‘ఆయన దళితుల పట్ల వివక్షత చూపటం దారుణం’ | Ijayya And Shilpa Chakrapani Reddy Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్‌ : శిల్పా

Published Thu, Dec 6 2018 2:11 PM | Last Updated on Thu, Dec 6 2018 2:47 PM

Ijayya And Shilpa Chakrapani Reddy Comments On Chandrababu - Sakshi

శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే ఐజయ్య ( ఫైల్‌)

సాక్షి, కర్నూలు : సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితుల పట్ల వివక్షత చూపటం దారుణమని వైఎస్సార్‌ సీపీ నందికోట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యానించారు. గురువారం డాక్టర్‌ బి. ఆర్‌ అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐజయ్య మాట్లాడుతూ.. దళితులను కించపరుస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమన్నారు. దళితుల సంక్షేమాన్ని పక్కనపెట్టి దళితుల సబ్‌ ప్లాన్‌ నిధులను ఇతర రంగాలకు కేటాయించి చంద్రబాబు దళితులను మోసం చేశారని మండిపడ్డారు. 

బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్‌ : శిల్పా
డాక్టర్‌ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని వైఎస్సార్‌ సీపీ నంద్యాల పార్లమెంట్‌ అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. గురువారం డాక్టర్‌ బి. ఆర్‌ అంబేద్కర్‌ వర్థంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ.. బి.ఆర్‌ అంబెద్కర్‌ రాజ్యంగ రచయిత , ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అయినటువంటి గొప్పవ్యక్తిగా పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement