ఆర్వోప్లాంటు ప్రారంభించి విద్యార్థినులకు తాగునీరందిస్తున్న ఎంపీ వేమిరెడ్డి, ఎమ్మెల్యే అనిల్
నెల్లూరు(సెంట్రల్): నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ సేవలు ఆదర్శమని వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కొనియాడారు. నగరంలోని 9వ డివిజన్ చిన్నబాలయ్యనగర్‌లోని పత్తివారి నగరపాలక ఉన్నత పాఠశాలలో నిర్మించిన 1000 లీటర్ల మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యేతో కలిసి వేమిరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వాటర్‌ప్లాంటు ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. దీనికి కారణం నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ అన్నారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉం టూ అనిల్ చేపడుతున్న సేవలు ఆదర్శంగా ఉన్నాయన్నారు. అనిల్‌ను రానున్న ఎన్నికల్లో ఆశీర్వదించి గెలిపించాలని కోరారు. రానున్న రోజుల్లో ఎంపీ నిధులతో పాఠశాలకు అవసరమైన వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
వాటర్‌ప్లాంట్‌ను రాజకీయాలకు అతీతంగా ప్రతిఒక్కరూ ఉపయోగించుకోవాలని కోరారు. నవరత్నాల పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బూత్‌కమిటీ సభ్యులకు సూచించారు. చంద్రబాబు మోసాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఎమ్మెల్యే అనిల్‌కుమార్ మాట్లాడుతూ తాగునీటి సమస్యను ఎంపీ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ఎంపీ నిధుల నుంచి వాటర్‌ప్లాంటు మంజూరు చేయడం జరిగిందన్నారు. నగర ప్రజలకు తనకు చేతనైన సహాయసహకారాలు అందించడంలో ముందుంటానన్నారు. డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్ రాజశేఖర్, వంగాల శ్రీనివాసులురెడ్డి, ఈదల ధనూజారెడ్డి, తంబి, బట్టా కోటేశ్వరరావు, సుబ్బారెడ్డి, మల్యాద్రి, పొడమేకల సురేష్, నాగూర్ నాయుడు, వీపీఆర్ ఫౌండేషన్ సీఈఓ నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment