
కర్నూలు, బండిఆత్మకూరు: నిత్యం రాజకీయాల్లో బిజీగా ఉండే వైఎస్సార్‌సీపీ నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి కాసేపు క్రీడాకారుడిగా మారిపోయారు. బండిఆత్మకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న జోనల్ పోటీల్లో విజేతలకు బహుమతుల ప్రదాన కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకుని కబడ్డీ క్వార్టర్ ఫైనల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల్లో జోష్ నింపేందుకు శిల్పా.. కబడ్డీ... కబడ్డీ అంటూ రైడింగ్‌కు వెళ్లి విద్యార్థుల్లో ఉత్సాహాన్ని ఉరకలెత్తించారు.