Haj subsidy
-
మైనారిటీ బాలికల విద్యకు హజ్ సబ్సిడీ
సాక్షి, న్యూఢిల్లీ : హజ్‌యాత్ర సబ్సిడీకి వినియోగించే నిధులను మైనారిటీ బాలకల విద్యకు కేటాయిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మంగళవారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ సమాధానమిచ్చారు. హజ్ యాత్ర సబ్సిడీని క్రమంగా తగ్గించి, పూర్తిగా ఎత్తేయాలని సుప్రీం కోర్టు ఇచ్చిన సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 2012-13లో రూ. 836.56 కోట్ల నుంచి 2017-18లో 210.63 కోట్లకు తగ్గించారని తెలిపారు. 2018లో హజ్‌యాత్రకు ఇచ్చే సబ్సిడీని పూర్తిగా ఆపేశామన్నారు. ఈ నిధులను మైనారిటీ బాలికల విద్యకు ఉపయోగిస్తామన్నారు. -
ట్రావెల్ టెస్ట్
-
ముస్లింలకో న్యాయం, హిందువులకో న్యాయమా?
సాక్షి, న్యూఢిల్లీ : ‘ముస్లింలను మెప్పించడం కోసం కాకుండా మైనారిటీలు సమాజంలో గౌరవప్రదంగా జీవించడం కోసం కృషి చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోరుకుంటోంది. అందుకని ముస్లింల హజ్ యాత్రకు ఏటా కేటాయిస్తున్న దాదాపు 700 కోట్ల రూపాయలను ఇక నుంచి ముస్లిం మహిళల విద్యాభివద్ధికి ఖర్చు చేస్తాం’ అని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ మంగళవారం నాడు ప్రకటించడం ఎంతైనా ముదావహం. ఇదేమి బీజేపీ ప్రభుత్వం సొంతంగా తీసుకున్న నిర్ణయం కాదు. హజ్ యాత్రకు కేంద్రం కల్పిస్తున్న సబ్సిడీని పదేళ్ల కాలంలో పూర్తిగా ఎత్తివేయాలని సుప్రీం కోర్టు 2012లో ఉత్తర్వులు జారీ చేసింది. ఆ సొమ్మును ముస్లింల విద్యా, సామాజికాభివద్ధికి ఖర్చు పెట్టాలని కూడా సుప్రీం కోర్టు సూచించింది. నాలుగేళ్లకు ముందుగానే సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారం హజ్ యాత్రకు ఇస్తున్న సబ్సిడీని బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం సున్నితమైన అంశమే. ఏ సెక్యులర్ ప్రభుత్వం అయినా సరే ప్రజల మత కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులను ఖర్చు పెట్టరాదు. మన రాజ్యాంగంలోని సెక్యులర్ అనే పదానికి అదే అర్థం. అందుకనే కేంద్రంలోని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింల హజ్ యాత్రకు సబ్సిడీని ప్రకటించడాన్ని బీజేపీ ‘సూడో సెక్యులరిజమ్’ అంటూ విమర్శించింది. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సబబే. మరి కుంభమేళా లాంటి హిందూ మతపరమైన కార్యక్రమాలకు కోట్లాది రూపాయలను ప్రభుత్వం ఖర్చు పెట్టడాన్ని ఆపేస్తుందా? భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చే కార్యక్రమాల సందర్భంగా వారికి తగిన సౌకర్యాలు కల్పించడం, శాంతి భద్రతల పరిరక్షణకు తగిన ఏర్పాట్లు చేయడం ప్రభుత్వం బాధ్యతని ఇలాంటి సందర్భాల్లో ప్రభుత్వాలు సమర్థించుకోవచ్చు. కైలాస మానససరోవర్ యాత్ర సందర్భంగా టిబెట్ వెళ్లే హిందూ భక్తుల ప్రయాణానికి, వారి బసకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు నిధులను విడుదల చేస్తోంది? వీటిని కూడా తక్షణం నిలిపివేయాలి కదా! కేంద్రమే కాకుండా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు మత కార్యక్రమాలకు నిధులను విడుదల చేయడమే కాకుండా, దగ్గరుండి కొన్ని కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి? బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాలు కూడా ప్రభుత్వ నిధులతో హిందూ మత కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నాయి. ఇక బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్ ప్రభుత్వమైతే అయోధ్య, మధురలతోపాటు కేరళలోని సెయింట్ థామస్ చర్చిని సందర్శించే వృద్ధులకు, వారి సహాయకులకు సబ్సిడీలను ఇస్తోంది. అంతేకాకుండా పాకిస్థాన్, చైనా, కాంబోడియా, శ్రీలంకలో హిందూ పుణ్యక్షేత్రలను దర్శించుకునే భక్తులకు కూడా రాయితీలు ఇస్తోంది. ఇక మానస సరోవర యాత్రకు ఇస్తున్న నిధులను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవలనే రెట్టింపు చేశారు. భక్తుల బస కోసం ‘మానససరోవర్ భవన్’ను నిర్మించాలని కూడా ఆయన నిర్ణయించారు. హజ్‌యాత్ర విషయంలో తీసుకున్నట్లుగానే హిందూ మత కార్యక్రమాల విషయంలో కూడా కేంద్ర, బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలి. లేకపోయినట్లయితే బీజేపీ ప్రభుత్వాలదే సూడో సెక్యులరిజమ్, హిందూ అప్పీజ్మెంట్ అవుతుంది. వారికో న్యాయం, వీరికో న్యాయం అన్నట్లు ఉంటుంది. -
హజ్ రాయితీ రద్దు : తీర్థయాత్రల మాటేంటి?
-
హజ్ సబ్సిడీ రద్దు
న్యూఢిల్లీ: ఈ ఏడాది నుంచి హజ్ యాత్రకు సబ్సిడీ ఇవ్వబోమని కేంద్ర మైనారిటీ శాఖమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ‘బుజ్జగింపు రాజకీయాలు కాకుండా ముస్లింలు హుందాగా బతికేలా సాధికారత కల్పించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సబ్సిడీతో ముస్లింలు ఎలాంటి లబ్ధి పొందటం లేదు. గౌరవంతో కూడిన అభివృద్ధినే మేం విశ్వసిస్తాం. ఇప్పటివరకూ హజ్‌యాత్రకు కేటాయిస్తున్న మొత్తాన్ని మైనారిటీ బాలికల చదువుకు వినియోగిస్తాం’ అని మంగళవారం మీడియాకు వెల్లడించారు. సౌదీ అరేబియాలోని మక్కాకు దేశం నుంచి ఏటా 1.75 లక్షల మంది ముస్లింలు వెళ్తుంటారని నఖ్వీ తెలిపారు. గతేడాది హజ్ సబ్సిడీ కింద రూ.250 కోట్లకు పైగా కేటాయించినట్లు వెల్లడించారు. సబ్సిడీ రద్దు వల్ల హజ్ ఖర్చులు పెరిగిపోకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2022 నాటికి హజ్ సబ్సిడీని పూర్తిగా ఎత్తేయాలంటూ సుప్రీం కోర్టు 2012లో ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సబ్సిడీలో భాగం గా ప్రభుత్వరంగ విమానయాన సంస్థల్లో టికెట్ ధరలపై రాయితీ ఇస్తున్నారు. అదనపు భారమేం ఉండదు సాక్షి, హైదరాబాద్: హజ్ సబ్సిడీని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తెలంగాణ నుంచి హజ్ యాత్రకు వెళ్లేవారిపై ఎలాంటి అదనపు భారం పడదని హజ్ కమిటీ ఉన్నతాధికారులు తెలిపారు. హజ్ యాత్రకు విమానయాన టికెట్లపై కేంద్ర హజ్ కమిటీ నిర్ణయించిన స్లాబ్ రేటుకు, విమానయాన సంస్థలు వసూలు చేస్తున్న మొత్తానికి భారీ వ్యత్యాసం లేకపోవడమే ఇందుకు కారణమన్నారు. గతేడాది హజ్ యాత్రికులకు కమిటీ స్లాబ్ రేటును రూ.65 వేలుగా నిర్ధారించగా, విమానయాన సంస్థలు రూ.62,065 మాత్రమే వసూలు చేశాయన్నారు. సాధారణంగా ఇప్పటివరకూ స్లాబ్ రేటు కన్నా ఎక్కువ మొత్తాన్ని విమానయాన సంస్థలు వసూలు చేస్తే.. ఆ మొత్తాన్ని సబ్సిడీగా కేంద్రం హజ్ కమిటీకి అందజేస్తుంది. -
హజ్ రాయితీ రద్దు ; తీర్థయాత్రల మాటేంటి? : అసదుద్దీన్
సాక్షి, హైదరాబాద్ : హజ్ యాత్రికులకు సబ్సిడీని రద్దుచేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. తాము కూడా మొదటి నుంచీ హజ్ సబ్సిడీని వ్యతిరేకిస్తూనే ఉన్నామని గుర్తుచేశారు. అయితే, హిందూ, ఇతర మతస్తుల తీర్థయాత్రలకు అందిస్తోన్న సబ్సిడీలపైనా కేంద్రం ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటుందా? అని ప్రశ్నించారు. మంగళవారం దారుసలాంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘హజ్‌యాత్రికులకు ప్రభుత్వాలు అందించే రాయితీలను ఆర్ఎస్ఎస్, బీజేపీలు ఓటు బ్యాంకు రాజకీయాలని విమర్శించాయి. నిజమే, మేము కూడా రాయితీలేవీ అవసరం లేదని మొదటి నుంచి చెబుతున్నాం. ఈ ఏడాది సబ్సిడీ విలువ రూ.200 కోట్లు మాత్రమే. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. 2022 నాటికి ఈ(రాయితీలు ఇచ్చే) విధానం పూర్తిగా అంతంకావాల్సిఉంది. కానీ ఈలోపే ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. మరి హిందూ తీర్థయాత్రలకు నేటికీ అందుతోన్న సబ్సిడీలు ఓటు బ్యాంకు రాజకీయాల కిందికి రావా? కుంభమేళా, అయోధ్య, కాశీ, మథుర, మానససరోవర యాత్రికులకు బీజేపీ ప్రభుత్వాలు ఇస్తోన్న సబ్సిడీల మాటేమిటి? ఆయా యాత్రలకు సబ్సిడీల కింద రూ.800 కోట్లు ఖర్చుచేస్తోన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను బీజేపీ నిలువరించగలదా? ఆలయాల పునరుద్ధరణకు, అర్చకులకు నిధులివ్వడం ఆపేస్తారా? అసలీ విషయంలో కాషాయపార్టీకి స్పష్టత ఉందా, రాజ్యాంగంలోని 290ఏ ఆర్టికల్ రద్దు చేసేలా పార్లమెంటులో బిల్లు పెట్టే దమ్ముందా?’’ అని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఈ ఏడాది హజ్ యాత్రకు వెళ్లే 1.75 లక్షల మంది యాత్రికులకు సబ్సిడీని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ముక్తర్ అబ్బాస్ నక్వీ ప్రకటించిన సంగతి తెలిసిందే. #Haj Subsidy this year it is 200 crore & it would have been phased out by 2022 as per Supreme Court order,since 2006 I have been demanding that should be removed & used for Muslim girls education upliftment — Asaduddin Owaisi (@asadowaisi) 16 January 2018 #Haj Subsidy BJP /RSS had called It appeasement,vote Bank Pol my Qs to BJP will you bring a Bill in parliament remove Article 290A of Constitution,Will BJP Tell Yogi govt to stop 800 crore for pilgrimage to Ayodhya,Kashi,Mathura 1.5 lakh to each Manasarovar yatri? — Asaduddin Owaisi (@asadowaisi) 16 January 2018 #Haj Subsidy 3 Qs to BJP/RSS Why did Haryana government give 1 Crore to Dera Sacha Sauda was it for electoral appeasement?4qs why did Modi govt gave grant of 100 crore to MP govt for Simhastha Maha Kumbh & MP govt had spend 3,400 crore was this not appeasement? — Asaduddin Owaisi (@asadowaisi) 16 January 2018 # Haj Subsidy Rajasthan govt allocated 38.91 crores in 17-18 for Devasthan dept ,last government had ₹260 milllion for temple renovation & training of Hindu Priests is this Not Appeasement & Vote Bank Politics — Asaduddin Owaisi (@asadowaisi) 16 January 2018 # Haj Subsidy - Karnataka congress govt which is practising Janedharu politics is giving ₹20,000 to each pilgrims who undertakes pilgrimage to Chardham so is this Not Appeasement of Majority — Asaduddin Owaisi (@asadowaisi) 16 January 2018 # Haj Subsidy I challenge the Modi Government to walk the talk by allocating ₹2,0000 crores for Muslim girls scholarships (pre matric,post matric,merit cum means ) will Modi do it I doubt ,will wait and see in next budget 18-19 — Asaduddin Owaisi (@asadowaisi) 16 January 2018 -
హజ్‌కు కేంద్రం రాయితీ కొనసాగించాలి
కేంద్ర మంత్రి నఖ్వీకి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ లేఖ సాక్షి, హైదరాబాద్: హజ్‌యాత్రకు సబ్సిడీని యథావిధిగా కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గతేడాది కేంద్రం నుంచి రూ.690 కోట్ల రాయితీ ఇవ్వగా.. ఈ ఏడాది ఆ మొత్తాన్ని రూ.వెయ్యి కోట్లకు పెంచాలని కోరారు. ఈ మేరకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీకి ఆదివారం ఆయన లేఖ రాశారు. హజ్‌ను సందర్శించడం ముస్లింల జీవిత ఆశయమని, పేద ముస్లింలకు హజ్‌యాత్ర సులభతరం కానందునే ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసి వారి కలను సాకారం చేస్తుందని తెలిపారు. అయితే హజ్‌యాత్ర రాయితీ నిధులపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసినట్లు తెలిసిందని, కమిటీ నివేదికతో సంబంధం లేకుండా నిధులు ఇవ్వాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా హజ్ యాత్రికులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని లేఖలో ఆయన వివరించారు.