‘అక్షయ గోల్డ్‌ బాధితుల పక్షాన పోరాడుతాం’ | Sakshi
Sakshi News home page

‘అక్షయ గోల్డ్‌ బాధితుల పక్షాన పోరాడుతాం’

Published Sun, Jan 6 2019 3:26 PM

 We Will Fight For Akshaya gold Victims Says vijaya Sai Reddy - Sakshi

సాక్షి, కర్నూలు: అగ్రిగోల్డ్‌ బాధితులు పక్షాన పోరాడిన విధంగానే అక్షయ గోల్డ్‌ బాధితుల తరఫున కూడా వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. అక్షయ గోల్డ్‌ బాధితుల పక్షాన ప్రత్యేక అధ్యయన కమిటీ వేసి వారికి అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌సీపీని బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కర్నూల్‌ జిల్లా రీజినల్‌ కోఆర్డినేటర్‌గా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌  బాధ్యతలు స్వీకరించారు. సమావేశంలో వేమిరెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కర్నూలు జిల్లాల్లోని రెండు లోక్‌సభ స్థానాలతోపాటు 14 అసెంబ్లీ సీట్లను కూడా సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజలతో పార్టీని సమన్వయ పరిచి ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ గెలుపుకు కృషిచేయాలని పేర్కొన్నారు. జిల్లాలో మరిన్ని స్థానాలకు గెలిపించి వైఎస్‌ జగన్‌కు బహుమతిగా ఇస్తామని నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement