రోజు అసెంబ్లీలో కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానాలు చేశారని గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను సన్మానించారన్నారు. ఇప్పుడు యూటర్న్ తీసుకొని హోదా కోసం పోరాడుతున్నట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్‌ది అలుపెరగని పోరాటం ప్రత్యేక హోదా సాధనకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నాలుగేళ్లుగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా అలుపెరగని పోరాటాలు చేశారని శిల్పాచక్రపాణిరెడ్డి అన్నారు. బంద్‌లు, ధర్నాలు, యువభేరీలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేశారన్నారు. ఆయన వల్లే హోదా నినాదం బతికిందన్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీలతో పదవులకు రాజీనామా చేయించి ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయించారన్నారు. మొట్టమొదట కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన పార్టీ వైఎస్ఆర్సీపీనే అన్నారు. పోరాటాలతో వైఎస్ జగన్‌కు మంచి పేరు వస్తోందని గ్రహించిన చంద్రబాబు ఇప్పుడు ప్రత్యేక హోదా నినాదం ఎత్తుకున్నారని..అయితే ఆయనను ప్రజలు నమ్మరన్నారు. ఈ నెల 20న చంద్రబాబు ధర్మపోరాటం పేరుతో దీక్ష చేసి రూ.30 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్నారు. అంతటితో ఆగకుండా ప్రజలను వంచించేందుకు ఈ నెల 30న తిరుపతిలో సభ పెట్టారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసానికి నిరసనగా అదేరోజు న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విశాఖలో వంచన దినం పాటిస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరూ తమ పోరాటానికి మద్దతివ్వాలని శిల్పా కోరారు. సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మండ్ల శంకర్‌రెడ్డి, నాగేశ్వరరెడ్డి, అమీర్ అలీఖాన్, పెద్ద స్వామన్న, నడిపి స్వామన్న, ఇలియాస్‌ఖాన్, మోతుకూరు నాగేశ్వరరెడ్డి, శ్రీనివాసులు, జనాబా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.