ijaiah
-
బాబును నమ్మితే ముంచడం ఖాయం
కర్నూలు(రాజ్‌విహార్): చంద్రబాబును మరోసారి నమ్మితే రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచుతారని ఆలూరు, నందికొట్కూరు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు గుమ్మనూరు జయరాం, ఐజయ్య అన్నారు. ఆదివారం పార్టీ ఆధ్వర్యంలో జిల్లాలో ‘నిన్ను నమ్మం బాబు’ కార్యక్రమం నిర్వహించారు. గత ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు, విస్మరించిన తీరు, ప్రజలకు చేసిన మోసాలను వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ అధికార దాహంతో సీఎం చంద్రబాబు గత ఎన్నికల ముందుకు 600కు పైగా హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక వాటిలో 60కూడా అమలు నెరవేర్చలేదని, దీంతో ప్రజలు తీవ్రంగా మోసపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతు, పొదుపు, చేనేత రుణమాఫీలతోపాటు ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి విషయంలో ఆయా వర్గాలను నిండా ముంచారన్నారు. ఎలాగైనా అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఇష్టానుసారంగా హామీలు ఇచ్చారన్నారు. మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎంఏ హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీ మాత్రమే పోరాడుతోందన్నారు. హోదా కోసం గళమెత్తిన వారిపై కేసులు పెట్టి జైలుపాలు చేస్తానని హెచ్చరించిన చంద్రబాబు యూ టర్న్ తీసుకొని ధర్మ పోరాట దీక్షలతో నాటకమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబును నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర పరాభవం తప్పదని చెప్పారు. ♦ కర్నూలు నగరంలోని సాయిబాబ సంజీవయ్య నగర్లో ఎంఎ హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో నిన్ను నమ్మ బాబు కార్యక్రమం చేపట్టారు. కాలనీ అంతా కలియదిరిగి చంద్రబాబు మోసాలను వివరించారు. ♦ కల్లూరు మండలం అశ్వర్థాపురంలో కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆధ్వర్యలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమం చేపట్టారు. ఇందులో గ్రామ స్తులతోపాటు మండల ప్రజలు పాల్గొన్నారు. ♦ హాలహర్వి మండలం బిలేహాల్ గ్రామంలో ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం ఆధ్వర్యంలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు శ్రీనివాసులు, ఎంపీపీ బసప్ప, గ్రామస్తులు పాల్గొన్నారు. ఆలూరు మండల కన్వీనర్ చిన్న వీరన్న, ఎంపీటీసీలు నాగేంద్ర, నాగరాజు ఆధ్వర్యంలో ఆలూరు మండలం మణేకుర్తి, ఏ. గోనెహాలు, అంగస్గల్లు గ్రామాల్లో నిర్వహించారు. ♦ బనగానపల్లె నియోజకవర్గ సమన్వయకర్త కాటసాని రామిరెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పంచమపేటలో నిన్ను నమ్మం బాబు కార్యక్రమం నిర్వహించారు. మండల కన్వీనర్ చిన్నదస్తగిరి పాల్గొన్నారు. ♦ డోన్ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీరాములు ఆధ్వర్యంలోమండలంలో వెంకటనాయుని పల్లెలో, ప్యాపిలి జెడ్పీటీసీ దిలిప్ చక్రవర్తి ఆధ్వర్యంలో మండలంలోని అలేబాదు, మునిమడుగు గ్రామాల్లో కార్యక్రమం జరిగింది. ♦ కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త మురళీకృష్ణ ఆధ్వర్యంలో మండలంలోని వర్కూరులో కార్యక్రమం నిర్వహించారు. మండల కన్వీనర్ సురేష్ పాల్గొన్నారు. ♦ నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య, సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థారెడ్డి ఆధ్వర్యంలో తుమ్మలూరు, కృష్ణరావుపేటలో కార్యక్రమం నిర్వహించారు. -
‘చంద్రబాబు తెలంగాణలో పెత్తనం చేయాలని చూస్తున్నాడు’
సాక్షి, కర్నూల్ : ఏపీలో రాజ్యాంగ విలువలను సర్వనాశనం చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య ఆరోపించారు. శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగానికి తూట్లు పొడిచిన వ్యక్తి చంద్రబాబు అంటూ విమర్శించారు. నిన్నటి దాక బీజేపీతో పొత్తు పెట్టుకుని నాలుగేళ్లు సంసారం చేసిన వ్యక్తి.. నేడు సిగ్గు లేకుండా కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణలో ప్రచారం చేస్తున్నారంటూ మండి పడ్డారు. దేశంలో చరిత్ర హీన చక్రవర్తి చంద్రబాబేన్నారు. కాంగ్రెస్ మహాకూటమితో కలిసి తెలంగాణలో పెత్తనం చెలాయించాలని చంద్రబాబు ఆరాటపడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఏపీలో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలను డబ్బుల సంచులతో పశువులను కొన్నట్లు కొన్నది నీవు కాదా బాబు అంటూ ఐజయ్య ప్రశ్నించారు. స్పీకర్ స్థానాన్ని కూడా అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రజల వెంటే ఉంటూ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి. వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తుందని తెలిపారు. -
‘ఆయన దళితుల పట్ల వివక్షత చూపటం దారుణం’
సాక్షి, కర్నూలు : సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితుల పట్ల వివక్షత చూపటం దారుణమని వైఎస్సార్ సీపీ నందికోట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యానించారు. గురువారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐజయ్య మాట్లాడుతూ.. దళితులను కించపరుస్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వమన్నారు. దళితుల సంక్షేమాన్ని పక్కనపెట్టి దళితుల సబ్ ప్లాన్ నిధులను ఇతర రంగాలకు కేటాయించి చంద్రబాబు దళితులను మోసం చేశారని మండిపడ్డారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ : శిల్పా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి అని వైఎస్సార్ సీపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు శిల్పా చక్రపాణిరెడ్డి అన్నారు. గురువారం డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్భంగా ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శిల్పా మాట్లాడుతూ.. బి.ఆర్ అంబెద్కర్ రాజ్యంగ రచయిత , ప్రపంచ మేధావి, నవభారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అయినటువంటి గొప్పవ్యక్తిగా పేర్కొన్నారు. -
టీబీ డ్యామ్ నీటిని అనంతపురానికి తరలించొద్దు
సాక్షి, కర్నూలు : తుంగభత్ర డ్యామ్(టీబీ డ్యామ్) నీటిలో కర్నూలు వాటను అనంతపురానికి తరలించరాదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఆయన వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి, రైతువిభాగ రాష్ట్ర నాయకుడు భరత్ కుమార్ రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. తుంగభత్ర డ్యామ్ నుంచి కేసీ కెనాల్ ద్వారా కర్నూలుకు 10 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయడంతో 38వేల ఎకరాల్లో రైతులు వరిపంటను సాగు చేశారన్నారు. మిగిలిన 5.5టీఎంసీల వాటాను చంద్రబాబు అనంతపురానికి తరలించడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఇదే జరిగితే కర్నూలు రైతులు వేసిన పంటలు మధ్యలోనే ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకోకుండా జిల్లా వాసులు టీడీపీకి ఓట్లు వేయలేదని చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కేసీ కెనాల్‌కు రావాల్సిన వాటాను జిల్లాకు ఇచ్చి తీరాల్సిందేన్నారు. తుంగభద్ర డ్యామ్ నీటిని అనంతపురంకు తరలిస్తామన్న మంత్రి వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నవంబర్ 10 లోపు మంత్రి చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోకపోతే జిల్లాలోని ఆరు నియోజక వర్గాల రైతులతో చర్చించి, అన్ని పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తునఆందోళన చేపడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
‘పాదయాత్ర చూసి చంద్రబాబుకు నిద్రపట్టడంలేదు’
సాక్షి, కర్నూలు : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడుకి నిద్రపట్టడంలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య వ్యాఖ్యానించారు. మంగళవారం కర్నూలులో భారీ ఎత్తున వైఎస్సార్సీపీలోకి చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబుకు రోజులు దగ్గర పడ్డాయని, నాలుగేళ్ల కాలంలో చంద్రబాబు వేల కోట్ల రూపాయలను అక్రమంగా దోచ్చుకున్నారని ఆరోపించారు. వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాలను చూసి టీడీపీ నాయకులు తమ పార్టీలో చేరుతున్నారని ఐజయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతల మేకపాటి గౌతమ్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణి పార్టీ నేతలు పాల్గోన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో పలవురు నేతుల చేరారు. వీరిలో.. బన్నురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జగన్ మోహన్ రెడ్డి, మిడుతుర్ నాగిరెడ్డి, బన్నుర్ చంద్రరెడ్డి, పీరుసాహెబ్, పెట్ట జగదీష్ రెడ్డి, పేరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను పార్టీ నేతలు కండువా కప్పి ఆహ్వానించారు. -
కర్నూలులో వైఎస్సార్సీపీలోకి భారీ చేరికలు
-
ముస్లింలపై బాబుకు సవతి ప్రేమ
నందికొట్కూరు: ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.. ముస్లింలపై సవతి ప్రేమ చూపుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య ఆరోపించారు. నందికొట్కూరు వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ సిద్ధార్థ రెడ్డితో కలిసి ఐజయ్య విలేకరులతో మాట్లాడారు. ముస్లింలపై అక్రమ కేసులు బనాయించి వారిని భయపెట్టాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. నాలుగు సంవత్సరాల కాలంలో ముస్లింలకు బాబు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. మొన్న నంద్యాల ఉప ఎన్నికలలో మసీదులలో ఉన్న ఇమామ్‌లకు జీతాలు ఇస్తాను అని హామీఇచ్చి ఇప్పటివరకు పట్టించుకోలేదని గుర్తు చేశారు. సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు ముస్లింలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా వారు భయపడరని, వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని తెలిపారు. అక్రమంగా అరెస్ట్ చేసిన ముస్లిం సోదరులను విడుదల చేసి కేసులు ఎత్తేయాలని డిమాండ్ చేశారు. గుంటూరులో నారా హమారా-టీడీపీ హమారా అనే కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేసిన ముస్లిం యువకులను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పోలీసు స్టేషన్‌కు ర్యాలీగా చేరుకుని స్థానిక సీఐకి వినతిపత్రం సమర్పించారు. -
‘దుర్గారావుది మరణం కాదు.. హత్య’
సాక్షి, కర్నూలు : చంద్రబాబు మోసానికి, ప్రభుత్వ నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్ర బంద్ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి హృదయ పూర్వక ధన్యవాదాలు అని ఆ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బీవై రామయ్య అన్నారు. బుధవారం ఆయన ఎమ్మెల్యే ఐజయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్‌లతో కలిసి విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చంద్రబాబు తొత్తులుగా మారిన పోలీసులు పచ్చ చొక్కాలేసుకొని హోదా ఉద్యమాన్ని అనగదొక్కే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రజల సంకల్పం ముందు బాబు కుట్రలు, ఖాకీల కర్కశత్వం తుడిచిపెట్టుకు పోయాయని విమర్శించారు. బంద్‌లో పాల్గొని గుండెపోటుతో మృతి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త దుర్గారావు కుంటుంబానికి సానుభూతిని తెలిపారు. హోదా పోరులో వైఎస్సార్సీపీ సైనికుడు అశువులు బాయటం బాధాకరమని పేర్కొన్నారు. దుర్గారావుది మరణం కాదని చంద్రబాబు ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. ఒక్క రోజు బంద్‌కు పిలుపు నిస్తే అదేదో నేరం అన్నట్లు, ప్రజలు దేశ ద్రోహులు అన్నట్లుగా టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ చేట్టిన బంద్‌ను ప్రభుత్వం విఫలం చేయలేదని ప్రజలే భగ్నం చేశారని డిప్యూటి సీఎం కేఈ క్రిష్ణమూర్తి అనడం సిగ్గుచేటన్నారు. ఒక్కరోజు బంద్‌తో హోదా వస్తుందా అన్న కేఈ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని విమర్శించారు. హోదా పోరాటంలో యూటర్న్ తీసుకుంది చంద్రబాబేనని ఆరోపించారు. నమ్మక ద్రోహం చేసి ఫిరాయించిన మంత్రులు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. ఫిరాయింపుతో వచ్చిన మంత్రి పదవి శాశ్వతం కాదని అఖిలప్రియ తెలుసుకోవాన్నారు. ప్రత్యేక హోదా బంద్‌తో ఎవరు ఎటువైపో తేలిపోయిందన్నారు. ధ్వంద ప్రమాణాల రాజకీయ పార్టీల నైజం ప్రజలకు తెలిసిపోయిందన్నారు. హోదా కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. -
అవినీతి చక్రవర్తి చంద్రబాబు
మిడుతూరు: నాలుగేళ్ల పాలనలో అడ్డగోలుగా రూ. 4 లక్షల కోట్లు సంపాదించి అవినీతి చక్రవర్తిగా సీఎం చంద్రబాబు పేరు గడించారని ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. నందికొట్కూరు పట్టణంలోని ఆయన స్వగృహంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 1500 రోజుల పాలనలో ఏమి సాధించారని పండగ చేసుకుంటున్నారని టీడీపీ నేతలను నిలదీశారు. 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసినందుకా లేక ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసినందుకా అని ప్రశ్నించారు. తనది 40 ఏళ్లు రాజకీయ అనుభవమని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. దళితులకు, మహిళలకు రక్షణ కూడా కల్పించలేకపోయారన్నారు. అంతేకాదు ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారన్నారు. అదే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉంటే ప్రత్యేక హోదా వచ్చేదన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావడం తథ్యమని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్‌తో జట్టు.. చంద్రబాబు తహతహ..
సాక్షి, కర్నూలు : ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వ్యాఖ్యలు విడ్డూరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. జిల్లాలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరం కాంగ్రెస్ పెట్టిన భిక్షే అని ముఖ్యమంత్రి చెప్పడం ఆయన ద్వంద వైఖరికి నిదర్శమని చెప్పారు. ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును ప్రస్తావించకపోవడం చంద్రబాబు సంకుచిత స్వభావాన్ని తెలియజేస్తుందని పేర్కొన్నారు. వైఎస్సార్ లేకపోతే పోలవరం లేదన్న సంగతిని చంద్రబాబు మరచిపోయారన్నారు. 2007లో పోలవరానికి శంకుస్థాపన వైఎస్సార్, కేవలం 5,135 కోట్లతో 30 శాతం ప్రాజెక్టు పనులను పూర్తి చేశారని ఐజయ్య వెల్లడించారు. ‘జలయజ్ఞం కార్యక్రమం ద్వారా సాగు, తాగునీటి ప్రాజెక్టులను ప్రారంభించిన అపర భగీరథుడు వైఎస్సార్. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలసి పోటీ చేసేందుకు చంద్రబాబు తహతహలాడుతున్నారు. అందుకే వాస్తవాలను గాలికి వదిలేసి మాట్లాడుతున్నారు. అవినీతి సొమ్ముతో 2019 ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు అనుకుంటున్నారు. ఓటుకు రూ. 5 వేల చొప్పున పంపిణీ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై చంద్రబాబు కచ్చితంగా విచారణను ఎదుర్కొంటారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానమంత్రిని కలవలేదని దౌర్భాగ్యస్థితిలో చంద్రబాబు ఉన్నారు. బాబు అవినీతిపై ఆరోపణలు చేస్తున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) విచారణకు ఎందుకు ఆదేశించడం లేదో అర్థం కావడం లేదు. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబు ఎన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా భయపడేది లేదు. రానున్నది జగనన్న ప్రభుత్వమే.’ అని ఐజయ్య చెప్పారు. -
బాబూ.. చిత్తశుద్ధి నిరూపించుకో
పగిడ్యాల:రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం టీడీపీ ఎంపీలతో రాజీనామా చేయించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సీఎం చంద్రబాబుకు నందికొట్కూరు ఎమ్మెల్యే వై. ఐజయ్య సూచించారు. ఆ పార్టీ మాజీ మండల కన్వీ నర్ రమాదేవి స్వగృహంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ముందు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేసి అధికారంలోకి రాగానే ప్యాకేజీకి మొగ్గు చూపి ప్రజలను మోసం చేశారన్నారు. నాలుగేళ్లుగా హోదా సాధనం కోసం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారన్నారు. హోదా ఆంధ్రుల హక్కు అంటూ ఆమరణ æనిరాహారదీక్షలు, ధర్నాలు, యువభేరిలు నిర్వహించారన్నారు. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడమే కాక ఎంపీలతో రాజీనామా చేయించేందుకు సిద్ధమయ్యారన్నారు. తమ పోరాటానికి కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, ఆమ్ఆద్మీ, ఆర్జేడీ, సమాజ్‌వాది తదితర పార్టీలన్నీ సంపూర్ణ మద్దతు ప్రకటించాయన్నారు. తమకు లభిస్తున్న మద్దతును చూసి టీడీపీ యూటర్న్ తీసుకుందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించి హోదా ఉద్యమంలో తమతో కలిసి రావాలని లేదంటే ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రతి పనిలో అవినీతి పోలవరం, రాజధాని నిర్మాణం ఇలా ప్రతి పనిలో టీడీపీ అవినీతికి పాల్పడుతోందని ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు. ఆ డబ్బుతోనే ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను సీఎం కొనుగోలు చేశారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన బాబు ఏదో ఒక రోజు విచారణను ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. దమ్ముంటే తన నాలుగేళ్ల పాలనలో అవినీతికి పాల్పడలేదని విచారణకు అంగీకరించి నిజాయితీని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారిందని, మినుము, శనగ, వరి, కంది, మొక్కజొన్న పంటలకు గిట్టుబాటు ధర లేక వారు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆ పంటలకు గిట్టుబాటు ధర కల్పించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మిడుతూరు జెడ్పీటీసీ సభ్యుడు యుగంధర్‌రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్రప్రధాన కార్యదర్శి వంగాల భరత్‌కుమార్‌రెడ్డి, నాయకులు చంద్రమౌళి, చిట్టిరెడ్డి, మిడుతూరు ఎంపీటీసీ మరియమ్మ, శివపురం సర్పంచ్ సంతోషమ్మ పాల్గొన్నారు. -
చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారు...
హైదరాబాద్ : కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ పార్టీని వీడరని, గతంలో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశామని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అన్నారు. తాము పార్టీని వీడుతున్నామంటు మీడియా దుష్ప్రచారం చేసిందని ఆయన శనివారమిక్కడ ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాకు చెందిన వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా బుడ్డా రాజశేఖరరెడ్డి మాట్లాడుతూ...' చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతున్నారు. మీడియాలో ప్రతిరోజు వైఎస్ఆర్ సీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీలో అభద్రతా భావం తీసుకు రావాలని మీడియా ప్రయత్నిస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా టీడీపీ నెరవేర్చగలిగిందా?. తెలంగాణలో టీడీపీ ఖాళీ అయిపోయింది. టీడీపీ చెప్పినట్లు చానల్స్ ఆడటం సరికాదు. మీడియా పట్ల మాకు గౌరవం ఉంది. దాన్ని నిలుపుకోవాలి' అని అన్నారు. మాపై ఎందుకు అభాండాలు పార్టీ మార్పు ప్రచారాన్ని తాము పదేపదే ఖండించామని, తోక పార్టీ మీడియాలు తమపై ఎందుకు అభాండాలు వేస్తున్నాయో అర్థం కావడం లేదని ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. తమ పేర్లు పెట్టి ఎందుకు మీడియా ప్రచారం చేస్తుందోనని, మీడియా ప్రచారాల వల్ల ప్రజలు తమని నిలదీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటిది ఎన్నిసార్లు వివరణ ఇచ్చినా మళ్లీ ఎందుకు బురద చల్లుతున్నారో తెలియట్లేదన్నారు. సీమ ప్రజలను టీడీపీ పూర్తిగా విస్మరించింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోనే తాము కొనసాగుతామని ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి తెలిపారు. రాయలసీమ ప్రజలను టీడీపీ పూర్తిగా విస్మరించిందని, ఉన్న టీడీపీ ఎమ్మెల్యేల వల్లే ఒక్క పనీ కావడం లేదని ఆమె అన్నారు. అమరావతి, ఉత్తరాంధ్ర వైపు చంద్రబాబు దృష్టి పెడుతున్నారని, సీమను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరుతున్నారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. -
ప్రజా సంక్షేమమే ధ్యేయం- నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య
కొత్తపల్లి: ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని నందికొట్కూరు ఎమ్మెల్యే ఐజయ్య అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ఎంపీపీ ఎన్నిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఎన్నికల అధికారి శోభారాణి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో నెలకొన్న ప్రధాన సమస్యలపై దృష్టి సారించానని చెప్పారు. శివపురం, బావాపురం వంతెనలను నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. మండల ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎంపీక కావడం ఆనందంగా ఉందన్నారు. అధికారులు విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, వచ్చే సర్వసభ్య సమావేశానికి పూర్తి నివేదికలతో హాజరుకావాలని సూచించారు. అనంతరం నూతన ఎంపీపీ సావిత్రమ్మ మాట్లాడుతూ మండలాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పారు. ఇందుకు అధికారులు సహకరించాలని కోరారు. సమావేశంలో మండల ఉపాధ్యక్షుడు ఎస్ మహబూబ్‌బాషా, ఎంపీడీవో రమేష్‌బాబు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్వోలు, డాక్టర్లు, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు. -
కొత్తపల్లి ఎంపీపీ పీఠం వైఎస్సార్సీపీదే
ఆత్మకూరు/కొత్తపల్లి: కర్నూలు జిల్లా కొత్తపల్లి మండల ఎంపీపీ పీఠం ఎట్టకేలకు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 4న ఎంపీపీ ఎన్నికలు నిర్వహించగా.. కొత్తపల్లి మండలంలో సభ్యులు హాజరు కాకపోవడంతో వాయిదా వేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆదివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి శోభారాణి ఆధ్వర్యంలో తిరిగి ఎన్నిక నిర్వహించారు. మొత్తం 9 ఎంపీటీసీ స్థానాల్లో ఆరు వైఎస్ఆర్సీపీ, మూడు టీడీపీ కైవసం చేసుకున్నాయి. మొదట కో ఆప్షన్ సభ్యుడి ఎంపిక చేపట్టగా.. వైఎస్ఆర్సీపీ తరఫున ముసలమడుగు గ్రామానికి చెందిన మూసా కరిముల్లాతో నామినేషన్ వేయించారు. టీడీపీ తరఫున ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎంపికైనట్లు అధికారులు ప్రకటించారు. మధ్యాహ్నం ఎంపీపీ సమావేశ హాలులో వైఎస్ఆర్సీపీ, టీడీపీ ఎంపీటీసీలచే ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం ఎంపీపీ ఎన్నిక ప్రారంభమైంది. దుద్యాల ఎంపీటీసీ-2 స్థానంలో గెలుపొందిన సావిత్రమ్మను వైఎస్ఆర్సీపీ తరఫున ప్రతిపాదించగా గువ్వలకుంట్ల ఎంపీటీసీ సభ్యురాలు రవణమ్మ బలపర్చారు. వైఎస్ఆర్సీపీకి చెందిన 8 మంది ఎంపీటీసీ సభ్యులు ఆమెకు మద్దతుగా చేతులు ఎత్తడంతో సావిత్రమ్మ ఎంపీపీగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించి ప్రమాణస్వీకారం చేయించారు. వైస్ ఎంపీపీగా ఎర్రమఠం ఎంపీటీసీ సభ్యుడు ఎస్.మహబూబ్‌బాషా ఎన్నికయ్యారు. డీఎస్పీ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటైంది. ఫలించిన ఎమ్మెల్యే వ్యూహం- టీడీపీ నేత మాండ్ర శివానందరెడ్డికి చుక్కెదురు నందికొట్కూరు: కొత్తపల్లి ఎంపీపీ పీఠం వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్యే ఐజయ్య రచించిన వ్యూహం ఫలించింది. మండలంలోని తొమ్మిది ఎంపీటీసీ స్థానాల్లో ఆరింటిని వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. అయితే ఇటీవల వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో చేరిన మాండ శివానందరెడ్డి కొత్తపల్లి మండల ఎంపీపీ పీఠం ఆ పార్టీ ఖాతాలో జమ చేసేందుకు సర్వశక్తులు ఒడ్డారు. ఆయన ఎత్తులను ఎమ్మెల్యే ఐజయ్య చిత్తు చేశారు. ఎంపీపీ పీఠం విషయంలో నెలకొన్న ఉత్కంఠకు తనదైన శైలిలో తెరదించారు. టీడీపీ శ్రేణులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎంపీటీసీ సభ్యులు తాము వైఎస్ఆర్సీపీని వీడేది లేదని తేల్చి చెప్పడం విశేషం.