ఉచిత మినరల్‌ వాటర్‌ప్లాంట్లు ప్రారంభం | Start free mineral water plants | Sakshi
Sakshi News home page

ఉచిత మినరల్‌ వాటర్‌ప్లాంట్లు ప్రారంభం

May 2 2017 2:42 AM | Updated on Sep 5 2017 10:08 AM

ఉచిత మినరల్‌ వాటర్‌ప్లాంట్లు ప్రారంభం

ఉచిత మినరల్‌ వాటర్‌ప్లాంట్లు ప్రారంభం

వీపీఆర్‌ ఫౌం డేషన్‌ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఏ ర్పాటు చేసిన మూడు మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను ఆ ఫౌండేషన్‌ చైర్మన్‌ వేమి రెడ్డి ప్రభాకర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు.

ఉదయగిరి:  వీపీఆర్‌ ఫౌం డేషన్‌ ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గంలో ఏ ర్పాటు చేసిన  మూడు మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను ఆ ఫౌండేషన్‌ చైర్మన్‌ వేమి రెడ్డి ప్రభాకర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఉదయగిరి మండలం దాసరపల్లి, వింజమూరు మండలం జనార్దనపురం, సీతారామపురం మండలం బసినేనిపల్లిలో ఏర్పాటు చేసి వీపీఆర్‌ అమృతధార ప్లాంట్లను ఆయన ప్రారంభించి మాట్లాడారు. మారుమూల గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఫౌండేషన్‌ కృషి చేస్తుందన్నారు.

జిల్లాలోని ఫ్లోరైడ్‌ ప్రభావిత ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇచ్చి మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వాటర్‌ప్లాంట్లను రెండేళ్ల పాటు ఫౌం డేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. అనంతరం యువతకు స్పోర్ట్స్‌ కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో  ఉదయగిరి ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి , దాసరపల్లి మాజీ సర్పంచ్‌ గౌస్‌మొహిద్దీన్, వింజమూరు ఎంపీపీ గణపం కృష్ణకిరణ్‌రె డ్డి, జనార్దనపురం సర్పంచ్‌ కొండస్వామి, మారంరెడ్డిపల్లి సొసైటీ అధ్యక్షుడు చిం తంరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ సర్పంచ్‌ అల్లూరురాజు, వీపీఆర్‌ ఫౌండేషన్‌ సీఈఓ నా రాయణరెడ్డి, సింహపురి ఆస్పత్రి అధినేత రవీంద్రరెడ్డి,  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement