సాక్షి, న్యూఢిల్లీ : హజ్‌యాత్ర సబ్సిడీకి వినియోగించే నిధులను మైనారిటీ బాలకల విద్యకు కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ సమాధానమిచ్చారు. హజ్ యాత్ర సబ్సిడీని క్రమంగా తగ్గించి, పూర్తిగా ఎత్తేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 2012-13లో రూ. 836.56 కోట్ల నుంచి 2017-18లో 210.63 కోట్లకు తగ్గించారని తెలిపారు. 2018లో హజ్‌యాత్రకు ఇచ్చే సబ్సిడీని పూర్తిగా ఆపేశామన్నారు. ఈ నిధులను మైనారిటీ బాలికల విద్యకు ఉపయోగిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment