Vemi Reddy Prabhakar Reddy
-
అనిల్ సేవలు ఆదర్శం
నెల్లూరు(సెంట్రల్): నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ సేవలు ఆదర్శమని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కొనియాడారు. నగరంలోని 9వ డివిజన్ చిన్నబాలయ్యనగర్లోని పత్తివారి నగరపాలక ఉన్నత పాఠశాలలో నిర్మించిన 1000 లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యేతో కలిసి వేమిరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వాటర్‌ప్లాంటు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. దీనికి కారణం నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ అన్నారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉం టూ అనిల్ చేపడుతున్న సేవలు ఆదర్శంగా ఉన్నాయన్నారు. అనిల్‌ను రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. రానున్న రోజుల్లో ఎంపీ నిధులతో పాఠశాలకు అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు. వాటర్‌ప్లాంట్‌ను రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బూత్‌కమిటీ సభ్యులకు సూచించారు. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్ మాట్లాడుతూ తాగునీటి సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఎంపీ నిధుల నుంచి వాటర్‌ప్లాంటు మంజూరు చేయడం జరిగిందన్నారు. నగర ప్రజలకు తనకు చేతనైన సహాయసహకారాలు అందించడంలో ముందుంటానన్నారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్ రాజశేఖర్, వంగాల శ్రీనివాసులురెడ్డి, ఈదల ధనూజారెడ్డి, తంబి, బట్టా కోటేశ్వరరావు, సుబ్బారెడ్డి, మల్యాద్రి, పొడమేకల సురేష్, నాగూర్ నాయుడు, వీపీఆర్ ఫౌండేషన్ సీఈఓ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
మైనారిటీ బాలికల విద్యకు హజ్ సబ్సిడీ
సాక్షి, న్యూఢిల్లీ : హజ్‌యాత్ర సబ్సిడీకి వినియోగించే నిధులను మైనారిటీ బాలకల విద్యకు కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ సమాధానమిచ్చారు. హజ్ యాత్ర సబ్సిడీని క్రమంగా తగ్గించి, పూర్తిగా ఎత్తేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 2012-13లో రూ. 836.56 కోట్ల నుంచి 2017-18లో 210.63 కోట్లకు తగ్గించారని తెలిపారు. 2018లో హజ్‌యాత్రకు ఇచ్చే సబ్సిడీని పూర్తిగా ఆపేశామన్నారు. ఈ నిధులను మైనారిటీ బాలికల విద్యకు ఉపయోగిస్తామన్నారు. -
‘చంద్రబాబు పేరు గిన్నిస్‌లో ఎక్కించాలి’
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు పార్లమెంట్ ముందు ధర్నాకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని.. ఆయన పేరును గిన్నిన్ బుక్‌లో రికార్డు చేయాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండి రూ. లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ నాలుగేళ్ల నుంచి పోరాడుతోందని, వైఎస్ జగన్‌తోనే అది సాధ్యమని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లను గెలిపిస్తే ప్రేత్యేక హోదా సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో కుట్ర దాగుంది కాబట్టే చంద్రబాబు భయపడుతున్నారని, ఎన్ఐఏకు సహరించవద్దని చంద్రబాబు పోలీసులకు డైరెక్షన్ ఇస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు ఢిల్లీ వచ్చినంత మాత్రనా ఏపీకి ఒరిగేదేమీ లేదని, దేశ రాజకీయాల్లో ఏ పార్టీ కూడా ఆయనను నమ్మదని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులన్నీ నాసిరమైనవే అని, ప్రాజెక్టు అంచనాలను 16 వేల కోట్లనుంచి 50 వేల కోట్లకు పెంచినందుకు గిన్నిస్ బుక్ రికార్డు చెయ్యాలన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయనుందుకు కూడా ఆయన పేరును రికార్డు చేయాలని వ్యాఖ్యానించారు. -
‘అక్షయ గోల్డ్ బాధితుల పక్షాన పోరాడుతాం’
సాక్షి, కర్నూలు: అగ్రిగోల్డ్ బాధితులు పక్షాన పోరాడిన విధంగానే అక్షయ గోల్డ్ బాధితుల తరఫున కూడా వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. అక్షయ గోల్డ్ బాధితుల పక్షాన ప్రత్యేక అధ్యయన కమిటీ వేసి వారికి అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు. కర్నూలు జిల్లాలో ఆదివారం జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీని బలోపేతం చేసేందుకు పార్టీ శ్రేణులంతా కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కర్నూల్ జిల్లా రీజినల్ కోఆర్డినేటర్‌గా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. సమావేశంలో వేమిరెడ్డి మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో కర్నూలు జిల్లాల్లోని రెండు లోక్‌సభ స్థానాలతోపాటు 14 అసెంబ్లీ సీట్లను కూడా సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పార్టీ కార్యకర్తలు, నేతలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రజలతో పార్టీని సమన్వయ పరిచి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపుకు కృషిచేయాలని పేర్కొన్నారు. జిల్లాలో మరిన్ని స్థానాలకు గెలిపించి వైఎస్ జగన్‌కు బహుమతిగా ఇస్తామని నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. -
ఉచిత మినరల్ వాటర్ప్లాంట్లు ప్రారంభం
ఉదయగిరి: వీపీఆర్ ఫౌం డేషన్ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఏ ర్పాటు చేసిన మూడు మినరల్ వాటర్ ప్లాంట్లను ఆ ఫౌండేషన్ చైర్మన్ వేమి రెడ్డి ప్రభాకర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఉదయగిరి మండలం దాసరపల్లి, వింజమూరు మండలం జనార్దనపురం, సీతారామపురం మండలం బసినేనిపల్లిలో ఏర్పాటు చేసి వీపీఆర్ అమృతధార ప్లాంట్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఫౌండేషన్ కృషి చేస్తుందన్నారు. జిల్లాలోని ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి మినరల్ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాటర్ప్లాంట్లను రెండేళ్ల పాటు ఫౌం డేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. అనంతరం యువతకు స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో ఉదయగిరి ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి , దాసరపల్లి మాజీ సర్పంచ్ గౌస్‌మొహిద్దీన్, వింజమూరు ఎంపీపీ గణపం కృష్ణకిరణ్రె డ్డి, జనార్దనపురం సర్పంచ్ కొండస్వామి, మారంరెడ్డిపల్లి సొసైటీ అధ్యక్షుడు చిం తంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్ అల్లూరురాజు, వీపీఆర్ ఫౌండేషన్ సీఈఓ నా రాయణరెడ్డి, సింహపురి ఆస్పత్రి అధినేత రవీంద్రరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.