
సాక్షి, న్యూఢిల్లీ: ఏపీ ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు పార్లమెంట్ ముందు ధర్నాకు దిగారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ.. విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని.. ఆయన పేరును గిన్నిన్ బుక్‌లో రికార్డు చేయాలని ఎద్దేవా చేశారు.
చంద్రబాబు నాలుగున్నరేళ్లు అధికారంలో ఉండి రూ. లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌సీపీ నాలుగేళ్ల నుంచి పోరాడుతోందని, వైఎస్ జగన్‌తోనే అది సాధ్యమని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లను గెలిపిస్తే ప్రేత్యేక హోదా సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో కుట్ర దాగుంది కాబట్టే చంద్రబాబు భయపడుతున్నారని, ఎన్‌ఐఏకు సహరించవద్దని చంద్రబాబు పోలీసులకు డైరెక్షన్ ఇస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబు ఢిల్లీ వచ్చినంత మాత్రనా ఏపీకి ఒరిగేదేమీ లేదని, దేశ రాజకీయాల్లో ఏ పార్టీ కూడా ఆయనను నమ్మదని అన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులన్నీ నాసిరమైనవే అని, ప్రాజెక్టు అంచనాలను 16 వేల కోట్లనుంచి 50 వేల కోట్లకు పెంచినందుకు గిన్నిస్ బుక్ రికార్డు చెయ్యాలన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయనుందుకు కూడా ఆయన పేరును రికార్డు చేయాలని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment