మాట్లాడుతున్న శిల్పా చక్రపాణి రెడ్డి
కర్నూలు, నంద్యాల: హామీలు నెరవేర్చకుండా బీసీలను మోసం చేస్తున్న సీఎం చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని వైఎస్సార్సీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పాచక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలో గురువారం నిర్వహించిన బీసీల మహా ర్యాలీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పద్మావతినగర్ నుంచి ఆర్‌డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ఇన్‌చార్జి ఆర్‌డీఓ అనురాధకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో బీసీల ఓట్ల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 110 హామీలు ఇచ్చారని, వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు.
ఎన్నికలు వస్తున్న తరుణంలో ఆదరణ పథకం అంటూ మోసం చేస్తున్నారన్నారు. జగనన్న సీఎం అయితేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోగోలు శివశంకర్‌నాయుడు, మార్క్‌ఫెడ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీపీనాగిరెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, కర్రాహర్షవర్ధన్‌రెడ్డి, దేశం సుధాకర్‌రెడ్డి, చైర్‌పర్సన్ దేశం సులోచన, పీపీ మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ రాకేష్‌రెడ్డి, కల్లూరి రామలింగారెడ్డి, శ్రీశైలం నాయకులు మద్దిలేటి, వెంకటేశ్వర్లు, కదిరి శీను, సురేష్, రంగయ్య, నంద్యాల నాయకులు రమేష్‌నాయు డు, శివప్రసాద్, జగన్‌ప్రసాద్, సుబ్బరాయుడు, పున్నా శేషయ్య, ప్రసాద్ యాదవ్, ఆళ్లగడ్డ నాయకులు బోయిలకుంట్ల నాగన్న, సింగం భరత్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి, నాగేశ్వరరావు, నరసింహ పాల్గొన్నారు.
ఓట్ల కోసమే ఆదరణ పథకం
బీసీల ర్యాలీకి ప్రజలు బ్రహ్మరథం పట్టడం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వాన్ని కుప్పకూలుస్తారనే నమ్మకం కలుగుతోంది. వైఎస్సార్ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలతో బీసీలు లబ్ధి పొందారు. ఓట్ల కోసం ప్రస్తుతం చంద్రబాబు ఆదరణ పథకాన్ని తెరపైకి తెచ్చారు.– గౌరు చరితారెడ్డి, పాణ్యం ఎమ్మెల్యే
దోచుకోవడమే టీడీపీ నేతల పని..
ప్రజాసంక్షేమాన్ని మరచి టీడీపీ నేతలు దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు. సీఎం చంద్రబాబు హామీలు అమలు చేయకుండా ప్రజలను వంచిస్తున్నారు. వీరి ఆటలు ఇక సాగబోవు. జగనన్న అధికారంలోకి వస్తే బడుగు, బలహీన వర్గాల సంక్షేమం సాధ్యమవుతుంది. –గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ
శ్వేతపత్రం విడుదల చేయాలి
నాలుగున్నరేళ్ల కాలంలో బీసీలకు ప్రభుత్వం ఏయే పనులు చేసిందో శ్వేత పత్రం విడుదల చేయాలి. కోటి హామీలు అమలు చేయకపోవడంతో 2004లో ప్రజలు చంద్రబాబును తరిమికొట్టారు. 2019 ఎన్నికల్లో అదే పునరావృతం అవుతుంది. వైఎస్సార్ హయాంలో బీసీల సంక్షేమం సాధ్యమైంది. –కాటసాని రాంభూపాల్‌రెడ్డి,
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
కులానికో హామీ ఇచ్చారు
గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు..కులానికో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక వాటిని అ మలు చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. చేనేతలను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యా రు. గొర్రెల కాపరుల కోసం రైతు బజారుల మాదిరి విక్రయ బజారులు ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పారు. –శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, నంద్యాల నియోజకవర్గ నేత
మోసం..బాబు నైజం
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేరుస్తానని మోసం చేశారు. పద్మశాలీయులను ఎస్సీ–ఏలుగా, బలిజలను బీసీలుగా మారుస్తామని ఇష్టమొచ్చినట్లు వాగ్దానాలు చేసిన చరిత్ర చంద్రబాబుకే దక్కింది. మోసం చేయడంలో చంద్రబాబు పీహెచ్‌డీ చేశారు. ఉనికి కోసం, అధికారం కోసం టీడీపీ అధినేత ఏమైనా చేస్తారని నిరూపించుకున్నారు.
– బైరెడ్డి సిద్ధార్థరెడ్డి,నందికొట్కూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్
బీసీలపై పెరుగుతున్న దాడులు
టీడీపీ ప్రభుత్వ హయాంలో బీసీలపై రోజురోజుకు దాడులు అధికమవుతున్నాయి. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. జగనన్న పాదయాత్రలో బీసీలు పెద్ద ఎత్తున పాల్గొంటూ సమస్యలపై వినతి పత్రాలు అందజేస్తున్నారు. చంద్రబాబు చేసిన మోసాలను ఏకరువు పెడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి బీసీలు వెన్నుద న్నుగా ఉండి గెలిపిస్తారనే నమ్మకం ఉంది.– కాటసాని రామిరెడ్డి,బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్
వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం
వైఎస్సార్ పాలన మళ్లీ రావాలంటే వైఎస్ జగన్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. వైఎస్సార్ హయాంలో బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగింది. ప్రస్తుతం బీసీలు అంతా వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం. – గంగుల బిజేంద్రారెడ్డి,ఆళ్లగడ్డ నియోజకవర్గ నేత
Comments
Please login to add a commentAdd a comment